సాక్షి, న్యూఢిల్లీ : సామాన్యుల ఆలోచనలు వ్యక్తపరచడానికి, నైపుణ్యాలను ప్రదర్శించడాని సోషల్ మీడియా ఓ చక్కటి వేదిక అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచ సోషల్ మీడియా డే( జూన్30) శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ‘యువకులకు సోషల్ మీడియా డే శుభాకాంక్షలు. ప్రజాస్వామ్య దేశంలో సోషల్ మీడియా ముఖ్యపాత్ర పోషిస్తోంది.
ఇది సామాన్యులు గొంతుక. కోట్లాది మంది సామాన్యులు తమ అభిప్రాయాలను వెల్లడించానికి అవకాశం ఇచ్చింది. పద్దతిగా మంచి కోసం ఉపయోగిస్తే సోషల్ మీడియా ద్వారా అనేక ఉపయోగాలు ఉన్నాయి. కానీ చెడు కోసం ఉపయోగిస్తే అంతే స్థాయిలో నష్టం కూడా ఉంది. యువకుల్లారా బాధ్యతాయుతంగా సోషల్ మీడియా ద్వారా స్వేచ్ఛగా మీ భావాలను ,నైపుణ్యాలను వెల్లడించండి’ అంటూ ట్వీట్ చేశారు.
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రామన్ సింగ్ కూడా ప్రపంచ సోషల్ మీడియా డే శుభాకాంక్షలు తెలిపారు. ‘నేడు సోషల్ మీడియా ఒక ఉప్పెనలా దూసుకెళ్తోంది. సామాన్యుడు తన భావాలను వ్యక్త పరచడానికి చక్కటి వేదికైంది. సమాజంలో సానుకూల ప్రభావాన్ని కల్పించేందుకు వీలుగా ప్రతిఒక్కరు బాధ్యతాయుతంగా ఈ సాధనాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను’ అని సింగ్ ట్వీటర్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment