సబర్మతీ తరహాలో మూసీ సుందరీకరణ
గుజరాత్ పర్యటనలో కేటీఆర్
- సబర్మతీ రివర్ డెవలప్‌మెంట్
- ఫ్రంట్ సందర్శన
- టెక్స్‌టైల్స్ ఇండియా సదస్సులో ప్రసంగం
సాక్షి, హైదరాబాద్: అహ్మదాబాద్‌లోని సబర్మ తీ నది తరహాలో మూసీ నది అభివృద్ధి, సుందరీకరణకు చర్యలు చేపడతామని రాష్ట్ర పురపాలన, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. టెక్స్‌టైల్స్ ఇండియా–2017 సదస్సులో పాల్గొనేందుకు గుజ రాత్‌లో పర్యటిస్తున్న ఆయన శనివారం రెండోరోజు హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, రాష్ట్ర అధికారులతో కలసి సబర్మతీ రివర్ డెవలప్‌మెంట్ ఫ్రంట్‌ను సందర్శించారు. సబర్మతీ సుందరీకణలో ఎదురైన సమస్యలు, జనావాసాల తరలింపు, ప్రాజెక్టు పూర్తి చేసేందుకు పట్టిన సమయం వంటి అంశాలను అక్కడి అధికారులకు అడిగి తెలుసుకున్నారు. మూసీ సుందరీకరణ దిశగా నిధుల సమీకరణ, తొలి దశ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. నదీ ఒడ్డున ఏర్పాటు చేసిన గార్డెన్స్, వాక్‌వే, పార్కులు, రోడ్లను సందర్శించారు.
టెక్స్‌టైల్స్‌కు భారీ ప్రోత్సాహకాలు..
రాష్ట్రంలో టెక్స్‌టైల్స్ రంగం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై కేటీఆర్ శనివారం టెక్స్‌టైల్స్ ఇండియా సదస్సులో కేంద్ర టెక్స్ టైల్స్ శాఖ మంత్రి స్మృతి ఇరానీ సమక్షంలో ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్ర టెక్స్‌టైల్స్ పాల సీ గురించి వివరించారు. వరంగల్‌లో నెలకొ ల్పనున్న మెగా టెక్స్‌టైల్ పార్కు గురించి ప్రస్తావించారు. రాష్ట్రం చేస్తున్న కార్యక్రమా లతో టెక్స్‌టైల్స్ రంగం మరింత ముందుకు పోతోందని, పెట్టుబడులు వస్తాయని ఆశా భావం వ్యక్తం చేశారు. సమర్థమైన నాయక త్వంలో నడుస్తున్న తెలంగాణ అన్ని రంగాల్లో బలోపేతం అవుతుందని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ప్రశంసించారని మంత్రి కేటీఆర్ కార్యాలయం తెలిపింది.
సబర్మతీ ఆశ్రమంలో..
మహాత్మా గాంధీ జీవన విధానం అందరికీ ఆదర్శ మని కేటీఆర్ పేర్కొన్నారు. గుజరాత్ లోని సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు. మహాత్ముడి నివాసం, ఆశ్రమం లోని పాఠశా లను తిలకించారు. మహాత్ముడు వినియో గించిన వస్తువులను, రాసిన లేఖలను పరిశీ లించారు. మంత్రికి అక్కడి విద్యార్థులు చర ఖాను బహుకరించారు. ఆశ్రమాన్ని సంద ర్శించడం ద్వారా మహాత్ముడి అతి సాధారణ జీవితం కళ్లకు కట్టినట్లు కనిపిస్తోందని పేర్కొన్నారు. మహాత్ముడు చూపిన బాటలో నే గ్రామాల అభివృద్ధికి ప్రయత్నిస్తున్నామని, గ్రామ స్వరాజ్య స్థాపనే రాష్ట్ర ప్రభుత్వ పథకాల ప్రాథమిక లక్ష్యమని చెప్పారు.