
ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి కివీస్
రాంచీ: భారత్ తో జరుగుతున్న నాలుగో వన్డేలో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నట్టు న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ చెప్పాడు. సోధి, డెవ్ చిచ్, వాల్టింగ్ జట్టులోకి వచ్చారు. రోంచి, హెన్రీ, జిమ్మీ నిషామ్ ఈ మ్యాచ్ లో ఆడడం లేదు.
టాస్ గెలిస్తే ఫీల్డింగ్ ఎంచుకోవాలనుకున్నామని టీమిండియా కెప్టెన్ ఎంఎస్ ధోని చెప్పాడు. తమ జట్టులో ఒక మార్పు చోటుచేసుకుందని చెప్పాడు. బుమ్రా స్థానంలో ధవళ్ కులకర్ణిని ఆడిస్తున్నట్టు వెల్లడించాడు. తాను నాలుగో స్థానంలో బ్యాటింగ్ దిగితే ఎక్కుసేపు ఆడడానికి అవకాశముంటుందని అన్నాడు. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ దక్కించుకోవాలని ధోని సేన పట్టుదలతో ఉంది. సిరీస్ ను సమం చేయాలన్న లక్ష్యంతో కివీస్ టీమ్ బరిలోకి దిగుతోంది.