
ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని అక్షర్‌ధామ్ మెట్రో స్టేషన్‌పై నుంచి దూకి ఓ యువతి (22) ఆత్మహత్యకు పాల్పడింది. పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌కు చెందిన ఈమె గురువారం ఉదయం 7.30 సమయంలో మెట్రోస్టేషన్ రెండో నంబర్ ప్లాట్‌ఫాం నుంచి కిందికి దూకేందుకు ప్రయత్నించింది. అది చూసి వెంటనే అప్రమత్తమైన సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది ఆమెను వారించేందుకు ప్రయత్నించారు.
ఆమె వినకపోవడంతో కాపాడేందుకు కింద భారీ దుప్పటిని అడ్డుగా పట్టుకుని నిలబడ్డారు. కిందికి దూకిన ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలతో ఆమె ఆస్పత్రిలో కన్నుమూసిందని అధికారులు తెలిపారు. ఆ యువతి గత కొద్ది రోజులుగా గుర్‌గావ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసిందన్నారు. ఆత్మహత్యకు దారితీసిన కారణాలు తెలియాల్సి ఉందని అధికారవర్గాలు పేర్కొన్నాయి.
మెట్రో భవనం పైనుంచి దూకుతున్న యువతి
Comments
Please login to add a commentAdd a comment