పాపం వర్మ.. ఏం చేస్తున్నాడో? | Social Media troll with RGV after Sridevi Death | Sakshi
Sakshi News home page

Published Mon, Feb 26 2018 7:54 PM | Last Updated on Mon, Oct 22 2018 6:05 PM

Social Media troll with RGV after Sridevi Death  - Sakshi

సాక్షి, సినిమా : నటి శ్రీదేవి హఠాన్మరణం ఆమె కుటుంబ సభ్యులను, అమితంగా అభిమానించే వారిని ఎంత దిగ్భ్రాంతికి గురి చేసిందో చెప్పనక్కర్లేదు. అయితే ఆమెను ఆరాధ్య దేవతగా భావించే దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మను మాత్రం ఆ వార్త కుదిపేసింది.

ఆమె మరణవార్త తెలిసినప్పటి నుంచి మొదలైన ట్వీట్ల పర్వం ఆదివారం అంతా కొనసాగింది. దేవుడ్ని నిందిస్తూ... పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ... తనకు చెప్పకుండా వెళ్లిపోయావంటూ నీతో(శ్రీదేవి) కటీఫ్‌​ అంటూ ఆవేదన వ్యక్తం చేసిన వర్మ.. ఇవాళంతా మూగబోయాడు. దీంతో ఆయనసలు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వేర్‌ ఈజ్‌ ఆర్జీవీ? అంటూ సోషల్‌ మీడియాలో చర్చ నడుస్తోంది. 

కొందరేమో ఈ బాధను తట్టుకోలేక వర్మ అందరికీ దూరంగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడని అంటుండగా.. ఆ బాధ నుంచి వర్మ కోలుకోవడానికి సమయం పట్టే అవకాశం ఉందని మరికొందరు అంటున్నారు. కడసారి చూపుల కోసం ముంబై వెళ్లి ఉంటాడని ఇంకొందరు చెబుతున్నారు. ఎవరి ఊహకు అందని వర్మ మళ్లీ ఏ క్షణానైనా స్పందిచొచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం శ్రీదేవి మృతిపై మీడియాలో రకరకాల కథనాలు వెలువడుతున్న నేపథ్యంలోనైనా వర్మ ఏదో ఒకటి రియాక్ట్‌ అవుతాడేమో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement