రోహిత్.. ఇలా అయితే ఎలా?
రాంచీ: న్యూజిలాండ్ తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ మళ్లీ విఫలమయ్యాడు. రాంచీలో జరుగుతున్న నాలుగో వన్డేలో రోహిత్ శర్మ కేవలం 11 పరుగులు చేసి జట్టు స్కోరు 19 పరుగుల వద్ద తొలి వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ఈ వన్డేలో తాను ఎదుర్కొన్న తొలి 9 తొమ్మిది బంతుల్లో ఒకే పరుగు చేసిన రోహిత్ చివరికి 19 బంతుల్లో 11 పరుగులు చేసి ఔటయ్యాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. టీమిండియాకు 261 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. బౌల్ట్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో రెండు ఫోర్లతో టచ్ లోకి వచ్చినట్లు కనిపించిన రోహిత్ ఆ మరుసటి ఓవర్లో సౌథీ బౌలింగ్ లో తొలి బంతికే కీపర్ వాట్లింగ్ కు క్యాచ్ ఇచ్చి తన వైఫల్యాన్ని కొనసాగించాడు. సిరీస్ లో ఓవరాల్ గా చూస్తే రోహిత్ శర్మ 14, 15, 13, 11 చేసి విఫలమయ్యాడు.