IMPS
-
తగ్గిన యూపీఐ చెల్లింపులు.. ఎంతంటే..
యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ లావాదేవీలు 2024 మార్చితో పోలిస్తే ఏప్రిల్‌లో తగ్గాయి. మొత్తం యూపీఐ లావాదేవీల సంఖ్యలో నెలవారీగా 1 శాతం, మొత్తం విలువలో 0.7 శాతం తగ్గినట్లు ఎన్పీసీఐ వెల్లడించింది.మార్చిలో రూ.19.78 ట్రిలియన్లుగా నమోదైన యూపీఐ ట్రాన్సాక్షన్ల విలువ ఏప్రిల్‌లో రూ.19.64 ట్రిలియన్లకు చేరింది. మార్చిలో మొత్తం 13.44 బిలియన్ల సంఖ్యలో జరిగిన లావాదేవీలు ఏప్రిల్‌లో 13.3 బిలియన్లకు తగ్గింది. తక్షణ చెల్లింపు సేవ (ఐఎంపీఎస్) లావాదేవీలు మార్చితో పోలిస్తే ఏప్రిల్‌లో 7 శాతం(రూ.6.35 ట్రిలియన్ల నుంచి రూ.5.92 ట్రిలియన్లు), విలువలో 5 శాతం(581 మిలియన్ల నుంచి 550 మిలియన్లు) తగ్గాయి. ఏప్రిల్‌లో ఫాస్ట్‌ట్యాగ్ లావాదేవీలు విలువలో 3 శాతం (మార్చిలో రూ.5,939 కోట్ల నుంచి ఏప్రిల్‌లో రూ.5,592 కోట్లు) తగ్గాయి. వాల్యూమ్‌లో 6 శాతం.. మార్చిలో 339 మిలియన్లతో పోలిస్తే ఏప్రిల్‌లో 328 మిలియన్లకు తగ్గాయి.ఇదీ చదవండి: దిగ్గజ కంపెనీల మధ్య రూ.1.66లక్షల కోట్ల ఒప్పందం.. ఎందుకంటే..యూపీఐ చెల్లింపుల వాల్యూమ్‌లు, విలువలు నెలవారీగా తగ్గినా ఏడాది ప్రాతిపదికన మాత్రం ఘననీయంగా పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. వాల్యూమ్ పరంగా 50 శాతం, విలువలో 40 శాతం పెరిగాయి. -
ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ రూల్స్ మారాయ్.. ఇక అది అవసరం లేదు!
IMPS Rules change: ఒక బ్యాంక్ నుంచి మరొక బ్యాంకుకు చేసే ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ నిబంధనలు మారాయి. వినియోగదారులు ఫిబ్రవరి 1 నుంచి రిసీవర్ మొబైల్ నంబర్, పేరుతోనే ఇమీడియట్ పేమెంట్ సర్వీస్ (IMPS) ద్వారా డబ్బును బదిలీ చేయవచ్చని, ఐఎఫ్ఎస్సీ కోడ్ జోడించాల్సిన అవసరం లేదని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తెలిపింది. 2024 జనవరి 31 నాటికి అన్ని ఐఎంపీఎస్ ఛానెల్‌లలో మొబైల్ నంబర్ + బ్యాంక్ పేరు ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్ను అనుమతించాలని బ్యాంకులను అభ్యర్థిస్తున్నట్లు ఎన్పీసీఐ ఒక సర్క్యులర్‌లో పేర్కొంది. అలాగే డిఫాల్ట్ ఎంఎంఐడీ (మొబైల్ మనీ ఐడెంటిఫైయర్- MMID)తో సభ్యుల బ్యాంక్ పేర్లను మ్యాపింగ్ చేయాలని రిమిటర్ బ్యాంకులకు సూచించింది. ఐఎంపీఎస్ అంటే.. ఇమీడియట్ పేమెంట్ సర్వీస్ (IMPS) అనేది ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లు, బ్యాంక్ శాఖలు, ఏటీఎంలు, ఎస్ఎంఎస్, ఐబీఆర్ఎస్ వంటి వివిధ ఛానెల్‌ల ద్వారా డబ్బు ట్రాన్స్‌ఫర్‌కు అత్యంత సాధారణంగా ఉపయోగించే పద్ధతుల్లో ఒకటి. ఈ ఐఎంపీఎస్ ప్రస్తుతానికి P2A (అకౌంట్ + ఐఎఫ్ఎస్సీ) లేదా P2P (మొబైల్ నంబర్ + ఎంఎంఐడీ) ట్రాన్స్ఫర్ విధానాల్లో లావాదేవీలను ప్రాసెస్ చేస్తుంది. ఒక వేళ ఒకే మొబైల్ నంబర్‌తో ఎక్కువ అకౌంట్లను లింక్ చేసిన సందర్భంలో కస్టమర్ సమ్మతి ఆధారంగా ప్రాథమిక/డిఫాల్ట్ అకౌంట్‌కు బెనెఫీషియరీ బ్యాంక్ డబ్బును జమ చేస్తుంది. ఒక వేళ కస్టమర్ సమ్మతి లేని పక్షంలో బ్యాంకు ఆ లావాదేవీని తిరస్కరించాలి. -
రూ.1000 కోట్లు ఆదా చేసిన ప్రభుత్వం..
డిజిటల్ చెల్లింపులకు సంబంధించి ఎదురవుతున్న సైబర్ సెక్యూరిటీ సవాళ్లను పరిష్కరించడానికి ప్రభుత్వం సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ కరద్ చెప్పారు. కేంద్ర ఆర్థికశాఖ సమక్షంలో ఇటీవల జరిగిన భేటీలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సన్నద్ధత గురించి చర్చించామని మంత్రి కరద్ పేర్కొన్నారు. సైబర్ దాడులు, డిజిటల్ చెల్లింపులకు సంబంధించి అవకతవకలపై పటిష్ఠ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆర్థిక మోసాలను వెంటనే పరిష్కరించేందుకు ప్రభుత్వం సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. డిసెంబరు 4, 2023 వరకు జరిగిన 4 లక్షలకు పైగా సంఘటనల్లో ఈ వ్యవస్థ మొత్తం రూ.1,000 కోట్లకు మించి ఆదా చేసిందని పేర్కొన్నారు. పలువురి ఖాతాల్లో నవంబర్, 2023లో పొరపాటున జమ అయిన రూ.820 కోట్లకు గాను రూ.705.31 కోట్లను యూకో బ్యాంక్ రికవరీ చేసిందని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ కరద్ ఈ సమావేశంలో వెల్లడించారు. బ్యాంక్ ఐఎంపీ పేమెంట్ ఛానెల్లో సాంకేతికలోపంతో 41,000 యూకో బ్యాంక్ ఖాతాల్లోకి పొరపాటున ఈ నిధులు జమ అయినట్లు బ్యాంక్ వర్గాలు తెలిపాయి. ఈ ఘటనకు సంబంధించి నవంబర్ 15న యూకో బ్యాంక్ ఇద్దరు సపోర్ట్ ఇంజినీర్లు, ఇతర వ్యక్తులపై సీబీఐ వద్ద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. పశ్చిమ బెంగాల్, కర్ణాటకలోని 13 ప్రదేశాల్లో డిసెంబర్ 5న సీబీఐ సోదాలు చేపట్టింది. ఇందులో భాగంగా మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, డెబిట్ క్రెడిట్ కార్డులు, ఈ మెయిళ్లకు సంబంధించి సీబీఐ విచారణ చేపట్టింది. ఇదీ చదవండి: ఆఫీస్‌లో కాసేపు పడుకోనివ్వండి! ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లు, ఏటీఎంలు, బ్యాంక్ బ్రాంచ్‌లతో సహా వివిధ ఛానెల్‌ల ద్వారా యాక్సెస్ చేయగల 24/7 ఇంటర్‌బ్యాంక్ మొబైల్, ఐఎంపీఎస్‌లో లోపం ఏర్పడినట్లు విచారణలో తేలిందని అధికారులు వివరించారు. -
ప్రభుత్వ ‘యూకో’ బ్యాంక్ బాగోతం.. ప్రశ్నార్ధకంగా 114 కోట్లు!
డిసెంబర్ 7న ప్రభుత్వ బ్యాంకింగ్ రంగ సంస్థ యూకో బ్యాంక్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. ఫలితంగా యూకో బ్యాంక్‌కు చెందిన 41వేల అకౌంట్లలో పొరపాటున రూ.820 కోట్లు జమయ్యాయి. వాటిల్లో రూ. 705.31 కోట్లు రికవరీ అయ్యాయి. బ్యాంక్ ఐఎంపీ పేమెంట్ చానెల్లో సాంకేతిక లోపంతో జరిగిన నిధుల బదిలీలో రూ.114.69 ఇంకా రికవరీ కాలేదని కేంద్ర ఆర్ధిక శాఖ సహాయమంత్రి భగవత్ కరద్ లోక్ సభ సమావేశాల్లో లికిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఈ ఘటనకు కారణమైన యూకో బ్యాంక్ ఉద్యోగుల్ని గుర్తించింది. గుర్తించలేని ఇతర వ్యక్తులపై సీబీఐ వద్ద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇక పశ్చిమ బెంగాల్, కర్నాటకలోని 13 ప్రదేశాల్లో సీబీఐ సోదాలు చేపట్టింది. ఈ సోదాల్లో మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, డెబిట్ క్రెడిట్ కార్డులు, ఈ మెయిల్ ఆర్కైవ్లను సీబీఐ స్వాధీనం చేసుకుంది. -
ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే..!
అమ్మో ఒకటో తారీఖు..! ప్రతి నెల ఒకటో తారీఖు వచ్చిదంటే చాలు సామాన్యుడి జీవితంతో పాటు దేశంలో కూడా అనేక కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. దేశంలో కొత్త కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి. ఈ నిబంధనలు వల్ల కొన్ని సార్లు సామాన్యుడి జేబుకు చిల్లు పడుతుంది. వచ్చేనెల ఫిబ్రవరి ఒకటిన కేంద్ర బడ్జెట్ ను కేంద్ర ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టనుండగా పలు రంగాల్లో రానున్న మార్పులను మనం స్వాగతించాల్సి ఉంటుంది. వచ్చే నెల 1 నుంచి అమలులోకి రానున్న బ్యాంకులకు సంబంధించిన కొత్త రూల్స్ గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం.. ► దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 1 నుంచి తక్షణ చెల్లింపు సేవ(ఐఎంపీఎస్) ఛార్జీలను పెంచనుంది. ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్‌లో ఐఎంపీఎస్ ద్వారా చేసే నగదు బదిలీకి ఛార్జీ విధించనుంది. ఐఎమ్పిఎస్ లావాదేవీలు చేసేటప్పుడు జీఎస్టీతో పాటు గరిష్టంగా రూ.20 వసూలు చార్జీల రూపంలో చేయనుంది. అక్టోబర్ 2021లో ఐఎంపీఎస్ లావాదేవీల పరిమితిని ఆర్బిఐ రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచిన విషయం మనకు తెలిసిందే. ► ఫిబ్రవరి 1 నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన చెక్ క్లియరెన్స్‌కు సంబంధించిన నియమ & నిబంధనలు మారనున్నాయి. చెక్ చెల్లింపు కోసం వినియోగదారులు సానుకూల చెల్లింపు విధానాన్ని అనుసరించాలి. ప్రస్తుతం ఖాతాదారులు చెక్ జారీ చేసిన తర్వాత ఆ చెక్కుకు సంబంధించిన వివరాలు బ్యాంక్‌కు పంపాల్సి ఉంటుంది. లేకపోతే ఆ చెక్ క్లియర్ అవ్వదు. ఖాతాదారుల భద్రత దృష్ట్యా బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మార్పు కేవలం రూ. 10 లక్షల కంటే ఎక్కువ ఉన్న చెక్కుల కోసం ఇలాంటి నిబంధనలు మార్చింది. తక్కువ మొత్తంలో చెక్కులు జారీ చేస్తే మాత్రం ఈ మార్పులు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ► పంజాబ్ నేషనల్ బ్యాంక్ వచ్చే నెల నుంచి చార్జీల బాదుడు షురూ చేయబోతోంది. ఫిబ్రవరి 1 నుంచి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేకపోవడం వల్ల మీ ఇన్స్టాల్మెంట్లు లేదంటే ఈఎంఐ చెల్లింపులు ఫెయిల్ అయితే అప్పుడు బ్యాంక్ రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం రూ.100 చార్జీ వసూలు చేస్తున్నారు. డిమాండ్ డ్రాఫ్ట్‌ను క్యాన్సిల్ చేయాలన్నా రూ.150 చెల్లించుకోవాలి. ► ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల మాదిరిగానే వచ్చేనెల ఫిబ్రవరి 1, 15వ తేదీ నాడు గ్యాస్ సిలిండర్ల ధరల్ని సవరించనున్నాయి. ఫిబ్రవరి & మార్చిలో 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున ఫిబ్రవరి 1న ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను ప్రభుత్వం తగ్గిస్తుందా? లేదా అనేది చూడాలి. (చదవండి: బీఎండబ్ల్యూ అనూహ్య నిర్ణయం...! తొమ్మిదేళ్ల ప్రస్థానానికి ఎండ్ కార్డ్..!) -
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్..! ఫిబ్రవరి 1 నుంచి..!
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్..! ఫిబ్రవరి 1 నుంచి తక్షణ చెల్లింపు సేవ(ఐఎంపీఎస్) ఛార్జీలను పెంచుతోంది. ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్‌లో ఐఎంపీఎస్ ద్వారా చేసే నగదు బదిలీకి ఛార్జీ విధించనుంది. కొత్త ఛార్జీలు..! డిజిటల్ బ్యాంకింగ్ సేవలను ప్రొత్సహించేందుకుగాను ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. యోనో బ్యాంకింగ్ ద్వారా రూ. 5 లక్షల వరకు ఐఎంపీఎస్ సేవలకు ఎలాంటి సర్వీస్ ఛార్జ్, జీఎస్టీ వర్తించదు. బ్యాంకుల్లో చేసే ఐఎంపీఎస్ లావాదేవీలకు ఫిబ్రవరి 1 నుంచి కొత్త ఐఎంపీఎస్ ఛార్జీని అమలు చేయనున్నట్లు ఎస్బీఐ తమ ఖాతాదారులను ఇప్పటికే అలర్ట్ చేసింది. ఐఎంపీఎస్ ద్వారా ఖాతాదారులు 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు పంపితే రూ. 20తో పాటుగా జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని తెలియజేసింది. ఐఎంపీఎస్ సేవలతో డబ్బులను ఒక బ్యాంకు ఖాతా నుంచి మరొక బ్యాంకు ఖాతాకు సెకన్లలో బదిలీ చేయవచ్చును.సెలవు దినాలలో కూడా నగదు బదిలీ జరుగుతుంది. కొత్త ఛార్జీలు ఇలా ఉన్నాయి..! రూ. 5 లక్షల వరకు ఇంటర్నెట్ లేదా మొబైల్ బ్యాంకింగ్ ద్వారా చేసే ఏదైనా ఐఎంపీఎస్ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు ఉండవు. వీటిలో యోనో యాప్ లావాదేవీలకు కూడా వర్తించనుంది. ఐఎంపీఎస్ లావాదేవీల్లో భాగంగా రూ.1,000 నుంచి రూ.10,000 వరకు బదిలీ చేస్తే రూ. 2తో పాటు జీఎస్టీ చెల్లించాలి. రూ.10,000 నుంచి రూ.1,00,000 వరకు ఐఎంపీఎస్ లావాదేవీపై రూ. 4తో పాటుగా జీఎస్టీ చెల్లించాలి. రూ.1,00,000 నుంచి రూ.2,00,000 వరకు జరిపే లావాదేవీలపై రూ.12తో పాటు జీఎస్టీని ఛార్జ్ చేయనుంది. తాజాగా ఎస్బీఐ రూ.2,00,000 నుంచి రూ.5,00,000 వరకు కొత్త స్లాబ్‌ను యాడ్ చేసింది. ఈ నగదు లావాదేవీలపై రూ. 20 పాటు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. చదవండి: ఎస్బీఐ కొత్త సర్క్యులర్.. ఒక్క నోటీసుతో సీన్ రివర్స్, వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటన -
కొత్త ఏడాదిలో ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త..!
కొత్త ఏడాదిలో ఎస్బీఐ తన ఖాతాదారులకు మంచి శుభవార్త తెలిపింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన బ్యాంకు శాఖల వద్ద చేసే డబ్బు బదిలీలకు సంబంధించిన తక్షణ చెల్లింపు సేవ(ఐఎమ్పీఎస్) పరిమితిని పెంచినట్లు ప్రకటించింది. ఎస్బీఐ వెబ్సైట్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఐఎమ్పీఎస్ లావాదేవీల కొత్త స్లాబ్ అనేది ఫిబ్రవరి 1, 2022 నుంచి అమల్లోకి రానుంది. ఐఎమ్పీఎస్ ద్వారా రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య డబ్బును పంపినందుకు రూ.20లతో పాటు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఐఎమ్పీఎస్ అంటే ఏమిటి? ఐఎమ్పీఎస్ అంటే తక్షణ నగదు బదిలీల చెల్లింపు వ్యవస్థ. ఈ వ్యవస్థను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) నిర్వహిస్తుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లు, బ్యాంక్ బ్రాంచీలు, ఎటిఏమ్స్, ఎస్ఎమ్ఎస్, ఐవిఆర్ఎస్ వంటి వివిధ ఛానల్స్ ద్వారా ఐఎమ్పీఎస్ వ్యవస్థను యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ వ్యవస్థ వల్ల ఖాతాదారులు ఏడాదిలో ఎప్పుడైనా వేగంగా నగదు బదిలీ చేసుకోవచ్చు. భారతదేశం అంతటా బ్యాంకులు, ఆర్బిఐ అధీకృత ప్రీపెయిడ్ పేమెంట్ ఇనుస్ట్రుమెంట్(పిపిఐ) వ్యక్తులు తక్షణమే డబ్బును బదిలీ చేయవచ్చు. ఐఎమ్పీఎస్ ఇమీడియట్ పేమెంట్ సర్వీస్(ఐఎమ్పీఎస్) విధానంలో డబ్బులు వెంటనే ఇతరుల బ్యాంక్ అకౌంట్‌కు వెళ్లిపోతాయి. కనీసం రూ.1 నుంచి డబ్బులు పంపొచ్చు. గరిష్టంగా ఇప్పుడు రూ.5 లక్షల వరకు పంపించుకోవచ్చు. గతంలో ఈ పరిమితి రూ.2 లక్షల వరకు ఉండేది. ఇప్పుడు ఆ పరిమితిని రూ.5 లక్షల వరకు పెంచింది. ఈ సేవలు రోజులో ఎప్పుడైనా అందుబాటులో ఉంటాయి. రూ.2 లక్షల వరకు ఐఎమ్పీఎస్ ద్వారా ఉచితంగా పంపించవచ్చు. ఆ తర్వాత పంపించే మొత్తాలకు ఛార్జీలు వర్తిస్తాయి. (చదవండి: రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. వచ్చే బడ్జెట్లో) -
ఐఎంపీఎస్ చెల్లింపులు.. గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్బీఐ
RBI Monetary Policy Updates: డిజిటల్ చెల్లింపు విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపి కబురు అందించింది. ఇమ్మిడియట్ పేమెంట్స్ సర్వీసెస్(IMPS) చెల్లింపుల పరిమితిని 2 లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలకు పెంచేసింది. ఈ మేరకు రెండురోజులపాటు సాగిన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ(MPC) సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, శుక్రవారం మీడియాకు వెల్లడించారు. యూపీఐలాగే ఐఎంపీఎస్ కూడా ఇన్స్టంట్ ఫండ్ ట్రాన్స్ఫర్ సర్వీస్. మొబైల్ ఫోన్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, బ్యాంక్ బ్రాంచ్‌లు, ఏటీఎం, ఎస్సెమ్మెస్, ఐవీఆర్ఎస్ సర్వీసులతో ఉపయోగించుకోవచ్చు. 2014 జనవరిలో ఐఎంపీఎస్ చెల్లింపు పరిమితిని 2 లక్షలుగా నిర్ణయించింది ఆర్బీఐ. ఎస్సెమ్మెస్, ఐవీఆర్ఎస్ సర్వీసులతో మాత్రం ఇది 5 వేలుగానే కొనసాగుతోంది. ఈరోజుల్లో డిజిటల్ చెల్లింపులు ప్రామాణికంగా మారిన తరుణంలో.. ఊరటనిస్తూ ఐదు లక్షలకు ఆర్బీఐ పెంచడం విశేషం. అక్టోబరు 6న ప్రారంభమైన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం వివరాల్ని శుక్రవారం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. వరుసగా ఎనిమిదోసారి తర్వాత కూడా వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదని ప్రకటించారాయన. రెపోరేట్, రివర్స్ రెపోరేట్లను మార్చకుండా 4 శాతం, 3.35 శాతానికి, ఎస్ఎఫ్ కూడా 4.25 శాతానికే పరిమితం చేసినట్లు వెల్లడించారాయన. ఇక యూజర్లకు ఊరటనిస్తూ ఐఎంపీఎస్ ట్రాన్జాక్షన్ లిమిట్‌ను 2 లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచే ప్రతిపాదనను Immediate Payment Service (IMPS) యాప్స్ ముందు ఉంచినట్లు ఆర్బీఐ వెల్లడించింది. దీంతో పాటు ఎన్బీఎఫ్సీల్లో పెద్ద కస్టమర్ల ఫిర్యాదులను పరిష్కరించేందుకు అంతర్గత అంబుడ్స్‌మన్ ఏర్పాటునకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అంతేకాదు ఆఫ్‌లైన్‌పేమెంట్ మెకానిజంను త్వరలో తీసుకురాబోతున్నట్లు, దేశవ్యాప్తంగా ఆఫ్‌లైన్ విధానంలో రిటైల్ డిజిటల్ పేమెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కూడా ఆర్బీఐ ప్రతిపాదించింది. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్న సంకేతాలు ఉన్నప్పటికీ, ఆర్బీఐ మరోసారి సర్దుబాటు వైపే మొగ్గుచూపింది. ఇక కరోనాతో ప్రభావితమైన భారత ఆర్థిక వ్యవస్థకు అండగా నిలవడానికి ఆర్బీఐ రెపోరేటును 2020 మేలో 4 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. ఎంపీసీలోని కీలకాంశాలు ►చివరి ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష నాటితో పోలిస్తే ఆర్థికంగా భారత్ ప్రస్తుతం మెరుగైన స్థాయిలో ఉంది. ►ప్రస్తుత ఆర్థిక సంవత్సర వృద్ధిరేటు 9.5 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. ►ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఉన్నాయని శక్తికాంత దాస్ అన్నారు. ►పెట్టుబడుల్లో కూడా స్పష్టమైన పునరుద్ధరణ సంకేతాలు కనిపిస్తున్నాయి. ►పండగ సీజన్లో పట్టణ ప్రాంతాల్లో గిరాకీ మరింత వేగంగా ఊపందుకుంటుందని భావిస్తోంది. ►కీలక ద్రవ్యోల్బణం లక్షిత పరిధిలోనే ఉందన్నారు. ►జులై-సెప్టెంబరు త్రైమాసికంలో రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాల కంటే తక్కువగానే ఉందని పేర్కొన్నారు. ► క్యాపిటల్ గూడ్స్‌కి గిరాకీ పుంజుకోవడం ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణను సూచిస్తోంది. ►ఈ ఆర్థిక సంవత్సర రిటైల్ ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని 5.7 శాతం నుంచి 5.3 శాతానికి సవరణ. ►జులై-సెప్టెంబరులో అంచనాల కంటే తక్కువగా నమోదు కావడం గమనార్హం. ►అక్టోబరు-డిసెంబరు త్రైమాసిక లక్ష్యాన్ని సైతం 5.3 శాతం నుంచి 4.5 శాతానికి కుదించారు. ►రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాల ఉత్పత్తి నేపథ్యంలో వచ్చే నెల ఆహార ద్రవ్యోల్బణం స్థిరంగా ఉండనుంది. ►పేమెంట్ యాక్సెప్టెన్సీ కోసం పీవోఎస్ point of sale (PoS), క్యూఆర్ కోడ్ల తరహాలోనే జియో ట్యాగింగ్ టెక్నాలజీ తీసుకురావాలనే ఆలోచన ►2023 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వృద్ధి రేటును 17.1 శాతంగా నిర్దేశించుకుంది ఆర్బీఐ. చదవండి: మరింత సులభతరం కానున్న లావాదేవీలు -
ఆర్ బీఐ మరో కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: డీమానిటైజేషన్ నేపథ్యంలో నగదు కొరత కష్టాలను అధిగమించే చర్యల్లో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజలకు మరో వెసులుబాటు కల్పించింది. రూ 1,000 లోపు లావాదేవీల చార్జీలను రద్దు చేస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. ఈమేరకు అన్ని బ్యాంకులకు ఇతర ప్రీ పెయిడ్ సర్వీస్ ఏజెన్సీలకు సమాచారం అందించింది. 2017 జనవరి నుంచి మార్చి 31 వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. వెయ్యి లోపు చెల్లింపులపై తక్షణ చెల్లింపుల సేవ (ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్, ఐఎంపీస్ ) యూఎస్ఎస్డీ ఆధారిత చెల్లింపులు, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) సేవలపై ఎలాంటి చార్జీలను వసూలు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. పెద్ద నోట్లు రద్దు తర్వాత తాత్కాలిక చర్యల్లో భాగంగా ఈనిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. సమాజం లో ఎక్కువ మంది ప్రజల డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ఈ ఆదేశాలుజారీ చేసినట్టు ఆర్ బీఐ నోటిఫికేషన్లో పేర్కొంది. -
ట్విటర్ లో నగదు బదిలీ
ముంబై: తమ ఖాతాదారుల కోసం ఐసీఐసీఐ బ్యాంకు మరో సౌకర్యం అందుబాటులోకి తెచ్చింది. ట్విటర్ ద్వారా నగదు బదిలీ, బ్యాలెన్స్ ఎంక్వరీ, ప్రిపెయిడ్ మొబైల్ రీచార్జి చేసుకునే సదుపాయాన్ని సోమవారం ప్రారంభించింది. దీనికోసం ఖాతాదారులు బ్యాంకు ట్విటర్ పేజీలోకి వెళ్లి తమ పేర్లు రిజిష్టర్ చేసుకోవాలని ఐసీఐసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. నగదు బదిలీ చేయాలంటే అవతలివారి ట్విటర్ ఎకౌంట్ తెలుసుండాలి. నగదు బదిలీ చేసిన తర్వాత యూనిక్ కోడ్ తో ఎస్ఎంఎస్ వస్తుంది. నగదు తీసుకోవాలనుకునే వారు ఐసీఐసీఐ ట్విటర్ లో ఉన్న ప్రత్యేక పేజీలో ఈ కోడ్ ఎంటర్ చేస్తే బదిలీ పూర్తవుతుంది. త్వరలో ఇమ్మిడియేట్ పేమెంట్ సర్వీస్(ఐఎంపీఎస్) ప్రవేశపెడుతున్నట్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ సభర్వాల్ తెలిపారు.