
విరాట్ కోహ్లి 21వ సెంచరీ
రాంచీ: శ్రీలంకతో జరుగుతున్న ఐదో వన్డేలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి సెంచరీ సాధించాడు. 107 బంతుల్లో 10 ఫోర్లతో సెంచరీ సాధించాడు. వన్డేల్లో కోహ్లికి ఇది 21 సెంచరీ.
146 మ్యాచుల్లోనే అతడీ ఘనత సాధించాడు. తాజా సెంచరీతో వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో కోహ్లి ఐదో స్థానంలో ఉన్నాడు. 21 సెంచరీతో హెర్షలీ గిబ్స్(దక్షిణాఫ్రికా), క్రిస్ గేల్(గేల్) సరసన కోహ్లి చేరాడు.