direct messages
-
ట్విటర్ బ్లూటిక్ లేదా మీకు, అయితే ఈ వార్త మీకోసమే!
న్యూఢిల్లీ: నాన్ వెరిఫైడ్ ట్విటర్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్.మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ట్విటర్ డైరెక్ట్ మెసేజ్‌ల సంఖ్యను పరిమితం చేయడానికి చూస్తోంది. బ్లూ టిక్ లేని యూజర్ల మెసేజ్‌లకు ఇకపై పరిమితిని విధించనున్నారు. ఒకే రోజులో డైరెక్ట్ మెసేజ్‌పై లిమిట్ విధించేందుకు ట్విటర్ యోచిస్తోంది. ఈ పరిమితి దాటిన తరువాత మరిన్ని మెసేజ్‌లను సెండ్ చేసేందుకు వెరిఫై చేసుకోండి అనే మెసేజ్ దర్శనమివ్వనుంది. లీకర్ అలెశాండ్రో పలుజ్జీ ఈ మేరకు మంగళవారం ట్వీట్ చేశారు. రోజుకి ఒక నాన్వెరిఫైడ్ యూజర్ సెండ్ చేసే డైరెక్ట్ మెసేజ్‌లను కట్టడి చేసేందుకు ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. (షావోమీ సరికొత్త ట్యాబ్లెట్ వచ్చేసింది, ధర, ఆఫర్లు ఎలా ఉన్నాయంటే?) లీకర్ షేర్ చేసిన స్క్రీన్‌షాట్ ప్రకారం, పరిమితిని చేరుకున్న తర్వాత, నాన్-ట్విటర్ బ్లూ వినియోగదారులు "మరిన్ని సందేశాలపంపానుకుంటే వెరిఫై చేసుకోండి అనే సందేశాన్ని రానుంది. అంతే కాదు ఈ పరిమితి రోజుకు 500 DMలు అని, ఇది అమల్లోకి వచ్చార ఈ పరిమితి తగ్గుతుందని కూడా ఆయన భావించారు. (నెలకు లక్షన్నర జీతం: యాపిల్ ఫోనూ వద్దు, కారూ వద్దు, ఎందుకు? వైరల్ ట్వీట్) కాగా ట్విటర్లో కంటెంట్ క్రియేటర్లకు వారి రిప్లయ్స్లో వచ్చిన ప్రకటనల ఆధారంగా త్వరలో చెల్లింపులను ప్రారంభిస్తుందని ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్ గత వారం ప్రకటించిన సంగతి తెలిసిందే. #Twitter is working to limit the number of DMs you can send per day before having to sign up for @TwitterBlue 👀 pic.twitter.com/R9UDmd4OAo — Alessandro Paluzzi (@alex193a) June 12, 2023 -
ట్విట్టర్లో అక్షరాల ఆంక్షలు ఎత్తివేత!
సెకన్లలో సమాచారాన్నిలక్షలాదిమందికి చేరవేసే సామాజిక మాధ్యమం.. మైక్రో బ్లాగింగ్ సైట్.. ట్విట్టర్... ఇప్పుడు అక్షరాల ఆంక్షను ఎత్తివేసింది. ఇప్పటికే సైట్ లో ఖాతాదారులు పదివేల అక్షరాలను డైరెక్ట్ గా ట్వీట్ చేసే అవకాశం ఉండగా... ఇటీవల ఆంక్షలను విధించడం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. సెలబ్రిటీలు, జనం తాము అందించాలనుకున్న సమాచారాన్ని పొడి అక్షరాలుగా కుదించి పోస్ట్ చేస్తుంటారు. డైరెక్ట్ మెసేజ్ అయినా, ప్రైవేట్ మెసేజ్ అయినా ట్విట్టర్ యూజర్లు ఒకరికొకరు పంపించుకుంటుంటారు. ఈ సంవత్సరం మొదట్లో గ్రూప్ ఛాట్ లను కూడ ట్విట్టర్ ప్రారంభించింది. దానితోపాటు ఎవరైనా మరొకరికి ప్రైవేట్ మెసేజ్ ఇచ్చేందుకు కూడ సేవలు ప్రారంభించింది. ఇలా అప్ డేట్ చేయకముందు... నెటిజన్లు తమ ట్వీట్లను డైరెక్ట్ మెజేజ్ గా మాత్రమే పోస్ట్ చేసే అవకాశం ఉండేది. అయితే అప్పట్లో ప్రైవసీకి ఇది భంగం కలిగిస్తోందంటూ వివాదాలు కూడ చోటు చేసుకోవడంతో... యూజర్లకు సెట్టింగ్ మెనూలో సేవ్ అయ్యే అవకాశాన్ని కల్పించింది. దీంతో జనం ముఖ్యమైన సమాచారం మాత్రమే 140 క్యారెక్టర్లకు కుదించి పోస్ట్ చేయాల్సి వచ్చేది. అయితే అక్షరాలను ఏ విధంగా లెక్క కట్టాలి అనే దానిపై సంస్థ ఉన్నతాధికారులు పలు విధాలుగా చర్చించారు. యూజర్లకు లింక్ లు, రీ కోడ్ లు, తెలియకపోవడంతో 140 అక్షరాల ఆంక్షను అమలు చేయడం కష్టంగా మారింది. అయితే విమర్శలకు వెంటనే స్పందించలేదు. ఈ అక్షరాల ఆంక్షను ఎత్తివేసేందుకు సంవత్సరాల పాటు చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ జాక్ డోర్సీ.. సంస్థ అభివృద్ధి యూజర్లపైనే ఆధారపడి ఉంటుందని గమనించారు. అంతేకాదు న్యూయార్క్ స్టాక్ ఎక్సేంజ్ లో పెరిగే షేర్లు కూడ పతనం అవ్వడాన్ని గమనించారు. దీంతో గత నెలలో డైరెక్ట్ మెసేజ్ లో 140 క్యారెక్టర్ల ఆంక్షను ఎత్తివేశారు. పదివేల అక్షరాలతోనైనా మెసేజ్ లు పెట్టుకోవచ్చని ప్రకటించారు. ఓపక్క 140 అక్షరాల్లో మెసేజ్ లు పెట్టాలంటే కష్టం అంటూ ఖాతాదారులనుంచీ వ్యతిరేకత వ్యక్తమవ్వడం... మరోపక్క నెట్టింట్లో ట్విట్టర్ కు పోటీగా ఉన్న వాట్స్ అప్, ఫేస్బుక్ తదితరాలు అక్షరాల పరిమితిని విధించకపోవడంతో పోటీలో నిలవాలంటే ట్విట్టర్ ఆంక్షను ఎత్తివేయక తప్పలేదు. ఇప్పుడు ట్విట్టర్ లో మీరు ఏమైనా మాట్లాడుకోవచ్చు అంటూ ట్విట్టర్ యాజమాన్యం ప్రకటించింది. ప్రస్తుతం ప్రపంచంలోని మూడు వందల మిలియన్ల యూజర్లతో సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ట్విట్టర్ ఉండగా.. ఫేస్బుక్ 1.4 బిలియన్లతో కొనసాగుతోంది.