
న్యూఢిల్లీ: మాజీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చీఫ్ సంజయ్ కుమార్ మిశ్రాను ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (EAC-PM)లో కార్యదర్శి హోదాలో పూర్తి సమయం సభ్యునిగా ప్రభుత్వం నియమించింది. ఈమేరకు మంగళవారం అర్థరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి(Economic Advisory Council to the Prime Minister)(EAC-PM) అనేది అనేది ప్రభుత్వానికి, ముఖ్యంగా ప్రధానమంత్రికి ఆర్థిక, సంబంధిత అంశాలపై సలహా ఇచ్చేందుకు ఏర్పాటైన స్వతంత్ర సంస్థ.
EAC-PM ప్రస్తుత సభ్యులు
సుమన్ బెర్రీ (ఛైర్మన్)
సంజీవ్ సన్యాల్ (సభ్యులు)
డాక్టర్ షమికా రవి (సభ్యులు)
రాకేశ్ మోహన్ (పార్ట్ టైమ్ సభ్యులు)
డాక్టర్ సజ్జిద్ చినోయ్ (పార్ట్ టైమ్ సభ్యులు)
డాక్టర్ నీలేశ్ షా (పార్ట్ టైమ్ సభ్యులు)
ప్రొఫెసర్ టీటీ రామ్మెహన్ (పార్ట్ టైమ్ సభ్యులు)
డాక్టర్ పూనమ్ గుప్తా (పార్ట్ టైమ్ సభ్యులు)
సంజయ్ కుమార్ మిశ్రా(Sanjay Kumar Mishra) 1984 బ్యాచ్ ఐఆర్‌ఎస్ (ఆదాయపు పన్ను) రిటైర్డ్ అధికారి. ఆర్థిక నిపుణునిగా ఆయన పలు ఉన్నత స్థాయి కేసులను వ్యక్తిగతంగా పర్యవేక్షించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సంజయ్ కుమార్ మిశ్రా 2018, నవంబర్ 19న న రెండు సంవత్సరాల పదవీకాలానికి ఈడీ చీఫ్‌గా నియమితులయ్యారు. దీనికిముందు ఆయన ఢిల్లీలో ఆదాయపు పన్ను చీఫ్ కమిషనర్‌గా పనిచేశారు. 2020లో మిశ్రా పదవీకాలాన్ని మూడు సంవత్సరాలకు పొడిగించారు.
సీఎన్‌బీసీ టీవీ 18 పేర్కొన్న వివరాల ప్రకారం మిశ్రా హయాంలో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా భర్త రాబర్ట్ వాద్రాపై ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, నేషనల్ కాన్ఫరెన్స్ నేతలు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లాపై మిశ్రా నేతృత్వంలో ఈడీ చర్యలు చేపట్టింది.
ఇది కూడా చదవండి: ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. ఎన్నికల్లో పౌరసత్వ రుజువుకు పెద్దపీట