ట్విటర్ సీఈవో ఎలాన్ మస్క్ అన్నంత పనీ చేశాడు. సబ్‌స్క్రిప్షన్ చార్జీలు చెల్లించని యూజర్ల అకౌంట్లన్నింటికీ బ్లూ టిక్‌లు తొలగించింది ట్విటర్. ఇందులో టాప్ సినీ సెలబ్రిటీలు, క్రీడా ప్రముఖులు, హై-ప్రొఫైల్ బిజినెస్‌మేన్‌లు ఉన్నారు.
నెలవారీ రుసుము 8 డాలర్లు (సుమారు రూ. 660) చెల్లించని హై-ప్రొఫైల్ యూజర్ల ఖాతాలకు సంబంధించిన బ్లూటిక్‌లను ట్విటర్ తొలగించింది. వెరిఫైడ్ బ్లూటిక్ కావాలంటే కచ్చితంగా సబ్‌స్క్రిప్షన్ చార్జీ చెల్లించాలని లేకుంటే ఏప్రిల్ 20 నుంచి బ్లూటిక్‌లను తొలగిస్తామని గత కొన్ని రోజులుగా ట్విటర్ సీఈవో ఎలాన్ మస్క్ హెచ్చరిస్తూనే ఉన్నారు. గడువు తేదీ అయిపోగానే సబ్‌స్క్రిప్షన్ చార్జీ చెల్లించని అకౌంట్లన్నికీ వెరిఫైడ్ బ్లూటిక్ టిక్‌ను ట్విటర్ తొలగించింది.
ఇదీ చదవండి: కియా, హ్యుందాయ్ కంపెనీలకు షాక్! ఆ కార్లు రీకాల్ చేసేయాలని అభ్యర్థనలు
టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్, విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఛైర్మన్ ఉదయ్ కోటక్ ఇంకా పలువురు బడా వ్యాపారవేత్తలు తమ ట్విటర్ అకౌంట్లకు బ్లూటిక్‌ను కోల్పోయారు.
తమ బ్లూ టిక్ అలాగే ఉండాలనుకునేవారు నెలకు సుమారు రూ.660 చొప్పున చెల్లించి ట్విటర్ బ్లూకు సభ్యత్వాన్ని పొందవలసి ఉంటుంది. ఇక వెరిఫైడ్ బ్యాడ్జ్‌ను ఉంచుకోవాలనుకునే సంస్థలు నెలవారీ రుసుము 1,000 డాలర్లు (రూ. 82వేలకు పైగా)తో పాటు 50 డాలర్లు (సుమారు రూ. 4,100) అదనంగా చెల్లించాలి.ట్విటర్ 'వెరిఫైడ్ ఆర్గనైజేషన్స్' కోసం గోల్డ్ టిక్‌లను, ప్రభుత్వ సంస్థలు, వాటి అనుబంధ సంస్థలకు గ్రే టిక్‌లను ట్విటర్ అందిస్తుంది.
ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్!
Comments
Please login to add a commentAdd a comment