only
-
ఆ ఊళ్లో.. ఇళ్లు, కారు చౌక! ధర ఎంతంటే? కేవలం...
ఆ ఊళ్లో ఇళ్లు కారుచౌకగా దొరుకుతాయి. అక్కడి ఇళ్ల ధరలు తెలుసుకుంటే, ఇక్కడి జనాలు ఏమాత్రం నమ్మలేరు. ఆ ఊరు ఇటలీలో ఉంది. సిసిలీ స్వయంప్రతిపత్తి ప్రాంతంలోని సంబూకా అనే పట్టణంలో ఒక్కో ఇల్లు ఒక యూరో నుంచి మూడు యూరోల (దాదాపు రూ. 90 నుంచి రూ. 270) ధరకే దొరుకుతాయి.సరిగా చెప్పాలంటే, ఈ ఇళ్లు మామూలు పిజ్జా ధర కంటే తక్కువే! ఇటలీలో పిజ్జా ధర దాదాపు 5 యూరోల (రూ.446) వరకు ఉంటుంది. ఈ పట్టణంలో ఇప్పటికే రెండుసార్లు– 2019లో ఒకసారి, 2021లో ఒకసారి ఇళ్ల వేలం నిర్వహించారు. ఆ వేలం పాటల్లో ఇళ్ల ధరలు ఒక యూరో నుంచి మూడు యూరోల వరకు పలికాయి.త్వరలోనే మరోసారి ఈ ఊళ్లో ఇళ్ల వేలం నిర్వహించనున్నారు. ఈసారి కూడా వేలంలో ఇళ్ల ధరలు పెద్దగా పెరిగే అవకాశం లేదని, ఇళ్ల ప్రారంభ ధరలు 3 యూరోల (సుమారు రూ.270) నుంచి మొదలయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. చాలాకాలంగా ఖాళీగా మిగిలిపోయి, పాడుబడిన ఇళ్లను ఈ పట్టణ సంస్థ ఇలా వేలంలో విక్రయిస్తోంది. వీటిని కొనుగోలు చేసేందుకు ఇటాలియన్లతో పాటు ఇటలీకి వచ్చే విదేశీ పర్యాటకులు కూడా ఆసక్తి చూపుతున్నారు.పురాతనమైన పాడుబడిన ఇళ్లకు పన్నులు కట్టలేక కొందరు యజమానులు వాటిని ఎలాగైనా వదిలించుకోవాలనుకుంటున్నారని, అందుకే ఇక్కడ ఇళ్లు ఇంత చౌకగా దొరుకుతున్నాయని రియల్ ఎస్టేట్ ఏజెంట్ మారిజియో బెర్తీ చెబుతున్నారు. ఇక్కడ చౌకగా దొరికే ఇళ్లలో ఎక్కువగా శతాబ్దాల కిందట నిర్మించినవి. ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే, మసూద్ అహ్మది అనే వ్యక్తి, ఆయన భార్య షెల్లీ ఇక్కడ మూడు యూరోలకు 2019లో పద్దెనిమిదో శతాబ్ది నాటి ఇల్లు కొన్నారు.దానిని 8400 యూరోల (సుమారు రూ.7.50 లక్షలు) ఖర్చుతో బాగు చేయించుకున్నారు. ఇక్కడ ఇళ్ల ధరల కంటే, వాటి మరమ్మతుల ఖర్చే ఎక్కువగా ఉంటుంది. మరమ్మతు ఖర్చులు కలుపుకున్నా, ఇక్కడి ఇళ్ల ధరలు కారుచౌక అనే చెప్పాలి. -
ఆ గనిలో మహిళలకే పని.. కారణమిదే!
సాధారణంగా గనుల్లో పనిచేసేందుకు పురుషులనే నియమిస్తుంటారు. గనుల్లోని పనులు ఎంతో కష్టమైనందున వాటిని పురుషులతోనే చేయిస్తుంటారు. అయితే ఆఫ్రికాలోని ఒక దేశంలో దీనికి విరుద్ధమైన పనితీరు కలిగిన ఒక గని ఉంది. దీనిలో మహిళలు మాత్రమే పని చేస్తుంటారు. దీని వెనుకగల కారణం తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. అంతే కాదు ఈ గనిలో పని చేసే మహిళలకు భారీ వేతనం కూడా లభిస్తుంది . ఐక్యరాజ్యసమితితో సహా ప్రపంచంలోని పలు దేశాలు ఆ గనిలో జరిగే పనితీరును ప్రశంసిస్తుంటాయి. ఉత్తర జింబాబ్వేలోని డుంగుజా నది వద్ద మైనింగ్ జరుగుతుంటుంది. ‘జింబాకువా’ లాంటి అనేక కంపెనీలు ఇక్కడ రత్నాల కోసం వెదుకులాట సాగిస్తుంటాయి. ఇక్కడ పనిచేసేందుకు మహిళలను మాత్రమే తీసుకుంటారు. డ్రిల్లింగ్ అయినా, సుత్తితో కొట్టే పని అయినా, పెద్ద పెద్ద రాళ్లను రవాణా చేయడమైనా.. ప్రతీపనిని మహిళలే చేస్తుంటారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ గనిలో పేలుళ్లు లాంటి పనులు చేయరు. జాతి రాళ్లు, రత్నాలు భూమి లోపలి పొరలలో కనిపిస్తాయి. ఉలి, సుత్తి సహాయంతోనే ఇక్కడ తవ్వకాల పనులు చేపడతారు. ఈ విధమైన పనితీరుతో పర్యావరణానికి హాని కలగదు. ఈ ప్రక్రియలో రసాయనాలు ఉపయోగించరు. నీటిని కూడా తక్కువగానే ఉపయోగిస్తారు. ఇక్కడ పనిచేసే మహిళలకు ప్రతినెలా 180 (ఒక యూరో రూ.91) యూరోలు అందుతుంటాయని ఐక్యరాజ్య సమితి చెబుతోంది. ఇక్కడ పనిచేసే మహిళలు తమ తీరిక సమయంలో కూరగాయలు పండిస్తూ, వాటిని విక్రయిస్తుంటారు. ఇక్కడి గనుల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మైనింగ్ కంపెనీలు మహిళా సాధికారతను కాంక్షిస్తూ, వారికే ఉపాధి కల్పిస్తున్నట్లు చెబుతున్నాయి. ఇక్కడి మహిళలు తమ పిల్లల చేత ఉన్నత చదువులు చదివిస్తున్నారు. నిరుద్యోగ భర్తలకు అండగా నిలుస్తున్నారు. మగవారి కంటే తామేమీ తక్కువ కాదని నిరూపిస్తున్నారు ఇక్కడి మహిళలు. ఇది కూడా చదవండి: కోతకొచ్చిన పంటల్లో నక్కిన పులులు.. వణుకుతున్న కూలీలు! -
హిజ్రాల పెళ్లి వేడుక ఏడుపుతో ఎందుకు ముగుస్తుంది? ఇదేమైనా సంప్రదాయమా?
హిజ్రాల జీవితాల్లో ఎన్నో రహస్యాలు దాగివుంటాయి. అందుకే వారి జీవితం ఎలా సాగుతుంది? వారికి వివాహాలు జరుగుతాయా? వారు జంటగా ఉన్నప్పుడు స్త్రీ, పురుష పాత్రలను పోషిస్తారా అనే ప్రశ్న చాలామందిలో తలెత్తుతుంది. నిజానికి ప్రతీ హిజ్రా తన జీవితంలో ఖచ్చితంగా వివాహం చేసుకుంటారు. అయితేవారు ఒక రాత్రికి మాత్రమే వధువుగా మారుతారు. ఇదేమీ విచిత్రం కాదు. వారి సమాజంలో ఇది ఒక సంప్రదాయంగా కొనసాగుతుంది. పురాతన గ్రంథాలలో హిజ్రాలను యక్షులు, గంధర్వులతో సమానంగా పరిగణించారు. మహాభారతం నుండి యక్ష పురాణం వరకు శిఖండి, మోహిని లాంటి పాత్రలు కనిపిస్తాయి. అయితే మన సమాజంలో హిజ్రాలను ప్రత్యేకంగా చూస్తుంటారు. అందుకే హిజ్రాలు తమకంటూ ఒక సమాజాన్ని సృష్టించుకుంటారు. వారి అంత్యక్రియలు, వివాహాలు వారి సంప్రదాయాలు, నమ్మకాల ఆధారంగా కొనసాగుతాయి. దక్షిణ భారతదేశంలో ప్రతి సంవత్సరం జరిగే హిజ్రాల ఉత్సవాన్ని కూవగం జాతర అని అంటారు. ఈ సంవత్సరం ఈ ఉత్సవం ఏప్రిల్ 18న ప్రారంభమై మే 03 వరకు జరిగింది. ఇందులో మే 02, 03 తేదీల్లో హిజ్రాల వివాహాలు జరిగాయి. ఈ జాతర తమిళనాడులోని కూవగం అనే గ్రామంలో జరుగుతుంది ఈ జాతర 18 రోజుల పాటు కొనసాగుతుంది. దేశం నలుమూలల నుండి హిజ్రాలు ఇక్కడికి వస్తుంటారు. ఈ ప్రదేశం తమిళనాడులోని విల్లుపురం జిల్లాకు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. హిజ్రాల దేవుడిగా భావించే అరవాన్ దేవతకు వారు ఆరోజుల్లో పూజలు చేస్తారు. జాతరలో హిజ్రాల కళ్యాణం ఒక్కరోజు మాత్రమే జరుగుతుంది. దీని వెనుక ఓ పురాణ కథ ఉంది. మహాభారతంలో అరవన్ అనే దేవుని పేరు ప్రస్తావనకు వస్తుంది. అతను.. అర్జునుడు- యువరాణి ఉలూపి కుమారుడు. మహాభారత కథ ప్రకారం యుద్ధ సమయంలో కాళీ దేవిని ప్రసన్నం చేసుకునేందుకు అరవన్ తనను తాను త్యాగం చేసుకునేందుకు సిద్ధమవుతాడు. అయితే పెళ్లి కాకుండా చనిపోవడం ఇందుకు అనువైనది కాదనేది షరతు. అటువంటి పరిస్థితిలో శ్రీ కృష్ణుడు మోహిని రూపాన్ని ధరించి అరవన్‌ను వివాహం చేసుకుంటాడు. అరవన్ మరణించిన మరుసటి రోజు ఉదయం మోహిని రూపంలో ఉన్న శ్రీ కృష్ణుడు వితంతువులా రోదించాడని చెబుతారు. ఈ కథను ఆధారంగా చేసుకుని హిజ్రాలు అరవన్‌ను ఒక రోజు వివాహం చేసుకుంటారు. మరుసటి రోజు వారు వితంతువులుగా మారి పెద్దపెట్టున విలపిస్తారు. పెళ్లి రోజన హిజ్రాలు అరవన్‌ను తమ భర్తగా భావించి, తమను తాము నవ వధువులా అలంకరించుకుంటారు. ఆలయ పూజారులు వారికి మంగళసూత్రం ధరించేలా ఏర్పాట్లు చేస్తారు. మరుసటి రోజు వారు అరవన్ చనిపోయినట్లు భావించి, వితంతువులు అవుతారు. అప్పుడు హిజ్రాలు తమ అలంకరణను తొలగించుకుని పెద్ద పెట్టున రోదిస్తారు. హిజ్రాల పరిస్థితి భారత్‌లోనే కాదు పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ వంటి పొరుగు దేశాలలో కూడా దారుణంగా ఉంది. స్త్రీల వేషధారణలో ఉంటూ, వారు సమాజానికి దూరంగా ఉంటున్నారు. పలు పాశ్చాత్య దేశాలలో హిజ్రాలు సామాన్య ప్రజల మధ్యనే ఉంటారు. వారు కూడా వివాహం చేసుకుని బిడ్డను దత్తత తీసుకుంటుంటారు. ఛాందసవాద సమాజం వారిని ప్రధాన స్రవంతి నుండి వేరు చేస్తున్నదనే వాదనలు వినిపిస్తుంటాయ. ఇది కూడా చదవండి: 4 కళ్ల నల్లని చారల చేప... చూసేందుకు జనం పరుగులు! -
విమానంలో "పెద్దలకు మాత్రమే" జోన్ : కారణం, ధర తెలిస్తే షాకవుతారు
Corendon Airlines Adultonly Zone: టర్కిష్-డచ్ కొరెండన్ ఎయిర్‌లైన్స్ వినూత్న నిర్ణయం తీసుకుంది. తన విమానాల సర్వీసుల్లో "పెద్దలకు మాత్రమే" విభాగాన్ని ఎయిర్‌లైన్ ప్రారంభించడం వార్తల్లో నిలిచింది. అసలు అడల్ట్స్ ఓన్లీ జోన్ అర్థం ఏమిటి, ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది ఈ కథనంలో తెలుసుకుందాం. పిల్లల గోల లేకుండా ప్రశాంతంగా.. ది హిల్ రిపోర్ట్ ప్రకారం విమానంలో ప్రయాణించే ప్రయాణికులకు చిన్న పిల్లల గొడవ లేకుండా ఉండేందుకు, ప్రశాంతంగా ప్రయాణాన్ని కొనసాగించేందుకు ఈ స్పెషల్ జోన్‌ను లాంచ్ చేసినట్టు కొరండెన్ ఎయిర్‌లైన్స్ తెలిపింది. "పెద్దలకు మాత్రమే" జోన్ అనేది నిశ్శబ్ద వాతావరణంలో పని చేయాలనుకునే వ్యాపార ప్రయాణీకులకు బాగా ఉపయోగపడుతుందని, అలాగే తమ పిల్లలు ఏడుస్తున్నప్పుడు తోటి ప్రయాణీకులనుంచి వచ్చే విమర్శలు, మాటలునుంచి పిల్లలు గల పేరెంట్స్‌కు కూడా ఆందోళన తగ్గుతుందని చెప్పింది. 16, అంతకంటే ఎక్కువ వయస్సు ప్రయాణీకుల సౌలభ్యంకోసం ఈ జోన్‌ను ప్లాన్ చేస్తోంది. ఈ పథకం కింద, ఎయిర్‌లైన్ ఉపయోగించే ఎయిర్‌బస్ A350లలో కొన్ని సీట్లు రిజర్వ్ చేస్తారు. డచ్ కరేబియన్ ద్వీపం అయిన ఆమ్స్టర్డామ్, కురాకో మధ్య విమానాల్లో ఈ జోన్లు నవంబర్‌లో లాంచ్ చేయనుంది. అదనపు వాత తప్పదు మరి! విమానంలో ముందు భాగం "పెద్దలకు మాత్రమే" జోన్లను ఏర్పాటు చేస్తారు ఇందులో తొమ్మిది అదనపు-పెద్ద సీట్లు అదనపు లెగ్‌రూమ్ , 93 స్టాండర్డ్ సీట్లతో ఉంటాయి. వాల్స్, కర్టెన్ల ద్వారా జోన్ భౌతికంగా మిగిలిన విమానం నుండి వేరు చేస్తామని, ప్రశాంతంగా, రిలాక్స్డ్ వాతావరణాన్ని కల్పించడమే దీని ఉద్దేశమని పేర్కొంది. అయితే వన్‌వేలో ఈ సీట్లకు అదనంగా 45 యూరోలు (రూ4,050), అదనపు పెద్ద సీట్లకు అదనంగా 100 యూరోలు (రూ.8,926) చెల్లించాల్సి ఉంటుంది. నెదర్లాండ్స్‌లో ఇలాంటి జోన్‌ను తీసుకొచ్చిన తొలి విమానయాన సంస్థగా నిలిచింది. -
బుమ్రా ఇక ఐపీఎల్ కే పరిమితమా..!
-
ఘాట్లలో మాత్రమే స్నానాలు చేయాలి : ఎస్పీ
నల్లగొండ క్రైం : కృష్ణా పుష్కరాల కోసం జిల్లాకు వచ్చే భక్తులు ప్రభుత్వం ఏర్పాటు చేసే ఘాట్లలో మాత్రమే స్నానాలు చేయాలని ఎస్పీ ఎన్.ప్రకాశ్‌రెడ్డి సూచించారు. ఘాట్లకు దూరంగా వెళ్లి ప్రమాదాలకు గురికావద్దని పేర్కొన్నారు. ఆదివారం కాచరాజుపల్లి ఘాట్ సమీపంలో ఘాట్ లేని చోట స్నానానికి వెళ్లి హైదరాబాద్‌కు చెందిన హార్దిక్ (12) మృత్యువాత పడిన ఘటనపై ఆయన ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. -
ఆస్తుల పంపిణీ వరకే...
రెండు గంటల్లో ముగియనున్న స్వాతంత్య్ర దినోత్సవం అవార్డుల ప్రదానోత్సవ కారక్రమం వాయిదా శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు నామమాత్రం జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి చేతుల మీదుగా పతాకావిష్కరణ పాల్గొననున్న కలెక్టర్, ఎస్పీ.. పుష్కర ఇన్చార్జిలకు మినహాయింపు నల్లగొండ: కృష్ణా పుష్కరాల ప్రభావం స్వాతంత్య్ర దినోత్సవంపై పడింది. ప్రతి ఏడాది ఆగస్టు 15న ఘనంగా నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాలను పుష్కరాల కారణంగా కుదించారు. జిల్లా సమస్త యంత్రాంగం పుష్కరాల్లో నిమగ్నం కావడంతో స్వాతంత్య్ర దినవేడుకలను రెండు గంటల్లో ముగించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ప్రతి ఏడాది విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు, జిల్లా అధికారులకు అందజేసే ప్రశంస పత్రాలు, అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ఈ సారి వాయిదా వేశారు. జిల్లా వ్యాప్తంగా 80 ప్రభుత్వ శాఖలకు చెందిన 420 మంది ఉద్యోగులను ఉత్తమ అవార్డు గ్రహీత లుగా ఎంపిక చేశారు. అయితే వారంతా ప్రస్తుతం కృష్ణా పుష్కరాల్లో విధుల్లో పాల్గొనడం తో అవార్డుల ప్రదానోత్సవాన్ని మరొక రోజు పెట్టుకోవాలని కలెక్టర్ నిర్ణయించారు. మంత్రి జగదీశ్‌రెడ్డి అనుమతితో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించే రోజును త్వరలో ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. దీంతో సోమవారం జరిగే స్వాతంత్య్ర వేడుకల్లో కేవలం ఆస్తుల పంపిణీ వరకే పరిమితం కానుంది. అది కూడా ఎస్సీలకు మూడెకరాల భూ పంపిణీ, వికలాంగులకు ట్రై సైకిళ్లు అందజేసేందుకు 30 మంది లబ్ధిదారుల జాబితా సిద్ధం చేశారు. డీఆర్డీఏ, డ్వామా, అటవీ శాఖ, పరిశ్రమల శాఖ ఇలా నాలుగైదు శాఖలకు చెందిన శకటాలను మాత్రమే ప్రదర్శిస్తారు. సాంస్కృతి కార్యక్రమాలు కూడా పరిమితం చేశారు. మొత్తంగా సోమవారం జరిగే స్వాతంత్య్ర వేడుకలను రెండు గంటల్లో ముగించనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల్లోగా వేడుకలు ముగిస్తారు షెడ్యూల్ ప్రతి ఏడాది ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే వేడుకలను ఈసారి పది గంటలకు మార్చారు. ఉదయం 10 గంటలకు రాష్ట్ర మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి చేతుల మీదుగా జాతీయ జెండా ఆవిష్కరిస్తారు. 10.10 గంటలకు మంత్రి ప్రజనుద్దేశించి ప్రసంగిస్తారు. ఈ ప్రసంగంలోనే ఎంపిక చేసిన అవార్డు గ్రహీతల వివరాలను మంత్రి ప్రకటిస్తారు. 10.40 గంటలకు పుర ప్రముఖల పరి^è యం. 11.15 గంటలకు వివిధ అభివృద్ధి, సంక్షేమ శాఖల ద్వారా ఆస్తుల పంపిణీ 12 గంటలకు జాతీయ గీతాలాపన.