కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వరుసగా రెండోసారి అధికారం నిలబెట్టుకున్నారు. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ట్రూడోకు చెందిన లిబరల్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. మొత్తం 388 సీట్లుకు లిబరల్స్ 156 స్థానాలు దక్కించుకోగా.. ప్రతిపక్ష కన్సర్వేటీవ్స్ 122 స్థానాలకే పరిమితమయ్యారు. ప్రవాస భారతీయుడు జగ్మీత్‌సింగ్ నేతృత్వంలోని న్యూ డెమొక్రటిక్ పార్టీ 23స్థానాలు గెలుచుకుని సత్తా చాటింది. కెనడాలో మెజార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు 170 స్థానాలు అవసరం.