ట్విటర్ లో నగదు బదిలీ
ముంబై: తమ ఖాతాదారుల కోసం ఐసీఐసీఐ బ్యాంకు మరో సౌకర్యం అందుబాటులోకి తెచ్చింది. ట్విటర్ ద్వారా నగదు బదిలీ, బ్యాలెన్స్ ఎంక్వరీ, ప్రిపెయిడ్ మొబైల్ రీచార్జి చేసుకునే సదుపాయాన్ని సోమవారం ప్రారంభించింది. దీనికోసం ఖాతాదారులు బ్యాంకు ట్విటర్ పేజీలోకి వెళ్లి తమ పేర్లు రిజిష్టర్ చేసుకోవాలని ఐసీఐసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
నగదు బదిలీ చేయాలంటే అవతలివారి ట్విటర్ ఎకౌంట్ తెలుసుండాలి. నగదు బదిలీ చేసిన తర్వాత యూనిక్ కోడ్ తో ఎస్ఎంఎస్ వస్తుంది. నగదు తీసుకోవాలనుకునే వారు ఐసీఐసీఐ ట్విటర్ లో ఉన్న ప్రత్యేక పేజీలో ఈ కోడ్ ఎంటర్ చేస్తే బదిలీ పూర్తవుతుంది. త్వరలో ఇమ్మిడియేట్ పేమెంట్ సర్వీస్(ఐఎంపీఎస్) ప్రవేశపెడుతున్నట్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ సభర్వాల్ తెలిపారు.