Mishra
-
కర్వా చౌత్ వేళ.. భర్త వీపుపై భార్య అమూల్య సందేశం
హల్ద్వానీ: కర్వా చౌత్ వ్రతాన్ని ఉత్తరాది మహిళలు ఆదివారం(అక్టోబర్ 20)న అత్యంత వేడుకగా జరుపుకున్నారు. ఉత్తరాఖండ్‌లోనూ ఇంటింటా కర్వాచౌత్ సందడి కనిపించింది. అయితే హల్ద్వానీ నగరంలో ఈ పండుగ సందర్భంగా చోటుచేసుకున్న ఒక విచిత్ర ఉదంతం అందరినీ ఆకర్షించింది. ఒక మహిళ తన భర్త వీపుపై గోరింటతో ‘వైద్య కళాశాల ఆస్తి’ అని రాశారు. దీని వెనుక ఆమె ఉద్దేశమేమిటనే విషయానికొస్తే..హల్ద్వానీలోని కుంతీపురం హిమ్మత్‌పూర్ తల్లా నివాసి గీతా మిశ్రా శరీర దాన ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అందుకే కర్వాచౌత్ సందర్భంగా తన భర్త వీపుపై మెహెందీతో ‘మెడికల్ కాలేజీ ఆస్తి’ అని రాసి, తమ సందేశాన్ని అందరికీ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మరణానంతరం శరీరాన్ని ఏదైనా ఉపయోగకరమైన పనులుకు వినియోగించాలన్నారు. హల్ద్వానీ వైద్య కళాశాలకు మృత శరీరాన్ని అప్పగిస్తే, వైద్య విద్యార్థులు ప్రయోగాలకు ఉపయోగపడుతుందన్నారు. ఇంతేకాదు.. మరణించ తరువాత కూడా మన శరీరం సదుపయోగం అవుతుందని పేర్కొన్నారు. గీతా మిశ్రా భర్త డాక్టర్ సంతోష్ మిశ్రా మాట్లాడుతూ 2013లోనే తమ కుటుంబ సభ్యులంతా దేహదానం చేస్తామని ప్రతిజ్ఞ చేశారన్నారు. ఇలాగే తాము నేత్రదానం, అవయవదానం మొదలైనవాటిపై ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు. ఈ దిశగా ఆలోచించేవారు మరిన్ని వివరాల కోసం వారికి సమీపంలోగల మెడికల్ కాలేజీలను సంప్రదించాలని మిశ్రా సూచించారు. ఇది కూడా చదవండి: ‘కర్వా చౌత్’ హామీని విస్మరించిన భర్తపై ఫిర్యాదు -
తారీఫ్ కరే క్యా ఉస్కీ..
లిసా మిశ్రా.. గాయనిగా, గేయరచయితగా సంగీత, సాహిత్యాభిమానులకు ఏనాడో పరిచయం. తాజాగా నటనారంగంలోకి అడుగుపెట్టి తన అభినయ కళనూ ప్రదర్శించింది. ఆ ఫ్యాన్ బేస్నూ సంపాదించుకుంది.👉లిసా పుట్టింది ఒడిశాలోని బరంపురంలో. పెరిగింది అమెరికాలోని షికాగోలో. నాలుగో ఏట నుంచే సంగీతం నేర్చుకోవడం ప్రారంభించింది. పదిహేనో ఏట నుంచి గిటార్లో శిక్షణ పొందటం మొదలుపెట్టింది. అకడమిక్స్ విషయానికి వస్తే ఇల్లినాయీ వెజ్లీయన్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్ అండ్ రిలిజియన్‌లో గ్రాడ్యుయేషన్ చేసింది.👉పదమూడేళ్ల వయసులో లిసా.. యూట్యూబ్ చానల్ స్టార్ట్ చేసి, తన పాటల వీడియోలను అందులో పోస్ట్ చేయసాగింది. అయితే ఆమె అలా వీడియోలు అప్లోడ్ చేయడం వాళ్లమ్మకు నచ్చలేదు. ఎందుకు అందరి కళ్లల్లో పడటం అంటూ అభ్యంతరం చెప్పింది. దాంతో కేవలం ఆడియో రికార్డింగ్స్‌ని మాత్రమే పోస్ట్ చేయసాగింది. ఆమె స్వరమాధుర్యానికి ఫిదా అయిపోయారు శ్రోతలు. ఆ ఆడియో పోస్ట్‌లకు వచ్చిన రెస్పాన్స్ చూసి లిసా వాళ్లమ్మ, కూతురి పాటల వీడియోలకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. 👉యూట్యూబ్‌లోని ఆమె పాటల వీడియోలకు అమెరికన్ పాప్ మ్యూజిక్ కూడా స్పందించింది. 2016, గ్రామీ అవార్డ్ గెలుచుకున్న ‘కలరింగ్ బుక్’ ఆల్బమ్‌లో పాడే అవకాశాన్నిచ్చింది. 2017లో ఎమ్మీ అవార్డ్స్‌కి నామినేట్ అయిన ‘బ్రౌన్ గర్ల్స్’ వెబ్ సిరీస్‌లోనూ థీమ్ సాంగ్ పాడింది.👉పాశ్చాత్య ప్రపంచంలో లిసా అంత కీర్తి సాధించినా.. ఆమె మీద భారత్ దృష్టి పడింది మాత్రం ఆమె ‘వీరే ది వెడ్డింగ్’లోని ‘తారీఫా’ పాటను పాడి, ఇన్‌స్టాలో పోస్ట్ చేశాకే! ఇన్‌స్టాలో ఆ వీడియో చూసిన సోనమ్ కపూర్, రియా కపూర్లు ఆమెను బాలీవుడ్‌కి పిలిచి, ‘తారీఫా’ రిప్రైజ్ వర్షన్‌ను పాడించారు. దాంతో ఇక్కడా ఆమె లైమ్‌లైట్‌లోకి వచ్చింది. బాలీవుడ్ ప్రయాణాన్ని మొదలుపెట్టింది.👉‘జడ్జ్‌మెంటల్ హై క్యా’, ‘స్కై ఈజ్ పింక్’, ‘గుడ్ న్యూస్’, ‘జుగ్‌జుగ్ జియో’, ‘లైగర్’, ‘దోనో’ వంటి సినిమాల్లో ఆమె పాడిన పాటలన్నీ హిట్టే! సినిమాల్లో పాడే చాన్స్ రాగానే తనకు ఇష్టమైన పాప్ మ్యూజిక్ వరల్డ్‌కి గుడ్ బై చెప్పలేదు. అక్కడా వినిపించడానికి ప్లాన్ చేసుకుంటోంది. గాయనిగానే కాదు పాటలను రాస్తూ తన రచనా పాటవాన్నీ చూపిస్తోంది.👉క్షణం తీరిక లేని ఆమె షెడ్యూల్లో తన కోసం కాల్షీట్ సర్దే వీలుంటుందేమో చూడమని ఓటీటీ రిక్వెస్ట్ చేసింది.. ‘కాల్ మి బే’ వెబ్ సిరీస్ ఆఫర్‌తో! ఎంతో ఉత్సాహంగా ‘యెస్’ చెప్పింది లిసా. ప్రాధాన్యమున్న పాత్రలో నటించి వీక్షకులు, విమర్శల ప్రశంసలు అందుకుంటోంది. ఆ సిరీస్ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో స్ట్రీమ్ అవుతోంది.సింగర్, సాంగ్ రైటర్ అయిన నాకు యాక్టింగ్ అనేది సవాలే! చాలెంజెస్ అంటే ఇష్టం కాబట్టి యాక్టర్‌గానూ ఇంట్రడ్యూస్ అయ్యాను. మంచి రోల్స్ వస్తే నటననూ కంటిన్యూ చేస్తాను.– లిసా మిశ్రా. -
సకాలంలో నివేదికలిస్తే బాధితులకు సత్వర న్యాయం
సాక్షి, అమరావతి/ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు వీలుగా అధికారులు సకాలంలో నివేదికలు ఇవ్వాలని జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) చైర్పర్సన్ జస్టిస్ అరుణ్ మిశ్రా ఆదేశించారు. రాష్ట్రంలో నమోదైన మానవ హక్కుల ఉల్లంఘన కేసులపై జస్టిస్ అరుణ్ మిశ్రాతో పాటు ఎన్హెచ్ఆర్సీ సభ్యులు డాక్టర్ డి.ఎం.మూలే, రాజీవ్ జైన్, విజయభారతి సయాని, సెక్రటరీ జనరల్ భరత్ లాల్, రిజి్రస్టార్(లా) సురాజిత్ బృందం బుధవారం విజయవాడలో విచారణ నిర్వహించింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, వివిధ విభాగాల ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థలు, మానవ హక్కుల పరిరక్షకులతో సమావేశమయ్యారు. అనంతరం ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ జస్టిస్ అరుణ్ మిశ్రా మీడియాతో మాట్లాడారు. విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో 30 కేసులను విచారించి, తగిన ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. రూ.80 లక్షల మేర పరిహారం చెల్లింపులకు సిఫార్సు చేశామని తెలిపారు. 17 కేసుల్లో తుది ఉత్తర్వులు జారీ చేశామన్నారు. లైంగిక నేరాల కేసుల్లో బాలబాలికలకు నష్టపరిహారం విషయంలో పోక్సో కోర్టు ముందు ప్రతిపాదనలు ఉంచాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. మానసిక ఆరోగ్యం, వెట్టి చాకిరీ, ఆహార భద్రత హక్కు, జ్యుడీషియల్–పోలీసు కస్టడీలో ఆత్మహత్యల నివారణ తదితర అంశాలపై కార్యాచరణ నివేదికలను సమర్పించాలని కోరినట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని స్వచ్ఛంద సంస్థలు, మానవ హక్కుల పరిరక్షకులు చేస్తున్న కృషి ప్రశంసనీయమని అభినందించారు. మానవ హక్కుల ఉల్లంఘనలపై hrcnet.nic.in వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. దుర్గమ్మ సేవలో జస్టిస్ అరుణ్ మిశ్రా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ అరుణ్‌మిశ్రా బుధవారం దర్శించుకున్నారు. అమ్మవారి పంచహారతుల సేవలో పాల్గొనేందుకు ఇంద్రకీలాద్రికి వచ్చిన జస్టిస్ అరుణ్మిశ్రాకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. పంచహారతుల సేవలో పాల్గొన్న అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత వేద పండితులు ఆశీర్వచనం ఇవ్వగా.. ఆలయ ఈవో కేఎస్ రామారావు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, పట్టువ్రస్తాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఢిల్లీరావు, జాయింట్ కలెక్టర్ సంపత్‌కుమార్ పాల్గొన్నారు. -
అరరే... ఎంత పనైపాయే!
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ ప్రియాంక మిశ్రా ఊరకనే ఉండి ఉంటే వైరల్ అయ్యేది కాదు. సదరు కానిస్టేబుల్ ఇన్స్టాగ్రామ్ రీల్ చేసి వైరల్ అయింది. ఈ రీల్లో ప్రియాంక మిశ్ర ‘కర్తవ్యం’ సినిమాలో విజయశాంతిని గుర్తు తెచ్చేలా ఓ లెవెల్లో నటించింది. సహజత్వం కోసం సర్వీస్ గన్ను ఉపయోగించి మరీ నటించింది. ఈ వీడియో వైరల్ కావడం మాట ఎలా ఉన్నా పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం ‘చాల్లేండి సంబడం’ అంటూ ఆమెను సస్పెండ్ చేసింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా మళ్లీ పోలీస్ డిపార్ట్మెంట్లో పని చేయడానికి ప్రియాంక దరఖాస్తు చేసుకుంది. ఆమె దరఖాస్తు ఆమోదం పొందింది. ఆగ్రాలో పోస్టింగ్ కూడా ఇచ్చారు. అయితే 48 గంటల్లోనే ఆమె నియామకాన్ని పోలీస్ కమిషనర్ ప్రీతిందర్సింగ్ రద్దు చేశారు. ప్రియాంక మిశ్రాపై సోషల్ మీడియాలో సానుభూతి చూపుతున్నవారితో పాటు, సానుభూతి చూపుతూనే ‘స్వయంకృతాపరాధం’ అని విమర్శించిన వాళ్లు కూడా ఉన్నారు. -
ఈడీ చీఫ్ పదవీకాలం పొడిగింపు చట్టవిరుద్ధం: సుప్రీం స్పష్టీకరణ
ఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చీఫ్ సంజయ్ కుమార్ మిశ్రా Sanjay Kumar Mishra పదవీకాలం పొడగింపుపై సుప్రీం కోర్టు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ మేరకు పొడిగింపు చట్టవిరుద్ధమని ప్రకటిస్తూనే.. జులై 31వ తేదీ వరకు ఆయన పదవిలో కొనసాగవచ్చని మంగళవారం కేంద్రానికి తెలిపింది. ఆర్థిక నేరాలపై దర్యాప్తు చేసే ఈ జాతీయ సంస్థ చీఫ్ బాధ్యతలను 2018 నవంబర్‌లో ఎస్కే మిశ్రా చేపట్టారు. అయితే రెండేళ్లకే ఆయన వయోపరిమితి రిత్యా(60 ఏళ్ల) రిటైర్ కావాల్సి ఉంది. కానీ, కేంద్రం మాత్రం రకరకాల సవరణలు, ప్రత్యేక ఆదేశాలతో ఆయన పదవీ కాలాన్ని మూడుసార్లు పొడిగించింది. ఈ క్రమంలో రాజకీయ దుమారం చెలరేగగా.. మధ్యలో సుప్రీం కోర్టు సైతం అభ్యంతరం వ్యక్తం చేసింది. అయినప్పటికీ కేంద్రం మాత్రం ఆర్డినెన్స్‌ల వంకతో ఆయన పదవీ కాలాన్ని పొడగిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఇవాళ జరిగిన విచారణ సందర్భంగా సుప్రీం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ► 2020 నవంబర్‌లో మరో ఏడాదికి కేంద్రం పొడిగించగా.. ఆ సమయంలో జస్టిస్ ఎల్ నాగేశ్వరావు నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ‘పొడిగింపు ప్రత్యేక సందర్భాల్లో.. అదీ తక్కవ కాల వ్యవధితో మాత్రమే ఉండాలని స్పష్టంగా కేంద్రానికి తెలిపింది. అంతేకాదు.. ఎస్కే మిశ్రాను ఈడీ చీఫ్‌గా కొనసాగించకూడదని స్పష్టం చేసింది కూడా. ► అయినప్పటికీ.. 2021 నవంబర్‌లో మరో మూడు రోజుల్లో ఆయన రిటైర్ అవ్వాల్సి ఉండగా.. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్1946 తోపాటు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యాక్ట్ 2003కి సవరణలు చేస్తూ కేంద్రం ఆర్డినెన్స్‌లు తీసుకురాగా.. అప్పటి రాష్ట్రపతి ఆమోదం లభించింది. దీంతో కేంద్రానికి మరింత బలాన్ని దక్కినట్లయ్యింది. ► 1997కి ముందు ఈడీ, సీబీఐల డైరెక్టర్ పదవీకాలం నిర్ధిష్టంగా ఉండేది కాదు. కేంద్రం ఎప్పుడు కావాలనుకుంటే.. అప్పుడు తొలగించేది. ► ఆ తర్వాత పదవీ కాలం రెండేళ్లు చేశారు. ► అయితే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆర్డినెన్స్ 2021 ప్రకారం.. ఐదేళ్ల కాలపరిమితికి పెంచింది. అది ముగిశాక వాళ్ల పని తీరు ఆధారంగా మరో ఏడాది పొడిగించుకోవచ్చు. ► అలా కిందటి ఏడాది నవంబర్‌లో మిశ్రాను ఈడీ డైరెక్టర్‌గా మరో ఏడాది పొడిగించిది కేంద్రం. దీంతో మిశ్రా 2023 నవంబర్‌లో రిటైర్ కావాల్సి ఉంది. కానీ.. ► సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌కు చేసిన సవరణపై తీవ్ర స్థాయిలో రాజకీయపరంగా అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. విడివిడిగా ఎనిమిది ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు అయ్యాయి. వీళ్లలో కాంగ్రెస్, టీఎంసీ, తరపున కూడా కొందరు నేతలు ఉన్నారు. అయితే.. రాజకీయ ప్రయోజనాల కోసమే వాళ్లు కోర్టును ఆశ్రయించారని కేంద్రం కౌంటర్ దాఖలు చేసింది. ఆయా పార్టీలకు చెందిన నేతలు మనీలాండరింగ్ ద్వారా ఈడీ దర్యాప్తు ఎదుర్కొంటున్నారని.. అందుకే కోర్టుకు చేరారని తెలిపింది. ► ఇక ఇదే ఏడాది ఫిబ్రవరిలో అమికస్ క్యూరి(కోర్టు స్నేహితుడు) కేవీ విశ్వనాథన్.. జస్టిస్ గవాయ్, జస్టిస్ అరవింద్ కుమార్‌లతో కూడిన ధర్మాసనానికి ఎస్కే మిశ్రా బాధ్యతల పొడిగింపు చెల్లదని నివేదించారు. ► ఇక పిటిషన్లపై అన్ని వర్గాల వాదనలు విన్న జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం.. మే 8వ తేదీన తీర్పును రిజర్వ్ చేసి ఉంచింది. ► దఫదఫాలుగా ఎస్కే మిశ్రాను ఈడీ చీఫ్‌గా కొనసాగించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ధర్మాసనం.. ఆయన పొడిగింపు చెల్లదని ఇవాళ్టి ఆదేశాల్లో స్పష్టం చేసింది. అయితే.. కేంద్రం విజ్ఞప్తి చేయడంతో జులై 31వ తేదీ వరకు కొనసాగవచ్చని మాత్రం పేర్కొంది. -
జస్టిస్ మిశ్రా గౌరవార్థం ఏపీ ప్రభుత్వం ఆత్మీయ విందు (ఫొటోలు)
-
జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రాకు ఏపీ ప్రభుత్వం సత్కారం
సాక్షి, విజయవాడ: సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రాను ఏపీ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. ఆయన గౌరవార్థం ప్రభుత్వం ఆత్మీయ విందు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఏపీ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి హాజరయ్యారు. విజయవాడ ఎ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాను సత్కరించిన సీఎం వైఎస్ జగన్.. మెమెంటో అందజేశారు. పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, చీఫ్ సెక్రటరీ, డీజీపీ, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, న్యాయవాదులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఏపీ హైకోర్టు సీజేగా పనిచేసిన జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా ఇటీవలే సుప్రీం జడ్జిగా పదోన్నతి పొందారు. ఆయన ఆగస్టు 29, 1964న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయగఢ్‌లో జన్మించారు. బిలాస్‌పూర్‌లోని గురు ఘాసిదాస్ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ, ఎల్ఎల్బీ పట్టాలు పొందారు. 1987 సెప్టెంబరు 4న న్యాయవాదిగా పేరు నమోదు చేయించుకుని రాయ్‌గఢ్‌లోని జిల్లా కోర్టు, జబల్పూర్లోని మధ్యప్రదేశ్ హైకోర్టు, బిలాస్‌పూర్‌లోని ఛత్తీస్‌గఢ్ హైకోర్టుల్లో ప్రాక్టీసు చేశారు. సివిల్, క్రిమినల్ కేసుల్లో పేరుగాంచారు. ఛత్తీస్‌గఢ్ బార్ కౌన్సిల్‌కు చైర్మన్‌గా పనిచేశారు. 2004 జూన్ 26 నుంచి 2007 ఆగస్టు 31 వరకు ఆ రాష్ట్ర అదనపు అడ్వొకేట్ జనరల్‌గా పనిచేశారు. అనంతరం సెప్టెంబర్ 1, 2007 నుంచి న్యాయమూర్తి అయ్యే వరకూ అడ్వొకేట్ జనరల్‌గా కొనసాగారు. డిసెంబరు 10, 2009న ఛత్తీస్‌గఢ్ న్యాయమూర్తిగా నియమితులయ్యారు. కాగా, 2021, జూన్ 1 వ తేదీ నుంచి ఛత్తీస్‌గఢ్ హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. తర్వాత ఏపీ హైకోర్టు సీజేగా పని చేసి ఇటీవలే సుప్రీం కోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. చదవండి: ఎలాంటి సహకారం కావాలన్నా అండగా ఉంటాం: సీఎం జగన్ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఆ నిర్మాత ఎంతోమందిని వాడుకుని వదిలేశాడు: ప్రేమమ్ హీరోయిన్
సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ అవకాశాలు రావాలంటే హీరోయిన్లు కమిట్మెంట్ ఇచ్చి తీరాల్సిందే..! ఇది ఒక్కరి మాట కాదు.. చాలామంది హీరోయిన్లు బహిరంగానే చెప్పిన విషయం. అయితే కొందరు బయటపడతారు.. ఇంకొందరు బయటపడరు. స్టార్ హీరోయిన్లు సైతం తమను నిర్మాతలు, హీరోలు కమిట్మెంట్ అడిగినట్లు చెప్పుకొచ్చారు. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు 'క్యాస్టింగ్ కౌచ్' అనే పదం ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. (ఇదీ చదవండి: అప్పటినుంచే ప్రేమలో ఉన్నామన్న లావణ్య.. పోస్ట్ వైరల్) తాజాగా ఒడియా ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన నిర్మాత సంజయ్ నాయక్‌పై ఇద్దరు హీరోయిన్లు క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేశారు. ఒడియా 'ప్రేమమ్' సినిమాలో నటించి గుర్తింపు తెచ్చుకున్న ప్రకృతి మిశ్రా అనే హీరోయిన్ మీడియా ముందే నిర్మాతపై ఫైర్ అయింది. తన సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పి నిర్మాత సంజయ్ నాయక్ ఎంతోమంది యువతులను లోబరుచుకున్నాడని తెలిపింది. ఆయన అవసరం తీరితే తరువాత ఆ నటి ముఖం కూడా చూడడని సెన్సెషనల్ కామెంట్ చేసింది. ఇలాంటి వారి టార్చర్ వల్ల ప్రస్తుతం రియాలిటీ షోలు చేసుకుంటూ.. వాటి ద్వారా మంచి నటిగా ప్రూవ్ చేసుకుని, ఇప్పుడు తాను ఒక ఉన్నత స్థానానికి చేరుకున్నాని తెలిపింది. ప్రకృతి మిశ్రా వ్యాఖ్యలకు మరో నటి జాస్మిన్ రథ్ మద్ధతు తెలిపింది. తను కూడా సంజయ్ బాధితురాలినే అంటూ కామెంట్ చేసింది. నిర్మాత సంజయ్ నాయక్ కామెంట్: హీరోయిన్ల ఆరోపణలను సంజయ్ నాయక్ తప్పుబట్టాడు. ప్రకృతి మిశ్రా, హీరో బాబు సాన్ మధ్య జరిగిన వివాదం అందరికీ తెలిసిందే.. ఆ సమయంలో బాబు సాన్‌కు మద్దతు ఇచ్చానన్న అక్కసుతో ప్రకృతి మిశ్రా ఇలాంటి నిరాధారమైన నిందలు వేస్తోందన్నాడు. ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని, ప్రకృతి మిశ్రా చేసిన వ్యాఖ్యలను ప్రసారం చేసిన మీడియా సంస్థలను కోర్టుకు లాగుతానని సంజయ్ తెలిపాడు. (ఇదీ చదవండి: మళ్లీ తెరపైకి మీటూ కేసు.. మరో కొత్త ట్విస్ట్) -
ఉన్నత పదవుల్లో మహిళల సంఖ్య పెరగాలి
సాక్షి, అమరావతి: జనాభాలో సగభాగం ఉన్న మహిళలకు సమ ప్రాధాన్యతనివ్వకపోతే దేశ, సమాజం పురోగతి సాధించలేవని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా అన్నారు. మహిళలకు సముచిత స్థానం కల్పిస్తే ప్రపంచంలో భారతదేశం తిరుగులేని స్థానం సంపాదిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతి, గవర్నర్లుగా, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలుగా పలువురు మహిళలు ఉన్నారని, అయినప్పటికీ ఉన్నత పదవుల్లో మహిళల సంఖ్య మరింత పెరగాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం హైకోర్టు న్యాయవాదుల సంఘం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది. సీజే ప్రశాంత్‌కుమార్ మిశ్రా, మహిళా న్యాయమూర్తులు జస్టిస్ బి.శ్రీభానుమతి, జస్టిస్ వడ్డిబోయన సుజాత, జస్టిస్ ప్రతాప వెంకట జ్యోతిర్మయి, న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు కె.జానకిరామిరెడ్డి, అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్, బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు, రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ యర్రంరెడ్డి నాగిరెడ్డి, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (డీఎస్జీ) ఎన్.హరినాథ్, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీజే జస్టిస్ మిశ్రా మాట్లాడుతూ మహిళలను పూజించడం, గౌరవించడం మన ధర్మమని చెప్పారు. మహిళలు ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవాలని, అప్పుడే ఉన్నత శిఖరాలకు చేరుకోగలరని తెలిపారు. ఏపీ హైకోర్టులో గతంలో మహిళా న్యాయవాదుల సంఖ్య చాలా తక్కువగా ఉండేదని, ఇప్పుడు 28 శాతానికి పైగా మహిళలే ఉన్నారన్నారు. న్యాయవ్యవస్థతోపాటు ఇతర శాఖల్లో నిర్వహించే నియామక పరీక్షల్లో మహిళలే ఎక్కువగా ఉత్తీర్ణత సాధిస్తున్నారని చెప్పారు. ఆత్మస్థైర్యం కోల్పోకూడదు మహిళా న్యాయమూర్తులు జస్టిస్ శ్రీభానుమతి, జస్టిస్ సుజాత, జస్టిస్ జ్యోతిర్మయి మాట్లాడుతూ హైకోర్టులో మహిళా జడ్జిల సంఖ్య మరింత పెరగాల్సి ఉందన్నారు. జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకునేందుకు ఉన్న అడ్డంకులను మహిళలు తమకు తామే తొలగించుకోవాలన్నారు. మహిళలు ఎన్నడూ ఆత్మస్థైర్యం కోల్పోకూడదని, తమను తాము తక్కువగా భావించకూడదని తెలిపారు. కేవలం వాయిదాలు అడిగేందుకే కాకుండా వాదనలు వినిపించే అవకాశాలను మహిళా న్యాయవాదులు అందిపుచ్చుకోవాలన్నారు. సీనియర్ న్యాయవాది భాస్కరలక్ష్మి మాట్లాడుతూ మహిళా సంఘాలు నిర్వహించే కార్యక్రమాలకు పురుషులను సైతం ఆహ్వానించాలని, తద్వారా మహిళల కష్టాలను అర్థం చేసుకునే అవకాశం వారికి కలుగుతుందన్నారు. అనంతరం జస్టిస్ భానుమతి, జస్టిస్ సుజాత, జస్టిస్ జ్యోతిర్మయితోపాటు భాస్కరలక్ష్మిని న్యాయవాదుల సంఘం ప్రతినిధులు ఘనంగా సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు. -
ప్రభవించిన పుంగనూరు
పలమనేరు పశు పరిశోధన కేంద్రంలో ఉత్పత్తి చేస్తున్న పుంగనూరు జాతి ఆవు జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డు–2022కు ఎంపికైంది. ఈ నెల 23న కిసాన్ దివస్ సందర్భంగా హరియాణాలోని కర్నాల్‌లోగల జాతీయ జన్యు వనరుల కేంద్రం(యానిమల్ జెనటిక్ రిసోర్స్ సెంటర్)లో ఈ అవార్డును అందించనున్నారు. దీనికి సంబంధించిన సమాచారం రిసోర్స్ సెంటర్ చీఫ్ సైంటిస్ట్ ఏకే మిశ్రా నుంచి ఇప్పటికే అందిందని ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ వీసీ డా.పద్మనాభరెడ్డి చెప్పారు. ప్రపంచంలోనే అరుదైన రకం పశువులుగా పుంగనూరు పొట్టి పశువులకు పేరుంది. వీటి ఉనికి ప్రశ్నార్థకంగా మారుతున్న నేపథ్యంలో వీటిని మరింత ఉత్పత్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్కేవీవై ద్వారా కృషిచేస్తోంది. ఇందులో భాగంగా ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ నిధుల ద్వారా పలమనేరు పశు పరిశోధన కేంద్రంలో ఐవీఎఫ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ కృత్రిమ పిండోత్పత్తి ద్వారా పుంగనూరు జాతి పశువులను ఎక్కువగా ఉత్పత్తి చేసే అవకాశం ఏర్పడింది. – పలమనేరు పొట్టి పశువుల పరిశోధన కేంద్రం లక్ష్యం ఇదీ పలమనేరు సమీపంలోని క్యాటిల్‌ఫామ్ వద్ద 1953లో సంకర జాతి ఆవుల ఉత్పత్తి, పరిశోధన కేంద్రంగా ఈ పశు పరిశోధన సంస్థ ప్రారంభమైంది. 1995 నుంచి పుంగనూరు పొట్టి రకం పశువుల ఉత్పత్తి కేంద్రంగా మారింది. 20 పొట్టి రకం పశువులతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు.. 268 పశువులు వరకూ చేరింది. అయితే నూతన సాంకేతిక పద్ధతుల ద్వారా వీటి సంఖ్యను పెంచాలని ప్రభుత్వం సంకల్పించింది. దీంతో స్థానిక పరిశోధన కేంద్రంలో ఆర్కేవీవై, ఐకార్ నిధులు రూ.2.85 కోట్లతో పిండమార్పిడి కేంద్రాన్ని(ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ల్యాబ్), ఐవీఎఫ్(ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్)ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. గతంలో పుంగనూరు జాతి ఎద్దు నుంచి సెమన్‌ను తీసి ఎదకొచ్చిన ఆవుకు ఇచ్చేవారు. దీంతో ఆవుకు ఓ దూడ మాత్రమే పుట్టేది. అయితే ఐవీఎఫ్ ద్వారా ఎద్దు సెమన్ నుంచి ఎక్కువ కణాలను తీసుకుని సరోగసి పద్ధతిలో ఎదకొచ్చిన ఎక్కువ ఆవులకు ఇంప్లాంట్ చేస్తారు. దీంతో ఒకే ఏడాదిలో ఈ జాతి పశువులను ఎక్కువ ఉత్పత్తి చేసేందుకు వీలవుతుంది. ఈ విధానం ద్వారా ఏటా వందల సంఖ్యలో పొట్టి రకం పశువుల ఉత్పత్తి జరగనుంది. వచ్చే ఐదేళ్లలో వీటి సంఖ్యను 500కు పెంచే లక్ష్యంతో పశు పరిశోధన కేంద్రం కృషి చేస్తోంది. అధిక వెన్న, పోషక విలువలు పుంగనూరు ఆవులు మూడడుగుల పొడవు మాత్రమే ఉంటాయి. తోకలు దాదాపుగా నేలను తాకుతుంటాయి. ఇవి సగటున 1 నుంచి 2 లీటర్ల వరకు మాత్రమే పాలిస్తాయి. ఈ పాలలో ఎక్కువ వెన్నతో పాటు.. పోషక విలువులు, రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటాయి. తక్కువ మేతతోనే జీవించగలుగుతాయి. ఇవి మనిషిని అత్యంత ప్రేమగా నమ్మి విశ్వాసంగా ఉంటాయి. తనకు పరిచయం లేని వారిని దరిదాపులకు కూడా రానివ్వవు. ఒక్కో ఆవు ధర రూ.10 లక్షల దాకా ఉంది. -
ప్రమాదం కాదు.. పథకం ప్రకారమే చంపేశారు!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో చోటుచేసుకున్న ఘటన పథకం ప్రకారం జరిగిందని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) స్పష్టం చేసింది. ఆందోళన చేస్తున్న రైతులను చంపాలన్న ఉద్దేశంతోనే ఈ మారణ హోమానికి పాల్పడ్డారని వెల్లడించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రాతో సహా నిందితులపై మోపిన అభియోగాలను సవరించాలని సిట్ అధికారులు న్యాయమూర్తికి లేఖ రాశారు. నిందితులపై పెట్టిన ర్యాష్ డ్రైవింగ్ ఆరోపణలను సవరించి... హత్యానేరం మోపాలని కోరారు. లఖింపూర్ ఖేరీ ఘటన ప్రమాదవశాత్తు జరలేదని, పథకం ప్రకారం జరిగిందని విచారణాధికారి విద్యారామ్ దివాకర్ కోర్టులో దాఖలు చేసిన దరఖాస్తులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన లఖింపూర్ జిల్లా కోర్టు నిందితులందరినీ మంగళవారం న్యాయస్థానానికి పిలిపించింది. కాగా, కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా ఈరోజు జైలులో తన కుమారుడు ఆశిష్ మిశ్రాను కలిశారు. (చదవండి: మాకు న్యాయం కావాలి.. పరిహారం కాదు!) అక్టోబర్ 3న లఖింపూర్ ఖేరీలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపైకి తన కారుతో ఆశిష్ మిశ్రా దూసుకురావడంతో నలుగురు అన్నదాతలు, జర్నలిస్ట్ చనిపోయారు. తర్వాత ఆందోళన కారులు జరిపిన దాడిలో ఇద్దరు బీజేపీ కార్యకర్తలు, కారు డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో ఆశిష్ మిశ్రాతోపాటు ఇతర నిందితులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. (చదవండి: సోనియా గాంధీ తీవ్ర అభ్యంతరం.. ఆ ప్రశ్న క్షణాల్లో తొలగింపు!) -
వైరస్ల తీరే వేరు!
భారత్‌లాంటి ఉష్ణమండల ప్రాంతాల్లో ‘కోవిడ్–19’ బతికి బట్టకట్టదు.. మాస్కులు ధరిస్తే వైరస్ దరిచేరదు.. ‘కోవిడ్’ నేపథ్యంలో వినిపిస్తున్న మాటలివి. అయితే, వీటిలో వాస్తవం కొంతేనని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్‌మిశ్రా చెబుతున్నారు. వాతావరణానికి, కోవిడ్‌కు సంబంధం ఉన్నట్టు ఎలాంటి శాస్త్రీయ ఆధారాల్లేవని ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. వైరస్ నుంచి రక్షణకంటూ చాలామంది మాస్కులు ధరిస్తున్నారని.. ఆరోగ్యవంతులకు ఇవి అవసరం లేదని, దగ్గు, జలుబు వంటివి ఉన్న వారు మాస్కులు తొడుక్కోవడం వల్ల ఆయా సమస్యలకు కారణమైన సూక్ష్మజీవులు ఇతరులకు సోకకుండా జాగ్రత్త పడవచ్చునని తెలిపారు. కోవిడ్–19 విషయంలో మాత్రం వ్యాధి సోకిన వారు లేదా లక్షణాలున్న వారు, రోగులకు వైద్య సాయం అందిస్తున్న వారు మాత్రమే మాస్కులు తొడుక్కోవడం మేలని సూచించారు. తెలివిమీరిన వైరస్లు కోవిడ్ కొత్తది కాకపోయినా, చాలాకాలంగా దీనిపై పరిశోధనలు జరుగుతున్నా ఇప్పటికీ తగిన చికిత్స లేకపోవడానికి వైరస్ల తీరుతెన్నులు కారణమని డాక్టర్ రాకేశ్‌మిశ్రా తెలిపారు. బ్యాక్టీరియా కంటే తక్కువ సైజుండే వైరస్‌లకు సొంతంగా పునరుత్పత్తి చేసే సామర్థ్యం ఉండదని, అందుకే ఇది పరాన్నజీవి మాదిరిగా ఇతరుల శరీర కణాల్లోకి చొరబడి ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుందన్నారు. కోవిడ్ వంటివి తరచూ రూపురేఖలను మార్చుకుంటాయని, ఫలితంగా వాటిని మన రోగ నిరోధక వ్యవస్థ గుర్తించలేదన్నారు. అందువల్లే కొన్నేళ్లుగా కోవిడ్ కుటుంబంలోని సార్స్, మెర్స్ వైరస్ల గురించి తెలిసినా చికిత్సను అభివృద్ధి చేయలేకపోయామని వివరించారు. అయితే వైరస్లు ఎలా సోకుతాయి? ఎలా వ్యాపిస్తాయన్న అంశాలపై స్పష్టమైన అవగాహన ఉండటం వల్ల కోవిడ్–19ను సమర్థంగా ఎదుర్కోగలుగుతున్నామన్నారు. ‘కోవిడ్’ వేడికి చస్తుందా? కోవిడ్ వేడి వాతావరణంలో బతకలేదనేందుకు శాస్త్రీయ ఆధారాల్లేవని రాకేశ్ మిశ్రా తెలిపారు. సాధారణ వ్యక్తులు కోవిడ్ నుంచి రక్షణ కోసమని మాస్కులు తొడుక్కోవడం అనవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. కోవిడ్, సార్స్, మెర్స్ వంటి వైరస్ సమస్యలన్నింటికీ ఒకే మందు కనుక్కోవడం అసాధ్యం కాదని, ఆ దిశగా ప్రయత్నాలు జరగాలన్నారు. ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నందున భారత్‌లో కోవిడ్ పెద్ద ఆరోగ్య సమస్యగా మారే అవకాశాల్లేవన్నారు. చైనాలో 90 వేలమందికి సోకి, మూడు వేల మంది ప్రాణాలు కోల్పోయినా.. మరణించిన వారిలో 80ఏళ్లు పైబడిన వారు ఎక్కువగా ఉండటం గమనించాలన్నారు. -
మిశ్రా మ్యాజిక్.. కివీస్ టాపార్డర్ ఔట్
రాంచీ: భారత్ తో జరుగుతున్న నాలుగో వన్డేలో న్యూజిలాండ్ టాపార్డర్ ఆటగాళ్లు పెవిలియన్ కు చేరారు. అమిత్ మిశ్రా స్పిన్ మాయాజాలంతో వరుస ఓవర్లలో ఇద్దరు కివీస్ బ్యాట్స్ మన్లను ఔట్ చేశాడు. తొలుత కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 41 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇన్నింగ్స్ 36వ ఓవర్లో టీమిండియా స్పిన్నర్ అమిత్ మిశ్రా రెండో బంతిని ఆడిన విలియమ్సన్ కీపర్ ధోనీ చేతికి చిక్కాడు. ధోనీ ఏ పొరపాటు లేకుండా విలియమ్స్ ఇచ్చిన క్యాచ్ పట్టడంతో జట్టు స్కోరు 184 పరుగుల వద్ద మూడో వికెట్ రూపంలో నిష్క్రమించాడు. మూడో వికెట్ కు రాస్ టేలర్ (20) తో కలిసి స్కోరు బోర్డుకు 46 పరుగులు జత చేశాడు. 38వ ఓవర్ వేసిన మిశ్రా.. ఓవర్ చివరి బంతికి నీషమ్ షాడ్ ఆడాడు. అయితే చాలా తక్కువ ఎత్తులో వస్తున్న బంతిని వైస్ కెప్టెన్ విరాట్ చక్కగా ఒడిసిపట్టడంతో నీషమ్ నిరాశగా వెనుదిరిగాడు. 38 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ 4 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. -
దారిమళ్లిన రాయితీ సొమ్ము
♦ రూ.10.71 కోట్లే ♦ ‘సాక్షి’ వార్తపై పరిశ్రమల శాఖ వివరణ సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక రాయితీల వ్యవహారంలో రూ.10.71 కోట్లు మాత్రమే పక్కదారి పట్టాయని, ఇందులో రూ.7.5 కోట్లు తిరిగి రాబట్టామని, ఇంకా రూ.3.66 కోట్లను రాబట్టాల్సి ఉందని పరిశ్రమల శాఖ తెలిపింది. ‘రావత్ అవుట్... మిశ్రాపై సీఎస్ సీరియస్’ పేరుతో ఈ నెల 7న ‘సాక్షి’లో వచ్చిన కథనంపై ఆ శాఖ స్పందించింది. పారిశ్రామిక రాయితీల కింద రూ.1,990.52 కోట్లు విడుదల చేసినట్టు తెలిపింది. ఇందులో కొన్ని తప్పుగా, మరికొన్ని ఇచ్చిన సంస్థలకే మళ్లీ ఇవ్వడం జరిగిందని పేర్కొంది. వీటిని తిరిగి తెప్పించే క్రమంలో జాయింట్ డెరైక్టర్ రామిరెడ్డి బ్యాంకులో తప్పుడు ఖాతా సృష్టించి.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని, ఈ వ్యవహారంలో మరో ముగ్గురి పాత్ర కూడా ఉందని, ఈ కారణంగానే వారిని సస్పెండ్ చేసినట్టు వెల్లడించింది. దాదాపు రూ.100 కోట్ల వరకూ రాయితీ సొమ్ము పక్కదారి పట్టాయన్న ఆరోపణల్లో నిజం లేదని పరిశ్రమలశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. -
కృష్ణా ట్రిబ్యునల్ కేసు.. కేంద్రంపై సుప్రీం ఆగ్రహం
ఢిల్లీ: కృష్ణా ట్రిబ్యునల్ అంశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కృష్ణా ట్రిబ్యునల్ పరిధిని నాలుగు రాష్ట్రాలకు విస్తరించాలా? లేదా కొత్త ట్రిబ్యునల్ వేయాలా ? అనే అంశంపై ఇంకా అఫిడవిట్ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేయకపోవడంతో ధర్మాసనం మండిపడింది. దాంతో ఈ అంశంపై ఎలాంటి సమాచారం లేదని కేంద్రం తరపు న్యాయవాది మిశ్రా సుప్రీంకోర్టుకు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం గురువారమే దీనిపై నిర్ణయం తీసుకుందంటూ ఆయన కోర్టుకు తెలిపారు. ఆ నిర్ణయానికి సంబంధించి పూర్తి వివరాలు కోర్టుకు అందించేందుకు తగిన సమయం కావాలని మిశ్రా సుప్రీంకోర్టును కోరారు. అయితే వాదనలు మొదలైనప్పుడు ఈ విషయాన్ని ఎందుకు చెప్పలేదంటూ కోర్టు ఆయనను ప్రశ్నించింది. కౌన్సిల్ నిర్వహించాల్సిన బాధ్యతలు అడ్వకేట్‌గా మీకు తెలియవా? అంటూ న్యాయవాది మిశ్రాపై సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ విషయం అనేది వెంటనే తెలపాలని కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో కృష్ణా ట్రిబ్యునల్ కేసు డిసెంబర్ 8 కి వాయిదా పడింది. -
అడవుల అభివృద్ధికి శ్రీకారం
నర్సాపూర్: రాష్ట్రంలో అడవులను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు అటవీశాఖ రాష్ర్ట ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ మిశ్రా వెల్లడించారు. ఆదివారం ఆయన పలువురు అటవీశాఖ అధికారులతో కలిసి నర్సాపూర్ అడవులలో పర్యటించిన అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడారు. రాష్ర్టంలో అడవులను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని, అందుకు అవసరమైన నిధులు ఉన్నాయని ఆయన తెలిపారు. అడవులను ఎలా అభివృద్ధి చేయాలో పరిశీలించేందుకే తాను నర్సాపూర్ అడవిలో పర్యటించినట్లు ఆయన తెలిపారు. అడవుల అభివృద్ధి ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని చెప్పారు. కాగా అటవీ శాఖ పరిధిలో 1250 చెరువులు,కుంటలు ఉన్నాయని, వాటిలో 20శాతం చెరువులు,కుంటలను ఎంపిక చేసి అభివృద్ధి చేయాలని నిర్ణయించామని, ఎంపిక చేసిన చెరువులు,కుంటల అభివృద్ధి పనులు వచ్చే మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేయాలని నిర్ణయించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్రంలోని అటవీశాఖ అధికారులను ఆయన ఆదేశించారు. నర్సాపూర్ అటవీ శాఖ రేంజ్ పరిధిలోని సహజసిద్ధమైన అడవుల్ని మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అందుకే నర్సాపూర్ అడవులను పరిశీలించేందుకు వచ్చానన్నారు. అడవిలో చాలా మేర పర్యటించామని చెప్పారు. హైదరాబాద్‌కు సమీపానే నర్సాపూర్ ఉండడం చెంతనే అడవి, చెరువుల్ని కల్గి ఉండడం వల్ల ఇక్కడ అభివృద్ధి చేస్తే ప్రశాంత వాతావరణం మరింత పెరుగుతుందన్నారు. నర్సాపూర్‌లో జింకల అభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు కేంద్రం నుంచి అనుమతులు పొందాల్సి ఉందని మిశ్రా చెప్పారు. ఆయన వెంట అడిషనల్ పీసీసీఎఫ్ బాబురావు, జిల్లా డీఎఫ్ఓ సోనిబాల, సబ్ డీఎఫ్ఓ రాజేందర్‌కుమార్, వైల్డ్ లైఫ్ డీఎఫ్ఓ శివ్వయ్య, ఏసీఎఫ్ రేఖాబాను పర్యటించారు. -
ఎయిమ్స్‌లో మరో కొత్త ఓపీడీ
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకమైన అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో మరో ఔట్ పేషెంట్ విభాగాన్ని ప్రారంభించనున్నారు. ప్రతిరోజు ఎయిమ్స్‌కు వైద్యం కోసం వచ్చే వేలాది మంది రోగులకు మరింత మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు కొత్తగా 400 పడకల మాతా శిశు సంరక్షణ కేంద్రా న్ని కూడా ఏర్పాటు చేయనున్నామని సంస్థ డెరైక్టర్ ఎంసీ మిశ్రా చెప్పారు. మరో 200 పడకలతో శస్త్ర చికిత్స కేంద్రం, 200 పడకల వృద్ధుల సంక్షేమ కేంద్రాన్ని కూడా ప్రారంభించనున్నామని తెలిపారు. కేంద్ర బడ్జెట్లో తమకు కేటాయించిన రూ.1,365 కోట్ల నిధులతో ఈ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని మిశ్రా పేర్కొన్నారు. రెఫరల్, రీసెర్చ్ ఆస్పత్రిగా 1956, సెప్టెంబర్ 25న ఎయిమ్స్‌ను స్థాపించారు. ఇక్కడ దాదాపు 30 లక్షల మంది రోగులు ఏటా వైద్య సేవలు పొందుతుంటారు. ఇక్కడున్న అధునాతన వైద్య సదుపాయాల కారణంగా ఇక్కడికి వచ్చే రోగుల సంఖ్య నానాటికీ పెరుగుతోందని మిశ్రా చెప్పారు. తమకు కేటాయించిన నిధులను ఎల్లప్పుడూ సంస్థ విస్తరణకు, సదుపాయాల మెరుగుదలకే ఉపయోగించామని అన్నారు. ఇప్పుడున్న ఔట్ పేషెంట్ విభాగం నిత్యం రద్దీగా ఉంటోందని, అందువల్ల మరిన్ని మెరుగైన సదుపాయాలతో కొత్త ఓపీడీని ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. ఎయిమ్స్‌కు వెనుకనున్న మసీదు ప్రాంతంలో కొత్తగా తొమ్మిది అంతస్తుల భవన నిర్మాణం జరుగుతోందని, అందులో అనేక కొత్త విభాగాలను ఏర్పాటు చేస్తామని అన్నారు. 200 పడకల శస్త్రచికిత్స కేంద్రం, 400 పడకల మాతా శిశు సంరక్షణ కేంద్రం, వృద్ధుల సంక్షేమ కేంద్రాలను వచ్చే ఒకటి రెండేళ్లలో నెలకొల్పుతామని మిశ్రా పేర్కొన్నారు. అత్యవసర విభాగంలో రద్దీ, అక్కడ ఉత్పన్నమవుతున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొనిమరో ఎమర్జెన్సీ విభాగాన్ని ఏర్పాటుచేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపామని, దీనికి త్వరలోనే ఆమోదం లభించగలదని అన్నారు. ఎయిమ్స్‌లో వివిధ కోర్సుల్లో శిక్షణ పొందుతున్న విద్యార్థినీ విద్యార్థుల కోసం చెరో రెండు హాస్టళ్ల నిర్మాణం పూర్తి కావచ్చిందని చెప్పారు. ఆస్పత్రిలో పరిశోధనల కోసం మౌలిక సదుపాయాలను మరింత ఉన్నతీకరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రస్తుతం ఎయిమ్స్‌లో సుమారు 500 మంది పీహెచ్డీ విద్యార్థులు వివిధ వైద్యపరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నారని మిశ్రా చెప్పారు. తమకు కేటాయించిన నిధులతోనే నర్సులు, ప్రొఫెసర్ల, కొత్త డాక్టర్ల శిక్షణనిస్తున్నామని అన్నారు. ట్రామా కేంద్రం విస్తరణ 2015 నాటికి పూర్తి కాగలదని అన్నారు. -
రైల్వే సిబ్బంది.. తప్పిదాలు చేయొద్దు
సేఫ్టీ సెమినార్లో రైల్వే డీఆర్ఎం మిశ్రా పాల్గొన్న కాజీపేట-బల్లార్షా, కొండపల్లి, భువనగిరి అధికారులు కాజీపేట రూరల్, న్యూస్‌లైన్ : రైల్వే సిబ్బంది విధి నిర్వహణలో ఎలాంటి తప్పిదాలు జరగుకుండా వ్యవహరించాలని సికింద్రాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ ఎస్కె.మిశ్రా సూచించారు. కాజీపేట జంక్షన్‌లోని సెమినార్ హాల్లో శుక్రవారం సికింద్రాబాద్ డివిజన్ స్థాయి సేప్టి సమావేశం జరిగింది. ఈ సెమినార్లో కాజీపేట-బల్లార్షా, కొండపెల్లి, భువనగిరి రైల్వే సెక్షన్లలో పనిచేస్తున్న రైల్వే అధికారులు, సూపర్వైజర్లు, రైల్వే గేట్మెన్లు. సీనియర్ సెక్షన్ ఇంజనీర్లు, పాయింట్స్ మెన్లు, స్టేషన్ మాస్టర్లు, డ్రైవర్లు, కీ మెన్లు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు హాజరయ్యూరు. ఈ సేఫ్టీ సెమినార్లో సికింద్రాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ ఎస్కె.మిశ్రా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ అన్ని విభాగాల వారు అప్రమత్తంగా ఉండి రైల్వే ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పలు సూచనలు చేశారు. సమావేశంలో సికింద్రాబాద్ సీనియర్ డీఎస్ఓ మోహన్రాం, డీఈఎన్ సెంట్రల్ నాయక్, డిప్యూటీ సీఎస్ఓ ప్రజాపతి, కాజీపేట ఆర్పీఎఫ్ అదనపు కమిషనర్ విజయ్‌కుమార్, కాజీపేట ఏరియా ఆఫీసర్ కుమార్, స్టేషన్ మేనేజర్ ఓదేలు, ఆర్పీఎఫ్ సీఐ సయ్యద్ ఇక్బాల్ అహ్మద్, జీఆర్పీ ఎస్సై శ్రీనివాస్ ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం డీఆర్ఎం మిశ్రా కాజీపేట జంక్షన్ నుంచి సికింద్రాబాద్ వరకు గూడ్స్ రైళ్లో ఫుట్ప్లేటింగ్ తనిఖీ చేస్తూ వెళ్లారని అధికారులు తెలిపారు. డీఆర్ఎంకు రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకుల వినతి కాజీపేటలో రైల్వే కార్మికులు ఎదుర్కొటున్న పలు సమస్యలపై మజ్దూర్ యూనియన్ ఇంజినీరింగ్ బ్రాంచ్ సెక్రటరీ బి. రామనాథం ఆధ్వర్యంలో నాయకులు డీఆర్ఎం మిశ్రాను కలిసి వినతిపత్రం అందజేశారు. రైల్వే క్వార్టర్స్‌లలో సౌకర్యాలు లేవని, నిరుపయోగంగా ఉన్న క్వార్టర్స్‌ను నేలమట్టం చేయకపోవడంతో అందులో అసాంఘిక కార్యాకలాపాలు సాగుతున్నాయ ని, రైల్వే ఆస్పత్రిలో మందుల కొరత ఉందని తదితర సమస్యలను వినతి పత్రంలో పేర్కొన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో నాయకులు ఎ.శ్రీనివాస్, పి.వేదప్రకాష్, ఎన్.సదానందం, నిజాముద్దీన్, జేపీ యాదవ్, ఎన్.కుమారస్వామి ఉన్నారు.