న్యూఢిల్లీ: నాన్ వెరిఫైడ్ ట్విటర్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్.మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ట్విటర్ డైరెక్ట్ మెసేజ్‌ల సంఖ్యను పరిమితం చేయడానికి చూస్తోంది. బ్లూ టిక్ లేని యూజర్ల మెసేజ్‌లకు ఇకపై పరిమితిని విధించనున్నారు.
ఒకే రోజులో డైరెక్ట్ మెసేజ్‌పై లిమిట్ విధించేందుకు ట్విటర్ యోచిస్తోంది. ఈ పరిమితి దాటిన తరువాత మరిన్ని మెసేజ్‌లను సెండ్ చేసేందుకు వెరిఫై చేసుకోండి అనే మెసేజ్ దర్శనమివ్వనుంది. లీకర్ అలెశాండ్రో పలుజ్జీ ఈ మేరకు మంగళవారం ట్వీట్ చేశారు. రోజుకి ఒక నాన్‌వెరిఫైడ్ యూజర్ సెండ్ చేసే డైరెక్ట్ మెసేజ్‌లను కట్టడి చేసేందుకు ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. (షావోమీ సరికొత్త ట్యాబ్లెట్ వచ్చేసింది, ధర, ఆఫర్లు ఎలా ఉన్నాయంటే?)
లీకర్ షేర్ చేసిన స్క్రీన్‌షాట్ ప్రకారం, పరిమితిని చేరుకున్న తర్వాత, నాన్-ట్విటర్ బ్లూ వినియోగదారులు "మరిన్ని సందేశాలపంపానుకుంటే వెరిఫై చేసుకోండి అనే సందేశాన్ని రానుంది. అంతే కాదు ఈ పరిమితి రోజుకు 500 DMలు అని, ఇది అమల్లోకి వచ్చార ఈ పరిమితి తగ్గుతుందని కూడా ఆయన భావించారు. (నెలకు లక్షన్నర జీతం: యాపిల్ ఫోనూ వద్దు, కారూ వద్దు, ఎందుకు? వైరల్ ట్వీట్)
కాగా ట్విటర్‌లో కంటెంట్ క్రియేటర్‌లకు వారి రిప్లయ్స్‌లో వచ్చిన ప్రకటనల ఆధారంగా త్వరలో చెల్లింపులను ప్రారంభిస్తుందని ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్ గత వారం ప్రకటించిన సంగతి తెలిసిందే.
#Twitter is working to limit the number of DMs you can send per day before having to sign up for @TwitterBlue 👀 pic.twitter.com/R9UDmd4OAo
— Alessandro Paluzzi (@alex193a) June 12, 2023
Comments
Please login to add a commentAdd a comment