ranchi ODI
-
దక్షిణాఫ్రికాతో రెండో వన్డే.. రుత్‌రాజ్‌కు నో ఛాన్స్! పటిదార్ అరంగేట్రం!
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ను టీమిండియా ఓటమితో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రోటీస్‌తో తొలి వన్డేలో పరాజయం పాలైన భారత్.. ఇప్పుడు రెండో వన్డేలో తలపడేందకు సిద్దమైంది. రాంఛీ వేదికగా ఆక్టోబర్9 భారత్-దక్షిణాఫ్రికా మధ్య రెండో వన్డే జరగనుంది. ఇక ఈ మ్యాచ్‌లో ఏలగైనా విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలని ధావన్ సేన భావిస్తోంది. మరోవైపు దక్షిణాఫ్రికా మాత్రం ఈ మ్యాచ్‌లో కూడా తొలి వన్డే జోరును కొనసాగించి సిరీస్ కైవసం చేసుకోవాలి అని అనుకుంటుంది. ప్రస్తుతం మూడు సిరీస్‌లో ప్రోటీస్ జట్టు 1-0తో ముందంజలో ఉంది. ఇక ఇప్పటికే రాంఛీకి చేరుకున్న టీమిండియా ప్రాక్టీస్ మొదలు పెట్టింది. ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో ఓ మార్పుతో భారత్ బరిలోకి దిగే అవకాశం ఉంది. తొలి వన్డేలో విఫలమైన రుత్‌రాజ్ గైక్వాడ్ స్థానంలో యువ ఆటగాడు రజిత్ పటిదార్ అంతర్జాతీయ అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది. లక్నో వేదికగా జరిగిన మొదటి వన్డేలో 42 బంతులు ఎదర్కొన్న రుత్‌రాజ్ కేవలం 19 పరుగులు మాత్రమే చేసి నిరాశ పరిచాడు. మరో వైపు దక్షిణాఫ్రికా మాత్రం తొలి వన్డేలో ఆడిన జట్టుతోనే రెండో వన్డేలో కూడా బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. తుది జట్లు(అంచనా) టీమిండియా: శిఖర్ ధావన్(కెప్టెన్), శుభమన్ గిల్, రజిత్ పటిదార్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సంజు శాంసన్(వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, అవేష్ ఖాన్ దక్షిణాఫ్రికా: జన్నెమన్ మలన్, క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), టెంబా బావుమా(కెప్టెన్), ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎన్గిడి, తబ్రైజ్ షమ్సీ చదవండి: T20 World Cup 2022: టీ20 క్రికెట్ చరిత్రలో.. ఆఫ్గానిస్తాన్- ఆస్ట్రేలియా తొలి మ్యాచ్ -
ఇక చాలు.. మళ్లీ చూడదల్చుకోలేదు : కోహ్లి
రాంచీ : తక్కువ వ్యవధిలో వికెట్లు కోల్పోవడం మళ్లీ చూడదల్చుకోలేదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. శుక్రవారం రాంచీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత్ 32 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కోహ్లి శతకంతో అదరగొట్టినా అది భారత విజయానికి సరిపోలేదు. మ్యాచ్ అనంతరం కోహ్లి మాట్లాడుతూ.. తమ అంచనాలు తప్పడం వల్లే ఓటమి చవిచూశామని, తమ కన్నా అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆతిథ్య ఆటగాళ్లు విజయానికి అర్హులని వ్యాఖ్యానించాడు. ‘రాత్రి 7.30 సమయంలో మంచు ప్రభావం చూపిస్తుందని మాకు ఎవరో చెప్పారు. అందుకే ముందు బౌలింగ్ ఎంచుకున్నా. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఆరంభంలోనే ఇలా మేం వికెట్లు కోల్పోలేదు. మూడేసి వికెట్లు తక్కువ వ్యవధిలో పడిపోవడం సిరీస్‌లో రెండు సార్లు జరిగింది. ఇకపై ఇలా కుప్పకూలిపోవడాన్ని చూడదల్చుకోలేదు. ఈ సమస్యను అధిగమించడంపై దృష్టి సారిస్తాం. తర్వాతి మ్యాచ్‌లకు మార్పులు ఖాయం. చిన్న భాగస్వామ్యాలు నెలకొల్పడంపై కసరత్తులు చేస్తాం. నేను ఆడిన చక్కటి ఇన్నింగ్స్‌లలో ఇది కూడా ఒకటి. మూడు వికెట్ల అనంతరం క్రీజులోకి వచ్చినప్పుడు ఒక్కటే అనుకున్నా.. నేను నా ఆటను ఆడుతాను. తర్వాత ఏం జరుగుతుందనేది నాకు అనవసరం. ఇదే రీతిలో షాట్స్ ఆడాను. కానీ నేను ఔటవ్వడం నిరాశను మిగిల్చింది. మేం గెలుస్తామని అనుకున్నా. కానీ ఆసీస్ ఆటగాళ్లు మా కన్నా అద్భుత ప్రదర్శన కనబర్చారు. ఆడమ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. వారు ఈ విజయానికి అర్హులు.’ కోహ్లి వ్యాఖ్యానించాడు. ఇక కోహ్లి వ్యాఖ్యలను బట్టి జట్టులో మార్పులు ఖాయంగా కనిపిస్తోంది. గత మూడు వన్డేల్లో నిరాశపర్చిన శిఖర్ ధావన్, అంబటి రాయుడులలో ఒక్కరిని పక్కకు పెట్టే అవకాశం ఉంది. ఇక చివరి రెండు వన్డేలకు ధోని విశ్రాంతి తీసుకోవడంతో పంత్ బెర్త్ ఖాయమైంది. కేఎల్ రాహుల్‌కు అవకాశం దక్కనుంది. బౌలింగ్ విభాగంలో షమీ స్థానంలో భువనేశ్వర్ తుది జట్టులోకి రానున్నాడు. -
నాలుగో వన్డేలో భారత్ ఓటమి
-
నాలుగో వన్డేలో భారత్ ఓటమి
రాంచీ: ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన నాలుగో వన్డేలో టీమిండియా పరాజయం పాలైంది. ఈ మ్యాచ్ నెగ్గి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావించిన భారత్‌కు న్యూజిలాండ్ అడ్డుకట్టవేసింది. దీంతో ఐదు వన్డేల సిరీస్ 2-2తో రసవత్తరంగా మారింది. న్యూజిలాండ్ విధించిన 261 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. విరాట్ కోహ్లీ(45), రహానే(57), అక్షర్ పటేల్(38) మాత్రమే రాణించగా రోహిత్ శర్మ(11), ఎంఎస్ ధోనీ(11), మనీశ్ పాండే(12) విఫలమయ్యారు. ఓ దశలో 25 ఓవర్లలో 122/2 గా ఉన్న భారత్ వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో.. 48.2 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్ అయింది. చివర్లో దవల్ కులకర్ణి(25) పోరాడినప్పటికీ ఫలితం దక్కలేదు. న్యూజిలాండ్ బౌలర్లలో సౌథీకి 3, బోల్ట్, నిషామ్లకు రెండేసి చొప్పున వికెట్లు దక్కాయి. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 260 పరుగులు చేసింది. కివీస్ ఓపెనర్లు జట్టుకు శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్ కు 15.3 ఓవర్లలో 96 పరుగులు చేసిన తర్వాత అక్షర్ పటేల్ బౌలింగ్ లో రహానేకు క్యాచ్ ఇచ్చి లాథమ్(39) ఔటయ్యాడు. మరో ఓపెనర్ గప్టిల్ హాఫ్ సెంచరీ (72, 11 ఫోర్లు)తో చెలరేగగా.. కెప్టెన్ విలియమ్సన్ 41 పరుగులు చేశాడు. 35 ఓవర్లలో 184/2తో పటిస్ట స్థితిలో ఉన్న కివీస్ ను టీమిండియా స్పిన్నర్ అమిత్ మిశ్రా దెబ్బతీశాడు. రెండు వరుస ఓవర్లలో విలియమ్సన్, నీషమ్(6)ను ఔట్ చేసి పరుగుల వేగాన్ని తగ్గించాడు. ఆ తర్వాత రాస్ టేలర్ (34) పరవాలేదనిపించాడు. భారత బౌలర్లలో అమిత్ మిశ్రా రెండు వికెట్లు పడగొట్టాడు. ఉమేశ్, కులకర్ణి, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ తలో వికెట్ తీశారు. చివరి వన్డే శనివారం విశాఖలో జరగనుంది. -
పీకల్లోతు కష్టాల్లో టీమిండియా
రాంచీ: న్యూజిలాండ్ తో జరుగుతున్న నాలుగో వన్డేలో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో ఉంది. విరాట్ కోహ్లీ(45), రహానే(57) మాత్రమే రాణించగా రోహిత్ శర్మ(11), ఎంఎస్ ధోనీ(11), మనీశ్ పాండే(12) విఫలమయ్యారు. ఓ దశలో 25 ఓవర్లలో 122/2 గా ఉన్న భారత్ 34 ఓవర్లలో 159/6 గా పరిస్థితి మారిపోయింది. న్యూజిలాండ్ బౌలర్లు బౌలర్లు కోహ్లీ, రహానే మినహా ఏ ఇతర భారత ఆటగాళ్లను స్వేచ్ఛగా ఆడనివ్వలేదు. ఇప్పటికే సిరీస్ లో 2-1తో ఆధిక్యంలో ఉన్నామన్న ఉదాసీనత భారత ఆటగాళ్లలో కనిపించింది. సౌథీ దెబ్బకొట్టాడు! 33వ ఓవర్లలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కివీస్ బౌలర్ టీమ్ సౌథీ ఆ ఓవర్ రెండో బంతికి మనీశ్ పాండేను, మూడో బంతికి ఆల్ రౌండర్ కేదార్ జాదవ్ ను డకౌట్ గా పెవిలియన్ బాట పట్టించాడు. ప్రస్తుతం 39 ముగిసేసరికి భారత్ 7 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. భారత్ విజయానికి 66 బంతుల్లో 82 పరుగులు చేయాలి. క్రీజులో అక్షర్ పటేల్(20), అమిత్ మిశ్రా(4) బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఏదైనా అద్భుతం జరిగితే తప్పా భారత్ కు విజయావకాశాలు లేవు. -
రాంచీలో ధోనీ అత్యధిక స్కోరెంతో తెలుసా?
రాంచీ: అసలే టెస్టు ఫార్మాట్ నుంచి రిటైరయిన మహేంద్రసింగ్ ధోనీని నేటి వన్డే మ్యాచ్ చూసేందుకు వేలాదిగా అభిమానులు స్డేడియానికి వచ్చారు. రెండో వికెట్ రూపంలో విరాట్ కోహ్లీ ఔటయ్యాక క్రీజులోకి ధోనీ వస్తున్న సమయంలో స్డేడియం అంతా ధోనీ పేరు మార్మోగిపోయింది. ఇంత జరుగుతున్నా మిస్టర్ కూల్ ధోనీ ఓ రికార్డును చేరాడు. అది మంచి రికార్డు మాత్రం కాదు. ఎందుకంటే 11 పరుగులు చేసి ఔటయిన ధోనీ ఇక్కడి రాంచీ స్డేడియంలో తన వ్యక్తిగత అత్యధిక స్కోరు నమోదు చేశాడు. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. గతంలో ఇక్కడి స్డేడియంలో ధోనీ అత్యధిక స్కోరు కేవలం 10 పరుగులు మాత్రమే. క్రీజులో కుదురుకోవడానికి ఎంతో ఇబ్బంది పడిన ధోనీ.. చివరికి 31 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేసి కివీస్ బౌలర్ నీషమ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. ధోనీ ఔట్ కాగానే స్డేడియం అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. ఎంతో బాధతో, తీవ్ర అసహనంతో ధోనీ పెవిలియన్ బాట పట్టాడు. అప్పటికి భారత్ స్కోరు 29.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 135 పరుగులు. -
విరాట్ కోహ్లీ తొలిసారి ఔటయ్యాడు!
రాంచీ: టీమిండియా స్టార్ బ్యాట్స్ మన్, పరిమిత ఓవర్ల క్రికెట్ లో వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలిసారిగా ఔటయ్యాడు. అదేంటి.. ఇప్పటివరకూ ఎన్నో మ్యాచ్ లలో పెవిలియన్ బాటపట్టాడు కదా.! ఇప్పుడు తొలిసారి ఔట్ కావడం ఏంటనేకదా అందరి సందేహం. ఇక్కడి స్డేడియంలో న్యూజిలాండ్ తో జరుగుతున్న నాలుగో వన్డేలో కోహ్లీ(45) సోధీ బౌలింగ్ లో ఔటయ్యాడు. అయితే లక్కీ స్డేడియం రాంచీలో ఆడిన రెండు మ్యాచులలోనూ కోహ్లీ నాటౌట్ గా నిలిచిన విషయం తెలిసిందే. గతంలో 2012-13లో ఇంగ్లండ్ పై 77 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. మరోసారి ఇదే స్డేడియంలో 2014-15లో శ్రీలంకపై కోహ్లీ అజేయ సెంచరీ(139) సాధించాడు. అయితే ఈ రెండు మ్యాచ్ లలో ఛేదనలో భాగంగా బ్యాటింగ్ కు దిగిన విరాట్.. చివరివరకూ నిలిచి జట్టును గెలిపించాడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కివీస్ తో బుధవారం నాటి నాలుగో వన్డేలో హాఫ్ సెంచరీకి చేరువవుతున్న దశలో సోధీ బౌలింగ్ లో కీపర్ వాట్లింగ్ కు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్ గా వెనుదిరిగాడు. -
రోహిత్.. ఇలా అయితే ఎలా?
రాంచీ: న్యూజిలాండ్ తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ మళ్లీ విఫలమయ్యాడు. రాంచీలో జరుగుతున్న నాలుగో వన్డేలో రోహిత్ శర్మ కేవలం 11 పరుగులు చేసి జట్టు స్కోరు 19 పరుగుల వద్ద తొలి వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ఈ వన్డేలో తాను ఎదుర్కొన్న తొలి 9 తొమ్మిది బంతుల్లో ఒకే పరుగు చేసిన రోహిత్ చివరికి 19 బంతుల్లో 11 పరుగులు చేసి ఔటయ్యాడు. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. టీమిండియాకు 261 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. బౌల్ట్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో రెండు ఫోర్లతో టచ్ లోకి వచ్చినట్లు కనిపించిన రోహిత్ ఆ మరుసటి ఓవర్లో సౌథీ బౌలింగ్ లో తొలి బంతికే కీపర్ వాట్లింగ్ కు క్యాచ్ ఇచ్చి తన వైఫల్యాన్ని కొనసాగించాడు. సిరీస్ లో ఓవరాల్ గా చూస్తే రోహిత్ శర్మ 14, 15, 13, 11 చేసి విఫలమయ్యాడు. -
టీమిండియా టార్గెట్ 261
రాంచీ: భారత్ తో ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా జరుగుతున్న నాలుగో వన్డేలో న్యూజిలాండ్ 261 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 260 పరుగులు చేసింది. కివీస్ ఓపెనర్లు జట్టుకు శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్ కు 15.3 ఓవర్లలో 96 పరుగులు చేసిన తర్వాత అక్షర్ పటేల్ బౌలింగ్ లో రహానేకు క్యాచ్ ఇచ్చి లాథమ్(39) ఔటయ్యాడు. మరో ఓపెనర్ గప్టిల్ ఈ వన్డేలో ఫామ్ లోకొచ్చాడు. గప్టిల్ హాఫ్ సెంచరీ (72, 11 ఫోర్లు)తో పాటు కెప్టెన్ విలియమ్సన్ 41 పరుగులు చేశాడు. 35 ఓవర్లలో 184/2తో పటిస్ట స్థితిలో ఉన్న కివీస్ ను టీమిండియా స్పిన్నర్ అమిత్ మిశ్రా దెబ్బతీశాడు. రెండు వరుస ఓవర్లలో విలియమ్సన్, నీషమ్(6)ను ఔట్ చేసి పరుగుల వేగాన్ని తగ్గించాడు. ఆ తర్వాత రాస్ టేలర్ (34) పరవాలేదనిపించాడు. జట్టుస్కోరు 223 పరుగుల వద్ద ఆరో వికెట్ గా వెనుదిరిగాడు. చివర్లో శాంట్నర్ 17 పరుగులు చేసి జట్టు స్కోరు పెంచేయత్నం చేశాడు. వరుస విరామాలలో వికెట్లు కోల్పోవడంతో ఓ దశలో 300 పరుగులు చేస్తుందనుకున్న కివీస్ కేవలం 260 పరుగులు చేయగలిగింది. జస్ప్రిత్ బుమ్రా స్థానంలో జట్టులోకొచ్చిన కులకర్ణి ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. 7 ఓవర్లలో 59 పరుగులు ఇచ్చాడు. భారత బౌలర్లలో అమిత్ మిశ్రా రెండు వికెట్లు పడగొట్టాడు. ఉమేశ్, కులకర్ణి, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ తలో వికెట్ తీశారు. -
మిశ్రా మ్యాజిక్.. కివీస్ టాపార్డర్ ఔట్
రాంచీ: భారత్ తో జరుగుతున్న నాలుగో వన్డేలో న్యూజిలాండ్ టాపార్డర్ ఆటగాళ్లు పెవిలియన్ కు చేరారు. అమిత్ మిశ్రా స్పిన్ మాయాజాలంతో వరుస ఓవర్లలో ఇద్దరు కివీస్ బ్యాట్స్ మన్లను ఔట్ చేశాడు. తొలుత కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 41 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇన్నింగ్స్ 36వ ఓవర్లో టీమిండియా స్పిన్నర్ అమిత్ మిశ్రా రెండో బంతిని ఆడిన విలియమ్సన్ కీపర్ ధోనీ చేతికి చిక్కాడు. ధోనీ ఏ పొరపాటు లేకుండా విలియమ్స్ ఇచ్చిన క్యాచ్ పట్టడంతో జట్టు స్కోరు 184 పరుగుల వద్ద మూడో వికెట్ రూపంలో నిష్క్రమించాడు. మూడో వికెట్ కు రాస్ టేలర్ (20) తో కలిసి స్కోరు బోర్డుకు 46 పరుగులు జత చేశాడు. 38వ ఓవర్ వేసిన మిశ్రా.. ఓవర్ చివరి బంతికి నీషమ్ షాడ్ ఆడాడు. అయితే చాలా తక్కువ ఎత్తులో వస్తున్న బంతిని వైస్ కెప్టెన్ విరాట్ చక్కగా ఒడిసిపట్టడంతో నీషమ్ నిరాశగా వెనుదిరిగాడు. 38 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ 4 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. -
టీమిండియాకు బ్రేకిచ్చిన పాండ్యా
రాంచీ: భారత్ తో జరుగుతున్న నాలుగో వన్డేలో న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ ఫామ్ లోకి వచ్చాడు. భారత్ తో ప్రస్తుతం జరుగుతన్న పేలవ ప్రదర్శనతో తీవ్ర విమర్శలకు గురవుతున్న గప్టిల్ ఈ మ్యాచ్ లో కివీస్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో వన్డేలో కివీస్ ఓపెనర్ గప్టిల్ హాఫ్ సెంచరీ(72, 11 ఫోర్లు) చేశాడు. గప్టిల్ వన్డే కెరీర్ లో ఇది 31వ హాఫ్ సెంచరీ. 25 ఓవర్లు ముగిసేసరికి కివీస్ వికెట్ నష్టపోయి 138 పరుగులు చేసి పటిస్ట స్థితిలో ఉన్న కివీస్ ను పాండ్యా దెబ్బతీశాడు. ఆ మరుసటి ఓవర్ తొలి బంతికి ధోనీకి క్యాచ్ ఇచ్చి గప్టిల్ రెండో వికెట్ రూపంలో నిష్క్రమించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తున్న కివీస్ కు ఓపెనర్లు గప్టిల్, లాథమ్ అద్బుత ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్ కు 15.3 ఓవర్లలో 96 పరుగులు చేసిన తర్వాత అక్షర్ పటేల్ బౌలింగ్ లో రహానేకు క్యాచ్ ఇచ్చి లాథమ్(39) ఔటయ్యాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ (16 నాటౌట్) తో, రాస్ టేలర్(0) క్రీజులో ఉన్నాడు. తొలి 10 ఓవర్లలో 80 పరుగులు సాధించిన కివీస్, తర్వాతి 10 ఓవర్లలో వికెట్ నష్టపోయి 36 పరుగులు మాత్రమే చేయగలిగింది. -
రాంచీ వన్డే: కివీస్ ఓపెనర్ల జోరు
రాంచీ: భారత్ తో జరుగుతున్న నాలుగో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ పరుగుల వేట మొదలుపెట్టింది. 11 ఓవర్లు ముగిసేసరికి కివీస్ వికెట్లేమీ కోల్పోకుండా 82 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ ను 2-2తో సమయం చేయాలన్న లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 7.5 రన్ రేట్ తో పరుగులు సాధిస్తోంది. కివీస్ ఓపెనర్ గప్టిల్ 8 ఫోర్ల సాయంతో 43 పరుగులు చేయగా, మరో ఓపెనర్ లాథమ్ 4 ఫోర్లతో 31 పరుగులు చేశాడు. భారత బౌలర్లు పదే పదే వైడ్లు వేస్తూ కివీస్ ఓపెనర్ల ఏకాగ్రతను దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదు. బుమ్రాను పక్కనబెట్టి ధవల్ కులకర్ణిని జట్టులోకి తీసుకున్నారు. భారత బౌలర్లు ఉమేశ్, కులకర్ణి వికెట్ల కోసం శ్రమిస్తున్నారు. ధోనీ స్పిన్నర్లను రంగంలోకి దించాడు. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. సోధి, డెవ్ చిచ్, వాల్టింగ్ జట్టులోకి వచ్చారు. రోంచి, హెన్రీ, జిమ్మీ నిషామ్ ఈ మ్యాచ్ నుంచి తప్పించారు. -
ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి కివీస్
రాంచీ: భారత్ తో జరుగుతున్న నాలుగో వన్డేలో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నట్టు న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ చెప్పాడు. సోధి, డెవ్ చిచ్, వాల్టింగ్ జట్టులోకి వచ్చారు. రోంచి, హెన్రీ, జిమ్మీ నిషామ్ ఈ మ్యాచ్ లో ఆడడం లేదు. టాస్ గెలిస్తే ఫీల్డింగ్ ఎంచుకోవాలనుకున్నామని టీమిండియా కెప్టెన్ ఎంఎస్ ధోని చెప్పాడు. తమ జట్టులో ఒక మార్పు చోటుచేసుకుందని చెప్పాడు. బుమ్రా స్థానంలో ధవళ్ కులకర్ణిని ఆడిస్తున్నట్టు వెల్లడించాడు. తాను నాలుగో స్థానంలో బ్యాటింగ్ దిగితే ఎక్కుసేపు ఆడడానికి అవకాశముంటుందని అన్నాడు. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ దక్కించుకోవాలని ధోని సేన పట్టుదలతో ఉంది. సిరీస్ ను సమం చేయాలన్న లక్ష్యంతో కివీస్ టీమ్ బరిలోకి దిగుతోంది. -
వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన భారత్
రాంచీ: శ్రీలంకతో జరిగిన ఐదు వన్డేల సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. 5-0 తేడాతో సిరీస్ కైవశం చేసుకుంది. ఆదివారం జరిగిన చివరి వన్డేలో భారత్ 3 వికెట్లతో శ్రీలంకపై విజయం సాధించింది. లంక నిర్దేశించిన 287 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా మరో 8 బంతులు మిగులుండగానే చేరుకుంది. 48.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 288 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లి అజేయ సెంచరీతో జట్టును గెలిపించాడు. 126 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 139 పరుగులు చేశాడు. అంబటి రాయుడు అర్థసెంచరీ(59)తో రాణించాడు. జాదవ్ 20 ఊతప్ప 19, బిన్నీ 12, అక్షర్ పటేల్ 12 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో మెండిస్ 4 వికెట్లు పడగొట్టాడు. మాథ్యూస్ 2 వికెట్లు తీశాడు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది. లంక కెప్టెన్ మాథ్యూస్ సెంచరీ(139)తో నాటౌట్ గా నిలిచాడు. -
విరాట్ కోహ్లి 21వ సెంచరీ
రాంచీ: శ్రీలంకతో జరుగుతున్న ఐదో వన్డేలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి సెంచరీ సాధించాడు. 107 బంతుల్లో 10 ఫోర్లతో సెంచరీ సాధించాడు. వన్డేల్లో కోహ్లికి ఇది 21 సెంచరీ. 146 మ్యాచుల్లోనే అతడీ ఘనత సాధించాడు. తాజా సెంచరీతో వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో కోహ్లి ఐదో స్థానంలో ఉన్నాడు. 21 సెంచరీతో హెర్షలీ గిబ్స్(దక్షిణాఫ్రికా), క్రిస్ గేల్(గేల్) సరసన కోహ్లి చేరాడు.