ట్విట్టర్లో అక్షరాల ఆంక్షలు ఎత్తివేత!
సెకన్లలో సమాచారాన్నిలక్షలాదిమందికి చేరవేసే సామాజిక మాధ్యమం.. మైక్రో బ్లాగింగ్ సైట్.. ట్విట్టర్... ఇప్పుడు అక్షరాల ఆంక్షను ఎత్తివేసింది. ఇప్పటికే సైట్ లో ఖాతాదారులు పదివేల అక్షరాలను డైరెక్ట్ గా ట్వీట్ చేసే అవకాశం ఉండగా... ఇటీవల ఆంక్షలను విధించడం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది.
సెలబ్రిటీలు, జనం తాము అందించాలనుకున్న సమాచారాన్ని పొడి అక్షరాలుగా కుదించి పోస్ట్ చేస్తుంటారు. డైరెక్ట్ మెసేజ్ అయినా, ప్రైవేట్ మెసేజ్ అయినా ట్విట్టర్ యూజర్లు ఒకరికొకరు పంపించుకుంటుంటారు. ఈ సంవత్సరం మొదట్లో గ్రూప్ ఛాట్ లను కూడ ట్విట్టర్ ప్రారంభించింది. దానితోపాటు ఎవరైనా మరొకరికి ప్రైవేట్ మెసేజ్ ఇచ్చేందుకు కూడ సేవలు ప్రారంభించింది. ఇలా అప్ డేట్ చేయకముందు... నెటిజన్లు తమ ట్వీట్లను డైరెక్ట్ మెజేజ్ గా మాత్రమే పోస్ట్ చేసే అవకాశం ఉండేది. అయితే అప్పట్లో ప్రైవసీకి ఇది భంగం కలిగిస్తోందంటూ వివాదాలు కూడ చోటు చేసుకోవడంతో... యూజర్లకు సెట్టింగ్ మెనూలో సేవ్ అయ్యే అవకాశాన్ని కల్పించింది. దీంతో జనం ముఖ్యమైన సమాచారం మాత్రమే 140 క్యారెక్టర్లకు కుదించి పోస్ట్ చేయాల్సి వచ్చేది.
అయితే అక్షరాలను ఏ విధంగా లెక్క కట్టాలి అనే దానిపై సంస్థ ఉన్నతాధికారులు పలు విధాలుగా చర్చించారు. యూజర్లకు లింక్ లు, రీ కోడ్ లు, తెలియకపోవడంతో 140 అక్షరాల ఆంక్షను అమలు చేయడం కష్టంగా మారింది. అయితే విమర్శలకు వెంటనే స్పందించలేదు. ఈ అక్షరాల ఆంక్షను ఎత్తివేసేందుకు సంవత్సరాల పాటు చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ జాక్ డోర్సీ.. సంస్థ అభివృద్ధి యూజర్లపైనే ఆధారపడి ఉంటుందని గమనించారు. అంతేకాదు న్యూయార్క్ స్టాక్ ఎక్సేంజ్ లో పెరిగే షేర్లు కూడ పతనం అవ్వడాన్ని గమనించారు. దీంతో గత నెలలో డైరెక్ట్ మెసేజ్ లో 140 క్యారెక్టర్ల ఆంక్షను ఎత్తివేశారు. పదివేల అక్షరాలతోనైనా మెసేజ్ లు పెట్టుకోవచ్చని ప్రకటించారు.
ఓపక్క 140 అక్షరాల్లో మెసేజ్ లు పెట్టాలంటే కష్టం అంటూ ఖాతాదారులనుంచీ వ్యతిరేకత వ్యక్తమవ్వడం... మరోపక్క నెట్టింట్లో ట్విట్టర్ కు పోటీగా ఉన్న వాట్స్ అప్, ఫేస్బుక్ తదితరాలు అక్షరాల పరిమితిని విధించకపోవడంతో పోటీలో నిలవాలంటే ట్విట్టర్ ఆంక్షను ఎత్తివేయక తప్పలేదు. ఇప్పుడు ట్విట్టర్ లో మీరు ఏమైనా మాట్లాడుకోవచ్చు అంటూ ట్విట్టర్ యాజమాన్యం ప్రకటించింది. ప్రస్తుతం ప్రపంచంలోని మూడు వందల మిలియన్ల యూజర్లతో సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ట్విట్టర్ ఉండగా.. ఫేస్బుక్ 1.4 బిలియన్లతో కొనసాగుతోంది.