PAN 2.0
-
PAN 2.0: కొత్త పాన్ కార్డ్ ఎంత వరకూ సేఫ్?
ఆదాయపు పన్ను శాఖ పాన్ కార్డ్ అప్‌గ్రేడ్ వెర్షన్ 'పాన్ 2.0'ను ప్రారంభించింది. ఇందులో ప్రధానంగా మూడు విషయాల్లో జాగ్రత్తలు తీసుకున్నారు. మొదటిది యాక్సెసిబిలిటీ.. మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. రెండవది డేటా స్టోరేజ్.. ఇదీ సురక్షితం. ఇక మూడవది సులభతరమైన అప్లికేషన్ వెరిఫికేషన్ ప్రక్రియ. కొత్త పాన్ కార్డ్‌లో క్యూఆర్ కోడ్ సదుపాయం ఉంటుంది కాబట్టి డిజిటల్ వర్క్‌లో దాని ఉపయోగం మునుపటి కంటే సులభతరం అవుతుంది.ఎలా సురక్షితం?'పాన్ 2.0'లో ఈ-పాన్ కార్డ్ ఎటువంటి ఛార్జీ లేకుండా దరఖాస్తుదారు ఈ-మెయిల్‌కు వెంటనే డెలివరీ అవుతుంది. నామమాత్రపు రుసుముతో భౌతిక కార్డ్ కూడా పొందవచ్చు. కొత్త టెక్నికల్ సదుపాయాలు చేరిన తర్వాత కూడా పెరుగుతున్న సైబర్ మోసాల నుంచి కొత్త పాన్ కార్డు రక్షణ పొందుతుందా లేదా అనే ప్రశ్న సహజమే. సైబర్ నేరగాళ్ల వల్ల కలిగే ఆర్థిక నష్టాల నుండి ప్రజలను రక్షించడంలో కొత్త కార్డ్ ఎంతవరకు సమర్థంగా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం..తాజా సమాచారంకొత్త పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు మీ కార్డ్ ఆదాయపు పన్ను శాఖ తాజా ఫార్మాట్‌కి అప్‌గ్రేడ్ అవుతుంది. దానితో మీరు మీ కొత్త డేటాను అప్డేట్ చేయవచ్చు.దుర్వినియోగానికి కళ్లెంకొత్త పాన్ కార్డ్‌లోని క్యూఆర్ కోడ్ కారణంగా, సైబర్ దుండగులు దానిని సులభంగా నకిలీ చేయలేరు. తద్వారా సైబర్ మోసాలను కట్టడి చేయడాన్ని ఇది సులభతరం చేస్తుంది.మరింత సురక్షితంకొత్త పాన్ కార్డ్ క్యూఆర్ కోడ్‌లోని వ్యక్తిగత డేటా ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో ఉంటుంది. దీన్ని ప్రత్యేకంగా అధీకృత సాఫ్ట్వేర్ ద్వారా మాత్రమే రీడ్ చేసేందుకు వీలవుతుంది. దీంతో వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అయ్యే సంఘటనలను ఇది తగ్గిస్తుంది. అంతే కాకుండా పాన్ ధ్రువీకరించడంలో ఆర్థిక సంస్థలకు సహాయపడుతుంది.వేగవంతమైన ధ్రువీకరణక్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా పాన్ని సులభంగా ధ్రువీకరించవచ్చు. తద్వారా సమాచార దొంగతనం, టాంపరింగ్‌కు పాల్పడటం సులభం కాదు. ఇక కొత్త ఫీచర్లు ఎంత ప్రభావవంతంగా ఉండబోతున్నాయో చూస్తే.. ఒక వేళ అన్నింటికీ ఆధార్ కార్డు లింక్ చేయడం తప్పనిసరి చేస్తే.. రియల్ టైమ్ వ్యాలిడేషన్, అధునాతన డేటా అనలిటిక్స్ వంటి ఫీచర్లు కొత్త సిస్టమ్‌కు జత కలుస్తాయి. దీంతో సైబర్ భద్రతకు బలమైన వ్యవస్థ ఏర్పడుతుంది. అయితే సైబర్ సెక్యూరిటీ ముప్పులు నేడు కొత్త రూపాల్లో వస్తున్న నేపథ్యంలో ఈ వ్యవస్థ ఎంత ప్రభావవంతంగా, సమర్ధవంతంగా ఉంటుందో అన్నది రానున్న రోజులలో తెలుస్తుంది. -
పాన్ కార్డ్‌తో గేమ్స్ వద్దు
పర్మినెంట్ అకౌంట్ నెంబర్ లేదా పాన్ (పాన్ కార్డు) అనేది ఆర్థిక వ్యవస్థలో చాలా కీలకం. సంస్థలు, వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు అందరూ కూడా ఆర్ధిక కార్యకలాపాలలో దీని ద్వారానే భాగస్వాములవుతారు. టెక్నాలజీ పెరుగుతున్న క్రమంలో పాన్ కార్డును కూడా డిజిటలైజ్ చేయదలచి, కేంద్రం పాన్ 2.0 ప్రకటించింది. ఇది మరింత సేఫ్ అని పేర్కొంది.మన దేశంలో ఒక వ్యక్తికి ఒకే పాన్ కార్డు ఉండాలి. అలా కాకుండా ఒక వ్యక్తికి, ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉంటే.. అది చట్టరీత్యా నేరం. అలాంటి వారు జరిమానా కట్టాల్సి ఉంటుంది.మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులను తీసుకుంటారు. తప్పుడు వివరాలతో.. ఫేక్ పాన్ కార్డులను పొందటం నేరం. ఈ నేరానికి సెక్షన్ 272 బీ ప్రకారం.. రూ.10,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అంతే కాకుండా జైలు శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: పాన్ 2.0: అప్లై విధానం.. ఫీజు వివరాలుఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉండటం మాత్రమే కాకుండా.. అవసరమైన ఆర్ధిక కార్యకలాపాలకు పాన్ కార్డును ఉపయోగించకపోవడం కూడా నేరమే. అలాంటి వారు కూడా శిక్షార్హులే. కాబట్టి ఎక్కువ పాన్ కార్డులు ఉన్న వారు వెంటనే డీ-యాక్టివేట్ చేసుకోవాలి. అసలు పాన్ కార్డు లేనివారు వెంటనే.. పాన్ కార్డు కోసం అప్లై చేసుకోవాలి.పాన్ 2.0పాన్ 2.0 అనేది రూ. 1,435 కోట్ల బడ్జెట్‌తో క్యాబినెట్ ఆమోదించిన ప్రతిష్టాత్మక కార్యక్రమం. దీని ద్వారా క్యూఆర్ కోడ్ పాన్ కార్డును పొందవచ్చు. ఈ కార్డు ద్వారా వేగవంతమైన, సమర్థవంతమైన ప్రక్రియలను నిర్ధారించడం లక్ష్యం. PAN 2.0 పన్ను చెల్లింపుదారులకు సున్నితమైన, సురక్షితమైన అనుభవాన్ని అందిస్తుంది. -
పాన్ 2.0 ప్రాజెక్ట్ మంచిదే..
డిజిటల్ ప్రపంచంలో ప్రభంజనం.. మరో ముందడుగు. ఆదాయపు పన్ను శాఖవారు .. అత్యంత ముఖ్యమైనదైన.. అనువైనదైన.. అవసరమైనదైన అడుగువేశారు. ఇక నుంచి పాన్.. అంటే పర్మనెంట్ అకౌంట్ నంబరు, టాన్.. అంటే టాక్స్ నంబరుకి సంబంధించి అన్ని సర్వీసులు ఒకే గూటి కింద ఉంటాయి. వివిధ ప్లాట్‌ఫాంలకు వెళ్లడం ఉండదు.పాత పద్ధతికి స్వస్తి పలికారు. త్వరితగతి విధానం.. పేపర్ సహాయం లేకుండా ఉండటం, ఈ మార్పులన్నీ మనకు అనుగుణంగానే కాకుండా ఫ్రెండ్లీగా కూడా ఉంటాయి. పాన్‌కి దరఖాస్తు చేయడం, వాటిలో సమాచారం అప్డేట్ చేయడం, ఆధార్ కార్డుతో అనుసంధానం చేయడం .. ఈ మూడింటిని మూడు ప్లాట్‌ఫాంల మీద చేయాల్సి వచ్చేది. ఇకనుంచి మూడూ ఒకే ప్లాట్‌ఫాం మీద చేయొచ్చు. అదే.. పాన్ 2.0 ప్రాజెక్టు. వివరాల్లోకి వెళితే..» ఇక నుంచి పాన్, టాన్, రెండూ ఒకే ప్లాట్‌ఫాంలో ఉంటాయి » ఇది వరకులాగా మూడు ప్లాట్‌ఫాంలకు వెళ్లనక్కర్లేదు » అనేక వెబ్సైట్లను సందర్శించనక్కర్లేదు » కాలం వృధా కాదు .. శ్రమ తక్కువ » క్షణాల మీద వేలిడేషన్ జరుగుతుంది » సెక్యూరిటీ పెరుగుతుంది » మోసాలను తగ్గించవచ్చు » అన్ని సర్వీసులు ఉచితం » ఫిజికల్ కార్డు కావాలంటే రూ. 50 చెల్లించాలి » ఈ–పాన్‌ను మీ మెయిల్‌కి పంపుతారు. తక్షణం అందినట్లు లెక్క. లేటు ఉండదు. » వివిధ ఫిర్యాదులకు చెక్ పెట్టినట్లు అవుతుంది » యాక్సెసబిలిటీ .. అంటే .. అందుబాటులో ఉంటుంది » డాక్యుమెంట్లు అవసరం లేదు » ఈ–పాన్ వల్ల డూప్లికేట్ కార్డులను ఏరిపారేయొచ్చు » డూప్లికేట్ కార్డుల వల్ల జరిగే మోసాలను అరికట్టవచ్చు » ఈ–పాన్ ఇక నుంచి యూనివర్సల్ ఐడెంటిటీ కార్డుగా చలామణీ అవుతుంది » అటు అసెసీలకు, ఇటు వృత్తి నిపుణులకు శ్రమ తగ్గుతుంది. కాలం వృధా కాదు » సెంట్రలైజ్డ్, సింగిల్ విండో విధానం వల్ల ఫిర్యాదులను త్వరగా పరిష్కరించగలరుచివరగా ఇప్పుడున్న పద్ధతిలో డూప్లికేట్ కార్డుల వల్ల మోసాలు జరుగుతున్నాయి. రుణ సౌకర్యం, క్రెడిట్ కార్డులు పొందటం, ఒకే వ్యక్తి మరో వ్యక్తిగా చలామణీ అవడం.. వేరే అవతారమెత్తడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. పాన్, ఆధార్ కార్డు అనుసంధానం జరిగినప్పటికీ మోసాల వెల్లువ తగ్గలేదు.ఒక సమాచారం ప్రకారం.. 780 మిలియన్లు అంటే 78 కోట్ల మందికి పాన్ కార్డులున్నాయి. కానీ ఆధార్ కార్డులు దేశంలో 138 కోట్ల మందికి ఉన్నాయి. ఆధార్ కార్డున్న ప్రతి వ్యక్తి అసెస్సీ కానక్కర్లేదు. ఆదాయపు పన్ను పరిధిలోకి రానవసరం లేదు.. రారు. 78 కోట్ల మంది పాన్హోల్డర్లు ఆధార్ కార్డుతో అనుసంధానం అయితే మోసాలు తగ్గుతాయి. అయితే, ఇందులో డూప్లికేట్ కార్డులు ఎన్ని ఉన్నాయో అంచనా తెలీదు.కానీ చాలా ఏజెన్సీలు..ప్రకటనల ద్వారా ఊరించి.. యాప్‌ల ద్వారా జనాలను ఆకట్టుకుని మోసాలకు పాల్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో పాన్ 2.0 ప్రాజెక్టు మోసాలను అరికట్టేలా అడుగువేస్తుందని ఆశిద్దాం . మీరు వెంటనే అప్లై చేయనక్కర్లేదు. పాతవి కూడా కొత్త విధానంలో పని చేస్తాయి. మీరు ఆన్లైన్లో వెబ్సైట్ సెలెక్ట్ చేసుకుంటే కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతుంది ఈ–కార్డు.పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.comకు ఈ–మెయిల్ పంపించగలరు. -
పాన్ 2.0: అప్లై విధానం.. ఫీజు వివరాలు
భారత ప్రభుత్వం పాన్ 2.0 ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం కూడా దీనికి ఆమోదం తెలిపింది. ఇది ఆర్ధిక మోసాలను, గుర్తింపు చౌర్యం వంటి వాటిని నిరోధించడమే కాకుండా.. సమాచారం మరింత భద్రంగా ఉంటుంది. అయితే.. పాన్ 2.0 ఎప్పుడు వస్తుంది అన్నదానికి సంబంధించిన అధికారిక వివరాలు ప్రస్తుతం వెలువడలేదు. అయితే కొత్త పాన్ కార్డులు వస్తే?.. పాత పాన్ కార్డులు ఏమవుతాయి. ఈ కొత్త పాన్ కార్డులు లేదా క్యూఆర్ కోడ్ పాన్ కార్డుల కోసం ఎక్కడ.. ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయాలను ఈ కథనంలో చూసేద్దాం.పాత పాన్ కార్డులు రద్దవుతాయా?క్యూర్ కోడ్ పాన్ కార్డులు వస్తే.. పాత పాన్ కార్డులు రద్దవుతాయా? అనే అనుమానం చాలామందికి ఉంటుంది. కానీ పాత పాన్ కార్డులు రద్దు అయ్యే అవకాశం లేదని ఆదాయ పన్ను శాఖ క్లారిటీ ఇచ్చింది.పాన్ 2.0 ప్రవేశపెట్టడంలో ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే.. కొత్త టెక్నాలజీతో ట్యాక్స్ పేయర్లకు మెరుగైన సేవలు అందించడమే. నాణ్యమైన సేవలను సులభంగా, వేగవంతంగా అందించాలనే లక్ష్యంతో కేంద్రం ఈ పాన్ 2.0కు సిద్ధమైంది. కాబట్టి రాబోయే పాన్ కార్డులు క్యూఆర్ కోడ్‌తో రానున్నాయి.పాన్ 2.0 కోసం ఎలా అప్లై చేసుకోవాలి?➤పాన్ 2.0 కోసం అప్లై చేసుకోవాలంటే ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లోని పోర్టల్ సందర్శించాలి (పాన్ 2.0 ప్రాజెక్ట్ ఇటీవలే ప్రవేశపెట్టారు, కాబట్టి దీనికి అప్లై చేసుకోవడానికి వెబ్సైట్లో పోర్టల్ ఇంకా అందుబాటులోకి రాలేదు).➤అవసరమైన చోట వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలి.➤గుర్తింపు, చిరునామా, పుట్టిన తేదీలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి.➤అవసరమైనన్నీ నమోదు చేసిన తరువాత అప్లికేషన్ సబ్మీట్ చేయాలి.అవసరమైన డాక్యుమెంట్స్➤ఐడెంటిటీ ప్రూఫ్ కోసం.. ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్➤అడ్రస్ ప్రూఫ్ కోసం.. యుటిలిటీ బిల్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్ లేదా రెంటల్ అగ్రిమెంట్➤డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం.. బర్త్ సర్టిఫికెట్, టీసీ, పాస్పోర్ట్పాన్ 2.0 కోసం అప్లై చేయాలంటే డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పాన్ కార్డు.. రిజిస్టర్ మెయిల్‌కు వస్తుంది. అయితే క్యూఆర్ కోడ్‌తో వచ్చే ఫిజికల్ కార్డు కావాలంటే 50 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. క్యూఆర్ కోడ్ కలిగిన పాన్ కార్డును భారతదేశంలో ఎక్కడికైనా డెలివరీ చేసుకోవాలంటే ఈ 50 రూపాయలు చెల్లించాలి. అంతర్జాతీయ డెలివరీలకు ఫీజులు వేరే ఉంటాయి. కాబట్టి దీనికి అదనంగా చెల్లించాల్సి ఉండే అవకాశం ఉంది.