‘సబర్మతి రిపోర్ట్‌’ సినిమాపై ప్రధాని మోదీ కీలక ట్వీట్‌ | Pm Narendramodi Tweet On Sabarmati Report Movie | Sakshi
Sakshi News home page

‘సబర్మతి రిపోర్ట్‌’ సినిమాపై ప్రధాని మోదీ కీలక ట్వీట్‌

Published Sun, Nov 17 2024 6:04 PM | Last Updated on Sun, Nov 17 2024 6:12 PM

Pm Narendramodi Tweet On Sabarmati Report Movie

న్యూఢిల్లీ:తాను సీఎంగా ఉన్నప్పుడు జరిగిన గుజరాత్‌ అల్లర్లను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ‘ది సబర్మతి రిపోర్ట్‌’ సినిమాపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసల వర్షం కురిపించారు. నిజాలు బయటకు వస్తున్నాయన్నారు.కల్పిత కథనాలు పరిమిత కాలమే కొనసాగుతాయని,సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

ఈ సినిమానుద్దేశించి ఒక నెటిజన్‌ పెట్టిన పోస్ట్‌పై ప్రధాని ఆదివారం ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా స్పందించారు.2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్లు, గోద్రా రైలు దహన కాండ సంచలనం రేపిన విషయం తెలిసిందే.2002  ఫిబ్రవరి 27న పంచమహాల్‌ జిల్లాలోని గోద్రా నగరంలో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌కు కొందరు దుండగులు నిప్పు పెట్టారు. 

ఈ ఘటనలో 59 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. దీనిని ఆధారంగా చేసుకుని బాలీవుడ్‌ దర్శకుడు ధీరజ్ సర్నా ‘ది సబర్మతి రిపోర్ట్‌’ సినిమా తెరకెక్కించారు. విక్రాంత్‌ మాస్సే, రాశీఖన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. రిధి డోగ్రా కీలక పాత్ర పోషించారు. నవంబర్‌ 15న సినిమా విడుదలైంది. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement