sea plane
-
బాబు బిల్డప్‌కు ఎల్లో మీడియా డప్పులు
సాక్షి, అమరావతి : ‘సీ ప్లేన్ నడిపితే రాష్ట్రాభివృద్ధి జరిగిపోయినట్లా?’ అని సీఎం చంద్రబాబును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. దేశంలో తొలిసారిగా సీ ప్లేన్ నడిపినట్టుగా చంద్రబాబు బిల్డప్ ఇస్తుండటం.. అందుకు ఎల్లో మీడియా డప్పు కొడుతుండటం చూస్తుంటే పిట్టల దొర డైలాగ్‌లు గుర్తుకొస్తున్నాయని ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రజల సంపదగా నిర్మిస్తూ సృష్టిŠంచిన మెడికల్ కాలేజీలు, పోర్టులను ప్రయివేటుపరం చేస్తూ, స్కాంలు చేస్తూ తన మనుషులకు తెగనమ్ముతూ.. వీటన్నింటిపై ప్రజల్లో చర్చ జరగకూడదనే సీ ప్లేన్‌తో అభివృద్ధి జరిగిపోయినట్లు పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ దుర్మార్గపు చర్యలను చివరకు ప్రజలు తప్పక నిలదీస్తారని, ఈ ప్రభుత్వాన్ని ఎండగడతారని హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..1 చంద్రబాబు గురించి చెప్పాలంటే.. మాయ చేస్తాడు, మభ్యపెడతాడు, చివరకు ప్రజలను మోసం చేస్తాడు. ఇందుకోసం ఎన్ని వేషాలు వేయాలో అన్ని వేషాలూ వేస్తాడు. తాజాగా విజయవాడ నుంచి శ్రీశైలం వరకూ సీ ప్లేన్ ద్వారా చేసిన పర్యటన ఇలాంటిదే. సెల్ ఫోన్ తానే కనిపెట్టానని, కంప్యూటర్లు కూడా తానే కనిపెట్టానని రెండు దశాబ్దాలుగా కబుర్లు చెబుతున్న చంద్రబాబు, ఇప్పుడు సీ ప్లేన్ మీద కూడా కహానీలు మొదలెట్టేశారు. దేశంలోనే తొలిసారి అన్నట్టుగా, మరెక్కడా లేదన్నట్టుగా, సీ ప్లేన్ నడిపితే చాలు రాష్ట్రాభివృద్ధి జరిగిపోయినట్లుగా బిల్డప్ ఇస్తున్నారు.2 సీ ప్లేన్ అన్నది ఇప్పటిది కాదు. దాదాపు 114 ఏళ్ల క్రితమే 1910లో నడిచింది. మన దేశంలో కేరళలో 2013లో మొదలయ్యి తర్వాత నిలిపేశారు. గుజరాత్లో 2020లో సర్వీసులు నడవటం మొదలుపెట్టినా అవికూడా పలుమార్లు నిలిచిపోయాయి. ప్రతి రాష్ట్రంలోనూ అనేక రిజర్వాయర్లు, డ్యాంలు ఉన్నాయి. మరి ఎందుకు ఆయా రాష్ట్రాల్లో ఇలాంటి ప్రయోగాలు కొనసాగడం లేదు?3 ఆపరేషన్స్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సాంకేతిక సమస్యలు, ప్రయాణికుల భద్రతాపరమైన అంశాలతోపాటు నిర్వహణా భారం దీనికి ప్రధాన కారణాలని అనేక మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి. ఇలాంటి 14 మంది ప్రయాణికుల సీ ప్లేన్ సర్వీసులను అభివృద్ధికి ఒక ప్రమాణంగా చంద్రబాబు గొప్పగా చెప్పుకోవడం, దాన్ని ఎల్లో మీడియా కీర్తించడం.. పరస్పరం డప్పాలు కొట్టుకోవడం కాదా?4 సంపద సృష్టించడమంటే ప్రభుత్వ రంగంలో పోర్టులు నిర్మించి, తద్వారా అభివృద్ధి చేసి.. ప్రభుత్వానికి ఆదాయం కల్పించడం. ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు కట్టి, ప్రజలకు అందుబాటులో ఉచితంగా నాణ్యమైన, అత్యాధునిక వైద్యాన్ని అందించడం. ఇలాంటివి కాకుండా సీ ప్లేన్ మీద పబ్లిసిటీ స్టంట్లు ఏమిటి?5 చంద్రబాబూ.. రూ.8,480 కోట్లతో ప్రభుత్వ రంగంలో, మారుమూల ప్రాంతాల్లో అత్యాధునిక వైద్యాన్ని అందుబాటులోకి తెస్తూ, తద్వారా మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రిని తీసుకొస్తూ, కొత్తగా 17 మెడికల్ కాలేజీలు కట్టడం సంపద సృíష్టి అవుతుందా? లేక వాటిని ప్రయివేటు పరం పేరుతో మీ మనుషులకు స్కామ్‌లు చేస్తూ అమ్మాలనుకోవడం సంపద సృష్టి అవుతుందా?6 సుదీర్ఘ తీర ప్రాంతాన్ని వినియోగించుకుని మెరుగైన వాణిజ్యాన్ని, రాష్ట్రానికి అదనపు ఆదాయాన్ని, ప్రజలకు ఉపాధిని, పారిశ్రామిక ప్రగతిని సాధించడానికి ప్రభుత్వ రంగంలో రూ.4,361.91 కోట్లతో మూలపేట, రూ.5,156 కోట్లతో మచిలీపట్నం, రూ.3,736.14 కోట్లతో రామాయపట్నం వద్ద.. మొత్తంగా మూడు పోర్టులను రూ.13,254.05 కోట్లతో నిర్మిస్తే దాన్ని అభివృద్ధి, సంపద సృష్టి అంటారా? లేక సీ ప్లేన్‌లో తిరిగి ఈ పోర్టుల ఆస్తులను మీ వారికి స్కామ్‌ల ద్వారా తెగనమ్మితే దాన్ని అభివృద్ధి, సంపద సృష్టి అంటారా? ప్రభుత్వ రంగ పోర్టుల వల్ల రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుందా? లేక ఈ సంపద సృష్టించే వనరులను తెగనమ్మడంతో పాటు, సీ ప్లేన్స్ వల్ల రాష్ట్రానికి సంపద పెరుగుతుందా?7 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, పోర్టుల రూపేణా మొత్తంగా రూ.21,734 కోట్ల పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ప్రజల ఆస్తి కాదా? ప్రజల కోసం సృష్టించిన సంపద కాదా చంద్రబాబూ? రాష్ట్ర చరిత్రలో ప్రభుత్వ రంగంలో ఇన్ని పెట్టుబడులు ఎప్పుడైనా పెట్టారా? మా హయాంలో నిర్మాణాలు జరుపుకున్న కాలేజీలు, పోర్టులన్నీ కూడా ప్రత్యక్ష సాక్ష్యాలుగా ఇవాళ రాష్ట్ర ప్రజల కళ్ల ముందు లేవా? ఇవన్నీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం సృష్టించిన సంపద కాదా? ఈ ఆస్తులు విలువ భవిష్యత్తులో రూ.లక్షల కోట్లు కాదా? ఇదంతా అభివృద్ధి కాదా?8 చంద్రబాబూ.. మీరు, మీ పార్టీ నాయకుల అభివృద్ధే రాష్ట్రాభివృద్ధిగా.. మీరు, మీమనుషులు ఆస్తులు కూడబెడితే అది ప్రజల కోసం సృష్టించిన సంపదగా చెప్పుకుంటారు. మీ దృష్టిలో అభివృద్ధి, సంపద సృష్టి అంటే ఇదే. మీ పబ్లిసిటీ విన్యాసాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ప్రభుత్వ రంగంలో మంచి స్కూల్స్ లేకుండా చేసి, మంచి వైద్యాన్ని అందించే మెడికల్ కాలేజీలు లేకుండా చేసి, మంచి పోర్టులు లేకుండా చేసి, చివరకు ప్రజల ఆస్తులను వారికి కాకుండా చేసే దుర్మార్గపు చర్యలను ప్రజలు తప్పక నిలదీస్తారు. ఈ ప్రభుత్వాన్ని ఎండగడతారు. -
భవానీపురం : కృష్ణానదిలో సీ ప్లేన్ ట్రయల్ రన్ (ఫొటోలు)
-
విజయవాడ నుంచి శ్రీశైలానికి గంటన్నరలో వెళ్లిపోవచ్చు!
ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం కలగలసి వెలసిన మహా పుణ్యక్షేత్రం.. ఇల కైలాసం శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి అనేకమంది భక్తులు వస్తుంటారు. ఇప్పటి వరకు అటవీ ప్రాంతంలో ఘాట్ రోడ్డు మీద ప్రయాణం ప్రతి ఒక్కరికీ గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. ఇక నుంచి భక్తులకు సరికొత్త మధురానుభూతిని కలిగించేందుకు ‘సీ ప్లేన్’ను పర్యాటక శాఖ అందుబాటులోకి తీసుకురానుంది. నీటిలో విమానం ఎక్కి.. నీటిలోనే దిగడం ఈ సీ ప్లేన్ ప్రత్యేక. అయితే, అవసరమైనప్పుడు నేలపై కూడా సీ ప్లేన్ ల్యాండ్ అవుతుంది. విజయవాడ–శ్రీశైలం మధ్య సీ ప్లేన్ నడిపేందుకు ఈ నెల 9వ తేదీన ట్రయల్ రన్ నిర్వహించనుంది.తగ్గనున్న ప్రయాణ సమయంవిజయవాడ–శ్రీశైలం మధ్య రోడ్డు మార్గంలో సుమారు 270 కిలో మీటర్లు దూరం ఉంటుందని, సీ ప్లేన్‌లో సుమారు గంటన్నర సమయంలో చేరుకునే అవకాశం ఉంటుందని పర్యాటక శాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం 14 సీటింగ్, 19 సీటింగ్ కెపాసిటీ కలిగిన రెండు సీప్లేన్లు అందుబాటులో ఉన్నాయని, ట్రయల్ రన్ తర్వాత ఖర్చు, నిర్వహణ, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎప్పటి నుంచి ప్రారంభించాలి, ఎన్ని సర్వీసులు నడపాలి, టికెట్ ఎంత వసూలు చేయాలనేది నిర్ణయిస్తామని అధికారులు తెలిపారు. తొలి దశలో విజయవాడ–శ్రీశైలం సీ ప్లేన్ విజయవంతమైతే హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాల నుంచి కూడా నడిపేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.ఇదీ సీ ప్లేన్ ప్రణాళిక...సీప్లేన్ టేకాఫ్, టేకాన్‌కు నీటిలో సుమారు 1.16 కిలో మీటర్ల పొడవు, 120 మీటర్ల వెడల్పు ఉండాలి. పర్యాటకులు సీ ప్లేన్ ఎక్కేందుకు, దిగేందుకు నీటిపై ప్రత్యేక జెట్టీలు అవసరం.శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్ వద్ద గల ఎస్ఎల్బీసీ టన్నెల్ సమీపంలో సీ ప్లేన్ ల్యాండ్ అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడ పున్నమి ఘాట్ నుంచి బయలుదేరి శ్రీశైలం డ్యామ్ వెనుక భాగంలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ సమీపంలో సీ ప్లేన్ దిగుతుంది. అక్కడి నుంచి బోటులో ప్రయాణించి పాతాళగంగకు చేరుకుంటారు. పాతాళగంగ వద్ద ప్లాస్టిక్ జెట్టిపై ప్రయాణికులు దిగి రోప్‌వే ద్వారా పైకి వచ్చి శ్రీశైలం ఆలయానికి చేరుకుంటారు.తిరుగు ప్రయాణంలో మళ్లీ సీ ప్లేన్ శ్రీశైలం డ్యామ్ వెనుక భాగంలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ సమీపంలో బయలుదేరి విజయవాడ పున్నమి ఘాట్‌కు చేరుతుంది. చదవండి: నా శివయ్యను దర్శనం చేసుకోనివ్వరా.. శ్రీకాళహస్తిలో అఘోరీ ఆత్మహత్యాయత్నం -
సీ ప్లేన్కు బ్రేక్
సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో ఎంతో అట్టహాసంగా అక్టోబర్ 31 న అహ్మదాబాద్–కెవాడియా మధ్య ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన సీ ప్లేన్ సేవలు నెలలోనే ఆగిపోయాయి. మెయింటెనెన్స్ కోసం నిర్వాహకులు సీ–ప్లేన్‌ను మాల్దీవులకు పంపించారు. అయితే నిర్వహణ, మరమ్మతులు పూర్తి చేసుకొని తిరిగి సీప్లేన్ సేవలు కనీసం 15 రోజుల తర్వాతే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. పౌర విమానయాన విభాగం డైరెక్టర్ అజయ్ చౌహాన్ మాట్లాడుతూ, సీప్లేన్ ఫ్లైయింగ్ అవర్స్ ముగిశాయని, ఈ పరిస్థితుల్లో విమానానికి సర్వీసింగ్ అవసరమని, అందుకే సీప్లేన్‌ను మాల్దీవులకు తిరిగి పంపించామని తెలిపారు. అహ్మదాబాద్‌లోని సబర్మతి రివర్ ఫ్రంట్ – కెవడియాలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం (స్టాచ్యూ ఆఫ్ యూనిటీ) మధ్య తిరిగే సీ ప్లేన్ సేవలు ఆగిపోవడం ఇది మూడోసారి కావడం గమనార్హం. అక్టోబర్ 31న ప్రారంభోత్సవం జరిగిన తరువాత, నవంబర్ 1 నుంచి ప్రజల కోసం సీ ప్లేన్ సేవలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ నెల రోజుల్లో ఇప్పటికే 3–3 రోజుల పాటు రెండుసార్లు ఈ సీప్లేన్‌ను అధికారులు నిలిపివేశారు. ఆ సమయంలో క్రూ మెంబర్స్‌కు విరామాన్ని ఇచ్చేందుకు సేవలు ఆపినట్లు అధికారులు తెలిపారు. సీ ప్లేన్ వివరాలు సిట్టింగ్ కెపాసిటీ : 19 మంది బరువు: 3,377 కిలోలు వేగం: 170 కి.మీ./గంటకు ఇంధన సామర్థ్యం: 1,419 లీటర్లు పొడవు: 16 మీటర్లు 1 ఎత్తు: 6 మీటర్లు ఇంధన శక్తి: 272 లీటర్లు / గంటకు బరువు సామర్థ్యం: 5670 కిలోలు టికెట్ ధర (ఒక్కరికి): రూ.4,0005,000 సందర్శకుల సంఖ్య రోజుకు 13వేలు అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ సందర్శకుల సంఖ్య రోజుకు 10 వేలు -
ఈనెల 31 నుంచి సీప్లేన్ సేవలు షురూ
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 31న గుజరాత్లో తొలి సీప్లేన్ సర్వీసును ప్రారంభించనున్నారు. తొలి విమానం అహ్మదాబాద్‌లోని సబర్మతీ రివర్‌ఫ్రంట్ నుంచి టేకాఫ్ అయి నర్మదా జిల్లాలోని స్టాట్యూ ఆఫ్ యూనిటీకి చేరుకుంటుంది. సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఈనెల 31న సీప్లేన్ లాంఛ్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు గుజరాత్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. సబర్మతీ తీరం నుంచి కేవడియాలోని స్టాట్యూ ఆఫ్ యూనిటీ వరకూ రాష్ట్రంలో నిరంతరాయంగా అందుబాటు ధరలో ఎయిర్ కనెక్టివిటీని తొలిసారిగా అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొంది. దేశంలో ఇదే తొలి సీప్లేన్ సర్వీసు కావడం గమనార్హం. 12 మంది ప్రయాణీకులు కూర్చునేలా ప్రైవేట్ ఎయిర్‌లైన్ స్పైస్‌జెట్ ఈ సీప్లేన్ సర్వీసులను నిర్వహిస్తోంది. అహ్మదాబాద్ నుంచి కేవడియా వరకూ రోజుకు నాలుగు విమానాలు రాకపోకలు సాగిస్తాయి. ఒక్కో వ్యక్తి నుంచి టికెట్ ధరగా రూ 4,800 వసూలు చేస్తారు. అహ్మదాబాద్ కేవడియా మధ్య ప్రస్తుతం నాలుగు గంటలుగా ఉన్న ప్రయాణ సమయం సీప్లేన్ అందుబాటులోకి రావడంతో గంటకు తగ్గుతుందని అధికారులు తెలిపారు. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ 2017లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సబర్మతీ తీరం నుంచి ధరోయికి సీప్లేన్‌లో ప్రయాణించారు. చదవండి : పండగ సీజన్లో అప్రమత్తత అనివార్యం : మోదీ -
రాజధానిలో సీ ప్లేన్ ప్రాజెక్టు!
సాక్షి, హైదరాబాద్ : రాజధాని నగరాన్ని ఇతర నగరాలతో అనుసంధానం చేసేందుకు హుస్సేన్‌సాగర్ కేంద్రంగా సీ ప్లేన్ ప్రాజెక్టు నిర్మాణంపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రధాన రహదారులపై ఎయిర్ అంబులెన్స్ సేవలు ప్రవేశపెట్టేందుకు ఉన్న అవకాశాలనూ పరిశీలిస్తున్నట్లు తెలిపారు. కేంద్రం, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) సంయుక్త ఆధ్వర్యంలో బేగంపేట విమానాశ్రయంలో గురువారం జరిగిన ‘వింగ్స్ ఇండియా’ విమానయాన సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. పారిశ్రామిక విధానంలో ఏరోస్పేస్, రక్షణ రంగాలను అత్యంత ప్రాధాన్య రంగాలుగా గుర్తించామని ఉద్ఘాటించారు. బోయింగ్, ఎయిర్ బస్, జీఈ, సఫ్రాన్, ప్రాట్ అండ్ విట్నీ, సీఎఫ్ఎం, బాంబార్డియర్, పిలాటస్, ఆర్‌యూఏజీ, కోబామ్, హనీవెల్, సాబ్, రాక్వెల్ కొల్లిన్స్ వంటి ప్రఖ్యాత ఏరో స్పేస్ కంపెనీలు ఇక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏయిర్ ఇండియా, జీఎంఆర్‌ల ఆధ్వర్యంలో రెండు విమానాల మరమ్మతు, నిర్వహణ కేంద్రాలు ఉన్నాయన్నారు. అగ్రగామి విమాన ఇంజిన్ తయారీ కంపెనీలైన ప్రాట్ అండ్ విట్నీ, సీఎఫ్‌ఎంలు తమ విమాన ఇంజిన్ల తయారీ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంపిక చేసుకున్నాయన్నారు. ఈ సంస్థలన్నీ రాష్ట్రానికి దేశ ఏరోస్పేస్, విమానయాన రంగ రాజధానిగా గుర్తింపు కలిగించాయన్నారు. ఇక్కడ ప్రధాన విమానయాన కంపెనీలన్ని మరమ్మతు, శిక్షణ, సాంకేతిక అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తాయని ధీమా వ్యక్తం చేశారు. చాలా పరిశ్రమలకు మెగా పరిశ్రమల హోదా కల్పించి వాటికి అవసరమైన ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు. కొత్త విమానాశ్రయాలు ఏరో స్పేస్, విమానయాన కేంద్రాల్లో ఒకటిగా రాష్ట్రం ముందుకు వెళ్తోందని కేటీఆర్ తెలిపారు. దేశంలోనే అత్యంత వేగంగా వృద్ధి సాధిస్తున్న విమానాశ్రయాల్లో ఒకటైన రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఏటా 1.8 కోట్ల మంది ప్రయాణికులు, 1.35 లక్షల మెట్రిక్ టన్నుల సరుకుల రవాణా జరుగుతోందన్నారు. ఔషధ పరిశ్రమలు, ఏరో స్పేస్ రంగ విస్తరణలో విమానాశ్రయం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ప్రపంచ స్థాయి కార్గో సదుపాయాలతో హైదరాబాద్ విమానాశ్రయం ఫార్మా రంగం కోసం ప్రత్యేక జోన్‌ను కలిగి ఉందన్నారు. రాష్ట్రంలో బేగంపేట, వరంగల్, హకీంపేట, దుండిగల్, నాదర్గుల్, రామగుండం విమానాశ్రయాలున్నాయని, వరంగల్‌లో ఏర్పాటు చేస్తున్న మెగా టెక్స్టైల్ పార్క్, ఐటీ హబ్‌ల అవసరాల కోసం అక్కడి విమానాశ్రయాన్ని క్రియాశీలం చేస్తామన్నారు. కొత్తగూడెంలో ఏర్పాటు చేయనున్న గ్రీన్ఫిల్డ్ విమానాశ్రయంతో ఖమ్మం జిల్లా చుట్టూ ఉన్న బొగ్గు, విద్యుత్ పరిశ్రమలకు అనుసంధానం లభించనుందన్నారు.జక్రాన్‌పల్లిలో ప్రతిపాదించిన విమానాశ్రయం వల్ల హైదరాబాద్ ఫార్మాసిటీకి ప్రయోజనం కలగనుందన్నారు. కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్ నారాయణ్ చౌబే, సంయుక్త కార్యదర్శి ఉషా పాధీ, ఫిక్కీ ఉపాధ్యక్షుడు సందీప్ సోమనీ పాల్గొన్నారు. అంతర్జాతీయ శిక్షణ వియానయాన, ఏరో స్పేస్ రంగానికి అత్యున్నత నైపుణ్యం అవసరమని, ఇందుకు వైమానిక ఇంజనీరింగ్ విభాగంలో విదేశీ సంస్థలతో ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఫ్రెంచ్ ఏరో స్పేస్ అకాడమీ, యూకేకు చెందిన క్రాన్ఫీల్డ్ వర్సిటీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు. అమెరికాలోని ఎంబ్రీ రిడిల్ వర్సిటీ భాగస్వామ్యంతో టాస్క్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ప్రారంభించామని చెప్పారు. తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ గత ఐదేళ్లుగా అత్యుత్తమ విమానయాన శిక్షణ సంస్థగా కేంద్రం నుంచి పురస్కారాలు అందుకుందని చెప్పారు. రాష్ట్రంలో జాతీయ ఏవియేషన్ వర్సిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఏవియేషన్ టర్బైన్ ఇంధనంపై వ్యాట్ తగ్గించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. -
మోదీ ఎక్కిన ప్లేన్ పాక్ నుంచి వచ్చింది
సాక్షి, న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తుది రోజైన మంగళవారం నాడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘సీప్లేన్’లో ప్రయాణించడం పలు రకాలుగా వివాదాస్పదమైంది. స్పైస్‌జెట్ ఏర్పాటు చేసిన ‘కొడాయిక్ ఎన్181కేక్యూ’ సీప్లేన్ ఆరేబియన్ గల్ఫ్ ప్రాంతం నుంచి బయల్దేరి పాకిస్థాన్‌లోని కరాచి మీదుగా ముంబైకి వచ్చింది. జెడ్ ప్లస్ క్యాటగిరీ భద్రతను కలిగిన ప్రధాని నరేంద్ర మోదీ భద్రతా నిబంధనలను ఉల్లంఘించి ఈ విమానం ఎక్కడం ఏమిటని పలు పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. మరీ సింగిల్ ఇంజిన్ కలిగిన విమానం ఎక్కడం ఏమిటని విస్తుపోతున్నాయి. ఒక్క ప్రధాన మంత్రియే కాదు, జెడ్ ప్లస్ సెక్యూరిటీ కలిగిన ఏ వ్యక్తి కూడా సింగిల్ ఇంజిన్ కలిగిన విమానంలో ప్రయాణించరాదని భద్రతా మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. డబుల్ ఇంజిన్ కలిగిన విమానంలో ఎక్కితే ఒక ఇంజిన్ చెడిపోయినా మరో ఇంజిన్ సాయంతో విమానాన్ని పైలట్ దించవచ్చన్నది ఇక్కడ ఉద్దేశం. సింగిల్ ఇంజిన్ విమానంలో ప్రయాణిస్తే ఆ ఇంజిన్‌లో సమస్య వస్తే ప్రాణ రక్షణకు భరోసా ఉండదు. ఆరేబియా గల్ఫ్ నుంచి వచ్చిన కొడాయిక్ సీప్లేన్ మార్గమధ్యంలో పాకిస్థాన్‌లో కరాచిలో ఆగిందో, లేదోగానీ అక్కడి నుంచి వచ్చిందంటే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మణిశంకర్ అయ్యర్ నివాసంలో మన్మోహన్ సింగ్, పాక్ దౌత్య అధికారులు కలుసుకున్నారంటేనే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పాక్ కుట్ర పన్నిందంటూ ఆరోపణలు చేసిన ప్రధాని మోదీకి ఈ జాగ్రత్తల గురించి తెలియదా? అస్తమానం ‘మేకిన్ ఇన్ ఇండియా’ అనే మాట్లాడే మోదీ ప్రయాణించిన ‘కొడాయిక్ సీప్లేన్’ అమెరికాలో రిజిస్టర్ అయింది. అక్కడి రిజిస్టర్ నిబంధనల ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో భారతీయ ప్రయాణికులను తీసుకెళ్లేందుకు దీన్ని ఉపయోగించరాదు. పైగా ఈ విమానాన్ని నడిపిందీ కెనడా పైలెట్. ‘ మోదీ గురించి ఆ కెనడా పైలట్ చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాలు విన్నాయంటే నోరు మూసుకోవాల్సిందే’ అంటూ ‘టైమ్స్‌నౌ’ ఓ భారీ శీర్షికను పెట్టింది. ఇంతకు ఆ కెనడా పైలట్ మోదీ గురించి చేసిన కామెంట్ ఏమిటంటే...‘మోదీ ఓ మంచి ప్రయాణికుడు’ అని. ఈ విషయాన్ని పక్కన పెడితే అమెరికాలో రిజిస్టర్ అయిన సింగిల్ ఇంజిన్ విమానం, పైగా పాకిస్థాన్ నగరం నుంచి వస్తే, అందులోనూ కెనడా పైలెట్ నడుపుతుంటే మోదీ ఎక్కడం, అంబాజీ ఆలయాన్ని సందర్శించుకొని రావడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది దేశం సాధించిన అభివృద్ధా ? వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకునే ప్రయత్నమా?! -
మొట్టమొదట సీప్లేన్ ఎక్కింది మోదీ కాదు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం నాడు సముద్ర విమానం (సీప్లేన్)లో జేమ్స్‌బాండ్‌లా ప్రయాణించి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో 'సీ ఛేంజ్'ను తీసుకు రావాలని భావించారు. అక్కడే ఆయన పెద్ద పొరపాటు చేశారు. వెనకా ముందు ఆలోచించకుండా, వాస్తవాస్తవాలను పట్టించుకోకుండా దేశంలో అన్నిచోట్ల విమానాశ్రయాలను నిర్మించడానికి అనువైన స్థలాలు దొరకవని, అందుకనే పలు చోట్ల సముద్రపు ప్లేన్లను ప్రవేశపెట్టాలని తన ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. అహ్మదాబాద్‌లో సబర్మతీ నది నుంచి మెహసానాలోని ధరాయ్ డ్యామ్ వరకు సముద్ర విమానంలో ఆయన ప్రయాణించడాన్ని ఇక ఆయన వెబ్సైట్ 'డబ్లూడబ్లూడబ్లూ. నరేంద్రమోదీ డాట్ ఇన్' ఆకాశానికి ఎత్తింది. 'భారత్‌లోని మొట్టమొదటి సముద్ర విమానంలో ప్రయాణించిన మొట్టమొదటి ప్రయాణికుడు ప్రధాన మంత్రి మోదీ' అంటూ శీర్శిక పెట్టింది. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ అధికార వెబ్‌సైటే కాకుండా పలువురు బీజీపీ నాయకులు కూడా గుడ్డిగా ఈ హెడ్డింగ్‌ను కాపీ చేసి ట్వీట్లు చేశారు. సీప్లేన్‌తో కేంద్ర మాజీ మంత్రి ప్రఫుల్ పటేల్ అంతకంటే ఘోరంగా, ఎలాంటి విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించకుండా పలు జాతీయ, ప్రాంతీయ పత్రికలతోపాటు పలు టీవీ ఛానళ్లు 'భారత్ తొలి సముద్ర విమానంలో ప్రయాణించిన తొలి ప్రయాణికుడు ప్రధాని మోదీ' అంటూ వార్తలను ప్రసారం చేశాయి. చేసిన పొరపాటును ముందుగానే గ్రహించిన నరేంద్ర మోదీ వెబ్సైట్ 'భారత్‌లోని మొట్టమొదటి సముద్ర విమానంలో ప్రయాణించిన మొట్టమొదటి ప్రయాణికుడు మోదీ' అన్న మాటలను తొలగించి 'సముద్ర విమానంలో ప్రయాణించిన మోదీ' అని తప్పును సరిదిద్దుకుంది. అయినప్పటికీ టీవీ ఛానళ్లు, పత్రికలు పొరపాటును సరిదిద్దుకోక పోవడం విచారకరమే. సీప్లేన్‌లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ప్రధాని నరేంద్ర మోదీ వాస్తవానికి సముద్ర విమానాల సర్వీసులు భారత్‌లో 2010 సంవత్సరంలోనే ప్రారంభమయ్యాయి. అండమాన్, నికోబార్‌లోని ప్రభుత్వ యంత్రాంగం 2010లో 'జల్ హంస' పేరిట ఈ సీ ప్లేన్ సర్వీసులను ప్రారంభించింది. జల్ హంస ఆ తర్వాత పవన్ హంస అనే సంస్థతో కలిసి ఈ విమాన సర్వీసులను కొంతకాలం నడిపింది. ప్రఫుల్ పటేల్ కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభమైన ఈ సర్వీసులు గిట్టుబాటు లేక అనతి కాలంలోనే నిలిచిపోయాయి. ఈ విషయాన్ని ప్రఫుల్ పటేల్ ట్వీట్ ద్వారా మీడియాకు ధ్రువీకరించారు. 2013లో కేరళ పర్యాటక శాఖ, ఊమెన్ చాండీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీప్లేన్ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. అప్పుడే రాష్ట్రంలోని జల మార్గాలన్నింటిని కలుపుతూ ఈ సర్వీసులను అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. రాష్ట్ర మత్స్యకారులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో ఆ ప్రాజెక్ట్ ప్రారంభం కాకుండానే ఆగిపోయింది. దేశంలోని పలు చోట్ల పర్యాటకులను దష్టిలో పెట్టుకొని పలు ప్రైవేటు సంస్థలు సీప్లేన్లను ప్రవేశపెట్టాయి. మెహేర్ అనే సంస్థ 2011లో అండమాన్, నికోబార్‌లో సీ ప్లేన్ సర్వీసులను ప్రారంభించింది. ఆ తర్వాత ఆ సర్వీసులను మహారాష్ట్ర, గోవాలకు విస్తరించింది. ప్రభుత్వ అనుమతులు చికాకు పెట్టడం, వాణిజ్యపరంగా గిట్టుబాటు లేకపోవడంతో ఈ సర్వీసులు కూడా నిలిచిపోయాయి. 2012లో కేరళ, లక్ష్యదీవుల్లో సీప్లేన్ సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు 'సీబర్డ్ సీప్లేన్ ప్రైవేట్ లిమిటెడ్' ప్రకటించింది. మత్స్యకారుల ఆందోళన కారణంగా అనుమతులు ఇవ్వడానికి కేరళ ప్రభుత్వం నిరాకరించడంతో ఈ ప్రాజెక్ట్ కూడా నిలిచిపోయింది. సరిగ్గా ఈ నేపథ్యంలో భారత్‌లో సీప్లేన్ సర్వీసులను ప్రారంభించేందుకు గల అవకాశాలను పరిశీలించడం కోసం 'స్పైస్‌జెట్' సంస్థ కొడైయిక్ క్వెస్ట్ సీప్లేన్‌ను ముంబై తీసుకొచ్చి గిర్గామ్ ప్రాంతంలో డిసెంబర్ 9వ తేదీన ట్రయల్స్ నిర్వహించింది. ఈ ట్రయల్స్‌లో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కారి, అశోక గజపతి రాజు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. 'ఎన్ 181 కేక్యూ' నెంబర్ కలిగిన ఈ సీప్లేన్‌లో వారిరువురు కేంద్ర మంత్రులు ప్రయాణించారు. ఇప్పుడు సరిగ్గా అదే సీప్లేన్‌లో మంగళవారం నరేంద్ర మోదీ ప్రయాణించారు. స్పైస్‌జెట్ దేశంలో వంద సీప్లేన్ సర్వీసులను ప్రారంభించాలనే ఆలోచనతో ఉంది. అందుకావాల్సిన ప్రభుత్వ అనుమతుల కోసమే మంత్రుల సమక్షంలో ట్రయల్స్ నిర్వహించింది. ఆ ట్రయల్స్‌లో భాగంగానే మోదీకి కూడా సర్వీసు అందించి ఉంటుంది. ఇంతవరకు ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి వార్తలు వెలువడలేవు. మోదీ మాటల ప్రకారం త్వరలోనే ఆయన ప్రభుత్వం స్పైస్‌జెట్ సీప్లేన్లకు అనుమతిస్తుందని తెలుస్తోంది. ఇప్పటి వరకు సీ ప్లేన్ నుంచి ప్రయాణికులు దిగేందుకు ఎక్కడా ఏర్పాట్లు లేవు. మోదీ దిగుతున్న ఫొటో బాగా రావాలంటే ఆయన దిగేందుకు ఏర్పాట్లు ఉండాలి. అందుకని సీప్లేన్ నుంచి ఆయన దిగేందుకు ప్రత్యేక చప్టాను తయారు చేశారు. చప్టా లేకపోవడంతో గడ్కారి దిగేందుకు మొన్న ఇబ్బంది పడిన విషయాన్ని ఆయన సీప్లేన్ నుంచి దిగుతున్న వీడియో చూస్తే తెలిసిపోతుంది. 'భారత్‌లోని మొట్టమొదటి సీప్లేన్ నుంచి దిగిన మొట్టమొదటి ప్రయాణికుడు ప్రధాని మోదీ' అనడంలో అర్థం ఉందా? అందుకనే ఆయన్ని ఆయన పార్టీ సహచరుడు ఎల్కే అద్వానీ 'మోదీ మంచి ఈవెంట్స్ మేనేజర్' అని వ్యాఖ్యానించారు. -
దేశంలో తొలిసారి.. సీప్లేనులో మోదీ!
న్యూఢిల్లీ: హోరాహోరీగా సాగుతున్న గుజరాత్ రెండోదఫా ఎన్నికల ప్రచారం నేటి(మంగళవారం)తో ముగియనుంది. ఈ క్రమంలో అహ్మదాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్వహించతలపెట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ప్రధాని మోదీ తొలిసారి వినూత్నంగా ప్రజల ముందుకు వచ్చారు. సబర్మతి నదిలో సీప్లేన్ (సముద్ర విమానం)లో ప్రయాణించి.. ధారోయ్ డ్యామ్‌కు చేరుకున్నారు. అహ్మదాబాద్ నుంచి 150 కిలోమీటర్ల సముద్ర విమానంలో మోదీ ప్రయాణం చేశారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో ప్రయాణించి అంబాజీ ఆలయాన్ని దర్శించుకోబోతున్నారు. దేశంలో సీప్లేన్ ప్రయాణం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో అభివృద్ధి గురించి మాట్లాడటం లేదని కాంగ్రెస్ విమర్శిస్తున్న నేపథ్యంలో.. ఆ పార్టీ కనీసం ఇలాంటి అభివృద్ధిని ఊహించి కూడా ఉండదని ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశంలోని అన్నిచోట్లా ఎయిర్‌పోర్టులో నిర్మించడం సాధ్యం కాదని, అందుకే వాటర్‌వేస్‌పై దృష్టిపెట్టామని, దేశంలోని 106చోట్లా వీటిని నిర్మించాలని ప్రణాళికలు రచిస్తున్నామని ప్రధాని మోదీ వరుస ట్వీట్లలో వెల్లడించారు. ప్రధాని మోదీతోపాటు కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీకి కూడా అహ్మదాబాద్ లో ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ క్రమంలో వినూత్నంగా ప్రజలకు చేరువయ్యేందుకు మోదీ తొలిసారి సీప్లేన్ లో ప్రయాణించారు. -
ఆగస్టు నుంచి ‘స్కై చాపర్స్’ సర్వీసులు
విశాఖపట్నం, కాకినాడలకు ఆగస్టు నుంచి ‘స్కై చాపర్స్’ సర్వీసులు సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం, కాకినాడల నుంచి ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతికి వెళ్లి వచ్చే వారి కోసం సీ ప్లేన్ సిద్ధమవుతోంది. ఇటు భూమి నుంచి అటు నీటి నుంచి కూడా టేకాఫ్, ల్యాండింగ్ కాగల ఉభయ చర (యాంఫిబియాన్ ఎయిర్‌క్రాఫ్ట్) విమానం ఆగస్టు నెల నుంచి అందుబాటులోకి రానుంది. స్కై చాపర్స్ లాజిస్టిక్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ఈ సీప్లేన్‌ను నడపడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. దేశంలోని అమర్నాథ్, కేదార్నాథ్, వైష్ణోదేవి వంటి ఎత్తయిన పర్వత ప్రాంతాల్లోని దేవాలయాలకు హెలికాప్టర్లలో భక్తులను తీసుకెళ్లడంలో ఈ సంస్థకు అనుభవం ఉంది. ఇటీవల స్కై చాపర్స్ సంస్థ ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఇప్పటికే స్కై చాపర్స్ సంస్థ అమెరికా, ఇండోనేసియాల నుంచి రెండు ఎయిర్‌క్రాఫ్ట్‌లను కొనుగోలు చేసింది. వీటిలో ఒకటి రాకపోకలు సాగిస్తే మరొకటి స్టాండ్‌బైగా ఉంచుతారు. వీటికి సెస్సానా అనే పేరు పెట్టారు.ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌లో 12 మంది ప్రయాణించే వీలుంటుం ది. తొలిదశలో విజయవాడ నుంచి కాకినాడ, విశాఖపట్నంలకు ఈ సర్వీసులు నడపనుంది. తొలుత విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ నుంచి ఉదయం 6.30 గంటలకు బయల్దేరి అర గంటలోపు కాకినాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి బయల్దేరి విజయవాడ వస్తుంది. అనంతరం విజయవాడలో బయలుదేరి 8.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. విశాఖలో ప్రయాణికులను ఎక్కించుకుని గంటలోపు విజయవాడ చేరుకుంటుంది. సాయంత్రం నాలుగు గంటలకు ఉదయం వచ్చిన వారిని తిరిగి కాకినాడ, విశాఖపట్నంలకు తీసుకెళ్తుంది. మధ్యాహ్నం ఖాళీగా ఉన్న సమయంలో విజయవాడ నుంచి ఒక ట్రిప్పు తిరుపతికి కూడా నడపాలని స్కై చాపర్స్ యాజమాన్యం ఆలోచిస్తోంది. ఈ ఎయిర్‌క్రాఫ్ట్ ల్యాండింగ్, టేకాఫ్‌లకు వీలుగా విజయవాడలో ప్రకాశం బ్యారేజీ వద్ద ఒకటి, విశాఖ సమీపంలోని భీమిలి, కాకినాడల్లో ఒక్కోటి చొప్పున ఫ్లోటింగ్ జెట్టీల నిర్మాణం జరుగుతోంది. ఆగస్టు నుంచి సీప్లేన్ సర్వీసులు ప్రారంభమ య్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ సీప్లేన్‌కు రానూపోనూ టికెట్ ధర రూ.4,000 నుంచి 4,500 వరకు నిర్ణయించే అవకాశముంది. విశాఖపట్నం, కాకినాడ ప్రాంతాల నుంచి రాజధాని అమరావతి వెళ్లే వారు, వ్యాపారవేత్తలు అక్కడ ఉండిపోవాల్సిన అవసరం లేకుండా అదేరోజు సాయంత్రానికి తమ స్వస్థలాలకు చేరుకునేలా ఈ సీప్లేన్ సర్వీసులను ప్రవేశపెట్టనున్నట్టు స్కై చాపర్స్ బిజినెస్ డెరైక్టర్ చంద్రశేఖర్ ‘సాక్షి’కి చెప్పారు. భవిష్యత్‌లో కోనసీమకు కూడా సీప్లేన్ సర్వీసులను విస్తరిస్తామని తెలిపారు. -
గోవా టూరిజం వినూత్నప్రయోగం
-
ముంబై నుంచి సీ ప్లేన్ సర్వీసులు ప్రారంభం
-
సీప్లేన్ ఆగిపోయింది...
ముంబయి నుంచి సహారా సంస్థకు చెందిన ఆంబీవ్యాలీకి వెళ్లడానికి ఓ సీప్లేన్ సర్వీస్‌ను సిద్ధం చేసింది సహారా. రూ.4000-4500 టికెట్‌తో ఎంచక్కా 120 కిలోమీటర్ల దూరాన్ని సీప్లేన్‌లో చుట్టేద్దామనుకునేవారి కోసం ఈ సర్వీసును సోమవారం నుంచి ఆరంభించాల్సి ఉండగా... సుబ్రతోరాయ్ జైల్లో ఉండటం దీనికి కలిసిరాలేదు. ‘‘మా అధినేత జైల్లో ఉన్నారు కనక ఈ సర్వీసును ఇప్పుడే ఆరంభించొద్దు. దయచేసి వాయిదా వేయండి’’ అంటూ ఆంబీ వ్యాలీ అధికారుల నుంచి సమాచారం రావటంతో ఆపరేటింగ్ సంస్థ మెహ్ ఎయిర్‌కు దీన్ని నిలిపేయక తప్పలేదు.