Sabarmati
-
పార్లమెంట్ కాంప్లెక్స్‌లో ‘ది సబర్మతి రిపోర్ట్’ను వీక్షించనున్న మోదీ
న్యూఢిల్లీ: గుజరాత్ అల్లర్లు, గోద్రా రైలు దహన కాండను ఆధారంగా చేసుకొని తెరకెక్కిన తాజా హిందీ చిత్రం ‘ది సబర్మతి రిపోర్ట్’. ఈ చిత్రాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు(సోమవారం) వీక్షించనున్నారు. పార్లమెంట్ కాంప్లెక్స్‌లోని బాలయోగి ఆడిటోరియంలో సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. ఈ స్క్రీనింగ్‌కు ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సహా పలువురు సభ్యులతో మోదీ ఈ చిత్రాన్ని చూడనున్నారు. మోదీతో పాటు విక్రాంత్ మాస్సే, చిత్ర నిర్మాత ఏక్తా కపూర్ కూడా చిత్రాన్ని వీక్షించనున్నారు.ఫిబ్రవరి 27, 2002న జరిగిన గోద్రా రైలు దహనం సంఘటన ఆధారంగా రూపొందించిన ది సబర్మతి రిపోర్ట్’లో నటులు విక్రాంత్ మాస్సే, రిధి డోగ్రా, రాశి ఖన్నా ప్రధాన పాత్రాలుగా నటించారు. బాలీవుడ్ దర్శకుడు ధీరజ్ సర్నా తెరకెక్కించగా.. ఏక్తా కపూర నిర్మించారు. నవంబర్ 15న ఈ సినిమా విడుదలైంది.కాగా పంచమహల్ జిల్లాలోని గోద్రా పట్టణంలో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌కు కొందరు దుండగులు నిప్పు పెట్టడంతో 59 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో గుజరాత్లో మతపరమైన అల్లర్లు చెలరేగాయి. దాదాపు 1,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఎక్కువగా ముస్లింలు ఉన్నారు. కాగా ఆ సమయంలో ప్రధాని మోదీ గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. -
‘ది సబర్మతి రిపోర్ట్’కు ట్యాక్స్ మినహాయించాలి: బండి సంజయ్
సాక్షి,హైదరాబాద్: కాంగ్రెస్ చరిత్రను కనుమరుగు చేస్తోందని, ‘ది సబర్మతి రిపోర్ట్’ సినిమాకు ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ చేశారు. శుక్రవారం(నవంబర్22) హైదరాబాద్ జీవీకేమాల్లో ‘ది సబర్మతి రిపోర్ట్’ మూవీని బండి సంజయ్ పలువురితో కలిసి వీక్షించారు.‘కాంగ్రెస్ కుట్రలను బట్టబయలు చేసిన సినిమా ఇది. ఒక వర్గానికి కొమ్ము కాస్తూ కాంగ్రెస్ చరిత్రను కనుమరుగు చేస్తూనే ఉంది. క్రికెట్లో పాకిస్తాన్ గెలిస్తే ఇండియాలో సంబరాలు చేసుకునే వాళ్లను ఏమనాలి?ఇండియా గెలవొద్దని కోరుకునే వాళ్లను ఏమనాలి?ఇప్పటికీ మినీ పాకిస్తాన్,మినీ బంగ్లాదేశ్,మినీ ఆఫ్ఘనిస్తాన్ బస్తీలున్నాయి.సమాజంలో ఇకనైనా మార్పు రావాలి. సబర్మతి వంటి సినిమాలు మరెన్నో రావాలి. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను చూడాలి. కాంగ్రెస్ కార్యకర్తలంతా ఈ సినిమా చూసి వాస్తవాలు తెలుసుకోవాలి’అని బండిసంజయ్ హితవు పలికారు. -
‘సబర్మతి రిపోర్ట్’ సినిమాపై ప్రధాని మోదీ కీలక ట్వీట్
న్యూఢిల్లీ:తాను సీఎంగా ఉన్నప్పుడు జరిగిన గుజరాత్ అల్లర్లను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ‘ది సబర్మతి రిపోర్ట్’ సినిమాపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసల వర్షం కురిపించారు. నిజాలు బయటకు వస్తున్నాయన్నారు.కల్పిత కథనాలు పరిమిత కాలమే కొనసాగుతాయని,సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు.ఈ సినిమానుద్దేశించి ఒక నెటిజన్ పెట్టిన పోస్ట్‌పై ప్రధాని ఆదివారం ఎక్స్(ట్విటర్) వేదికగా స్పందించారు.2002లో గుజరాత్లో జరిగిన అల్లర్లు, గోద్రా రైలు దహన కాండ సంచలనం రేపిన విషయం తెలిసిందే.2002 ఫిబ్రవరి 27న పంచమహాల్ జిల్లాలోని గోద్రా నగరంలో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌కు కొందరు దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో 59 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. దీనిని ఆధారంగా చేసుకుని బాలీవుడ్ దర్శకుడు ధీరజ్ సర్నా ‘ది సబర్మతి రిపోర్ట్’ సినిమా తెరకెక్కించారు. విక్రాంత్ మాస్సే, రాశీఖన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. రిధి డోగ్రా కీలక పాత్ర పోషించారు. నవంబర్ 15న సినిమా విడుదలైంది. Well said. It is good that this truth is coming out, and that too in a way common people can see it.A fake narrative can persist only for a limited period of time. Eventually, the facts will always come out! https://t.co/8XXo5hQe2y— Narendra Modi (@narendramodi) November 17, 2024 -
సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన జస్టిన్ ట్రూడో
-
దేశంలో తొలిసారి.. సీప్లేనులో మోదీ!
న్యూఢిల్లీ: హోరాహోరీగా సాగుతున్న గుజరాత్ రెండోదఫా ఎన్నికల ప్రచారం నేటి(మంగళవారం)తో ముగియనుంది. ఈ క్రమంలో అహ్మదాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్వహించతలపెట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ప్రధాని మోదీ తొలిసారి వినూత్నంగా ప్రజల ముందుకు వచ్చారు. సబర్మతి నదిలో సీప్లేన్ (సముద్ర విమానం)లో ప్రయాణించి.. ధారోయ్ డ్యామ్‌కు చేరుకున్నారు. అహ్మదాబాద్ నుంచి 150 కిలోమీటర్ల సముద్ర విమానంలో మోదీ ప్రయాణం చేశారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో ప్రయాణించి అంబాజీ ఆలయాన్ని దర్శించుకోబోతున్నారు. దేశంలో సీప్లేన్ ప్రయాణం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో అభివృద్ధి గురించి మాట్లాడటం లేదని కాంగ్రెస్ విమర్శిస్తున్న నేపథ్యంలో.. ఆ పార్టీ కనీసం ఇలాంటి అభివృద్ధిని ఊహించి కూడా ఉండదని ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశంలోని అన్నిచోట్లా ఎయిర్‌పోర్టులో నిర్మించడం సాధ్యం కాదని, అందుకే వాటర్‌వేస్‌పై దృష్టిపెట్టామని, దేశంలోని 106చోట్లా వీటిని నిర్మించాలని ప్రణాళికలు రచిస్తున్నామని ప్రధాని మోదీ వరుస ట్వీట్లలో వెల్లడించారు. ప్రధాని మోదీతోపాటు కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీకి కూడా అహ్మదాబాద్ లో ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ క్రమంలో వినూత్నంగా ప్రజలకు చేరువయ్యేందుకు మోదీ తొలిసారి సీప్లేన్ లో ప్రయాణించారు. -
సబర్మతీ తరహాలో మూసీ సుందరీకరణ
గుజరాత్ పర్యటనలో కేటీఆర్ - సబర్మతీ రివర్ డెవలప్మెంట్ - ఫ్రంట్ సందర్శన - టెక్స్టైల్స్ ఇండియా సదస్సులో ప్రసంగం సాక్షి, హైదరాబాద్: అహ్మదాబాద్‌లోని సబర్మ తీ నది తరహాలో మూసీ నది అభివృద్ధి, సుందరీకరణకు చర్యలు చేపడతామని రాష్ట్ర పురపాలన, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. టెక్స్టైల్స్ ఇండియా–2017 సదస్సులో పాల్గొనేందుకు గుజ రాత్లో పర్యటిస్తున్న ఆయన శనివారం రెండోరోజు హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, రాష్ట్ర అధికారులతో కలసి సబర్మతీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్‌ను సందర్శించారు. సబర్మతీ సుందరీకణలో ఎదురైన సమస్యలు, జనావాసాల తరలింపు, ప్రాజెక్టు పూర్తి చేసేందుకు పట్టిన సమయం వంటి అంశాలను అక్కడి అధికారులకు అడిగి తెలుసుకున్నారు. మూసీ సుందరీకరణ దిశగా నిధుల సమీకరణ, తొలి దశ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. నదీ ఒడ్డున ఏర్పాటు చేసిన గార్డెన్స్, వాక్‌వే, పార్కులు, రోడ్లను సందర్శించారు. టెక్స్‌టైల్స్‌కు భారీ ప్రోత్సాహకాలు.. రాష్ట్రంలో టెక్స్టైల్స్ రంగం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై కేటీఆర్ శనివారం టెక్స్టైల్స్ ఇండియా సదస్సులో కేంద్ర టెక్స్ టైల్స్ శాఖ మంత్రి స్మృతి ఇరానీ సమక్షంలో ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్ర టెక్స్టైల్స్ పాల సీ గురించి వివరించారు. వరంగల్‌లో నెలకొ ల్పనున్న మెగా టెక్స్టైల్ పార్కు గురించి ప్రస్తావించారు. రాష్ట్రం చేస్తున్న కార్యక్రమా లతో టెక్స్టైల్స్ రంగం మరింత ముందుకు పోతోందని, పెట్టుబడులు వస్తాయని ఆశా భావం వ్యక్తం చేశారు. సమర్థమైన నాయక త్వంలో నడుస్తున్న తెలంగాణ అన్ని రంగాల్లో బలోపేతం అవుతుందని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ప్రశంసించారని మంత్రి కేటీఆర్ కార్యాలయం తెలిపింది. సబర్మతీ ఆశ్రమంలో.. మహాత్మా గాంధీ జీవన విధానం అందరికీ ఆదర్శ మని కేటీఆర్ పేర్కొన్నారు. గుజరాత్ లోని సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు. మహాత్ముడి నివాసం, ఆశ్రమం లోని పాఠశా లను తిలకించారు. మహాత్ముడు వినియో గించిన వస్తువులను, రాసిన లేఖలను పరిశీ లించారు. మంత్రికి అక్కడి విద్యార్థులు చర ఖాను బహుకరించారు. ఆశ్రమాన్ని సంద ర్శించడం ద్వారా మహాత్ముడి అతి సాధారణ జీవితం కళ్లకు కట్టినట్లు కనిపిస్తోందని పేర్కొన్నారు. మహాత్ముడు చూపిన బాటలో నే గ్రామాల అభివృద్ధికి ప్రయత్నిస్తున్నామని, గ్రామ స్వరాజ్య స్థాపనే రాష్ట్ర ప్రభుత్వ పథకాల ప్రాథమిక లక్ష్యమని చెప్పారు. -
సబర్మతి తరహాలో మానేర్ డ్యాం
-
సబర్మతి తరహాలో మానేర్ డ్యాం
టాటా గ్రూప్ ప్రతినిధులతో కేసీఆర్ - హైదరాబాద్‌కు మించిన ఆకర్షణలు.. ‘కరీంనగర్ అభివృద్ధి’పై సమీక్ష సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ లోయర్ మానేర్ డ్యాం రివర్ ఫ్రంట్‌ను అత్యద్భుత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ‘‘హైదరాబాద్‌లోని పర్యాటక స్థలాల్లో సైతం లేని ఆకర్షణలు కల్పించండి. కరీంనగర్ సమీప ప్రాంతాలకు వెళ్లే పర్యాటకులంతా రివర్ ఫ్రంట్‌ను తప్పనిసరిగా సందర్శించేలా ప్రత్యేకతలు ఉట్టిపడాలి. ఆ మేరకు అవసరమైన సదుపాయాలు కల్పించాలి. హైదరాబాద్‌వాసులకు కూడా కరీంనగర్ వెళ్లి రివర్ ఫ్రంట్ చూసొద్దామనే ఆసక్తి కలగాలి’’ అని అభిప్రాయపడ్డారు. మానేర్ రివర్ ఫ్రంట్ అభివృద్ధిపై కరీంనగర్ జిల్లా నేతలతో పాటు టాటా బృందంతో ముఖ్యమంత్రి మంగళవారం ప్రగతి భవన్లో చర్చలు జరిపారు. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ తదితరులు భేటీలో పాల్గొన్నా రు. టాటా గ్రూప్ ప్రతినిధులు షనేశ్, సూర్యప్రకాశ్ తమ ప్రజంటేషన్ను సీఎంకు చూపించారు. ‘‘మానేర్ డ్యాంను పర్యాటక కేంద్రంగా, కరీంనగర్ నగరాన్ని టూరిస్ట్ హబ్‌గా రూపొందించడం మా ప్రాజెక్టు లక్ష్యం. కరీంనగర్లో మరిన్ని సాంస్కృతిక, ఆహ్లాదకర కార్యక్రమాలు రూపొందించాం. తెలంగాణ ఉద్యమాన్ని, చరిత్రను ప్రతిబిం బించేలా డిజైన్ చేశాం’’ అని వారు వివరించారు. దేశంలోనే తొలి రివర్ ఫ్రంట్‌గా గుర్తింపు పొందిన గుజరాత్‌లోని సబర్మతీ రివర్ ఫ్రంట్‌ను అధ్యయనం చేయాలని వారికి సీఎం సూచించారు. ‘‘అక్కడి ఆకర్షణలు, సదుపాయాలన్నీ మానేర్ డ్యాం వద్ద ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించండి. కరీంనగర్ చరిత్రకు అద్దం పట్టేలా రూపొందించండి’’ అని కరీంనగర్ నగరాభివృద్ధి జిల్లా నేతలకు సీఎం పలు సూచనలు చేశారు. ‘‘నగరాన్ని అందంగా ఎలా మలచుకోవచ్చో ఎంపీ, ఎమ్మెల్యేలు ఆలోచించాలి. పచ్చదనముండాలి. రాగి, వేప, సిల్వర్ ఓక్ మొక్కలు పెంచాలి. ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటాలి. ఇందుకు ఒక అటవీ శాఖ అధికారిని ప్రత్యేకించాలి. శాతవాహన వర్సిటీ చుట్టూ కేబీఆర్ పార్క్ తరహాలో గ్రీన్ వాక్ వే ఏర్పాటు చేయాలి. వీటన్నింటికీ ఓ సమగ్ర ప్రణాళిక రూపొందించుకోవాలి’8 అని సూచించారు. అభివృద్ధి ప్రణాళికపై చర్చించేందుకు జిల్లా అధికారులు, ఎమ్మెల్యేలతో సీఎం బుధవారం మళ్లీ భేటీ కానున్నారు.