మిశ్రా మ్యాజిక్.. కివీస్ టాపార్డర్ ఔట్
రాంచీ: భారత్ తో జరుగుతున్న నాలుగో వన్డేలో న్యూజిలాండ్ టాపార్డర్ ఆటగాళ్లు పెవిలియన్ కు చేరారు. అమిత్ మిశ్రా స్పిన్ మాయాజాలంతో వరుస ఓవర్లలో ఇద్దరు కివీస్ బ్యాట్స్ మన్లను ఔట్ చేశాడు. తొలుత కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 41 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇన్నింగ్స్ 36వ ఓవర్లో టీమిండియా స్పిన్నర్ అమిత్ మిశ్రా రెండో బంతిని ఆడిన విలియమ్సన్ కీపర్ ధోనీ చేతికి చిక్కాడు. ధోనీ ఏ పొరపాటు లేకుండా విలియమ్స్ ఇచ్చిన క్యాచ్ పట్టడంతో జట్టు స్కోరు 184 పరుగుల వద్ద మూడో వికెట్ రూపంలో నిష్క్రమించాడు.
మూడో వికెట్ కు రాస్ టేలర్ (20) తో కలిసి స్కోరు బోర్డుకు 46 పరుగులు జత చేశాడు. 38వ ఓవర్ వేసిన మిశ్రా.. ఓవర్ చివరి బంతికి నీషమ్ షాడ్ ఆడాడు. అయితే చాలా తక్కువ ఎత్తులో వస్తున్న బంతిని వైస్ కెప్టెన్ విరాట్ చక్కగా ఒడిసిపట్టడంతో నీషమ్ నిరాశగా వెనుదిరిగాడు. 38 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ 4 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది.