బ్యాంకులో ఎప్పుడైనా చెక్ ద్వారా డబ్బు తీసుకున్నారా?.. దానిపైన రూపాయలకు ముందు మాత్రమే (Only) అని రాసి ఉండటం చూడవచ్చు. ఇంతకీ చెక్‌లో ఇలాగే ఎందుకు రాయాలి, దీని వల్ల ప్రయోజనాలు ఏమిటి అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
చెక్‌పై సంతకాలు, డేట్ వంటివన్నీ చాలా జాగ్రత్తగా వేయాలి. ఇందులో ఏ మాత్రం తప్పులున్న చెక్కులు క్యాన్సిల్ అవుతాయి. అయితే ఇందులో డబ్బుకు సంబంధించి అంకెలు మాత్రమే కాకుండా.. ఓన్లీ అనే పదాలలో కూడా రాయాలి. ఉదాహరణకు రూ. 5లక్షల రూపాయలు అనుకుంటే.. Rs. 5,00,000/- అని మాత్రమే కాకుండా కేవలం ఐదు లక్షల రూపాయలు మాత్రమే (Five Lakh Rupees Only) అని కూడా రాయాలి ఉంటుంది.
చెక్ ట్యాపరింగ్ వంటి వాటిని నిరోధించడానికి ఓన్లీ అని రాయడం చాలా ముఖ్యం. ఓన్లీ వదిలిపెట్టి, రూపాయలు అని రాస్తే.. మోసగాళ్లు దాని తరువాత ఏమైనా దానికి యాడ్ చేసి ఎక్కువ విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: పాన్ కార్డ్‌తో గేమ్స్ వద్దు
పదాలలో రాస్తూ.. చివర ఓన్లీ అని రాయడం వల్ల, మళ్ళీ ఆ సంఖ్యను పెంచుకునే అవకాశం లేదు. ఎందుకంటే దానిని మార్చడం కూడా చాలా కష్టమవుతుంది. కస్టపడి ప్రయత్నించినప్పటికీ.. అలాంటి చెక్కులు బ్యాంకులో చెల్లవు. చెక్కుల విషయంలో మోసాలను నివారించడానికి ఈ ఓన్లీ అనేది చాలా కీలకం.
Comments
Please login to add a commentAdd a comment