‘ది సబర్మతి రిపోర్ట్‌’కు ట్యాక్స్‌ మినహాయించాలి: బండి సంజయ్‌ | Bandi Sanjay Comments ON THE Sabarmati Report Movie | Sakshi
Sakshi News home page

‘ది సబర్మతి రిపోర్ట్‌’ సినిమాకు ట్యాక్స్‌ మినహాయించాలి: బండి సంజయ్‌

Published Fri, Nov 22 2024 5:42 PM | Last Updated on Fri, Nov 22 2024 6:35 PM

Bandi Sanjay Comments ON THE Sabarmati Report Movie

సాక్షి,హైదరాబాద్: కాంగ్రెస్‌ చరిత్రను కనుమరుగు చేస్తోందని, ‘ది సబర్మతి రిపోర్ట్‌’ సినిమాకు ట్యాక్స్‌ మినహాయింపు ఇవ్వాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ​ చేశారు. శుక్రవారం(నవంబర్‌22) హైదరాబాద్‌ జీవీకేమాల్‌లో ‘ది సబర్మతి రిపోర్ట్’ మూవీని బండి సంజయ్‌ పలువురితో కలిసి వీక్షించారు.

‘కాంగ్రెస్ కుట్రలను బట్టబయలు చేసిన సినిమా ఇది. ఒక వర్గానికి కొమ్ము కాస్తూ కాంగ్రెస్ చరిత్రను కనుమరుగు చేస్తూనే ఉంది. క్రికెట్‌లో పాకిస్తాన్ గెలిస్తే ఇండియాలో సంబరాలు చేసుకునే వాళ్లను ఏమనాలి?ఇండియా గెలవొద్దని కోరుకునే వాళ్లను ఏమనాలి?ఇప్పటికీ మినీ పాకిస్తాన్,మినీ బంగ్లాదేశ్,మినీ ఆఫ్ఘనిస్తాన్ బస్తీలున్నాయి.

సమాజంలో ఇకనైనా మార్పు రావాలి. సబర్మతి వంటి సినిమాలు మరెన్నో రావాలి. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను చూడాలి. కాంగ్రెస్ కార్యకర్తలంతా ఈ సినిమా చూసి వాస్తవాలు తెలుసుకోవాలి’అని బండిసంజయ్‌ హితవు పలికారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement