akshardham
-
మెట్రో స్టేషన్ విషాదం: అనాథలా బతకడం ఇష్టం లేకనే..
అక్షర్ధామ్ మెట్రో సూసైడ్ కేసు.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. చెవిటి-మూగ అయితే ఆ యువతి మెట్రో స్టేషన్ నుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే అదృష్టం కొద్దీ బతికింది అనుకునేలోపు.. చికిత్స పొందుతూ ఆమె కన్నుమూసింది. జీవితం మీద ఆమెకు అంతలా విరక్తి కలగడానికి వెనక కారణాలు తెలిస్తే అయ్యో పాపం అనకమానరు. పాతికేళ్లకే జీవితాన్ని ముగించాల్సిన అవసరం ఏంటన్న కోణంలో దర్యాప్తు చేసిన పోలీసులకు.. ఒక్కో విషయం తెలుస్తోంది. పంజాబ్ హోషియాపూర్‌కు చెందిన బాధితురాలు.. గురుగ్రామ్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ జీవనం కొనసాగించింది. అయితే ఆమె తల్లిదండ్రులు సహా ఇంట్లో వాళ్లంతా ఎప్పుడో మరణించారు. ప్రస్తుతం ఒక్క బామ్మ మాత్రమే బతికి ఉంది. ఆ పెద్దావిడ కూడా ఇవాళో రేపో అన్నట్లు ఉంది. ఈ తరుణంలో.. ఆవిడ కూడా చనిపోతే.. అనాథగా మిగిలిపోతానేమోనని ఆమె ఆందోళన చెందుతోంది. ఈ విషయమై చాలాకాలంగా ఆలోచిస్తూ డిప్రెషన్లో కూరుకుపోయిన ఆమె.. ఆఫీస్‌లోనూ ఎవరితో కలవకుండా ఒంటరిగా ఉంటోందని, కౌన్సెలింగ్ కోసం కూడా సహకరించలేదని ఆమెతో పని చేసిన కొలీగ్స్ చెప్పారు. ఇక ఒంటరితనం గురించి ఆలోచించి.. ఆలోచించి.. చివరకు ఈమధ్యే ఆ యువతి ఉద్యోగం కూడా మానేసిందట. ఆపై అనాథగా మిగిలిపోతానేమోనని ఆందోళనతో.. ఇలా తీవ్ర నిర్ణయం తీసుకుని ఉంటుందని పోలీసులు వెల్లడించారు. Saving Lives... Prompt and prudent response by CISF personnel saved life of a girl who jumped from Akshardham Metro Station. #PROTECTIONandSECURITY #Humanity @PMOIndia@HMOIndia@MoHUA_India#15yearsofCISFinDMRC pic.twitter.com/7i9TeZ36Wk — CISF (@CISFHQrs) April 14, 2022 కాపాడే ప్రయత్నంలో.. నలభై అడుగుల ఎత్తు నుంచి దూకడంతో.. తీవ్రంగా గాయాలపాలై శుక్రవారం ఆమె మృతి చెందినట్లు లాల్ బహదూర్ శాస్త్రి ఆస్పత్రి వైద్యులు తెలిపారు. తూర్పు ఢిల్లీ అక్షరధామ్ మెట్రో స్టేషన్ బ్లూ లైన్ మెట్రో ప్లాట్ఫారం చివర నుంచి ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది. అక్కడే ఉన్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది.. ఆమెను నిలువరించే ప్రయత్నం కూడా చేశారు. పైన ఒక బృందం ఆమెను బతిమాలి ఆత్మహత్య ప్రయత్నం విరమించే దిశగా కృషి చేయగా.. కింద మరో టీం దూకితే గనుక బ్లాంకెట్ సాయంతో ఆమెను పట్టేసుకోవాలని రెడీగా ఉన్నారు. ఈలోపు ఆమె దూకేయగా.. బ్లాంకెట్‌లో పట్టేసుకున్నారు. అయితే తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కన్నుమూసిందామె. చదవండి: మెట్రో స్టేషన్‌పై నుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
మెట్రో స్టేషన్ పైనుంచి దూకి యువతి మృతి
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని అక్షర్ధామ్ మెట్రో స్టేషన్‌పై నుంచి దూకి ఓ యువతి (22) ఆత్మహత్యకు పాల్పడింది. పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌కు చెందిన ఈమె గురువారం ఉదయం 7.30 సమయంలో మెట్రోస్టేషన్ రెండో నంబర్ ప్లాట్‌ఫాం నుంచి కిందికి దూకేందుకు ప్రయత్నించింది. అది చూసి వెంటనే అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఆమెను వారించేందుకు ప్రయత్నించారు. ఆమె వినకపోవడంతో కాపాడేందుకు కింద భారీ దుప్పటిని అడ్డుగా పట్టుకుని నిలబడ్డారు. కిందికి దూకిన ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలతో ఆమె ఆస్పత్రిలో కన్నుమూసిందని అధికారులు తెలిపారు. ఆ యువతి గత కొద్ది రోజులుగా గుర్గావ్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసిందన్నారు. ఆత్మహత్యకు దారితీసిన కారణాలు తెలియాల్సి ఉందని అధికారవర్గాలు పేర్కొన్నాయి. మెట్రో భవనం పైనుంచి దూకుతున్న యువతి -
మెట్రో స్టేషన్‌పై నుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం.. వీడియో
సాక్షి, న్యూఢిల్లీ: గుర్తు తెలియని ఓ యువతి మెట్రో స్టేషన్ గోడపైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈ ఘటన ఢిల్లీలోని అక్షరధామ్ మెట్రో స్టేషన్లో గురువారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సదరు యువతి గాయపడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. ఓ యువతి మెట్రోస్టేషన్ గోడ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మెట్రో స్టేషన్లో ఉన్న సిబ్బంది, సీఐఎస్ఎఫ్ జవాన్లు ఆమె మాటల్లో పెట్టి రక్షించే ప్రయత్నం చేశారు. ఆత్మహత్య చేసుకోవద్దని ఎంత చెప్పినా యువతి పట్టించుకోలేదు. ఎలాగైనా ఆమె కాపాడాలన్న ఉద్దేశ్యంతో జవాన్లు.. ఆమె పై నుంచి దూకబోయే ముందు మెట్రో స్టేషన్ కింద రక్షణ వలను ఏర్పాటు చేశారు. యువతిని కాపాడాలని సిబ్బంది ఆమె వద్దకు వెళ్లే ప్రయత్నం చేయగా యువతి కిందకు దూకింది. ఈ ఘటనలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. అయితే, ముందు జాగ్రత్తగా అధికారులు అంబులెన్స్‌ను పిలిపించడంతో వెంటనే ఆమెను లాల్ బహదూర్ శాస్త్రి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సీఐఎస్ఎఫ్ అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేయగా ట్రెండింగ్‌లో నిలిచింది. Saving Lives... Prompt and prudent response by CISF personnel saved life of a girl who jumped from Akshardham Metro Station. #PROTECTIONandSECURITY #Humanity @PMOIndia@HMOIndia@MoHUA_India#15yearsofCISFinDMRC pic.twitter.com/7i9TeZ36Wk — CISF (@CISFHQrs) April 14, 2022 Something dangerous that I witnessed today when I reached Akshardham metro station...This girl in white shirt wanted to commit suicide, while DMRC employees and jawans tried their best to convince this girl. Although she jumped from the edge, but was rescued.@NewsroomPostCom pic.twitter.com/la2XCyu9Tn — Neha Singh (@NehaSingh1912) April 14, 2022 -
సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన జస్టిన్ ట్రూడో
-
సబర్మతీ ఆశ్రమంలో.. సంప్రదాయ దుస్తుల్లో!
సాక్షి, అహ్మదాబాద్ : భారత పర్యటనలో ఉన్న కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో కుటుంబసభ్యులతో కలిసి సోమవారం సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. గుజరాతీ సంప్రదాయ దుస్తులు ధరించి భార్య సోఫీ, పిల్లలు జేవియర్, హడ్రియెన్, ఎల్లా గ్రేస్‌తో కలిసి ట్రూడో సబర్మతి ఆశ్రమాన్ని తిలకించారు. సబర్మతిలోని మహాత్మాగాంధీ జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా ట్రూడో, ఆయన భార్య సోఫీ చరఖా తిప్పారు. అనంతరం గాంధీనగర్‌లోని అక్షర్ధామ్ ఆలయాన్ని దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ట్రూడో ఆదివారం ఉదయం తాజ్‌మహల్‌ను సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భార్య, పిల్లలతో కలిసి తాజ్ మహల్ ఎదురుగా సరదాగా ఫోటోలు దిగారు. భారత్‌లో ఏడు రోజుల అధికారిక పర్యటన కోసం ట్రూడో శనివారం ఢిల్లీకి వచ్చారు. 2012 తర్వాత భారత్‌లో పర్యటిస్తున్న కెనడా ప్రధాని ట్రూడోనే. ఈ నెల 23 వరకు ఆయన దేశంలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. రక్షణ, ఉగ్రవాదం సహా పలు కీలకాంశాలపై ఇరువురు ప్రధానులు చర్చించనున్నారు. అనంతరం 20న ప్రముఖ వ్యాపారవేత్తలు, సినీ నిర్మాతలతో ముంబైలో సమావేశమవుతారు. 21న స్వర్ణదేవాలయాన్ని సందర్శించనున్నారు. -
గుడిసెల తొలగింపును అడ్డుకున్న ఆప్
సాక్షి, న్యూఢిల్లీ: అక్షర్ధామ్ మందిరం సమీపాన ఉన్న మురికివాడలోని గుడిసెలను (జుగ్గీలు) తొలగించడానికి వచ్చిన మున్సిపాలిటీ అధికారుల బృందాన్ని ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) నేత మనీష్ సిసోడియా నేతృత్వంలో కొందరు ఆప్ కార్యకర్తలు శుక్రవారం అడ్డుకున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు యమునాతీరాన ఆక్రమణలను తొలగించడానికి వచ్చిన బృందాన్ని అడ్డుకోవడానికి మనీష్ సిసోడియా కార్యకర్తలతో కలసి రావడంతో ఉద్రిక్తత నెలకొంది. దీనిపై సిసోడియా స్పందిస్తూ మానవతా దృక్పథంతో ఆక్రమణల తొలగింపును అడ్డుకున్నట్లు చెప్పారు. చలికాలంలో జుగ్గీలను తొలగిస్తే ఇక్కడి పేదలంతా చలిలో రాత్రులు గడపవలసి వస్తుందని ఆయన చెప్పారు. జుగ్గీల తొలగింపునకు ఐదు నెలల క్రితమే హైకోర్టు ఆదేశించిందని, ఇప్పుడు వాటిని తొలగించడం వెనుక రాజకీ యం ఉందని సిసోడియా ఆరోపించారు. యమునానది తీరంలో చాలా సంవత్సరాల కిందట వెలసిన జుగ్గీలను తొలగించాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. వాటిని తొలగించడానికి అధికారుల బృందం పోలీసులతోపాటు శుక్రవారం ఉదయం అక్షర్ధామ్ వద్దకు చేరుకుంది. ఈ సంగతి తెలుసుకున్న పత్పట్‌గంజ్ ఎమ్మెల్యే మనీష్ సిసోడియా ఆప్ కార్యకర్తలతోపాటు అక్కడికి చేరుకున్నారు. ఆక్రమణల తొలగింపును ఆరంభించగానే కార్యకర్తలు, జుగ్గీవాసులతోపాటు నినాదాలు చేస్తూ నేలపై పడుకున్నారు. దీంతో ఆక్రమణల తొలగింపు కోసం వ చ్చిన బృందం వెనుదిరిగింది. జుగ్గీల తొలగింపు వెనుక దుష్టరాజకీయం ఉందని సిసోడియా ఆరోపించారు. తమకు ఓటు వేయకుండా ఆప్‌కు ఓటు వేసినందుకే జుగ్గీలను తొలగిస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు స్థానికులతో చెప్పారని ఆయన ఆరోపించారు.