పంజాబ్లోని హోషియార్పూర్ సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 20 మంది యాత్రికులు మృతి చెందారని జిల్లా పోలీసు ఉన్నతాధికారి సుఖ్చైన్ సింగ్ గిల్ వెల్లడించారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారని తెలిపారు. ఆ ఘటనలో మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు.
క్షతగాత్రులను హోషియార్పూర్ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. పంజాబ్ - హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లోని యాత్రస్థలిని సందర్శించుకుని తిరిగి స్వస్థలానికి ప్రయాణమై వస్తుండగా ఆ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పారు. బాధితులంతా కపుర్తల జిల్లాలోని బొలత్ ప్రాంతానికి చెందిన వారని వివరించారు. పర్వత ప్రాంతంలో ఆ ప్రమాదం చోటు చేసుకోవడంతో సహాయక చర్యలు కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశం ఉందని పోలీసులు అధికారులు వివరించారు.