పీకల్లోతు కష్టాల్లో టీమిండియా | Team India is in trouble to win odi | Sakshi
Sakshi News home page

పీకల్లోతు కష్టాల్లో టీమిండియా

Published Wed, Oct 26 2016 8:37 PM | Last Updated on Mon, Sep 4 2017 6:23 PM

పీకల్లోతు కష్టాల్లో టీమిండియా

పీకల్లోతు కష్టాల్లో టీమిండియా

రాంచీ: న్యూజిలాండ్ తో జరుగుతున్న నాలుగో వన్డేలో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో ఉంది. విరాట్ కోహ్లీ(45), రహానే(57) మాత్రమే రాణించగా రోహిత్ శర్మ(11), ఎంఎస్ ధోనీ(11), మనీశ్ పాండే(12) విఫలమయ్యారు. ఓ దశలో 25 ఓవర్లలో 122/2 గా ఉన్న భారత్ 34 ఓవర్లలో 159/6 గా పరిస్థితి మారిపోయింది. న్యూజిలాండ్ బౌలర్లు బౌలర్లు కోహ్లీ, రహానే మినహా ఏ ఇతర భారత ఆటగాళ్లను స్వేచ్ఛగా ఆడనివ్వలేదు. ఇప్పటికే సిరీస్ లో 2-1తో ఆధిక్యంలో ఉన్నామన్న ఉదాసీనత భారత ఆటగాళ్లలో కనిపించింది.

సౌథీ దెబ్బకొట్టాడు!
33వ ఓవర్లలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కివీస్ బౌలర్ టీమ్ సౌథీ ఆ ఓవర్ రెండో బంతికి మనీశ్ పాండేను, మూడో బంతికి ఆల్ రౌండర్ కేదార్ జాదవ్ ను డకౌట్ గా పెవిలియన్ బాట పట్టించాడు. ప్రస్తుతం 39 ముగిసేసరికి భారత్ 7 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. భారత్ విజయానికి 66 బంతుల్లో 82 పరుగులు చేయాలి. క్రీజులో అక్షర్ పటేల్(20), అమిత్ మిశ్రా(4) బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఏదైనా అద్భుతం జరిగితే తప్పా భారత్ కు విజయావకాశాలు లేవు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement