ఆస్తుల పంపిణీ వరకే...
రెండు గంటల్లో ముగియనున్న స్వాతంత్య్ర దినోత్సవం
అవార్డుల ప్రదానోత్సవ కారక్రమం వాయిదా
శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు నామమాత్రం
జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి చేతుల మీదుగా పతాకావిష్కరణ
పాల్గొననున్న కలెక్టర్, ఎస్పీ.. పుష్కర ఇన్‌చార్జిలకు మినహాయింపు
నల్లగొండ: కృష్ణా పుష్కరాల ప్రభావం స్వాతంత్య్ర దినోత్సవంపై పడింది. ప్రతి ఏడాది ఆగస్టు 15న ఘనంగా నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాలను పుష్కరాల కారణంగా కుదించారు. జిల్లా సమస్త యంత్రాంగం పుష్కరాల్లో నిమగ్నం కావడంతో స్వాతంత్య్ర దినవేడుకలను రెండు గంటల్లో ముగించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ప్రతి ఏడాది విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు, జిల్లా అధికారులకు అందజేసే ప్రశంస పత్రాలు, అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ఈ సారి వాయిదా వేశారు. జిల్లా వ్యాప్తంగా 80 ప్రభుత్వ శాఖలకు చెందిన 420 మంది ఉద్యోగులను ఉత్తమ అవార్డు గ్రహీత లుగా ఎంపిక చేశారు. అయితే వారంతా ప్రస్తుతం కృష్ణా పుష్కరాల్లో విధుల్లో పాల్గొనడం తో అవార్డుల ప్రదానోత్సవాన్ని మరొక రోజు పెట్టుకోవాలని కలెక్టర్ నిర్ణయించారు. మంత్రి జగదీశ్‌రెడ్డి అనుమతితో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించే రోజును త్వరలో ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. దీంతో సోమవారం జరిగే స్వాతంత్య్ర వేడుకల్లో కేవలం ఆస్తుల పంపిణీ వరకే పరిమితం కానుంది. అది కూడా ఎస్సీలకు మూడెకరాల భూ పంపిణీ, వికలాంగులకు ట్రై సైకిళ్లు అందజేసేందుకు 30 మంది లబ్ధిదారుల జాబితా సిద్ధం చేశారు. డీఆర్‌డీఏ, డ్వామా, అటవీ శాఖ, పరిశ్రమల శాఖ ఇలా నాలుగైదు శాఖలకు చెందిన శకటాలను మాత్రమే ప్రదర్శిస్తారు. సాంస్కృతి కార్యక్రమాలు కూడా పరిమితం చేశారు. మొత్తంగా సోమవారం జరిగే స్వాతంత్య్ర వేడుకలను రెండు గంటల్లో ముగించనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల్లోగా వేడుకలు ముగిస్తారు
షెడ్యూల్
ప్రతి ఏడాది ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే వేడుకలను ఈసారి పది గంటలకు మార్చారు. ఉదయం 10 గంటలకు రాష్ట్ర మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి చేతుల మీదుగా జాతీయ జెండా ఆవిష్కరిస్తారు.
10.10 గంటలకు మంత్రి ప్రజనుద్దేశించి ప్రసంగిస్తారు. ఈ ప్రసంగంలోనే ఎంపిక చేసిన అవార్డు గ్రహీతల వివరాలను మంత్రి ప్రకటిస్తారు. 10.40 గంటలకు పుర ప్రముఖల పరి^è యం. 11.15 గంటలకు వివిధ అభివృద్ధి, సంక్షేమ శాఖల ద్వారా ఆస్తుల పంపిణీ
12 గంటలకు జాతీయ గీతాలాపన.