ఆధార్ కార్డ్ అనేది భారతీయ పౌరులకు అవసరమైన గుర్తింపు పత్రం. దీనిని చాలా సందర్భాల్లో వివిధ పనులకు వినియోగించుకుంటారు. అయితే ప్రతి పనికి ఆధార్ నెంబర్‌ను ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీనికి బదులు 'వర్చువల్ ఐడీ' (VID) ఉపయోగించవచ్చు. ఇంతకీ ఈ వర్చువల్ ఐడీ అంటే ఏమిటి? దీనివల్ల ఉపయోగాలు ఏమిటనే విషయాలను ఇక్కడా వివరంగా తెలుసుకుందాం.
వర్చువల్ ఐడీ
వర్చువల్ ఐడీ అనేది ఆధార్ కార్డ్‌తో అనుసంధానమైన 16 అంకెల సంఖ్య. దీనిని అసలైన ఆధార్ నెంబర్‌కు బదులుగా ఉపయోగించుకోవడానికి మాత్రమే కాకుండా.. ఈ-కేవైసీ వంటి వాటికోసం కూడా వినియోగించుకోవచ్చు. ఆధార్ నెంబర్ స్థానంలో.. వీఐడీ నెంబర్ ఉపయోగించడం వ్యక్తిగత గోప్యతను నిర్ధారిస్తుంది.
ఆధార్ వర్చువల్ ఐడీ ఉపయోగాలు
● బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసుకోవడనికి
● ప్రభుత్వ సర్వీసులకు అప్లై చేసుకోవడనికి
● ఈ-కేవైసీ ప్రక్రియ కోసం
● ఆధార్ పీవీసీ కార్డ్ లేదా ఈ-ఆధార్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి
● ప్రభుత్వ సబ్సిడీలను పొందటానికి
● పాస్‌పోర్టు కోసం అప్లై చేసుకోవడానికి
● కొత్త బీమా పాలసీని కొనుగోలు చేయడానికి
ఆధార్ వర్చువల్ ఐడీని ఎలా పొందాలి?
▸ఆధార్ వర్చువల్ ఐడీ కోసం ముందుగా అధికారిక వెబ్‌సైట్ 'యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా' (UIDAI)ను సందర్సించాలి.
▸అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తరువాత భాషను ఎంచుకోవాలి.
▸ఆధార్ సర్వీస్ అనే సెక్షన్‌లో 'వర్చువల్ ఐడీ జనరేటర్'పైన క్లిక్ చేయాలి.
▸వర్చువల్ ఐడీ జనరేటర్‌పై క్లిక్ చేసిన తరువాత ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి.
▸ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తరువాత మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై అండ్ ప్రాసెస్ మీద క్లిక్ చేయాలి. ఆ తరువాత మీకు ఒక 16 అంకెల వర్చువల్ ఐడీ నెంబర్ కనిపిస్తుంది.
▸స్క్రీన్‌పైన వర్చువల్ ఐడీ నెంబర్ కనిపించడమే కాకుండా.. మీ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్‌కు మెసేజ్ రూపంలో కూడా వస్తుంది.
ఇదీ చదవండి: బ్యాంక్ చెక్‌పై 'ఓన్లీ' అని ఎందుకు రాస్తారో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment