భారత పర్యటనలో ఉన్న కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో కుటుంబసభ్యులతో కలిసి సోమవారం సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. గుజరాతీ సంప్రదాయ దుస్తులు ధరించి భార్య సోఫీ, పిల్లలు జేవియర్, హడ్రియెన్, ఎల్లా గ్రేస్‌తో కలిసి ట్రూడో సబర్మతి ఆశ్రమాన్ని తిలకించారు. సబర్మతిలోని మహాత్మాగాంధీ జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా ట్రూడో, ఆయన భార్య సోఫీ చరఖా తిప్పారు. అనంతరం గాంధీనగర్‌లోని అక్షర్‌ధామ్ ఆలయాన్ని దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ట్రూడో ఆదివారం ఉదయం తాజ్‌మహల్‌ను సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భార్య, పిల్లలతో కలిసి తాజ్ మహల్ ఎదురుగా సరదాగా ఫోటోలు దిగారు. భారత్‌లో ఏడు రోజుల అధికారిక పర్యటన కోసం ట్రూడో శనివారం ఢిల్లీకి వచ్చారు