న్యూఢిల్లీ: హోరాహోరీగా సాగుతున్న గుజరాత్ రెండోదఫా ఎన్నికల ప్రచారం నేటి(మంగళవారం)తో ముగియనుంది. ఈ క్రమంలో అహ్మదాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్వహించతలపెట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ప్రధాని మోదీ తొలిసారి వినూత్నంగా ప్రజల ముందుకు వచ్చారు. సబర్మతి నదిలో సీప్లేన్ (సముద్ర విమానం)లో ప్రయాణించి.. ధారోయ్ డ్యామ్‌కు చేరుకున్నారు. అహ్మదాబాద్ నుంచి 150 కిలోమీటర్ల సముద్ర విమానంలో మోదీ ప్రయాణం చేశారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో ప్రయాణించి అంబాజీ ఆలయాన్ని దర్శించుకోబోతున్నారు.
దేశంలో సీప్లేన్ ప్రయాణం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో అభివృద్ధి గురించి మాట్లాడటం లేదని కాంగ్రెస్ విమర్శిస్తున్న నేపథ్యంలో.. ఆ పార్టీ కనీసం ఇలాంటి అభివృద్ధిని ఊహించి కూడా ఉండదని ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశంలోని అన్నిచోట్లా ఎయిర్‌పోర్టులో నిర్మించడం సాధ్యం కాదని, అందుకే వాటర్‌వేస్‌పై దృష్టిపెట్టామని, దేశంలోని 106చోట్లా వీటిని నిర్మించాలని ప్రణాళికలు రచిస్తున్నామని ప్రధాని మోదీ వరుస ట్వీట్లలో వెల్లడించారు. ప్రధాని మోదీతోపాటు కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీకి కూడా అహ్మదాబాద్ లో ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ క్రమంలో వినూత్నంగా ప్రజలకు చేరువయ్యేందుకు మోదీ తొలిసారి సీప్లేన్ లో ప్రయాణించారు.
Comments
Please login to add a commentAdd a comment