పైసలన్నీ గజ్వేల్‌కేనా..! | All money for gajwel district..! | Sakshi
Sakshi News home page

పైసలన్నీ గజ్వేల్‌కేనా..!

Published Sun, Jul 27 2014 12:09 AM | Last Updated on Sat, Sep 2 2017 10:55 AM

All money for gajwel district..!

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘మంత్రిగారూ..! వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు నిధులన్నీ కడపకే పట్టుకపోతున్నడని మీరు గోలగోలజేస్తిరి, కిరణ్‌రెడ్డి  కూడా పీలేరునే అభివృద్ధి జేసుకుంటన్నడని నిలదీస్తిరీ... ఇప్పుడు అదే పరిస్థితి మాకు ఎదురైతంది సార్.. సీఎం  కేసీఆర్ సార్ నిధులన్నీ గజ్వేల్‌కే మళ్లిస్తున్నడు, మా జిల్లా బిడ్డా సీఎం అయ్యాడని మేం అంతా సంతోష పడ్డాం. నిధులన్నీ సొంత నియోజకవర్గానికే కాకుండా మాకూ మంజూరు చేయండి సార్’ అని జిన్నారం జెడ్పీటీసీ ప్రభాకర్, మంత్రి హరీష్‌రావును జెడ్పీ సమావేశంలో అడిగారు. గజ్వేల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ పేరుతో ఇటీవల రూ.25 కోట్లు నిధులు మంజూరు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మంత్రి నోటి వెంట ఏమని సమాధానం వస్తుందోనని సభ్యులంతా ఆసక్తిగా ఎదురు చూసినప్పటికీ, హరీష్‌రావు మాత్రం దానిపై ఏమీ మాట్లాడకుండా  తెలివిగా సభ్యుల దృష్టిని మరో అంశం వైపు మళ్లించారు.  
 
 ప్రభుత్వశాఖల పరిధుల పునర్విభజన: హరీష్
 జిల్లా ప్రజలకు సుపరిపాలన అందించేందుకు వీలుగా జిల్లాలోని అన్ని ప్రభుత్వశాఖలు, పోలీసు శాఖల పరిధులను పునర్విభజన చేస్తామని మంత్రి హరీష్ తెలిపారు. శుక్రవారం ‘మనజిల్లా-మన ప్రణాళిక’ పై జెడ్పీ ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వారం రోజుల్లో అన్నిశాఖల జిల్లా అధికారులు తమ శాఖల పరిధుల పునర్విభజన ప్రతిపాదనలు అందజేయాలని ఆదేశించారు.
 
 జిల్లాలో ఇరిగేషన్, పోలీసుశాఖ, విద్యాశాఖ, విద్యుత్ ఇలా పలు శాఖల పరిధులు సరిగా లేవన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే పరిధిలో నలుగురు డీఎస్పీలు ఉంటే, అందోలు నియోజకవర్గం నలుగురు ఇరిగేషన్ డీఈల పరిధిలోకి వస్తుందన్నారు. తద్వారా పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వశాఖ పరిధులు పునర్విభజన చేయనున్నట్లు తెలిపారు. నారాయణఖేడ్, గజ్వేల్‌లలో డిప్యూటీ డీఈఓ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగును అందించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు హరీష్‌రావు ప్రకటించారు.
 
 పాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా జిల్లాలో అన్ని నియోజకవర్గాల పరిధిలో సాధ్యమైనంత ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు తాను వ్యక్తిగతంగా చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ప్రతి గ్రామంలో ఓ చెరువును ఎంపిక చేసి పూడికతీత పనులు చేపడతామన్నారు. బొడ్మట్‌పల్లి నుంచి బీదర్ వరకు రూ.125 కోట్లతో రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. దుబ్బాక నియోజకవర్గంలోని తొగుటలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పనులతో భూములు కోల్పోయే వారిని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
 
 యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి: డిప్యూటీ స్పీకర్
 మెదక్ జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ, మనజిల్లా-మనప్రణాళికలో భాగంగా జిల్లాను యూనిట్‌గా తీసుకుని సమగ్ర అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. మంబోజిపల్లిలోని ఎన్‌డీఎస్‌ఎల్ చక్కెర ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు.
 
 నారింజ ప్రాజెక్టు పనులు చేపట్టండి: గీతారెడ్డి
 జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని నారింజవాగు, కొత్తూరు ప్రాజెక్టు పనులు చేపట్టాలని ఎమ్మెల్యే గీతారెడ్డి కోరారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలో ఇరిగేషన్ పనుల విషయంలో అన్యాయం జరిగిన వాట వాస్తవమేనన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో మార్పులు ఉంటాయని ప్రచారం జరుగుతోందని ఈ విషయమై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నారు.
 
 మంబోజపల్లిలోని ఎన్‌డీఎస్‌ఎల్ చెరుకు ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కిష్టారెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో భారీ, మద్యతరహా నీటి ప్రాజెక్టు లేనందున మైనర్ ఇరిగేషన్  పనులకు ప్రభుత్వం పెద్దపీట వేయాలని కోరారు. నీటిపారుదలలో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని మంత్రి హరీష్‌రావును కోరారు. పెద్దశంకరంపేట మండలంలోని బుజరాన్‌పల్లి పెద్దచెరువు ప నులు చేపట్టాలని డిమాండ్ చేశారు. దీనికి మంత్రి హ రీష్‌రావు సుముఖత వ్యక్తం చేశారు.
 
 ఎమ్మెల్యే రామలి ంగారెడ్డి మాట్లాడుతూ, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ప నుల్లో భాగంగా తొగుట గ్రామంలో ఆరు గ్రామాలు మునిగిపోనున్నాయని, భూ నిర్వాసితులను ఆదుకోవాలని మంత్రి హరీష్‌రావును కోరారు. దీనిపై  హరీష్‌రావు స్పందిస్తూ ప్రాణహిత ప్రాజెక్టులో తక్కువ గ్రా మాలకు నష్టం జరుగుతుందని, భూ నిర్వాసితులను అన్ని రకాలుగా ఆదుకుంటామని స్పష్టం చేశారు. స మావేశంలో ఎమ్మెల్యేలు మదన్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, ఇ న్‌చార్జి కలెక్టర్ శరత్, జెడ్పీ వైస్ చైర్మన్ సారయ్య, డీసీసీబీ చైర్మన్ జైపాల్‌రెడ్డి, జెడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు.
 
 మాసాయిపేట దుర్ఘటన మృతులకు జెడ్పీ నివాళి
 మాసాయిపేట వద్ద చోటు చేసుకున్న రైలు ప్రమాదంలో మృతి చెందిన చిన్నారులకు జెడ్పీ సమావేశంలో ప్రత్యేకంగా నివాళులర్పించారు. మృతి చెందిన చిన్నారుల ఆత్మకు శాంతి చేకూరాలంటూ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, మంత్రి హరీష్‌రావు, శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణి, ఇన్‌చార్జి కలెక్టర్ శరత్, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు రెండు నిమిషాలు మౌనం పాటించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement