వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన భారత్ | India beat Sri Lanka by 3 wickets in 5th ODI | Sakshi
Sakshi News home page

వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన భారత్

Published Sun, Nov 16 2014 9:29 PM | Last Updated on Sat, Sep 2 2017 4:35 PM

వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన భారత్

వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన భారత్

రాంచీ: శ్రీలంకతో జరిగిన ఐదు వన్డేల సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. 5-0 తేడాతో సిరీస్ కైవశం చేసుకుంది. ఆదివారం జరిగిన చివరి వన్డేలో భారత్ 3 వికెట్లతో శ్రీలంకపై విజయం సాధించింది. లంక నిర్దేశించిన 287 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా మరో 8 బంతులు మిగులుండగానే చేరుకుంది. 48.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 288 పరుగులు చేసింది.

కెప్టెన్ విరాట్ కోహ్లి అజేయ సెంచరీతో జట్టును గెలిపించాడు. 126 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 139 పరుగులు చేశాడు. అంబటి రాయుడు అర్థసెంచరీ(59)తో రాణించాడు. జాదవ్ 20 ఊతప్ప 19, బిన్నీ 12, అక్షర్ పటేల్ 12 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో మెండిస్ 4 వికెట్లు పడగొట్టాడు. మాథ్యూస్ 2 వికెట్లు తీశాడు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది. లంక కెప్టెన్ మాథ్యూస్ సెంచరీ(139)తో నాటౌట్ గా నిలిచాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement