రాంచీలో ధోనీ అత్యధిక స్కోరెంతో తెలుసా?
రాంచీ: అసలే టెస్టు ఫార్మాట్ నుంచి రిటైరయిన మహేంద్రసింగ్ ధోనీని నేటి వన్డే మ్యాచ్ చూసేందుకు వేలాదిగా అభిమానులు స్డేడియానికి వచ్చారు. రెండో వికెట్ రూపంలో విరాట్ కోహ్లీ ఔటయ్యాక క్రీజులోకి ధోనీ వస్తున్న సమయంలో స్డేడియం అంతా ధోనీ పేరు మార్మోగిపోయింది. ఇంత జరుగుతున్నా మిస్టర్ కూల్ ధోనీ ఓ రికార్డును చేరాడు. అది మంచి రికార్డు మాత్రం కాదు. ఎందుకంటే 11 పరుగులు చేసి ఔటయిన ధోనీ ఇక్కడి రాంచీ స్డేడియంలో తన వ్యక్తిగత అత్యధిక స్కోరు నమోదు చేశాడు.
వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. గతంలో ఇక్కడి స్డేడియంలో ధోనీ అత్యధిక స్కోరు కేవలం 10 పరుగులు మాత్రమే. క్రీజులో కుదురుకోవడానికి ఎంతో ఇబ్బంది పడిన ధోనీ.. చివరికి 31 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేసి కివీస్ బౌలర్ నీషమ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. ధోనీ ఔట్ కాగానే స్డేడియం అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. ఎంతో బాధతో, తీవ్ర అసహనంతో ధోనీ పెవిలియన్ బాట పట్టాడు. అప్పటికి భారత్ స్కోరు 29.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 135 పరుగులు.