Hoshiarpur
-
Lok Sabha Election 2024: ఎమర్జెన్సీలో రాజ్యాంగం గొంతు నొక్కారు
హోషియార్పూర్: ఎమర్జెన్సీ సమయంలో రాజ్యాంగం గొంతు పిసికిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాజ్యాంగ పరిరక్షణ అంటూ గొంతు చించుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. 1984 నాటి అల్లర్లలో సిక్కుల మెడలకు టైర్లు బిగించి, నిప్పంటించి కాల్చి చంపుతుంటే కాంగ్రెస్‌కు రాజ్యాంగం గుర్తుకు రాలేదని ధ్వజమెత్తారు. గురువారం పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో ఎన్నికల ప్రచార సభలో మోదీ ప్రసంగించారు. ఈ ఎన్నికల్లో మోదీకి ఇదే చివరి సభ. రిజర్వేషన్లపై కాంగ్రెస్‌తోపాటు విపక్ష ‘ఇండియా’ కూటమి ఉద్దేశాలు చాలా ప్రమాదకరంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రిజర్వేషన్లలో కోత విధించి, బడుగు బలహీనవర్గాలకు అన్యాయం చేసిన చరిత్ర ప్రతిపక్షాలకు ఉందన్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు కట్టబెట్టేందుకు విపక్షాలు ప్రయతి్నస్తున్నాయని దుయ్యబట్టారు. రాజ్యాంగ స్ఫూర్తిని, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మనోభావాలను ప్రతిపక్షాలు కించపరుస్తున్నాయని ఆక్షేపించారు. అవినీతిలో కాంగ్రెస్ డబుల్ పీహెచ్డీ కాంగ్రెస్ పార్టీ అవినీతికి తల్లిలాంటిదని ప్రధానమంత్రి నిప్పులు చెరిగారు. అవినీతిలో ఆ పార్టీ డబుల్ పీహెచ్డీ చేసిందని ఎద్దేవా చేశారు. మరో అవినీతి పారీ్ట(ఆమ్ ఆద్మీ పార్టీ) కాంగ్రెస్‌తో చేతులు కలిపిందన్నారు. ఢిల్లీలో కలిసికట్టుగా, పంజాబ్‌లో విడివిడిగా పోటీ చేస్తూ ఆ రెండు పారీ్టలు డ్రామాలాడుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ గర్భంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ ఊపిరి పోసుకుందని అన్నారు. కాంగ్రెస్ నుంచే అవినీతి పాఠాలు చేర్చుకుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాల్లో మునిగి తేలుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సైనిక దళాలను బలహీనపర్చిందని ఆరోపించారు. సైన్యంలో సంస్కరణలు చేపట్టడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదన్నారు. ఓటింగ్‌లో కొత్త రికార్డు సృష్టించాలి వారణాసి ప్రజలకు ప్రధాని పిలుపు లక్నో: సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి పోటీ చేస్తున్నారు. వారణాసిలో శనివారం పోలింగ్ జరుగనుంది. తన నియోజకవర్గ ప్రజలకు మోదీ గురువారం ఒక వీడియో సందేశం విడుదల చేశారు. భారతదేశ అభివృద్ధి కోసం వారణాసి ఓటింగ్‌లో కొత్త రికార్డు సృష్టించాలని పిలుపునిచ్చారు. కాశీ విశ్వనాథుడితోపాటు అక్కడి ప్రజల ఆశీర్వచనాలతోనే పార్లమెంట్లో వారణాసికి ప్రాతినిధ్యం వహించే అవకాశం తనకు దక్కిందని పేర్కొన్నారు. పవిత్ర గంగామాత తనను దత్తత తీసుకుందన్నారు. నవకాశీతోపాటు ‘అభివృద్ధి చెందిన భారత్’ను సాకారం చేసుకోవడానికి ఈ ఎన్నికలు చాలా కీలకమని వివరించారు. జూన్ 1న జరిగే ఓటింగ్‌లో వారణాసి ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొనాలని, ఓటింగ్‌లో కొత్త రికార్డు సృష్టించాలని మోదీ విజ్ఞప్తి చేశారు. కాశీని ఎంతో అభివృద్ధి చేశామని, రాబోయే రోజుల్లో ఈ అభివృద్ధిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తామని మోదీ హామీ ఇచ్చారు. కన్యాకుమారిలో మోదీ ధ్యానముద్ర సాక్షి, చెన్నై: తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారిలో వివేకానంద రాక్ మెమోరియల్లోని ధ్యాన మండపంలో ప్రధాని మోదీ గురువారం సాయంత్రం ధ్యానం ప్రారంభించారు. దాదాపు 45 గంటపాటు ఆయన ధ్యానం కొనసాగించనున్నారు. మోదీ తొలుత కేరళలోని తిరువనంతపురం నుంచి హెలికాప్టర్లో కన్యాకుమారికి చేరుకున్నారు. సంప్రదాయ ధోతీ, తెల్ల రంగు కండువా ధరించి భగవతి అమ్మన్ ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం మోదీ సముద్ర తీరం నుంచి పడవలో రాక్ మెమోరియల్‌కు చేరుకున్నారు. ధ్యాన మండపం మెట్లపై కాసేపు కూర్చుకున్నారు. తర్వాత ధ్యాన మండపంలో సుదీర్ఘ ధ్యానానికి శ్రీకారం చుట్టారు. -
పార్టీలు మారుతున్న అభ్యర్థులు.. ఎంపీలను మార్చేస్తున్న ఓటర్లు!
దేశంలో లోక్‌సభ ఎన్నికలు ఏడు విడతల్లో జరుగుతున్నాయి. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ, శిరోమణి అకాలీదళ్, కాంగ్రెస్‌లు 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. బీజేపీ తొమ్మిది స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది. ఈసారి అన్ని రాజకీయ పార్టీలు విడివిడిగా ఎన్నికల్లో పోటీకి దిగడంతో పోరు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా పంజాబ్‌లోని హోషియార్పూర్ స్థానంలో పోటీపై ఎక్కడాలేని ఆసక్తి నెలకొంది. ఇక్కడ కూడా అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలిపాయి.హోషియార్పూర్ సిట్టింగ్ ఎంపీ సోమ్‌ప్రకాష్ భార్య అనితా ప్రకాష్‌ను భారతీయ జనతా పార్టీ ఎన్నికల పోరులో నిలిపింది. కాంగ్రెస్‌ను వీడి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన డాక్టర్ రాజ్‌కుమార్ చబ్బేవాల్‌ను ఆ పార్టీ రంగంలోకి దింపింది. శిరోమణి అకాలీదళ్ మాజీ మంత్రి సోహన్ సింగ్ తాండల్‌ను, కాంగ్రెస్ పార్టీ యామినీ గోమర్‌ను తమ అభ్యర్థులుగా నిలబెట్టాయి.ఈ లోక్‌సభ నియోజకవర్గంలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే గత ఏడు ఎన్నికల్లో హోషియార్పూర్ ఓటర్లు ప్రతీసారి ఎంపీని మారుస్తూనే ఉన్నారు. ఒక్క కమల్ చౌదరి మాత్రమే నాలుగుసార్లు ఇక్కడి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న నలుగురు అభ్యర్థులు కూడా కొత్తవారే కావడం విశేషం.గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన డాక్టర్ చబ్బెవాల్ ఈసారి ఆప్ నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. 2014లో ఇదే స్థానంలో ఆప్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన యామినీ గోమర్‌ను ఈసారి కాంగ్రెస్ తన అభ్యర్థిగా నిలబెట్టింది. గత లోక్‌సభ ఎన్నికల్లో హోషియార్పూర్ స్థానంలో బీజేపీకి చెందిన సోమ్‌ప్రకాష్ 48,530 ఓట్ల తేడాతో డాక్టర్ చబ్బెవాల్పై విజయం సాధించారు. సోమ్‌ప్రకాష్ ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం అతని భార్య అనితా సోమ్‌ప్రకాష్ బీజేపీ నుండి ఎన్నికల బరిలోకి దిగారు. హోషియార్‌పూర్‌లో అభ్యర్థులు పార్టీలను మార్చేస్తున్నట్లుగానే.. ఓటర్లు కూడా ప్రతీ ఎన్నికల్లోనూ ఎంపీలను మార్చేస్తుండటం విశేషం. -
అమృత్‌పాల్ కోసం డ్రోన్‌తో గాలింపు
హోషియార్పూర్: వివాదాస్పద సిక్కు మత బోధకుడు అమృత్‌పాల్ సింగ్ జాడ కోసం పంజాబ్ పోలీసులు వేట ముమ్మరం చేశారు. గురువారం డ్రోన్‌ను రంగంలోకి దించారు. హోషియార్పూర్ జిల్లాలోని మర్నాయిన్ గ్రామంలో, చుట్టుపక్కల ప్రాంతాల్లో డ్రోన్‌తో గాలింపు చర్యలు చేపట్టారు. రెండు రోజుల క్రితం ఇదే గ్రామంలో కొందరు అనుమానితులు తమకారును వదిలేసి పారిపోయారు. వారిలో అమృత్‌పాల్ ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కాగా, తాను ఎక్కడికీ పారిపోలేదని, త్వరలోనే ప్రపంచం ఎదుటకు వస్తానని అమృత్‌పాల్ వెల్లడించాడు. ఈ మేరకు గురువారం మరో వీడియో తెరపైకి వచ్చింది. చావంటే తనకు భయం లేదని ఆ వీడియోలో వ్యాఖ్యానించాడు. -
మెట్రో స్టేషన్ పైనుంచి దూకి యువతి మృతి
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని అక్షర్ధామ్ మెట్రో స్టేషన్‌పై నుంచి దూకి ఓ యువతి (22) ఆత్మహత్యకు పాల్పడింది. పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌కు చెందిన ఈమె గురువారం ఉదయం 7.30 సమయంలో మెట్రోస్టేషన్ రెండో నంబర్ ప్లాట్‌ఫాం నుంచి కిందికి దూకేందుకు ప్రయత్నించింది. అది చూసి వెంటనే అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఆమెను వారించేందుకు ప్రయత్నించారు. ఆమె వినకపోవడంతో కాపాడేందుకు కింద భారీ దుప్పటిని అడ్డుగా పట్టుకుని నిలబడ్డారు. కిందికి దూకిన ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలతో ఆమె ఆస్పత్రిలో కన్నుమూసిందని అధికారులు తెలిపారు. ఆ యువతి గత కొద్ది రోజులుగా గుర్గావ్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసిందన్నారు. ఆత్మహత్యకు దారితీసిన కారణాలు తెలియాల్సి ఉందని అధికారవర్గాలు పేర్కొన్నాయి. మెట్రో భవనం పైనుంచి దూకుతున్న యువతి -
Punjab Assembly Election 2022: ఇరవయ్యోస్సారి!.. తగ్గేదేలే..
చండీగఢ్: అతని పేరు ఓంప్రకాశ్ జఖూ. వయసు 80 ఏళ్లు. పంజాబ్‌లోని హోషియార్పూర్ నివాసి. బూట్లు పాలిష్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అయినా తన కోరికను తీర్చుకోవడంలో తగ్గేదేలే అంటున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడమంటే ఆయనకి మహా ఇష్టం. ఆయన జీవితంలో సగభాగం ఎన్నికల్లో పోటీకే సరిపోయింది. ఒక్కసారి కూడా గెలవకపోయినా పట్టు వదలని విక్రమార్కుడిలా మళ్లీ ఎన్నికల కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. ఇలా పోటీ చేయడాన్ని ఆయన గర్వంగా కూడా భావిస్తారు. ఈసారి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో భరతరాష్ట్ర డెమొక్రాటిక్ పార్టీ అని పెద్దగా ఎవరికీ తెలీని పార్టీ తరఫున హోషియార్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇలా ఎన్నికల్లో పోటీ పడడం ఇది 20వ సారి. కేవలం అసెంబ్లీ ఎన్నికలే కాదు, మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఓంప్రకాశ్ పోటీ చేశారు. ఏ పూట సంపాదన ఆ పూ టకే సరిపోయే దుర్భర దారిద్య్రంలో కూడా ఆయన ఎన్నికలకి దూరం కాలేదు. ఈ విషయంలో ఆయనకి భార్యాబిడ్డల సహ కారం కూడా ఉంది. దేశంలో ఎమర్జెన్సీ సమయంలో జైలు పా లయ్యారు. ఒకప్పుడు బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్‌తో సన్నిహితంగా మెలిగారు. ఎన్నికల్లో పోటీ చేయడమంటే తనకు అత్యంత ఇష్టమైన విషయమని, శ్వాస ఆగేవరకు ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉంటానని ఓంప్రకాశ్ చెప్పుకొచ్చారు. చదవండి: (Punjab Assembly Election 2022: మాల్వా చిక్కితే అసెంబ్లీ అందినట్టే) -
చదువుకు వయస్సుతో పని లేదు
పంజాబ్: చదువుకు వయసుతో సంబంధం లేదని నిరూపించాడు ఒక వృద్థుడు. వివరాల్లోకి వెళ్తే పంజాబ్‌కు చెందిన 83 ఏళ్ల సోహన్ సింగ్ గిల్ జలందర్ విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఏ ఇంగ్లీష్ మాస్టర్స్ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. పంజాబ్ హోషియార్‌పూర్‌లో, 1937,ఆగస్టు15న జన్మించిన గిల్ 1957లో అమృత్సర్ జిల్లాలో గల కల్సా కాలేజీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ, టీచింగ్ కోర్స్ పూర్తి చేశాడు. ఈ సందర్భంగా గిల్ మాట్లాడుతూ కాలేజీలో చదివే రోజుల్లో వైస్ ప్రిన్సిపల్ వర్యమ్ సింగ్ నాకు మాస్టర్స్ చదవాలనే ప్రేరణ కలిగించారు. డిగ్రీ తరువాత పీజీ చేయాలనుకుంటున్న సమయంలో అనూహ్యంగా కెన్యా నుంచి టీచర్ ఉద్యోగం రావడంతో పీజీ చేయాలనే నా కోరిక తీరలేదు’ అన్నాడు గిల్. 1991లో భారత్‌కు తిరిగి వచ్చాక వివిధ పాఠశాలల్లో అధ్యాపకునిగా సేవలందించానని, అయితే పీజీ చేయాలనే బలమైన కోరిక తీరలేదనే బాధ ఉండేదని గిల్ అన్నాడు. కానీ నేడు తన కోరిక నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు. చిన్నప్పటి నుంచి తాను ఆంగ్లాన్ని విపరీతంగా ఇష్టపడేవాడినని తెలిపాడు. ప్రస్తుతం తాను విద్యార్థులకు ప్రతిష్టాత్మక ఐఈఎల్‌టీఎస్‌కు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపాడు. గిల్ చదువులోనే కాక హాకీ, ఫుట్‌బాల్‌లో రాణించేవాడు. జర్నైల్ సింగ్ వంటి హాకీ లెజెండ్‌తో ఆడటం తనకు గుర్తిండిపోయే మదుర జ్ఞాపకం అని గిల్ తన ఆనందాన్ని పంచుకున్నాడు. కెన్యాలో అధ్యాపక వృత్తితో పాటు హాకీని నిరంతరం ఆడేవాడినని చెప్పుకొచ్చాడు. ఆటతో పాటు అంపైరింగ్ అనుభవం కూడా తనకుందని చెప్పడం విశేషం. తన విజయానికి ఆరోగ్యకరమైన జీవనశైలీ, సానుకూల దృక్పథాలే ప్రధాన పాత్ర పోషించాయని, భవిష్యత్తులో చిన్న పిల్లల కోసం పుస్తకాలు రాయాలని భావిస్తున్నట్లు గిల్ తెలిపాడు. -
మురికి కాల్వలో పడ్డ వరుడు
చండీగఢ్ : పెళ్లి వేడుకల్లో భాగంగా నిర్వహించిన బరాత్ వేడుకలో అపశృతి చోటు చేసుకుంది. దాంతో పెళ్లి కుమారుడితో సహా మరో 14 మంది మురికి కాల్వలో పడిపోయారు. పంజాబ్‌లోని హోషియాపూర్ గ్రామంలో ఫిబ్రవరి 9న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఘజియాబాద్‌లోని ఇందిరాపురముకు చెందిన అమిత్ యాదవ్‌కు సోనమ్ అనే యువతితో పెళ్లి కుదిరింది. ఈ క్రమంలో హోషియాపూర్‌లో ఏర్పాటు చేసిన వివాహ వేదిక వద్దకు ఇరు కుటుంబాల బంధువులు వచ్చారు. అయితే ఫంక్షన్ హాల్‌కు రోడ్డుకు మధ్య చిన్నపాటి మురుగు కాల్వ ఉంది. పెళ్లికి వచ్చే వారికి వీలుగా ఈ మురుగు కాల్వపై తాత్కాలిక బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. ఫంక్షన్ హాల్ ముందు వధువు కుటుంబ సభ్యులు వరుడికి ఆహ్వానం పలికేందుకు నిలబడ్డారు. అదే సమయంలో వరుడితో పాటు ఆయన స్నేహితులు డ్యాన్స్ చేసుకుంటూ తాత్కాలిక బ్రిడ్జిని దాటుతున్నారు. ఈ సమయంలో బ్రిడ్జి ఉన్నట్టుంది కుప్పకూలిపోయింది. దాంతో వరుడితో సహా మరో 14 మంది మురుగు కాల్వలో పడిపోయారు. వీరిలో ఇద్దరు ఎనిమిదేళ్ల పిల్లలు కూడా ఉన్నారు. బాధితులందరిని చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు ఫంక్షన్ హాల్ యాజమాన్యమే బాధ్యత వహించాలని వరుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. దాంతో ఫంక్షన్ హాల్ యాజమాన్యం వరుడి కుటుంబానికి రూ. 3 లక్షల పరిహారం ఇస్తామని చెప్పడంతో.. వివాదం సద్దుమణిగింది. -
నాడు ప్లంబర్.. నేడు కేంద్ర మంత్రి!
ప్రధాని నరేంద్ర మోదీ తాను నడిచొచ్చిన దారి మర్చిపోలేదు. టీ అమ్ముకుని దేశాన్ని ఏలేస్థాయికి చేరిన మోదీ... తనలాంటి వారికి మంత్రి పదవి ఇచ్చి గౌరవించారు. ఆయనే విజయ్ సంప్లా. ఒకప్పుడు ప్లంబర్ పనిచేసిన సంప్లా అంచెలంచెలు ఎదిగి కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్నారు. మొదటిసారి ఎంపీగా గెలిచిన ఆయనకు కేబినెట్ పదవి దక్కడం విశేషం. దళిత వర్గానికి చెందిన 2014 లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్ లోని హిషియాపూర్(రిజర్వుడ్) స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. మెట్రికులేషన్ చదివిన విజయ్ సంప్లా- పంజాబ్ లో సొంతంగా వ్యాపారం ప్రారంభించడానికి ముందు గల్ఫ్ లో ప్లంబర్ గా పనిచేశారు. 59 ఏళ్ల విజయ్ సంప్లా- సొంత గ్రామానికి సర్పంచ్ గా రాజకీయ జీవితం ప్రారంభించారు. తర్వాత పలు కీలక పదవులు చేపట్టారు. పంజాబ్ రాష్ట్ర అడవుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా, పంజాబ్ రాష్ట్ర ఖాదీ, గ్రామ పరిశ్రమల బోర్డు చైర్మన్ గా పనిచేశారు. బీజేపీ పంజాబ్ రాష్ట్ర శాఖలోనూ పలు పదవులు నిర్వహించారు. ఎంపీగా గెలిచేంత వరకు ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2017లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విజయ్ సంప్లాకు కేంద్ర పదవి దక్కడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాశంగా మారింది. -
పంజాబ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: 20 మంది మృతి
పంజాబ్‌లోని హోషియార్పూర్ సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 20 మంది యాత్రికులు మృతి చెందారని జిల్లా పోలీసు ఉన్నతాధికారి సుఖ్‌చైన్ సింగ్ గిల్ వెల్లడించారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారని తెలిపారు. ఆ ఘటనలో మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. క్షతగాత్రులను హోషియార్పూర్ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. పంజాబ్ - హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లోని యాత్రస్థలిని సందర్శించుకుని తిరిగి స్వస్థలానికి ప్రయాణమై వస్తుండగా ఆ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పారు. బాధితులంతా కపుర్తల జిల్లాలోని బొలత్ ప్రాంతానికి చెందిన వారని వివరించారు. పర్వత ప్రాంతంలో ఆ ప్రమాదం చోటు చేసుకోవడంతో సహాయక చర్యలు కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశం ఉందని పోలీసులు అధికారులు వివరించారు.