పర్మినెంట్ అకౌంట్ నెంబర్ లేదా పాన్ (పాన్ కార్డు) అనేది ఆర్థిక వ్యవస్థలో చాలా కీలకం. సంస్థలు, వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు అందరూ కూడా ఆర్ధిక కార్యకలాపాలలో దీని ద్వారానే భాగస్వాములవుతారు. టెక్నాలజీ పెరుగుతున్న క్రమంలో పాన్ కార్డును కూడా డిజిటలైజ్ చేయదలచి, కేంద్రం పాన్ 2.0 ప్రకటించింది. ఇది మరింత సేఫ్ అని పేర్కొంది.
మన దేశంలో ఒక వ్యక్తికి ఒకే పాన్ కార్డు ఉండాలి. అలా కాకుండా ఒక వ్యక్తికి, ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉంటే.. అది చట్టరీత్యా నేరం. అలాంటి వారు జరిమానా కట్టాల్సి ఉంటుంది.
మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులను తీసుకుంటారు. తప్పుడు వివరాలతో.. ఫేక్ పాన్ కార్డులను పొందటం నేరం. ఈ నేరానికి సెక్షన్ 272 బీ ప్రకారం.. రూ.10,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అంతే కాకుండా జైలు శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి: పాన్ 2.0: అప్లై విధానం.. ఫీజు వివరాలు
ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉండటం మాత్రమే కాకుండా.. అవసరమైన ఆర్ధిక కార్యకలాపాలకు పాన్ కార్డును ఉపయోగించకపోవడం కూడా నేరమే. అలాంటి వారు కూడా శిక్షార్హులే. కాబట్టి ఎక్కువ పాన్ కార్డులు ఉన్న వారు వెంటనే డీ-యాక్టివేట్ చేసుకోవాలి. అసలు పాన్ కార్డు లేనివారు వెంటనే.. పాన్ కార్డు కోసం అప్లై చేసుకోవాలి.
పాన్ 2.0
పాన్ 2.0 అనేది రూ. 1,435 కోట్ల బడ్జెట్‌తో క్యాబినెట్ ఆమోదించిన ప్రతిష్టాత్మక కార్యక్రమం. దీని ద్వారా క్యూఆర్ కోడ్ పాన్ కార్డును పొందవచ్చు. ఈ కార్డు ద్వారా వేగవంతమైన, సమర్థవంతమైన ప్రక్రియలను నిర్ధారించడం లక్ష్యం. PAN 2.0 పన్ను చెల్లింపుదారులకు సున్నితమైన, సురక్షితమైన అనుభవాన్ని అందిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment