
రాంచీ వన్డే: కివీస్ ఓపెనర్ల జోరు
రాంచీ: భారత్ తో జరుగుతున్న నాలుగో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ పరుగుల వేట మొదలుపెట్టింది. 11 ఓవర్లు ముగిసేసరికి కివీస్ వికెట్లేమీ కోల్పోకుండా 82 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ ను 2-2తో సమయం చేయాలన్న లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 7.5 రన్ రేట్ తో పరుగులు సాధిస్తోంది. కివీస్ ఓపెనర్ గప్టిల్ 8 ఫోర్ల సాయంతో 43 పరుగులు చేయగా, మరో ఓపెనర్ లాథమ్ 4 ఫోర్లతో 31 పరుగులు చేశాడు. భారత బౌలర్లు పదే పదే వైడ్లు వేస్తూ కివీస్ ఓపెనర్ల ఏకాగ్రతను దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదు.
బుమ్రాను పక్కనబెట్టి ధవల్ కులకర్ణిని జట్టులోకి తీసుకున్నారు. భారత బౌలర్లు ఉమేశ్, కులకర్ణి వికెట్ల కోసం శ్రమిస్తున్నారు. ధోనీ స్పిన్నర్లను రంగంలోకి దించాడు. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. సోధి, డెవ్ చిచ్, వాల్టింగ్ జట్టులోకి వచ్చారు. రోంచి, హెన్రీ, జిమ్మీ నిషామ్ ఈ మ్యాచ్ నుంచి తప్పించారు.