Williamson
-
బెంగళూరు బోల్తా.. ఎస్ఆర్హెచ్కు వరుసగా ఐదో విజయం
ఐదేళ్ల క్రితం 2017 ఏప్రిల్ 23న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ చరిత్రలో అత్యల్ప స్కోరు (49)ను నమోదు చేసింది. ఇప్పుడు సరిగ్గా అదే రోజు దాదాపు అదే ప్రదర్శనను కనబరుస్తూ తమ రెండో అత్యల్ప స్కోరు సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు ఒకరితో మరొకరు పోటీ పడి ఆర్సీబీని 68 పరుగులకే కుప్పకూల్చారు. ఒక్క బ్యాటర్ కూడా పట్టుదలగా నిలవలేకపోగా, ముగ్గురు డకౌటయ్యారు. ఆ తర్వాత సునాయాస లక్ష్యాన్ని సన్‌రైజర్స్ ఆడుతూ పాడుతూ ఛేదించి లీగ్‌లో తమ స్థానాన్ని మరింత పటిష్ట పర్చుకుంది. ముంబై: ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జోరు కొనసాగుతోంది. అద్భుత ప్రదర్శనతో సత్తా చాటిన హైదరాబాద్ లీగ్‌లో వరుసగా ఐదో విజయాన్ని అందుకుంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 9 వికెట్ల తేడాతో బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌పై ఘన విజయం సాధించింది. వరుసగా ఏడో మ్యాచ్‌లోనూ టాస్ గెలిచిన విలియమ్సన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 16.1 ఓవర్లలో 68 పరుగులకే ఆలౌటైంది. ] సుయాశ్ (15), మ్యాక్స్‌వెల్ (12) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మార్కో జాన్సెన్ (3/25), నటరాజన్ (3/10) ఆర్సీబీని దెబ్బ కొట్టారు. అనంతరం హైదరాబాద్ 8 ఓవర్లలో వికెట్ నష్టానికి 72 పరుగులు చేసి గెలిచింది. అభిషేక్ శర్మ (28 బంతుల్లో 47; 8 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడటం తో మరో 12 ఓవర్లు మిగిలి ఉండగానే గెలిచిన సన్‌రైజర్స్ భారీగా రన్‌రేట్‌ను మెరుగుపర్చుకుంది. టపటపా... తొలి ఓవర్లో 5 పరుగులు చేసిన బెంగళూరు పతనం రెండో ఓవర్ నుంచి మొదలైంది. ఈ ఓవర్ వేసిన జాన్సెన్ రెండో బంతికి డుప్లెసిస్ (5) స్టంప్స్ ఎగరగొట్టగా, తర్వాతి బంతికే విరాట్ కోహ్లి (0) వెనుదిరిగాడు. కోహ్లి వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ‘గోల్డెన్ డక్’ నమోదు చేయడం విశేషం. అదే ఓవర్ చివరి బంతికి అనూజ్ రావత్ (0) కూడా అవుటయ్యాడు. పవర్‌ప్లే ముగిసేసరికి మ్యాక్స్‌వెల్ (12) కూడా పెవిలియన్ చేరగా, స్కోరు 25/4 వద్ద నిలిచింది. సుయాశ్, ఈ సీజన్లో జట్టు తరఫున కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన కార్తీక్ (0), షహబాజ్ (7) కూడా 7 బంతుల వ్యవధిలో అవుట్ కావడంతో బెంగళూరు కోలుకునే అవకాశం లేకపోయింది. ఒకదశలో ఆర్సీబీ ‘49’ అయినా దాటగలదా అనిపించింది. మరో 23 బంతులు మిగిలి ఉండగానే జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. అనంతరం సన్‌రైజర్స్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా చకచకా మ్యాచ్‌ను ముగించింది. ఛేదనలో అభిషేక్ దూసుకెళ్లాడు. సిరాజ్ ఓవర్లో వరుసగా 6, 4 కొట్టిన అతను, హాజల్‌వుడ్ ఓవర్లో 4 ఫోర్లు బాది సత్తా చాటాడు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: డుప్లెసిస్ (బి) జాన్సెన్ 5; రావత్ (సి) మార్క్రమ్ (బి) జాన్సెన్ 0; కోహ్లి (సి) మార్క్రమ్ (బి) జాన్సెన్ 0; మ్యాక్స్‌వెల్ (సి) విలియమ్సన్ (బి) నటరాజన్ 12; సుయాశ్ (స్టంప్డ్) పూరన్ (బి) సుచిత్ 15; షహబాజ్ (సి) పూరన్ (బి) ఉమ్రాన్ 7; దినేశ్ కార్తీక్ (సి) పూరన్ (బి) సుచిత్ 0; హర్షల్ (బి) నటరాజన్ 4; హసరంగ (బి) నటరాజన్ 8; హాజల్‌వుడ్ (నాటౌట్) 3; సిరాజ్ (సి) విలియమ్సన్ (బి) భువనేశ్వర్ 2; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (16.1 ఓవర్లలో ఆలౌట్) 68. వికెట్ల పతనం: 1–5, 2–5, 3–8, 4–20, 5–47, 6–47, 7–49, 8–55, 9–65, 10–68. బౌలింగ్: భువనేశ్వర్ 2.1–0–8–1, జాన్సెన్ 4–0–25–3, నటరాజన్ 3–0–10–3, సుచిత్ 3–0–12–2, ఉమ్రాన్ 4–0–13–1. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) రావత్ (బి) హర్షల్ 47; విలియమ్సన్ (నాటౌట్) 16; రాహుల్ త్రిపాఠి (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (8 ఓవర్లలో వికెట్ నష్టానికి) 72. వికెట్ల పతనం: 1–64. బౌలింగ్: సిరాజ్ 2–0–15–0, హాజల్‌వుడ్ 3–0–31–0, హర్షల్ పటేల్ 2–0–18–1, హసరంగ 1–0–7–0. An emphatic win for #SRH as they beat #RCB by 9 wickets 👏🔥 Splendid performance from Kane & Co. This is one happy group right now 😃😃 They move to No.2 on the points table #TATAIPL | #RCBvSRH | #IPL2022 pic.twitter.com/TocgmvruFL — IndianPremierLeague (@IPL) April 23, 2022 -
RCB Vs SRH: ‘సన్’తోషించాల్సిన విజయం!
అబుదాబి: టోర్నీలో ‘ప్లే ఆఫ్స్’ అవకాశాలు కోల్పోయిన తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అభిమానుల కోసం ఒక చెప్పుకోదగ్గ విజయాన్ని అందుకుంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 4 పరుగుల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. తక్కువ స్కోరు చేసి కూడా... ఫామ్‌లో ఉన్న ఆర్సీబీని హైదరాబాద్ నిలువరించడం విశేషం. ముందుగా హైదరాబాద్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. జేసన్ రాయ్ (38 బంతుల్లో 44; 5 ఫోర్లు), ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ విలియమ్సన్ (29 బంతుల్లో 31; 4 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్లకు 137 పరుగులు సాధించింది. దేవదత్ పడిక్కల్ (52 బంతుల్లో 41; 4 ఫోర్లు), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (25 బంతుల్లో 40; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. చివరి 2 ఓవర్లలో బెంగళూరు గెలుపు కోసం 18 పరుగులు చేయాల్సి ఉండగా, 19వ ఓవర్లో హోల్డర్ 5 పరుగులే ఇచ్చి కట్టడి చేశాడు. ఆఖరి ఓవర్ వేసిన భువనేశ్వర్... డివిలియర్స్ క్రీజ్‌లో ఉన్నా సరే, ఒత్తిడిని అధిగమించి 8 పరుగులే ఇవ్వడంతో గెలుపు హైదరాబాద్ సొంతమైంది. ఆఖరి బంతికి సిక్స్ కొట్టాల్సి ఉండగా ఒక పరుగే వచి్చంది. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: జేసన్ రాయ్ (సి అండ్ బి) క్రిస్టియాన్ 44; అభిõÙక్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) గార్టన్ 13; విలియమ్సన్ (బి) హర్షల్ పటేల్ 31; ప్రియమ్ గార్గ్ (సి) డివిలియర్స్ (బి) క్రిస్టియాన్ 15; అబ్దుల్ సమద్ (ఎల్బీ) (బి) చహల్ 1; వృద్ధిమాన్ సాహా (సి) డివిలియర్స్ (బి) హర్షల్ పటేల్ 10; హోల్డర్ (సి) క్రిస్టియాన్ (బి) హర్షల్ పటేల్ 16; రషీద్ ఖాన్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 141. వికెట్ల పతనం: 1–14, 2–84, 3–105, 4–107, 5–107, 6–124, 7–141. బౌలింగ్: మొహమ్మద్ సిరాజ్ 3–0–17–0, గార్టన్ 2–0–29–1, షహబాజ్ 4–0–21–0, హర్షల్ పటేల్ 4–0–33–3, యజువేంద్ర చహల్ 4–0–27–1, క్రిస్టియాన్ 3–0–14–2. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (ఎల్బీ) (బి) భువనేశ్వర్ 5; పడిక్కల్ (సి) సమద్ (బి) రషీద్ 41; క్రిస్టియాన్ (సి) విలియమ్సన్ (బి) కౌల్ 1; భరత్ (సి) సాహా (బి) ఉమ్రాన్ 12; మ్యాక్స్‌వెల్ (రనౌట్) 40; డివిలియర్స్ (నాటౌట్) 19; షహబాజ్ (సి) విలియమ్సన్ (బి) హోల్డర్ 14; గార్టన్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 137. వికెట్ల పతనం: 1–6, 2–18, 3–38, 4–92, 5–109, 6–128. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–25–1, హోల్డర్ 4–0–27–1, సిద్ధార్థ్ కౌల్ 4–1–24–1, ఉమ్రాన్ మాలిక్ 4–0–21–1, రషీద్ ఖాన్ 4–0–39–1. -
విలియమ్సన్ సరసన కోహ్లి
అహ్మదాబాద్ : ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20లో వీరాట్ కోహ్లి కెప్టెన్‌గా విలియమ్సన్ పేరిట ఉన్న అత్యధిక అర్ధ సెంచరీల రికార్డును సమం చేశాడు. అంతర్జాతీయ టీ 20లో ప్రస్తుతం కోహ్లి ,విలియమ్సన్ 11 అర్ధ సెంచరీలతో సమంగా ఉన్నారు. మంగళవారం అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మూడవ టీ20 లో కోహ్లి కేవలం 46 బంతుల్లో 77 పరుగులు (నాటౌట్) చేసి ఈ ఘనతను సాధించాడు. ఇక ఆదివారం జరిగిన మ్యాచ్‌లో అంతరాతీయ పురుషుల టీ20 క్రికెట్లో 3000 పరుగుల చేసిన మొదటి క్రికెటర్‌గా తన పేరును నమోదు చేసుకున్నాడు . టీ 20లో 138.96 స్ట్రైక్ రేట్‌తో సగటున 52.17 పరుగులు చేశాడు. అంతర్జాతీయ టీ 20 లో కెప్టెన్ల జాబితాలో ఆస్ట్రేలియాకు చెందిన ఆరోన్ ఫించ్, ఇంగ్లాండ్‌కు చెందిన ఇయాన్ మోర్గాన్ వీరిద్దరు తొమ్మిది అర్ధ సెంచరీలు సాధించి కోహ్లీ ,విలియమ్సన్ తర్వాతి స్థానంలో ఉన్నారు. మూడో టీ20లో భారత బ్యాట్స్‌మెన్ తడబాటు పవర్‌ప్లేలోనే 24 పరుగులకు 3 వికెట్లను కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయిన భారత్‌కు కోహ్లి తన ఇన్నింగ్స్ ద్వారా గౌరవప్రదమైన స్కోర్‌ను ఇంగ్లాండ్ ముందు ఉంచాడు. ప్రత్యేకంగా మార్క్ వుడ్ వేసిన 18 వ ఓవర్లో 6, 6, 4 పరుగులు చేసి డెత్ ఓవర్లో తన విధ్వంసకర బ్యాటింగ్‌ను మరో సారి ప్రత్యర్థి జట్టుకు రుచి చూపించాడు. కోహ్లీ ( 77), రిషబ్ పంత్ (25) చివర్లో హార్దిక్ పాండ్యా (17) మినహా ఏ ఒక్క బ్యాట్స్‌మెన్ క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. -
న్యూజిలాండ్ నంబర్‌వన్
క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్ పేసర్ కైల్ జేమీసన్ (6/48) మళ్లీ నిప్పులు చెరగడంతో పాకిస్తాన్ కుప్పకూలింది. దీంతో ఆఖరి టెస్టులో కివీస్ ఇన్నింగ్స్ 176 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. రెండు టెస్టుల సిరీస్‌ను 2–0తో ఆతిథ్య జట్టు క్లీన్‌స్వీప్ చేసింది. బుధవారం ఓవర్‌నైట్ స్కోరు 8/1తో నాలుగోరోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్తాన్ 81.4 ఓవర్లలో 186 పరుగులు చేసి ఆలౌటైంది. అజహర్ అలీ (37; 6 ఫోర్లు), జాఫర్ గోహర్ (37; 7 ఫోర్లు), ఫహీమ్ అష్రఫ్ (28; 3 ఫోర్లు) మినహా మిగతా వారెవరూ ఆతిథ్య బౌలర్లకు ఎదురునిలిచే సాహసం చేయలేకపోయారు. జేమీసన్ 6 వికెట్లు పడగొట్టగా... సీనియర్ సీమర్ బౌల్ట్ 3 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌ల్లో పాకిస్తాన్ 297 పరుగులు చేయగా, న్యూజిలాండ్ 659/6 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. జేమీసన్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’... విలియమ్సన్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు గెల్చుకున్నారు. ఆసీస్‌ను వెనక్కినెట్టి ‘టాప్’లోకి... అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రపంచ టెస్టు టీమ్ ర్యాంకింగ్స్‌లో ఇన్నాళ్లు అగ్రస్థానంలో నిలిచిన ఆస్ట్రేలియాతో పాయింట్ల పరంగా న్యూజిలాండ్ (116 పాయింట్లు) సమంగా నిలిచింది. అయితే డెసిమల్ పాయింట్ల తేడాతో రెండో స్థానానికి పరిమితమైన న్యూజిలాండ్ ఇప్పుడు స్పష్టమైన తేడాతో తొలిసారి ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. పాక్‌తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం ద్వారా న్యూజిలాండ్ 118 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. ఆసీస్ (116), భారత్ (114) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు పాక్‌తో రెండు టెస్టుల్లో కలిపి 388 పరుగులు చేసిన న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ టెస్టు బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్ లో 890 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. -
రాయల్స్ రైజింగ్..
12 ఓవర్లు ముగిసేసరికి రాయల్స్ స్కోరు 78/5. మేటి బ్యాట్స్‌మెన్ అందరూ పెవిలియన్ చేరుకున్నారు. దాంతో రాజస్తాన్ ఓటమి ఖాయంగానే కనిపించింది. స్వల్ప లక్ష్యాల్ని కాచుకునే సన్‌రైజర్స్ బౌలింగ్ దళం ముందర మిగతా రాయల్స్ బ్యాట్స్‌మెన్ ఏం నిలుస్తారులే అనుకున్నారంతా. కానీ రాహుల్ తేవటియా, రియాన్ పరాగ్ అందరి అంచనాలను తల్లకిందులు చేశారు. సన్‌రైజర్స్ బౌలర్ల భరతంపట్టిన ఈ జోడీ రాయల్స్‌కు అద్భుత విజయం అందించింది. స్లో పిచ్‌పై రైజర్స్ బ్యాట్స్‌మెన్ శ్రమించిన చోటే వీరిద్దరూ సులువుగా పరుగులు సాధించారు. వచ్చిన ప్రతీ బౌలర్ పరుగులు సమర్పించుకోవడంతో మరో బంతి మిగిలి ఉండగానే రాజస్తాన్ విజయాన్నందుకుంది. వరుసగా నాలుగు పరాజయాల తర్వాత రాజస్తాన్ గెలుపు బాట పట్టగా... హైదరాబాద్ ఖాతాలో నాలుగో ఓటమి చేరింది. దుబాయ్: రాజస్తాన్ రాయల్స్‌కు ఊరటనిచ్చే విజయం దక్కింది. ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో రాయల్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 158 పరుగులు చేసింది. మనీశ్ పాండే (44 బంతుల్లో 54; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీతో మెరిశాడు. కెప్టెన్ డేవిడ్ వార్నర్ (38 బంతుల్లో 48; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు. విలియమ్సన్ (12 బంతుల్లో 22 నాటౌట్; 2 సిక్సర్లు), ప్రియమ్ గార్గ్ (8 బంతుల్లో 15; 1 ఫోర్, 1 సిక్స్) వేగంగా ఆడారు. అనంతరం ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రాహుల్ తేవటియా (28 బంతుల్లో 45 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రియాన్ పరాగ్ (26 బంతుల్లో 42; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో రాజస్తాన్ 19.5 ఓవర్లలో 5 వికెట్లకు 163 పరుగులు సాధించింది. వీరిద్దరూ అజేయంగా ఆరో వికెట్‌కు 85 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. ఖలీల్, రషీద్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. తొలుత తడబాటు... 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌కు ఆరంభంలోనే దెబ్బ పడింది. రైజర్స్ బౌలర్లు చెలరేగడంతో బెన్ స్టోక్స్ (5), బట్లర్ (16), స్మిత్ (5) పవర్‌ప్లే లోపే పెవిలియన్ చేరారు. తర్వాత సంజూ సామ్సన్ (26; 3 ఫోర్లు), ఉతప్ప (18; 1 ఫోర్, 1 సిక్స్) కాస్త పోరాడినా రషీద్‌ఖాన్ ముందు వారి ఆటలు సాగలేదు. క్రీజులోకి రియాన్ పరాగ్, రాహుల్ తేవటియా వచ్చినప్పటికీ 15 ఓవర్లకు రాజస్తాన్ 94/5తో నిలిచింది. విజయానికి 30 బంతుల్లో 65 పరుగులు కావాలి. ఈదశలో సన్‌రైజర్స్ స్కోరు (96/2) కూడా దాదాపు అంతే. అలవోకగా పరుగులు... అప్పటివరకు సింగిల్స్‌కే పరిమితమైన పరాగ్ 16వ ఓవర్ చివరి బంతికి సిక్స్‌తో జోరు పెంచాడు. సందీప్ శర్మ బౌలింగ్‌లో తేవటియా 6, పరాగ్ రెండు వరుస బౌండరీలు బాదడంతో 18 పరుగులు జతయ్యాయి. రషీద్ వేసిన 18వ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు బాదిన తేవటియా... నటరాజన్ తర్వాతి ఓవర్లో 4,6 దంచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. 6 బంతుల్లో 8 పరుగులు చేయాల్సి ఉండగా మొదటి నాలుగు బంతుల్లో 6 పరుగులు వచ్చాయి. ఐదో బంతికి సిక్సర్ బాదిన పరాగ్ జట్టుకు ఊరటనిచ్చే విజయాన్ని అందించాడు. ఆకట్టుకున్న వార్నర్, మనీశ్.. ఆట ఆరంభంలో సన్‌రైజర్స్ అతి జాగ్రత్తకు పోయింది. నాలుగో ఓవర్లో వార్నర్ కొట్టిన ఫోర్‌తో బౌండరీల ఖాతా తెరచింది. ఆ తర్వాత ఓ భారీ సిక్సర్ బాదిన బెయిర్‌స్టో (16) మరుసటి బంతికే ఔటయ్యాడు. పవర్‌ప్లేలో సన్‌రైజర్స్ స్కోరు 26/1. మనీశ్ వచ్చాక పరుగుల వేగం కాస్త పెరిగింది. ఏడో ఓవర్ తేవటియా బౌలింగ్‌లో మనీశ్, తర్వాతి ఓవర్లో వార్నర్ చెరో సిక్సర్‌తో అలరించారు. ఈ దశలో రాజస్తాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో 10–15 ఓవర్ల మధ్య వీరిద్దరు కలిసి కేవలం 2 సిక్సర్లు మాత్రమే బాదగలిగారు. బ్యాట్ ఝళిపించేందుకు సిద్ధమవుతున్న ఈ జంటను 15వ ఓవర్లో వార్నర్‌ను అవుట్ చేసి ఆర్చర్ విడదీశాడు. దీంతో రెండో వికెట్‌కు 73 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. 16వ ఓవర్లో 4, 6 బాదిన మనీశ్ 13 పరుగులు రాబట్టడంతో జట్టు స్కోరు 100 పరుగులు దాటింది. తర్వాత మనీశ్ పెవిలియన్ చేరినా... విలియమ్సన్ రెండు సిక్సర్లు బాదడంతో 19వ ఓవర్లో అత్యధికంగా 19 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్లో 6,4 బాదిన ప్రియమ్ గార్గ్ జట్టు స్కోరును 150 పరుగులు దాటించాడు. చివరి 30 బంతుల్లో 62 పరుగులు సాధించింది. ఆ క్యాచ్ పట్టి ఉంటే... అందివచ్చిన అవకాశాన్ని వదులుకుంటే ఒక్కోసారి భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌కు ఈ అనుభవం ఎదురైంది. ఖలీల్ అహ్మద్ వేసిన ఇన్నింగ్స్‌లో 16వ ఓవర్ మూడో బంతికి రియాన్ పరాగ్ భారీ షాట్ ఆడగా బంతి గాల్లోకి లేచింది. డీప్ మిడ్వికెట్లో ప్రియమ్ గార్గ్ క్యాచ్‌ను వదిలేశాడు. దాంతో పరాగ్ బతికిపోయాడు. అప్పటికి పరాగ్ 12 పరుగులతో ఉన్నాడు. ఒకవేళ పరాగ్ క్యాచ్‌ను గార్గ్ పట్టిఉంటే సన్‌రైజర్స్‌కు తుది ఫలితం మరోలా ఉండేదేమో. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (బి) ఆర్చర్ 48; బెయిర్‌స్టో (సి) సామ్సన్ (బి) త్యాగి 16; మనీశ్ (సి) తేవటియా (బి) ఉనాద్కట్ 54; విలియమ్సన్ (నాటౌట్) 22; ప్రియమ్ గార్గ్ (రనౌట్) 15; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 158. వికెట్ల పతనం: 1–23, 2–96, 3–122, 4–158. బౌలింగ్: ఆర్చర్ 4–0–25–1, శ్రేయస్ గోపాల్ 4–0–31–0, కార్తీక్ త్యాగి 3–0–29–1, ఉనాద్కట్ 4–0–31–1, తేవటియా 4–0–35–0, బెన్‌స్టోక్స్ 1–0–7–0. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: స్టోక్స్ (బి) ఖలీల్ అహ్మద్ 5; బట్లర్ (సి) బెయిర్‌స్టో (బి) ఖలీల్ అహ్మద్ 16; స్మిత్ (రనౌట్) 5; సంజూ సామ్సన్ (సి) బెయిర్‌స్టో (బి) రషీద్ ఖాన్ 26; ఉతప్ప (ఎల్బీడబ్ల్యూ) (బి) రషీద్ ఖాన్ 18; రియాన్ పరాగ్ (నాటౌట్) 42; రాహుల్ తేవటియా (నాటౌట్) 45; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19.5 ఓవర్లలో 5 వికెట్లకు) 163. వికెట్ల పతనం: 1–7, 2–25, 3–26, 4–63, 5–78. బౌలింగ్: సందీప్ 4–0–32–0, అహ్మద్ 3.5–0–37–2, నటరాజన్ 4–1–32–0, అభిషేక్ శర్మ 1–0–11–0, రషీద్ ఖాన్ 4–0–25–2, విజయ్ శంకర్ 3–0–22–0. -
‘టెస్టు’ సమయం
ఉపఖండం బయట ఇతర దేశాల్లో పోలిస్తే న్యూజిలాండ్‌లోనే భారత జట్టు తక్కువ సంఖ్యలో టెస్టు క్రికెట్ ఆడింది. 1967 నుంచి 2014 వరకు 9 టెస్టు సిరీస్‌లలో పాల్గొంటే ఆడిన మ్యాచ్‌లు 23 మాత్రమే! గత ఏడాది కివీస్ పర్యటనలో కూడా టెస్టులు ఆడాల్సి ఉండగా... తెల్లవారుజామున భారత అభిమానులు టెస్టులు చూడరంటూ ప్రసారకర్తలు తెచ్చిన ఒత్తిడితో షెడ్యూల్ నుంచి టెస్టులను తొలగించి వన్డేలు, టి20లకే పరిమితం చేశారు. ఇప్పుడు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగం కావడంతో తప్పనిసరిగా ఆడాల్సిన స్థితిలో భారత జట్టు ఐదు రోజుల ఫార్మాట్‌కు సన్నద్ధమైంది. స్వింగ్‌కు బాగా అనుకూలించే కివీస్ పిచ్‌లపై టీమిండియాకు ఎర్రబంతితో అతి పెద్ద సవాల్ ఎదురవ్వడం ఖాయం. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్‌కు రేపటితో తెర లేవనుంది. వెల్లింగ్టన్: టి20, వన్డే సిరీస్‌లను సమంగా పంచుకున్న తర్వాత భారత్, న్యూజిలాండ్ ఇప్పుడు సాంప్రదాయ ఫార్మాట్‌కు సై అంటున్నాయి. ఇరు జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా రేపటి నుంచి (శుక్రవారం) తొలి మ్యాచ్ జరుగుతుంది. సొంతగడ్డపై వరుస సిరీస్ విజయాల తర్వాత భారత జట్టు మళ్లీ టెస్టు బరిలోకి దిగుతుండగా... ఇటీవలే ఆస్ట్రేలియా చేతిలో క్లీన్‌స్వీప్‌నకు గురైన కివీస్ స్వదేశంలో తమ రాత మార్చుకోవాలని పట్టుదలగా ఉంది. కోహ్లి నాయకత్వంలో న్యూజిలాండ్ గడ్డపై భారత్ టెస్టులు ఆడుతుండటం ఇదే మొదటిసారి కావడం విశేషం. విహారికి చోటు! టీమిండియా తమ ఆఖరి టెస్టును కోల్‌కతాలో బంగ్లాదేశ్‌పై ఆడింది. అక్కడితో పోలిస్తే వాతావరణం, పిచ్ పరిస్థితులు న్యూజిలాండ్‌లో పూర్తిగా భిన్నం కాబట్టి స్వల్ప మార్పులు ఖాయం. రోహిత్ శర్మ గాయంతో దూరం కావడంతో మయాంక్‌కు తోడుగా పృథ్వీ షా ఓపెనింగ్ చేయడం దాదాపుగా ఖాయమైంది. బుధవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్ ఇదే సంకేతాన్నిచ్చింది. కాబట్టి శుబ్‌మన్ గిల్ టెస్టు అరంగేట్రం కోసం కొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు. అయితే ప్రతికూల వాతావరణంలో కివీస్ పేసర్లను సమర్థంగా ఎదుర్కొని ఓపెనర్లు పరుగులు సాధించడం అంత సులువు కాదు. జట్టుకు శుభారంభం దక్కకపోతే ఆ తర్వాత అది మ్యాచ్‌పై ప్రభావం చూపించవచ్చు. సొంతగడ్డపై టీమ్ మేనేజ్మెంట్ ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌నే ఆడించేది. కానీ కివీస్లాంటి చోట లోతైన బ్యాటింగ్ అవసరం కాబట్టి ఆరో స్థానంలో కూడా రెగ్యులర్ బ్యాట్స్‌మన్‌ను ఆడించక తప్పని పరిస్థితి. అందుకోసం ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారి సిద్ధంగా ఉన్నాడు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో కఠిన పరిస్థితుల్లో పట్టుదలగా నిలబడి అతను సాధించిన సెంచరీ కూడా విహారికి అనుకూలంగా మారింది. బౌలింగ్‌లో ముగ్గురు పేసర్లకే మొగ్గు చూపవచ్చు. గత రెండున్నరేళ్లలో ఇదే వ్యూహంతో విదేశాల్లో ప్రత్యర్థి జట్లను ఆలౌట్ చేశామంటూ కోహ్లి వ్యాఖ్యానించడం అతని ఆలోచనను స్పష్టం చేసింది. గాయం నుంచి కోలుకున్న ఇషాంత్ శర్మ ఎలాంటి ఇబ్బంది లేకుండా నెట్స్‌లో బౌలింగ్ చేశాడు. కాబట్టి అతనితో పాటు షమీ, బుమ్రాలు పేస్ భారం మోస్తారు. స్పిన్నర్‌గా మాత్రం ఒకరికే చోటు ఉంది. అశ్విన్ లేదా జడేజాలలో ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తిరం. 2013 నుంచి విదేశాల్లో ఇద్దరి రికార్డు దాదాపు ఒకేలా ఉంది. కీపర్‌గా సందేహం లేకుండా వృద్ధిమాన్ సాహానే ఉంటాడు కాబట్టి రిషభ్ పంత్‌కు నిరాశ తప్పదు. 2014లో ఇక్కడ టెస్టులు ఆడిన అనుభవం ప్రస్తుత జట్టులో కోహ్లి, పుజారా, రహానే, జడేజా, ఇషాంత్, షమీలకు ఉంది. కాబట్టి పరిస్థితులు పూర్తిగా కొత్త కాదు. ఆస్ట్రేలియాలో గెలిచినట్లుగా న్యూజిలాండ్‌లోనూ సిరీస్ విజయం సాధిస్తే నాయకుడిగా కోహ్లి ఘనతల్లో మరొకటి చేరుతుంది. ► న్యూజిలాండ్ గడ్డపై 9 టెస్టు సిరీస్‌లు ఆడిన భారత్ 2 గెలిచి, 5 ఓడింది. మరో 2 డ్రాగా ముగిశాయి. 2014 సిరీస్‌లో న్యూజిలాండ్ 1–0తో గెలిచింది. ► భారత్ గెలిచిన టెస్టుల సంఖ్య. మొత్తం 23 ఆడగా... కివీస్ 8 మ్యాచ్‌లలో విజయం సాధించింది. మిగిలిన 10 ‘డ్రా’గా ముగిశాయి. ► 30 భారత్‌లో 2016లో జరిగిన సిరీస్‌లో చివరిసారి ఈ రెండు జట్లు తలపడగా... భారత్ 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది వాగ్నర్ అవుట్! తొలి టెస్టుకు ముందే కివీస్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు ప్రధాన పేస్ బౌలర్ నీల్ వాగ్నర్ వ్యక్తిగత కారణాలతో మ్యాచ్‌కు దూరమయ్యాడు. భార్య ప్రసవం కారణంగా వాగ్నర్ వెల్లింగ్టన్కు రావడం లేదని కివీస్ బోర్డు ప్రకటించింది. గత కొన్నేళ్లలో బౌల్ట్, సౌతీలతో పోలిస్తే వాగ్నర్ అత్యంత ప్రమాదకర కివీస్ బౌలర్‌గా మారాడు. కీలకమైన మ్యాచ్‌కు ముందు అతను దూరం కావడం జట్టుపై ప్రభావం చూపడం ఖాయం. ఇది సీనియర్లు బౌల్ట్, సౌతీలకు అదనపు భారం కానుంది. వాగ్నర్ స్థానంలో హెన్రీని తీసుకున్నారు. అయితే పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్ అయిన హెన్రీ టెస్టు రికార్డు మరీ పేలవంగా ఉంది. సొంతగడ్డపైనే 6 టెస్టులో 12 వికెట్లు తీయగా సగటు 50కు పైగా ఉంది! అయితే మ్యాచ్ ముందు రోజు పిచ్‌ను బట్టి చూస్తే కివీస్ నలుగురు పేసర్లతో దిగాలని భావిస్తున్నట్లు అర్థమవుతోంది. కైలీ జేమీసన్ ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేయవచ్చు. ఏకైక స్పిన్నర్ ఎజాజ్ పటేల్‌కు తుది జట్టులో స్థానం కష్టమే. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో ఇటీవల న్యూజిలాండ్ బ్యాటింగ్ విఫలమైంది. ఇప్పుడు దానిని చక్కబెట్టుకునేందుకు ఆ జట్టుకు అవకాశం వచ్చింది. లాథమ్, బ్లన్‌డెల్ ఓపెనర్లుగా శుభారంభం ఇవ్వగల సమర్థులు. మూడు, నాలుగు స్థానాల్లో విలియమ్సన్, రాస్ టేలర్‌ల అనుభవమే జట్టుకు కీలకం. వీరిద్దరు తమ స్థాయికి తగినట్లుగా ఆడితే భారత్‌కు ఇబ్బందులు తప్పవు. వికెట్ కీపర్ వాట్లింగ్ బ్యాట్స్‌మన్‌గా కూడా తన సత్తా ఏమిటో ఇటీవలే ఇంగ్లండ్‌పై అద్భుత డబుల్ సెంచరీతో చూపించాడు. చివరి వన్డేలో భారత్ ఓటమికి కారణమైన గ్రాండ్‌హోమ్ ఆల్‌రౌండర్‌గా సత్తా చాటగలడు. మొత్తంగా కివీస్ బ్యాటింగ్ కూడా బలంగానే కనిపిస్తోంది. భారత పేస్ త్రయాన్ని వీరు సమర్థంగా ఎదుర్కోగలిగితే ఆపై జట్టును ఆపడం కోహ్లి బృందానికి కష్టం కావచ్చు. తుది జట్ల వివరాలు (అంచనా): భారత్: కోహ్లి (కెప్టెన్), పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్, పుజారా, రహానే, విహారి, అశ్విన్/రవీంద్ర జడేజా, వృద్ధిమాన్ సాహా, ఇషాంత్ శర్మ, షమీ, బుమ్రా. న్యూజిలాండ్: విలియమ్సన్ (కెప్టెన్), లాథమ్, బ్లన్‌డెల్, రాస్ టేలర్, నికోల్స్, వాట్లింగ్, గ్రాండ్‌హోమ్, సౌతీ, జేమీసన్, బౌల్ట్, హెన్రీ. పిచ్, వాతావరణం బేసిన్ రిజర్వ్ మైదానం పిచ్‌పై బుధవారం 15–18 మిల్లీ మీటర్ల మందం పచ్చిక కనిపించింది. మ్యాచ్ రోజు కూడా పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. కాబట్టి పేసర్లకు బాగా అనుకూలం. పైగా ఇది ఓపెన్ గ్రౌండ్ కావడం వల్ల 100 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు స్వింగ్‌ను శాసిస్తాయి. బ్యాట్స్‌మెన్ ఆరంభ పరీక్షను అధిగమించాల్సి ఉంటుంది. టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్‌ను ఎంచుకోవచ్చు. వర్షం సమస్య లేదు. మరో మూడేళ్లు ఇంతే జోరుగా... గత ఎనిమిదేళ్లుగా నేను మ్యాచ్‌లతో పాటు ప్రయాణాలు, ప్రాక్టీస్‌లు కలుపుకుంటే సంవత్సరంలో దాదాపు 300 రోజులు క్రికెట్ ఆడుతున్నాను. అయినా ఎక్కడా దూకుడు, తీవ్రత తగ్గదు. ఇక కెప్టెన్‌గా అదనపు ఒత్తిడి ఎలాగూ ఉంటుంది. కానీ ఒకటి మాత్రం ఖాయం. ఇదే జోరులో నేను అన్ని ఫార్మాట్లలో కనీసం వచ్చే మూడేళ్ల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడగలను. మరిన్ని కఠిన సవాళ్లకు సిద్ధంగా ఉన్నా. శరీరం అలసిపోవడం సహజమే కానీ అప్పుడప్పుడు తీసుకునే విరామాల వల్ల నేను మళ్లీ కోలుకోగలుగుతున్నా. గతంలో చెప్పినట్లు నా దృష్టిలో టెస్టు ఫార్మాటే అన్నింటికంటే అత్యుత్తమం. ఐసీసీ టోర్నీలపరంగా చూస్తే ఇప్పుడు జరుగుతున్న టెస్టు చాంపియన్‌షిప్‌కే నేను అగ్రస్థానం ఇస్తా. – విరాట్ కోహ్లి, భారత కెప్టెన్ వెల్లింగ్టన్లో ఇండియన్ హై కమిషన్ ఇచ్చిన విందులో... -
ఉత్కం‘టై’న మ్యాచ్‌కు సూపర్ ముగింపు
‘ఆఖరి పంచ్ మనదైతే... వచ్చే కిక్కే వేరబ్బా’ ఇది బాగా పాపులర్ డైలాగ్. ఇక్కడ పొట్టి మ్యాచ్‌లో ఆ పంచ్ కివీస్‌కు పడింది. కిక్ భారత్‌కు ఎక్కింది. ఈ డైలాగ్‌ను హీరో అంటుంటే ఎలా ఉంటుందో తెలియదు కానీ... ఆస్వాదిస్తే ఇంత అద్భుతంగా ఉంటుందా అని ఈ మ్యాచ్ చూసినోళ్లకు అనిపించక మానదు. నిజమే... మ్యాచ్ అంటే ఇది. మలుపులంటే ఇవి. మెరుపులంటే మావే అన్నట్లు ఇరు జట్లను ఉత్కంఠతో ఊపేసిన మ్యాచ్‌కు ఎవరూ ఊహించని ఫినిషింగ్ లభించింది. కోట్లాది అభిమానుల్ని మునివేళ్లపై నిలబెట్టిన పోరు సిక్సర్లతో హోరెత్తింది. హామిల్టన్: ఒకతను ఆపేశాడు. మరొకతను బాదేశాడు. ఇలా ఇద్దరు సీనియర్ల దెబ్బకు కివీస్ తలకిందులైంది. రెండుసార్లు ఊహకందని విధంగా అంచనాలు తారుమారయ్యాయి. ఎంచక్కా గెలుస్తుందిలే అనుకుని ఆఖరి మజిలీకి చేరిన న్యూజిలాండ్‌ను తొలుత పేసర్ షమీ అడ్డుకున్నాడు. మ్యాచ్ ‘టై’ అయింది. సూపర్ ఓవర్ మొదలైంది. ఇక్కడా విజయావకాశాలు కివీస్‌నే ఊరిస్తే... రోహిత్ సిక్సర్లతో మార్చేశాడు. ఈ రెండు దెబ్బలకు భారత్ మూడో టి20లోనూ గెలవడంతో పాటు... ఇంకా రెండు మ్యాచ్‌లుండగానే 3–0తో సిరీస్‌ను చేజిక్కించుకుంది. న్యూజిలాండ్ గడ్డపై భారత్‌కు ఇదే తొలి పొట్టి సిరీస్ కావడం విశేషం. గతంలో రెండు సార్లు ఆతిథ్య జట్టుకే సిరీస్ సమర్పించుకుంది. ఆఖరిదాకా అత్యుత్తమ పోరాటం జరిగిన మూడో మ్యాచ్‌లో భారత్ సూపర్ ఓవర్లో గెలుపొందింది. మొదట భారత్ నిరీ్ణత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (40 బంతుల్లో 65; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెపె్టన్ కోహ్లి (27 బంతుల్లో 38; 2 ఫోర్లు, 1 సిక్స్) మెరిపించారు. బెన్నెట్‌కు 3 వికెట్లు దక్కాయి. తర్వాత కివీస్ కూడా 20 ఓవర్లలో 6 వికెట్లను కోల్పోయి సరిగ్గా 179 పరుగులే చేయడంతో మ్యాచ్ టై అయింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (48 బంతుల్లో 95; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) వీరోచిత పోరాటం చేశాడు. కానీ ఒత్తిడిని ఎదుర్కోలేక చిత్తయ్యాడు. శార్దుల్, షమీలకు రెండేసి వికెట్లు దక్కాయి. ‘సిక్సర’ పిడుగు రోహిత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. నాలుగో టి20 శుక్రవారం వెల్లింగ్టన్లో జరుగుతుంది. దంచేసిన రోహిత్... టాస్ నెగ్గిన కివీస్ ఫీల్డింగ్ ఎంచుకోగా... గత రెండు మ్యాచ్‌ల్లో నిరాశపరిచిన రోహిత్ భారత ఇన్నింగ్స్‌కు మూలస్తంభమయ్యాడు. రాహుల్‌తో కలిసి చకచకా పరుగులు జత చేశాడు. దీంతో ఆరు ఓవర్లలోనే భారత్ 50 పరుగులకు చేరింది. బెన్నెట్ వేసిన ఈ ఓవర్‌ను రోహిత్ 1, 6, 6, 4, 4, 6తో దంచేశాడు. ఇందులో ఆ ఒక్కటీ రాహుల్దైతే... విధ్వంసం రోహిత్‌ది. దీంతో ఈ ఒక్క ఓవర్లోనే 27 పరుగులు లభించాయి. రోహిత్ శర్మ అర్ధసెంచరీ 23 బంతుల్లో (5 ఫోర్లు, 3 సిక్స్‌లు) పూర్తయ్యింది. ధాటిగా సాగిపోతున్న ఈ ఓపెనింగ్ జోడీని ఎట్టకేలకు రాహుల్ (19 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్)ని ఔట్‌చేయడం ద్వారా గ్రాండ్‌హోమ్ విడగొట్టాడు.89 పరుగుల వద్ద తొలివికెట్‌ను కోల్పోయిన భారత్ మరో 7 పరుగుల వ్యవధిలో రోహిత్, శివమ్ దూబే (3) వికెట్లను కోల్పోయింది. ఒకే ఓవర్లో బెన్నెట్ ఆ ఇద్దరి వికెట్లను పడేశాడు. తర్వాత కెపె్టన్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ (16 బంతుల్లో 17; 1 ఫోర్), మనీశ్ పాండే (6 బంతుల్లో 14; 1 ఫోర్, 1 సిక్స్) జట్టు స్కోరు పెంచే ప్రయత్నం చేశారు. విలియమ్సన్ వీరోచితం... అనంతరం 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ కూడా వేగంగానే పరుగులు జతచేసింది. బుమ్రా బౌలింగ్‌లో గప్టిల్ (21 బంతుల్లో 31; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కానీ ధాటిలో మన్రో (14; 2 ఫోర్లు) వెనుకబడ్డాడు. గప్టిల్ జోరుకు శార్దుల్ తెరదించగా, మన్రోను జడేజా అవుట్ చేశాడు. ఆరో ఓవర్లోనే జట్టు స్కోరు 50కి చేరినా... కీలక వికెట్లను కోల్పోయింది. అయినప్పటికీ కెపె్టన్ కేన్ విలియమ్సన్ మాత్రం క్రీజులోకి వచ్చినప్పటినుంచే దంచేసే పనిలో పడ్డాడు. బుమ్రా, చహల్, షమీ, జడేజా ఎవరు బౌలింగ్‌కు దిగినా బౌండరీలు, సిక్సర్లు బాదకుండా విడిచిపెట్టలేదు. ఈ క్రమంలోనే అతను 28 బంతుల్లో (4 ఫోర్లు, 3 సిక్సర్లు) ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు. 12.4 ఓవర్లలో జట్టు స్కోరు వందకు చేరింది. సాన్‌ట్నర్ (9), గ్రాండ్‌హోమ్ (5) తక్కువ స్కోర్లకే నిష్క్రమించినా ...కెప్టెన్ దూకుడుతో ఆ ప్రభావం స్కోరుపై పడలేదు. జోరును ఆపలేదు! టేలర్ (10 బంతుల్లో 17; 1 ఫోర్, 1 సిక్స్) అండతో కేన్ జట్టును విజయతీరాలకు తీసుకొచ్చాడు. సెంచరీకి అతను, విజయానికి జట్టు చేరువైనా... షమీ అద్భు త బౌలింగ్‌తో ఏ ఒక్కటీ జరగలేదు. 6 బంతుల్లో 9 పరుగులు చేయాల్సిన 20వ ఓవర్‌ను వైవిధ్యమైన బంతులతో నియత్రించాడు. ఆఖరి 4 బంతుల్లో అయితే వాళ్లిద్దరినీ ఔట్ చేసిన షమీ ఒక పరుగు మాత్రమే ఇవ్వడంతో స్కోరు సమమై మ్యాచ్ ‘టై’ అయింది. ఈ మ్యాచ్‌లో రో‘హిట్స్’, షమీ బౌలింగ్‌తో భారత్ గెలిచినప్పటికీ ఫీల్డింగ్‌లో తడబడింది. విలువైన క్యాచ్‌లు చేజార్చిన భారత ఫీల్డర్లు దూబే, జడేజా చిత్రంగా తేలికపాటి బౌండరీల్ని ఆపలేకపోయారు. దీంతో ఒక పరుగొచ్చే చోట 4 పరుగులు ప్రత్యర్థి స్కోరుకు జతయ్యాయి. షమీ ఆఖరి ఓవర్లో ఆపేశాడు... ఆఖరి ఓవర్ వేసిన షమీ కివీస్‌ను ఆపేశాడు. అద్భుతమైన బౌలింగ్‌తో గెలుపు దారిని మూసేశాడు. 6 బంతుల్లో 9 పరుగులతో గెలిచే చోట తొలి రెండు బంతులకు సిక్స్ సహా 7 పరుగులిచ్చాడు. మిగిలిన బంతులు నాలుగైతే.. చేయాల్సిన పరుగులు రెండే! కానీ షమీ ఇచ్చింది ఒకటే పరుగు. తీసింది రెండు వికెట్లు. మూడో బంతికి విలియమ్సన్, ఆఖరి బంతికి రాస్ టేలర్ ఔట్. మ్యాచ్ ‘టై’... రోహిత్ ఆఖరి బంతుల్లో ఆరేశాడు... సూపర్ ఓవర్లో భారత్ విజయానికి 18 పరుగులు చేయాలి. కానీ రోహిత్, రాహుల్ ఇద్దరు చెరో 2 బంతులాడి ఎనిమిదే చేశారు. ఇక గెలవాలంటే చివరి రెండు బంతుల్లో 10 చేయాలి. క్రీజ్‌లో ‘హిట్‌మ్యాన్’ ఉన్నాడు. సౌతీ యార్కర్ ప్రయత్నం విఫలం కాగా... రోహిత్ బ్యాట్ ఝుళిపించాడు. లాంగాన్‌లో సిక్స్. ఆఖరి బంతికి 4 కావాలి. ఈసారి లాంగాఫ్‌లో సిక్స్. అంతే భారత్‌కు మూడో మ్యాచ్ గెలుపుతో పాటు సిరీస్ కూడా దక్కింది. ►6 ఇప్పటివరకు టి20ల్లో ఆరుసార్లు, వన్డేల్లో ఒకసారి కలిపి న్యూజిలాండ్ జట్టు మొత్తం ఏడుసార్లు సూపర్ ఓవర్ ఆడింది. అయితే ఆరుసార్లు న్యూజిలాండ్ జట్టుకు పరాజయమే ఎదురైంది. ►న్యూజిలాండ్ తరఫున టిమ్ సౌతీ ఐదుసార్లు సూపర్ ఓవర్ వేశాడు. ఇందులో నాలుగుసార్లు ఓడిపోవడం గమనార్హం. ►ఐపీఎల్, అంతర్జాతీయ టి20ల్లో కలిపి జస్ప్రీత్ బుమ్రా మూడుసార్లు సూపర్ ఓవర్ వేయగా... మూడుసార్లూ అతని జట్టునే విజయం వరించింది. ఐపీఎల్లో 2017లో గుజరాత్ లయన్స్‌తో మ్యాచ్‌లో... 2019లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో బుమ్రా సూపర్ ఓవర్ వేశాడు. ►న్యూజిలాండ్ గడ్డపై భారత్ టి20 సిరీస్‌ను గెలవడం ఇదే తొలిసారి. న్యూజిలాండ్‌లో భారత్ 2009లో 0–2తో... 2019లో 1–2తో టి20 సిరీస్‌లను చేజార్చుకుంది. ►ఒక దశలో ఓటమి ఖాయమనుకున్నా. కేన్ బాగా ఆడాడు. కానీ దురదృష్టం. సెంచరీకి చేరువై 95 దగ్గర ఔటైతే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. చివరి బంతినెలా వేయాలనే దానిపై తర్జనభర్జన పడ్డాం. వికెట్లకు సూటిగా వేస్తే సరే కానీ... బ్యాట్‌కు తగిలితే ఆ ఒక్క పరుగు ఎలాగైనా వస్తుందనే బెంగ కూడా ఉంది. రోహిత్ ఇన్నింగ్స్‌లో, సూపర్ ఓవర్లో చెలరేగాడు. అతనొక బంతిపై విరుచుకుపడితే మరో బంతి వేసే సమయంలో తీవ్ర ఒత్తిడికి లోనవుతాడని అనుకున్నాం. సిరీస్ గెలిచాం. ఇక క్లీన్ స్వీపే మా లక్ష్యం. –భారత కెప్టెన్ కోహ్లి ►నేనెప్పుడూ సూపర్ ఓవర్లో బ్యాటింగ్‌కు రాలేదు. ఎలా మొదలెట్టాలో కూడా తెలియని పరిస్థితి. తొలి బంతినుంచే బాదాలా లేక సింగిల్ తీయాలో కూడా తెలియదు. కానీ మొత్తానికి మంచి ప్రదర్శన కనబరిచాను. చాలాసేపు క్రీజులో ఉండాలని భావించిన నేను అలా ఔట్ కావడం కాస్త నిరాశపరిచింది. –భారత ఓపెనర్ రోహిత్ స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి)సౌతీ (బి) బెన్నెట్ 65; రాహుల్ (సి) మన్రో (బి) గ్రాండ్‌హోమ్ 27; దూబే (సి) సోధి (బి) బెన్నెట్ 3; కోహ్లి (సి) సౌతీ (బి) బెన్నెట్ 38; అయ్యర్ (స్టంప్డ్) సిఫెర్ట్ (బి) సాన్‌ట్నర్ 17; పాండే (నాటౌట్) 14; జడేజా (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 179. వికెట్ల పతనం: 1–89, 2–94, 3–96, 4–142, 5–160. బౌలింగ్: సౌతీ 4–0–39–0, బెన్నెట్ 4–0–54–3, కుగెలెజిన్ 2–0–10–0, సాన్‌ట్నర్ 4–0–37–1, సోధి 4–0–23–0, గ్రాండ్ హోమ్ 2–0–13–1 న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గప్టిల్ (సి) సబ్–సామ్సన్ (బి) శార్దుల్ 31; మన్రో (స్టంప్డ్) రాహుల్ (బి) జడేజా 14; విలియమ్సన్ (సి) రాహుల్ (బి) షమీ 95; సాన్‌ట్నర్ (బి) చహల్ 9; గ్రాండ్‌హోమ్ (సి) దూబే (బి) శార్దుల్ 5; టేలర్ (బి) షమీ 17; సిఫెర్ట్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 179. వికెట్ల పతనం: 1–47, 2–52, 3–88, 4–137, 5–178, 6–179. బౌలింగ్: శార్దుల్ 3–0–21–2, షమీ 4–0–32–2, బుమ్రా 4–0–45–0, చహల్ 4–0–36–1, జడేజా 4–0–23–1, దూబే 1–0–14–0. -
కివీస్ అద్భుత విజయం
కొలంబో: ప్రతి రోజూ ఏదో ఒక దశలో వర్షం అంతరాయం కలిగించినా... చివరి రోజు అందివచ్చిన సమయంలో న్యూజిలాండ్ బౌలర్లు అదరగొట్టారు. ఫలితంగా శ్రీలంకతో జరిగిన చివరిదైన రెండో టెస్టులో విలియమ్సన్ బృందం ఇన్నింగ్స్ 65 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1–1తో సమం చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా సెంచరీ హీరో లాథమ్ (154) నిలిచాడు. అరగంట ఆలస్యంగా... ఓవర్ నైట్ స్కోరు 382/5తో ఆఖరి రోజు ఆట ప్రారంభించిన న్యూజిలాండ్ మరో వికెట్ నష్టపోయి 431 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. గ్రాండ్‌హోమ్ ఓవర్ నైట్ స్కోర్ (83) వద్దే ఔటైనా మరో ఎండ్‌లో వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ వాట్లింగ్ (105 నాటౌట్; 9 ఫోర్లు) శతకం పూర్తి చేసుకున్నాడు. 185 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక 70.2 ఓవర్లలో 122 పరుగులకు కుప్పకూలింది. సౌతీ, బౌల్ట్, ఎజాజ్ పటేల్, సోమర్విల్లె రెండేసి వికెట్లు తీశారు. గాయం కారణంగా దిముత్ కరుణరత్నే స్థానంలో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన కుశాల్ పెరీరా (0), తిరిమన్నె (0) ఖాతా తెరవకుండానే వెనుదిరిగారు. ఒక దశలో 32 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన శ్రీలంకను వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ డిక్వెల్లా (51; 6 ఫోర్లు), సారథి కరుణరత్నే (21) ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 41 పరుగులు జోడించి మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించేలా కనిపించారు. అయితే కరుణరత్నేను సౌతీ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడం, కాసేపటికే ఒంటరి పోరాటం చేస్తున్న డిక్వెల్లాను స్పిన్నర్ ఎజాజ్ పటేల్ పెవిలియన్‌కు పంపడంతో న్యూజిలాండ్ విజయం ఖాయమైంది. -
ఫైనల్లో పరాజితులు లేరు
వెల్లింగ్టన్: ప్రపంచ కప్ ఫైనల్లో ఫలితాన్ని తేల్చిన తీరుపై న్యూజిలాండ్ వైపు నుంచి స్పందనలు కొనసాగుతూనే ఉన్నాయి. జట్టు కెప్టెన్ విలియమ్సన్ సహా కోచ్, మాజీ ఆటగాళ్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. వివాదాస్పద ఆరు పరుగుల (2+4) ఓవర్ త్రోపై విలియమ్సన్ తమ దేశ మీడియాతో మాట్లాడుతూ... మ్యాచ్ ఆఖరి క్షణాల్లో అంపైర్లు చేసిన ఈ క్లిష్టమైన పొరపాటును తెలుసుకుని తామంతా ఆశ్చర్యపోయినట్లు పేర్కొన్నాడు. ‘నిబంధనలపై సంపూర్తి అవగాహన లేని మేం ఆ సమయంలో అంపైర్ల నిర్ణయాన్ని అంగీకరించాం. వందలకొద్దీ ఉన్న ఇతర నిబంధనల్లానే ఇదీ ఒకటని భావించాం తప్ప భిన్నమైనదని అనుకోలేదు’ అని అతడు తెలిపాడు. తీవ్ర ఉత్కంఠగా సాగిన తుది సమరంలో పరాజితులు ఎవరూ లేరని విలియమ్సన్ వివరించాడు. ఫలితాన్ని చూస్తే ఒక్క కిరీటం (ప్రపంచ కప్ ట్రోపీ) దక్కడం తప్ప రెండు జట్ల మధ్య తేడా ఏదీ లేదని అతడు విశ్లేషించాడు. కోచ్ గ్యారీ స్టీడ్ స్పందిస్తూ... ప్రపంచ కప్ నిబంధనలను తప్పనిసరిగా సమీక్షించాలని కోరాడు. ఆటలో సమఉజ్జీలుగా నిలిచినప్పటికీ సాంకేతిక అంశాలతో ఓటమి పాలవడం బాధాకరంగా ఉందని అతడు అన్నాడు. ఎన్నో అంశాలు ఉండగా... ప్రపంచ కప్ ఫైనల్ లాంటి మ్యాచ్‌లో ఇలాంటి నిబంధనలు వర్తింప చేయాల్సి వస్తుందని వాటిని రూపొందించినవారు సైతం ఊహించి ఉండరని స్టీడ్ పేర్కొన్నాడు. ‘ఆరు పరుగుల ఓవర్ త్రో’ నిర్ణయంపై స్పందిస్తూ అంపైర్లూ మనుషులేనని వారూ పొరపాట్లు చేస్తారని, అయినా వారు మ్యాచ్ అధికారులు కాబట్టి వాటిని అంగీకరించాల్సిందేనని అన్నాడు. భారత్‌లో జరిగే 2023 ప్రపంచ కప్‌నకు తమ జట్టు మరింత దృఢంగా తయారవుతుందని, టైటిల్‌కు గట్టి పోటీదారుగా నిలుస్తుందని కివీస్ దిగ్గజ స్పిన్నర్ డానియెల్ వెటోరి ఆశాభావం వ్యక్తం చేశాడు. ఫైనల్ ఓటమిని అతడు తేలిగ్గా తీసుకున్నాడు. మరోవైపు ఆటగాళ్లు విడివిడిగా స్వదేశం చేరుకుంటుండటంతో న్యూజిలాండ్ జట్టుకు స్వదేశంలో స్వాగత కార్యక్రమాన్ని ప్రస్తుతానికి వాయిదా వేశారు. అయితే, వారి అద్వితీయ ప్రదర్శనకు తగిన రీతిలో స్వాగతం పలకాలని బోర్డు భావిస్తోంది. దీనికోసం దేశ ప్రధాని జెసిండా అర్డెమ్, క్రీడా మంత్రి గ్రాంట్ రాబర్ట్సన్తో సంప్రదింపులు జరుపుతోంది. -
రికార్డు సాధించి ఔటయ్యాడు!
మాంచెస్టర్: న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఒక వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా, కెప్టెన్‌గా కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. భారత్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్‌లో విలియమ్సన్ 95 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 67 పరుగులు చేశాడు. దాంతో తాజా వరల్డ్‌కప్‌లో విలియమ్సన్ 548 పరుగులు సాధించాడు. ఈ క్రమంలోనే ఇప్పటివరకూ మార్టిన్ గప్టిల్(547 పరుగులు, 2015 వరల్డ్‌కప్)ఒక వరల్డ్‌కప్‌లో కివీస్ తరఫున అత్యధిక పరుగుల రికార్డు బద్ధలైంది. అయితే ఈ రికార్డు సాధించిన వెంటనే విలియమ్సన్ ఔటయ్యాడు. భారత స్పిన్నర్ చహల్ వేసిన 36 ఓవర్ రెండో బంతికి జడేజాకు క్యాచ్ ఇచ్చి విలియమ్సన్ పెవిలియన్ చేరాడు. దాంతో 134 పరుగుల వద్ద కివీస్ మూడో వికెట్‌ను కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కివీస్ ముందుగా బ్యాటింగ్ తీసుకుంది. గప్టిల్(1) ఆదిలోనే పెవిలియన్ చేరగా, నికోలస్(28) రెండో వికెట్‌గా ఔటయ్యాడు. విలియమ్సన్తో కలిసి 68 పరుగులు జత చేసిన తర్వాత రెండో వికెట్ భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆపై రాస్ టేలర్‌తో కలిసి 65 పరుగులు భాగస్వామ్యం సాధించిన తర్వాత విలియమ్సన్ ఔటయ్యాడు. -
నేడే తొలి సెమీఫైనల్.. భారత్ వర్సెస్ కివీస్
‘భారత్ సెమీఫైనల్ ప్రత్యర్థి న్యూజిలాండ్’ శనివారం అర్ధరాత్రి దాటాక ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మ్యాచ్ ఫలితం వచ్చాక సగటు టీమిండియా అభిమానిని ఒకింత సంతోషపర్చిన మాట ఇది! కివీస్‌తో పోరు అనగానే ఇక గెలుపు ఖాయం అన్నట్లుగా అన్ని వైపుల నుంచి ఫ్యాన్స్ నిశ్చింతంగా కనిపిస్తున్నారు. ఫైనల్ ప్రత్యర్థి గురించి మాత్రమే చర్చిస్తున్నారు. మరి నిజంగా ప్రపంచ కప్ సెమీఫైనల్ మాత్రం అంత ఏకపక్షంగా సాగుతుందా? అద్భుత విజయాలతో ఊపు మీదున్న భారత జట్టు నాకౌట్ ఒత్తిడిని అధిగమించి అలవోకగా న్యూజిలాండ్‌కు చెక్ పెడుతుందా? ఎనిమిది మ్యాచ్‌లలో ఒకే ఒక ఓటమి మినహా ఏడు సాధికారిక విజయాలతో సెమీస్ చేరిన జట్టు మనదైతే... పాక్‌తో సమానంగా ఐదు విజయాలే సాధించినా, వరుసగా గత మూడు మ్యాచ్‌లలో ఓడిన తర్వాత కూడా రన్‌రేట్ రూపంలో అదృష్టం కలిసొచ్చి ముందంజ వేసిన టీమ్ న్యూజిలాండ్. బలబలాల పరంగా ప్రత్యర్థి కంటే ఎంతో మెరుగ్గా కనిపిస్తున్న కోహ్లి సేనకే విజయావకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఐసీసీ టోర్నీలో అనూహ్య ప్రదర్శన కనబర్చడం అలవాటుగా మార్చుకున్న కివీస్ అంత సులువుగా లొంగుతుందా? ఫుట్‌బాల్ సంగతేమో కానీ ఇప్పుడు మాత్రం మాంచెస్టర్ మొత్తం నీలి రంగు పులుముకుంది. విండీస్‌తో మ్యాచ్ తర్వాత కోహ్లి చేసిన వ్యాఖ్య ఇది. అంతకుముందు ఇదే మైదానంలో పాకిస్తాన్‌తో పోరులో కూడా ‘మెన్ ఇన్ బ్లూ’ అభిమాన సంద్రం తరలి వచ్చింది. ఒక రకంగా సొంతగడ్డలా కనిపిస్తోన్న ఓల్డ్ ట్రఫోర్డ్‌లో కోహ్లి సేన ముందు ‘బ్లాక్ క్యాప్స్’ నిలవగలదా? మూడోసారి జగజ్జేతగా నిలిచేందుకు రెండడుగుల దూరంలో ఉన్న భారత్‌కు లార్డ్స్ ప్రయాణంకంటే ముందు కివీస్ సవాల్ ఎదురుగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఇక అందరి కళ్లూ భారత్–న్యూజిలాండ్ తొలి సెమీస్‌పైనే ఉన్నాయి. మాంచెస్టర్: ప్రపంచ కప్ లీగ్ దశలో భారత్, న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ‘ఫేస్ టు ఫేస్’లో ఆధిపత్యం ఎవరిదో తేలలేదు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో మనపై కివీస్ చెలరేగినా అది అసలు సమరం మాత్రం కానే కాదు. ఇప్పు డు ఇరు జట్లు నేరుగా నాకౌట్ మ్యాచ్‌లోనే తలపడుతున్నాయి. నేడు ఇక్కడి ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో జరిగే తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను భారత్ ఎదుర్కోనుంది. 2015లోనూ భారత్ సెమీస్ చేరి ఆసీస్ చేతిలో ఓడగా... కివీస్ తుదిపోరుకు అర్హత సాధించి అక్కడ కుదేలైంది. ఇటీవలే కోహ్లి, బుమ్రా లేకుండానే కివీస్‌ను వారి సొంతగడ్డపైనే వన్డే సిరీస్‌లో 4–1తో చిత్తు చేసిన భారత్‌కు ప్రత్యర్థి బలహీనతలపై పక్కా అవగాహన ఉందనడంలో సందేహం లేదు. మార్పులు ఉంటాయా... వరుస విజయాలతో జోరు మీదున్న జట్టు నాకౌట్ మ్యాచ్‌కు వెళుతుంటే సహజంగానే మార్పులకు ఆస్కారం ఉండదు. భారత జట్టు కూడా దాదాపు అదే తరహాలో ఆలోచిస్తోంది. అనితర సాధ్యమైన రీతిలో ఐదు సెంచరీలతో రోహిత్ శర్మ చెలరేగి ఆడుతుండగా, కోహ్లి ఈసారి సహాయక పాత్రలో సమర్థంగా రాణించాడు. ఓపెనర్‌గా రాహుల్ సఫలం కావడం కూడా భారత్‌లో ఆందోళన తగ్గించింది. అయితే సెమీఫైనల్ ఆరంభ ఓవర్లలో వీరంతా బౌల్ట్‌ను సమర్థంగా ఎదుర్కోవడం ముఖ్యం. బౌల్ట్‌కు అవకాశమిస్తే అతను మొత్తం బ్యాటింగ్‌ను కుప్పకూల్చగలడు. నాలుగో స్థానంలో పంత్ సామర్థ్యంపై కొంత అపనమ్మకం కనిపిస్తున్నా, అతని స్థానానికి ఢోకా లేదు. పాండ్యా దూకుడును కొనసాగించాల్సి ఉండగా... ధోని ఈసారి ఒక గొప్ప ఇన్నింగ్స్ ఆడకపోతాడా అని అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. లంకతో మ్యాచ్‌లో ధోనికి బ్యాటింగ్ చేయాల్సిన అవసరం రాలేదు. ఓవరాల్‌గా తన బ్యాటింగ్‌పై అత్తెసరు మార్కులే వేయించుకున్న మాజీ కెప్టెన్ కూడా చెలరేగితే టీమిండియాకు తిరుగుండదు. ఇద్దరు రెగ్యులర్ పేసర్లతోనే ఆడితే గత మ్యాచ్‌లాగే రవీంద్ర జడేజా కొనసాగే అవకాశం ఉంది. అయితే పిచ్‌ను బట్టి అవసరమైతే ప్రత్యామ్నాయ స్పిన్నర్‌గా పనికొస్తాడు కాబట్టి దినేశ్ కార్తీక్ స్థానంలో కేదార్ జాదవ్ తిరిగి రావచ్చు. అయితే లంకతో మ్యాచ్‌లో పాండ్యా కూడా పూర్తి పది ఓవర్ల కోటా వేశాడు కాబట్టి ఈ మార్పు సందేహమే. విలియమ్సన్ మినహా... టోర్నీ ఆరంభంలో చెలరేగిన న్యూజిలాండ్ ఆ తర్వాత తడబడింది. తమ చివరి మూడు మ్యాచ్‌లలో పరాజయాలే అందుకు నిదర్శనం. సరిగ్గా చెప్పాలంటే ఒక్క కెప్టెన్ విలియమ్సన్ మినహా మిగతా వారంతా అంతంత మాత్రంగానే ఆడుతున్నారు. సీనియర్ రాస్ టేలర్ కూడా వరుసగా విఫలమవుతుండటంతో ఆ జట్టు బ్యాటింగ్ బలహీనంగా కనిపిస్తోంది. గప్టిల్ ఘోరంగా ఆడుతుండగా... రెండో ఓపెనర్‌గా మార్చి మార్చి మున్రో, నికోల్స్‌లను ఆడించినా ఇద్దరూ చేతులెత్తేశారు. మిడిలార్డర్లో కీపర్ లాథమ్ పర్వాలేదనిపిస్తున్నాడు. ఆల్రౌండర్లుగా నీషమ్, గ్రాండ్‌హోమ్ తమ విలువను చూపిస్తే కివీస్ పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సౌతీ స్థానంలో ఫాస్ట్ బౌలర్ ఫెర్గూసన్ రావడం ఖాయమైంది. మూడో పేసర్ హెన్రీ స్థానంలో లెగ్ స్పిన్నర్ సోధికి అవకాశం ఇవ్వాలని కూడా కివీస్ మేనేజ్మెంట్ ఆలోచిస్తోంది. గత రెండు మ్యాచ్‌లలో సాన్ట్నర్ను తప్పించి రెండో స్పిన్నర్ లేని కొరత ఆ జట్టులో బాగా కనిపించింది. పోరాటపటిమలో ఎక్కడా తగ్గని న్యూజిలాండ్ జట్టు వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరాలని పట్టుదలగా ఉంది. సెమీఫైనల్ రోజున మాంచెస్టర్‌లో కొంత వర్షసూచన ఉన్నా, అది మ్యాచ్‌కు అంతరాయం కలిగించకపోవచ్చు. ఒకవేళ మంగళవారం మ్యాచ్ జరగకపోతే రిజర్వ్ డే బుధవారం దానిని నిర్వహిస్తారు. రిజర్వ్ డే రోజు కూడా మ్యాచ్ సాధ్యం కాకపోతే గ్రూప్ దశలో ఎక్కువ పాయింట్లు సాధించిన జట్టు (భారత్) ఫైనల్లోకి ప్రవేశిస్తుంది. మ్యాచ్ రోజున ఒక జట్టు ఇన్నింగ్స్ పూర్తయి రెండో జట్టు ఇన్నింగ్స్ ప్రారంభమై మధ్యలో ఆగిపోతే (డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలోనూ విజేత తేలకపోతే)... ఎక్కడ ఆట ఆగిపోయిందో అక్కడి నుంచే మ్యాచ్‌ను రిజర్వ్ డే రోజున కొనసాగిస్తారు. ఒకవేళ సెమీఫైనల్ మ్యాచ్ ‘టై’గా ముగిస్తే విజేతను నిర్ణయించేందుకు టి20 తరహాలో ‘సూపర్ ఓవర్’ నిర్వహిస్తారు. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రోజు సూపర్ ఓవర్ సాధ్యపడకపోతే రిజర్వ్ డే రోజున సూపర్ ఓవర్ వేయిస్తారు. ఒకవేళ వర్షం కారణంగా రిజర్వ్ డే రోజున కూడా సూపర్ ఓవర్ వీలుకాకపోతే లీగ్ దశలో ఎక్కువ పాయింట్లు సాధించిన జట్టు (భారత్) ఫైనల్‌కు చేరుతుంది. పిచ్, వాతావరణం ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానం బ్యాటింగ్‌కు అనుకూలం. భారీ స్కోర్లకు అవకాశం ఉంది. భారత్ ఇప్పటికే ఇక్కడ పాక్, విండీస్లపై గెలవగా... కివీస్ చేతిలో విండీస్ త్రుటిలో ఓడింది ఇక్కడే. మోర్గాన్ 17 సిక్సర్లు ఇదే స్టేడియంలో బాదాడు. అయితే ఈ మ్యాచ్‌కు కొత్తగా వేసిన పిచ్‌ను వాడుతున్నారు. టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ చేయడం ఖాయం. ఈ ప్రపంచకప్‌లో ఈ మైదానంలో జరిగిన 5 లీగ్ మ్యాచ్‌లలో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది. ప్రపంచ కప్ రెండో దశకు వచ్చేసరికి పిచ్‌లు జీవం కోల్పోయి రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం కష్టంగా మారిపోయింది. గత 20 మ్యాచ్‌లలో రెండోసారి బ్యాటింగ్ చేసిన టీమ్ 4 మ్యాచ్‌లే గెలవగలిగింది. తుది జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, రాహుల్, పంత్, ధోని, పాండ్యా, కార్తీక్/జాదవ్, జడేజా, భువనేశ్వర్, కుల్దీప్, బుమ్రా. న్యూజిలాండ్: విలియమ్సన్ (కెప్టెన్), గప్టిల్, మున్రో, టేలర్, లాథమ్, నీషమ్, గ్రాండ్‌హోమ్, సాన్‌ట్నర్, ఫెర్గూసన్, బౌల్ట్, హెన్సీ/సోధి. బౌల్ట్ X రోహిత్ రోహిత్ శర్మ ప్రపంచకప్‌లో ఇప్పటికే 647 పరుగులు సాధించాడు. సచిన్ చేసిన ఆల్‌టైమ్ వరల్ట్ కప్ రికార్డు (673)ని దాటేందుకు కేవలం 27 పరుగుల దూరంలో ఉన్న అతను సెమీస్‌లోనూ చెలరేగితే భారత్‌కు తిరుగుండదు. కాబట్టి అతడిని ఆపేందుకు కివీస్ తమ ‘ట్రంప్ కార్డ్’ ట్రెంట్ బౌల్ట్‌ను ప్రయోగిస్తుందనడంలో సందేహం లేదు. బౌల్ట్ బౌలింగ్‌లో రోహిత్ రికార్డు గొప్పగా లేదు. ముఖ్యంగా లెఫ్టార్మ్ పేసర్లు వేసే ఇన్‌స్వింగర్లను ఎదుర్కోవడంలో అతని బలహీనత చాలా సార్లు బయటపడింది. వార్మప్ మ్యాచ్‌లో కూడా బౌల్ట్ సరిగ్గా ఇలాంటి బంతితోనే రోహిత్‌ను ఎల్బీగా ఔట్ చేశాడు. ఈసారి రోహిత్ అతడిని ఎంత బాగా ఎదుర్కొంటాడో చూడాలి. వన్డేల్లో బౌల్ట్ బౌలింగ్‌లో 136 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 64.7 స్ట్రయిక్ రేట్‌తో 88 పరుగులు మాత్రమే చేయగలిగాడు. నాలుగుసార్లు అతని బౌలింగ్‌లో ఔటయ్యాడు. 3-3 ప్రపంచకప్‌లో ఆరుసార్లు సెమీఫైనల్ చేరిన భారత్ 3సార్లు ఓడి (1987, 1996, 2015) మూడుసార్లు ఫైనల్ చేరింది. ఇందులో 2003 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడగా.. 1983, 2011లలో విజేతగా నిలిచింది. 1-6 ప్రపంచ కప్‌లో ఏడుసార్లు సెమీస్ చేరిన న్యూజిలాండ్ 2015లో ఫైనల్ చేరడం మినహా మిగతా ఆరు సార్లు (1975, 1979, 1992, 1999, 2007, 2011) సెమీస్‌లోనే ఓడింది. అత్యధికంగా ఆరు సార్లు సెమీస్‌లో ఓడిన రికార్డు కివీస్ పేరిటే ఉంది. 4-3 ప్రపంచకప్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు ఏడుసార్లు తలపడ్డాయి. నాలుగు మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ గెలిచింది. మూడు మ్యాచ్‌ల్లో భారత్‌కు విజయం దక్కింది. ఈ రెండు జట్లు 2003 తర్వాత మళ్లీ ఓ ప్రపంచకప్ మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనుండటం విశేషం. 2003 ప్రపంచకప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఏడు వికెట్లతో గెలిచింది. -
రోహిత్ వెనక్కి పిలిచి ఉంటే...
రెండో టి20 మ్యాచ్‌లో జరిగిన ఒక ఘటన అంపైర్ సమీక్షా పద్ధతి (డీఆర్ఎస్) పనితీరుపై కొత్త సందేహాలు రేకెత్తించింది. కివీస్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో కృనాల్ వేసిన బంతి బ్యాట్స్‌మన్ డరైన్ మిషెల్ ప్యాడ్లను తాకింది. దాంతో భారత్ అప్పీల్ చేయడం, వెంటనే అంపైర్ ఔట్‌గా ప్రకటించడం జరిగిపోయాయి. అయితే నాన్ స్ట్రయికింగ్ ఎండ్‌లో ఉన్న కెప్టెన్ విలియమ్సన్ సూచనపై మిషెల్ రివ్యూ కోరాడు. రీప్లేలో బంతి బ్యాట్‌ను దాటే సమయంలో ఎలాంటి ‘స్పైక్’ను చూపించలేదు. పైగా హాట్‌స్పాట్ లో బంతి బ్యాట్‌కు తగిలినట్లు స్పష్టంగా కనిపించింది. అయితే బాల్ ట్రాకింగ్‌లో మాత్రం మూడు ఎరుపు గుర్తులు రావడంతో మూడో అంపైర్ షాన్ హెయిగ్... ఔట్‌గా ప్రకటించారు. మైదానంలో భారీ స్క్రీన్‌పై ఇదంతా చూసిన కివీస్ ఆటగాళ్లు, అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. విలియమ్సన్ అంపైర్ల వద్దకు వెళ్లి ఏమిటిలా అంటూ ప్రశ్నించే ప్రయత్నం చేయగా, ఆ తర్వాత రోహిత్ కూడా బ్యాట్స్‌మెన్‌తో పాటు అంపైర్లతో చర్చించాడు. బహుశా అతనికి సైతం అంపైర్ నిర్ణయం తప్పని అర్థమై ఉంటుంది. అయితే అంపైర్లతో రోహిత్ మరోసారి మాట్లాడుతుండగా అతడిని ధోని వారించడం కనిపించింది. దాంతో మిషెల్ వెనుదిరగక తప్పలేదు. నిబంధనల ప్రకారం ప్రత్యర్థి కెప్టెన్ మాత్రమే ఔటైన బ్యాట్స్‌మన్‌ను తర్వాతి బంతి వేసేలోగా వెనక్కి పిలవవచ్చు. కానీ రోహిత్ ఆ పని చేయలేదు. క్రీడాస్ఫూర్తి వంటి అంశాలకంటే అతను వికెట్ విలువను ఎక్కువగా భావించినట్లున్నాడు! మ్యాచ్ అనంతరం ఈ ఘటనపై భారత పేసర్ ఖలీల్ మాట్లాడుతూ...‘అప్పీల్‌ను వెనక్కి తీసుకోమని విలియమ్సన్ మమ్మల్నేమీ కోరలేదు. మేం అంపైర్ నిర్ణయం కోసమే వేచి చూస్తున్నాం. దానిని అంగీకరించడం తప్ప మరో మార్గం లేదు’ అని ఆ సమయంలో జరిగిన చర్చను వివరించాడు. -
విజయంతో ముగిస్తారా..!
కఠినంగా సాగుతుందని భావించిన వన్డే సిరీస్‌ను వరుసగా మూడు విజయాలతో సునాయాసంగా కైవసం చేసుకుంది టీమిండియా. హామిల్టన్‌లో జరిగిన నాలుగో మ్యాచ్‌లో మాత్రం అచ్చమైన న్యూజిలాండ్ పిచ్ ఎదురయ్యే సరికి ట్రెంట్ బౌల్ట్ స్వింగ్ ధాటికి బోల్తాకొట్టింది. తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ సహా బ్యాట్స్‌మెన్ కలసికట్టుగా విఫలమవడంతో బౌలర్లకూ చేసేందుకు ఏమీ లేకపోయింది. జట్టులో ఎవరున్నారు? ఎవరు లేరు? అని కాకుండా... స్వింగ్‌కు పేరుగాంచిన ఇంగ్లండ్‌లో జరిగే ప్రపంచ కప్ ముందు ఓ మేల్కొలుపు లాంటి ఓటమి ఇది. ఇక చివరి వన్డే వేదికైన వెల్లింగ్టన్‌లోనూ పిచ్ దాదాపు హామిల్టన్ తరహాలోనే ఉండనున్నట్లు కనిపిస్తోంది. ఈ సవాల్‌ను అధిగమించి భారత్ తమ ఆధిక్యాన్ని 4–1కు పెంచుకుంటుందా? లేక తలొంచి 3–2తో సంతృప్తిపడుతుందా? వెల్లింగ్టన్ ‘ఇలాంటి ఫలితం మాకు హెచ్చరికలాంటిది. దీన్నుంచి మేం పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది...’ నాలుగో వన్డేలో ప్రతిఘటనే లేకుండా ఓడటంతో టీమిండియా పేసర్ భువనేశ్వర్ చేసిన వ్యాఖ్యలివి. ప్రతిష్ఠాత్మక ప్రపంచ కప్ ముందు, విదేశీ గడ్డపై చివరి వన్డే ఆడబోతున్న భారత్ విషయంలో ఈ అభిప్రాయం వంద శాతం నిజమైనదే. దీన్నుంచి మన జట్టు ఎలాంటి పాఠం నేర్చుకుంది అనేది న్యూజిలాండ్‌తో ఆదివారం ఇక్కడి బేసిన్ రిజర్వ్ మైదానంలో జరిగే చివరిదైన ఐదో వన్డేలో తెలియనుంది. మరోవైపు గాయంతో గత రెండు వన్డేలకు దూరమైన వెటరన్ మహేంద్ర సింగ్ ధోని ఈ మ్యాచ్‌లో ఆడనుండటం టీమిండియాకు సానుకూలాంశం. కాగా, ఓపెనర్ మార్టిన్ గప్టిల్ వెన్నునొప్పితో దూరం కావడం కివీస్‌కు ప్రతికూలం కానుంది. మహి వచ్చాడు... సిరీస్ గణాంకాలను 4–1తో ముగిస్తే భారత్ తనదైన ఆధిపత్యం చాటినట్లవుతుంది. నాలుగో వన్డేలో ఊహించని పిచ్‌పై దెబ్బతిన్నందున ఈ మ్యాచ్‌లో కొంచెం జాగ్రత్తగా ఆడే అవకాశం కనిపిస్తోంది. హామిల్టన్‌లో బౌల్ట్ స్పెల్‌ను కాచుకుని ఉంటే... తర్వాత పరుగులు వచ్చేవి. మరోసారి అతడి ప్రభావానికి లొంగకుండా చూసుకోవాలి. కోహ్లి లేని నేపథ్యంలో ఆ బాధ్యత ఓపెనర్లు రోహిత్, ధావన్‌లదే. యువ శుబ్‌మన్ గిల్‌ను పరీక్షించి చూడాలనుకుంటే... దినేశ్ కార్తీక్ బెంచ్‌కు పరిమితం కావాల్సి ఉంటుంది. గిల్‌ను తప్పిస్తే రాయుడు మూడో స్థానంలో వస్తాడు. 4, 5 స్థానాల్లో కార్తీక్, ధోని ఆడతారు. షమీకి విశ్రాంతితో రెండో పేసర్‌గా ఖలీల్‌నే ఎంచుకోవచ్చు. హైదరాబాదీ సిరాజ్ పేరు వినిపిస్తున్నా అది ఖాయం కాదు. భువనేశ్వర్‌కు స్వింగ్ అనుకూలిస్తే ఫలిస్తే ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు కష్టాలు తప్పవు. కివీకి కేన్ బెంగ ఆతిథ్య జట్టును కెప్టెన్ విలియమ్సన్ ఫామ్ కంగారు పెడుతోంది. తొలి మ్యాచ్‌లో అర్ధసెంచరీ చేసిన తర్వాత అతడు మళ్లీ రాణించలేదు. బ్యాటింగ్ భారాన్ని రాస్ టేలర్ ఒక్కడే మోస్తున్నాడు. గప్టిల్ లేనందున నికోల్స్‌తో మున్రో ఇన్నింగ్స్ ప్రారంభించవచ్చు. వీరితోపాటు లాథమ్‌ను త్వరగా ఔట్ చేస్తే టీమిండియా పని సులువవుతుంది. ఇక పేసర్ హెన్రీ బదులుగా టిమ్ సౌథీని బరిలో దింపే ఆలోచనలో న్యూజిలాండ్ ఉంది. అనుకూల పరిస్థితుల్లో బౌల్ట్‌కు సౌథీ తోడైతే భారత్ శ్రమించక తప్పదు. పిచ్, వాతావరణం పిచ్ స్వింగ్‌కు అనుకూలించవచ్చు. మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు. గాలులతో కూడిన వేడి వాతావరణం ఉండనుంది. గత మూడేళ్లలో ఈ మైదానంలో న్యూజిలాండ్ సగటు స్కోరు 207 మాత్రమే కావడం గమనార్హం. తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్), ధావన్, రాయుడు, గిల్/దినేశ్ కార్తీక్, ధోని, జాదవ్, పాండ్యా, భువనేశ్వర్, చహల్, కుల్దీప్, ఖలీల్ న్యూజిలాండ్: నికోల్స్, మున్రో, విలియమ్సన్ (కెప్టెన్), రాస్ టేలర్, లాథమ్, గ్రాండ్‌హోమ్, నీషమ్, బ్రేస్‌వెల్/సాన్‌ట్నర్, ఆస్టల్, హెన్రీ/సౌథీ, బౌల్ట్. -
49 ఏళ్ల తర్వాత...
అబుదాబి: బౌలర్ల అద్భుత ప్రదర్శన కారణంగా పాకిస్తాన్‌తో మూడు టెస్టుల సిరీస్‌ను న్యూజిలాండ్ 2–1తో కైవసం చేసుకుంది. అందివచ్చిన అవకాశాలను చేజార్చుకున్న పాక్ రెండో సొంతగడ్డలాంటి యూఏఈలో వరుసగా రెండో టెస్టు సిరీస్ కోల్పోయింది. శుక్రవారం ముగిసిన చివరిదైన మూడో టెస్టులో కివీస్ 123 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా 49 ఏళ్ల తర్వాత విదేశీ గడ్డపై పాకిస్తాన్‌పై సిరీస్ విజయం సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 272/4తో చివరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ 353/7 వద్ద డిక్లేర్ చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (139; 13 ఫోర్లు) క్రితం రోజు స్కోరు వద్దే వెనుదిరగ్గా... నికోల్స్ (126 నాటౌట్; 12 ఫోర్లు) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. యాసిర్ షా 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 280 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలో దిగిన పాకిస్తాన్ 56.1 ఓవర్లలో 156 పరుగులకే కుప్పకూలింది. బాబర్ ఆజమ్ (51; 5 ఫోర్లు) ఒక్కడే అర్ధశతకం సాధించగా... మిగ తావారు పూర్తిగా విఫలమయ్యారు. కెరీర్లో చివరి టెస్టు ఆడిన హఫీజ్ (8) నిరాశ పరిచాడు. కివీస్ బౌలర్లలో సౌథీ, ఎజాజ్ పటేల్, సోమెర్‌విల్లే మూడేసి వికెట్లు పడగొట్టారు. విలియమ్సన్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, యాసిర్ షాకు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. -
నిర్మలతో భేటీకి బ్రిటన్ మంత్రి నిరాకరణ
లండన్: రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీకి నిరాకరించిన బ్రిటన్ రక్షణ మంత్రి విలియమ్సన్‌పై ఆయన మంత్రివర్గ సహచరులే తీవ్ర విమర్శలు చేస్తున్నారని ఆ దేశ మీడియా పేర్కొంది. రక్షణ రంగంలో భాగస్వామ్యం, కొనుగోళ్లపై రెండు దేశాల మధ్య జూన్ 20–22 తేదీల్లో లండన్‌లో ద్వైపాక్షిక సమావేశం జరగ్గా.. నిర్మలా సీతారామన్‌తో భేటీకి రక్షణ మంత్రి గవిన్ విలియమ్సన్‌ను భారత అధికారులు అపాయింట్మెంట్ అడిగారు. అందుకు విలియమ్సన్ సుముఖత వ్యక్తం చేయలేదని అక్కడి మీడియా ఆదివారం వెల్లడించింది. ఫలితంగా సీతారామన్ తన పర్యటనను రద్దు చేసుకున్నారని సండే టైమ్స్ పత్రిక పేర్కొంది. అయితే ఈ కథనాలను నిర్మలా సీతారామన్ ఖండించారు. -
అతడిని ఆదర్శంగా తీసుకోవాలి
పటిష్ట బ్యాటింగ్ లైనప్ ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సాధారణ లక్ష్యాన్ని కాపాడుకోవడం గొప్ప విషయం. మ్యాచ్ మ్యాచ్‌కూ సన్‌రైజర్స్ బౌలర్ల ప్రదర్శన మెరుగవుతోంది. కెప్టెన్ విలియమ్సన్ నిలకడగా ఆడుతుండగా... అతనికి సహచరుల నుంచి మద్దతు లభించాల్సిన అవసరం ఉంది. సన్‌రైజర్స్ జట్టులో కొందరు బ్యాట్స్‌మెన్ ఔటవుతున్న తీరు నిరాశ కలిగిస్తోంది. శుభారంభం లభించాక ఎక్కువసేపు క్రీజులో నిలిచి భారీగా పరుగులు చేయడంపై ఆ జట్టు దృష్టి సారించాలి. ఈ విషయంలో విలియమ్సన్‌ను మిగతావారు ఆదర్శంగా తీసుకోవాలి. 20 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ వాటిని అర్ధ సెంచరీలుగా మార్చేందుకు ప్రయత్నించి జట్టు భారీ స్కోరుకు దోహదపడాలి. మరోవైపు ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకు పృథ్వీ షా, శ్రేయస్ అయ్యర్ ద్వారా శుభారంభాలు లభిస్తున్నాయి. సన్‌రైజర్స్‌తో నేడు జరిగే మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాలని డేర్ డెవిల్స్‌కు తెలుసు. ఢిల్లీ ఎక్కువగా భారత బ్యాట్స్‌మెన్ ఆటతీరుపైనే ఆధారపడుతోంది. స్పిన్నర్ అమిత్ మిశ్రా పొదుపుగా బౌలింగ్ చేయడంతోపాటు కీలక సమయాల్లో వికెట్లు తీస్తున్నాడు. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ గట్టెక్కాలంటే విశేషంగా రాణించాల్సిందే. -
రైజర్స్‌ను బెంగళూరు ఆపగలదా!
సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుతమైన ఫామ్‌లో ఉంది. ఆ జట్టు తక్కువ లక్ష్యాలను కాపాడుకోవడమే కాదు...ఢిల్లీతో జరిగిన గత మ్యాచ్‌లో ఛేదనలోనూ గెలవగలమని నిరూపించింది. నిజానికి అదేమీ భారీ లక్ష్యం కాదు. ఓవర్‌కు 8 పరుగులకంటే కాస్త ఎక్కువగా మాత్రమే చేయాల్సి ఉంది. అయితే రన్‌రేట్ భారీగా పెరిగిపోయినా తాము దానిని అందుకోగలమని రైజర్స్ చూపించింది. కెప్టెన్ విలియమ్సన్ జట్టుకు అనుసంధానకర్తలా సమర్థంగా పని చేస్తున్నాడు. తుది జట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లు మాత్రమే ఉండాలి కాబట్టి గత ఏడాది విలియమ్సన్కు ఎక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం దక్కలేదు. ఆ సమయంలో నాటి కెప్టెన్ డేవిడ్ వార్నర్ బ్యాటింగ్‌లో అందరికంటే కీలక పాత్ర పోషించాడు. ఈ సారి వార్నర్ లేకపోవడంతో పాటు కెప్టెన్‌గా కూడా విలియమ్సన్‌పై అదనపు బాధ్యత పడింది. ఈ కివీస్ కెప్టెన్ తన ఆటను అన్ని రకాలుగా మెరుగుపర్చుకొని బ్యాట్స్‌మన్ అంటే చితకబాదేవాడు మాత్రమే కాదని నిరూపించాడు. పైగా ఎంతో నిలకడగా ఆడాడు. అన్నింటికి మించి క్లిష్ట సమయాల్లో కూడా అతను సంయమనం కోల్పోకుండా ప్రశాంతంగా కనిపిస్తూ ఈ విషయంలో మహేంద్ర సింగ్ ధోనిని గుర్తు చేస్తున్నాడు. సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై కావడం దాదాపు ఖాయం కాగా... మరోవైపు వారి ప్రత్యర్థి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్రతి మ్యాచ్ తప్పక గెలవాల్సిన స్థితిలో ఉంది. చెన్నైతో మ్యాచ్‌లో అతి తక్కువ స్కోరు నమోదు చేయడంతో ఓటమితోపాటు రన్‌రేట్‌పై కూడా తీవ్ర ప్రభావం చూపించింది. అలాంటి చిన్న స్కోర్లు జట్టుకు మేలు చేయవు. మరోసారి బెంగళూరు చెత్త ఫీల్డింగ్‌తో సునాయాస క్యాచ్‌లు వదిలేయడంతో చెన్నై గెలిచింది. వారికి ఉన్న బ్యాటింగ్ లైనప్‌ను చూస్తే ఆ జట్టు ప్రతీ మ్యాచ్‌లో కనీసం 180 పరుగులైనా చేయాల్సిందే. గత ఏడాది వారి బౌలింగ్ మరీ చెత్తగా ఉండి జట్టుకు ఘోర పరాభవాలు మిగిల్చింది. ఈసారి ఉమేశ్, చహల్ చాలా బాగా బౌలింగ్ చేస్తున్నారు కానీ వారు ఒక్క చెత్త ఓవర్ వేసినా కోలుకోగలిగేంత కనీస స్కోరు కూడా బెంగళూరు చేయడం లేదు. సన్‌రైజర్స్ జోరు కొనసాగించాలని కోరుకుంటుండగా, బెంగళూరు దానికి బ్రేక్ వేయగలుగుతుందో లేదో చూడాలి. -
విలియమ్సన్ రికార్డు సెంచరీ
ఆక్లాండ్: ఇంగ్లండ్‌తో జరుగుతోన్న డే–నైట్ టెస్టులో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (102; 11 ఫోర్లు, 1 సిక్స్) రికార్డు సెంచరీ నమోదు చేశాడు. 91 పరుగుల వ్యక్తిగత స్కోరుతో రెండో రోజు బ్యాటింగ్ కొనసాగించిన అతను అండర్సన్ బంతికి సింగిల్ తీయడం ద్వారా టెస్టు క్రికెట్లో 18వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో న్యూజిలాండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. అంతకుముందు కివీస్ తరఫున రాస్ టేలర్, మార్టిన్ క్రో చెరో 17 శతకాలతో అగ్రస్థానంలో ఉన్నారు. తొలి టెస్టు రెండో రోజు ఆటకు వరుణుడు అడ్డుపడటంతో 23.1 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఓవర్‌నైట్ స్కోరు 175/3తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన కివీస్ శుక్రవారం ఆట నిలిచిపోయే సమయానికి 4 వికెట్ల నష్టానికి 229 పరుగుల వద్ద నిలిచింది. ఆరు వికెట్లు చేతిలో ఉన్న కివీస్ ప్రస్తుతం 171 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంలో ఉంది. నికోల్స్ (49 బ్యాటింగ్), వాట్లింగ్ (17 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రత్యర్థి బౌలర్లలో అండర్సన్ 3 వికెట్లు పడగొట్టాడు. -
విలియమ్సన్ సెంచరీ: పాక్‌పై కివీస్ గెలుపు
వెల్లింగ్టన్: పాకిస్తాన్‌తో మొదలైన ఐదు వన్డేల సిరీస్‌లో ఆతిథ్య న్యూజిలాండ్ శుభారంభం చేసింది. తొలి వన్డేలో కివీస్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 61 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారీ వర్షం వల్ల పాక్ ఇన్నింగ్స్ పూర్తిగా సాగలేదు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 315 పరుగులు చేసింది. కెప్టెన్ విలియమ్సన్ (115; 8 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ సాధించాడు. గప్టిల్ (48; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), మున్రో (58; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు); నికోల్స్ (43 బంతుల్లో 50; 4 ఫోర్లు) ఆకట్టుకున్నారు. తర్వాత వర్షంతో ఆట నిలిచే సమయానికి పాకిస్తాన్ 30.1 ఓవర్లలో 6 వికెట్లకు 166 పరుగులు చేసింది. ఫఖర్ జమాన్ (82 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఒక్కడే రాణించాడు. కివీస్ బౌలర్లలో సౌతీ 3, బౌల్ట్ 2 వికెట్లు పడగొట్టారు. బలమైన ఈదురు గాలులతో వికెట్ల మీది బెయిల్స్ పదే పదే పడిపోవడంతో వాటిని తీసేసి మ్యాచ్‌ను ఆడించారు. ఇరు జట్ల మధ్య 9న రెండో వన్డే జరుగనుంది. -
ఆ ఇద్దరితో మాకు కష్టమే: న్యూజిలాండ్ కెప్టెన్
సాక్షి, ముంబై: భారత యువ స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్‌లను ఎదుర్కోవడం కష్టమైన పనేనని న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ అభిప్రాయపడ్డారు. ఈ ఇద్దరు నైపుణ్యం గల బౌలర్లని, ఐపీఎల్లో అద్భుతంగా రాణించారని ప్రశంసించారు. ఈనెల 22 నుంచి భారత్‌తో ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌లో పాల్గొనేందుకు ఇక్కడి వచ్చిన సందర్భంగా విలియమ్సన్ మీడియాతో ముచ్చటించారు. చైనామన్ బౌలర్లు అరుదుగా ఉంటారని, వారిని ఎదుర్కోవడం చాలెంజ్‌తో కూడుకున్నదన్నారు. ఇక కుల్డీప్, చాహాల్ బౌలింగ్ నైపుణ్యం చాలా బాగుందన్నారు. కానీ ఇక్కడి పరిస్థితులను అందిపుచ్చుకోవడమే మాకు పెద్ద సవాలని విలియమ్సన్ చెప్పుకొచ్చారు. ఇక సీనియర్ స్పిన్నర్లు అశ్విన్, జడేజాలు జట్టులో లేకపోవడంపై విలియమ్సన్ ప్రశ్నించగా.. వారు లేకపోవడం మాకు కూడా ఆశ్చర్యం కలిగించిందన్నారు. కానీ భారత్‌లో ప్రతిభ కలిగిన క్రికెటర్లు ఉన్నారని, భారత్ ఈ మధ్య ఎక్కువ మ్యాచ్‌లు ఆడిందన్నారు. ప్రతి ఒక్కరు అన్ని ఫార్మాట్లు ఆడటం కష్టమని, బిజీ షెడ్యూల్ వల్ల కొందరికి విశ్రాంతి ఇవ్వడం క్రికెట్లో సహజమేనని అభిప్రాయపడ్డారు. మేము గత వేసవిలో ఇలాంటి పరిస్థితే ఎదుర్కొన్నామని చెప్పుకొచ్చారు. ఈ మధ్యకాలంలో భారత్ మరింత దృడంగా తయారైందన్నారు. ఇక ఆస్ట్రేలియాపై కుల్దీప్ హ్యాట్రిక్ తీయడం తనను ఎంతగానో ఆకట్టుకుందని విలియమ్సన్ కొనియాడాడు. గతేడాది సిరీస్ (3-2) చేజారడం నిరాశపరిచిందని, ఈ సారి అవకాశం ఇవ్వకూడదని కివీస్ ఆటగాళ్లంతా ఉత్సాహంగా ఉన్నట్లు తెలిపారు. చాలా మంది ప్లేయర్లకు ఇక్కడ ఆడిన అనుభవం ఉందన్నారు. కివీస్ కోచ్ మైక్ హెస్సన్ మాట్లాడుతూ.. ‘కుల్దీప్, చాహల్ బౌలింగ్‌ను ఐపీఎల్లో మా ఆటగాళ్లు చాల మంది ఎదుర్కొన్నారు. కొందరు కుల్దీప్ సహచరులుగా అతని మణికట్టు విద్యను గమనించారు. మణికట్టు స్పిన్నర్లు ఎక్కువగా పరుగుల ఇచ్చే అవకాశం కల్పిస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మేం విజయవంతమైనట్లేనని’ మైక్ తెలిపారు. -
విలియమ్సన్ మరో హాఫ్ సెంచరీ
కార్డిఫ్:చాంపియన్స్ ట్రోఫీలో అత్యంత నిలకడగా ఆడుతున్న న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మరో హాఫ్ సెంచరీ సాధించాడు. శుక్రవారం బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో విలియమ్సన్ అర్ద శతకం నమోదు చేశాడు. కివీస్ 69 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన తరుణంలో విలియమ్సన్ బాధ్యతాయుతంగా ఆడి హాఫ్ సెంచరీ సాధించాడు. 58 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో అర్ధ శతకం సాధించి జట్టు పరిస్థితిని చక్కదిద్దాడు. దాంతో న్యూజిలాండ్ జట్టు 27 ఓవర్లలో రెండు వికెట్లకు 144 పరుగులు చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ కు మార్టిన్ గప్టిల్(33),రోంచీ(16)లు దూకుడుగా ఇన్నింగ్స్ ను ఆరంభించారు. అయితే జట్టు స్కోరు 46 పరుగుల వద్ద రోంచీ తొలి వికెట్ గా అవుట్ కాగా, ఆపై కాసేపటికి గప్టిల్ రెండో వికెట్ గా పెవిలియన్ చేరాడు. ఆ దశలో విలియమ్సన్-రాస్ టేలర్‌ల జోడి జట్టు పరిస్థితిని చక్కదిద్దారు. ఈ క్రమంలోనే విలియమ్సన్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. అంతకుముందు ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో సెంచరీ సాధించిన విలియమ్సన్.. ఆపై ఇంగ్లండ్ తో మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేశాడు. -
విలియమ్సన్ 'బెస్ట్' ఇన్నింగ్స్
-
విలియమ్సన్ 'బెస్ట్' ఇన్నింగ్స్
బర్మింగ్‌హోమ్: చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గ్రూప్-ఎలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్ లో న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ శతకం నమోదు చేశాడు. 96 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, మూడు సిక్సర్లతో విలియమ్సన్ సెంచరీ చేశాడు. తద్వారా ఆస్ట్రేలియాపై వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరును విలియమ్సన్ సాధించడమే కాకుండా, ఆ జట్టుపై తొలి వన్డే శతకాన్ని నమోదు చేశాడు. అంతకుముందు ఆసీస్ పై విలియమ్సన్ అత్యధిక వ్యక్తిగత వన్డే స్కోరు 81. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నెమ్మదిగా ఇన్నింగ్స్ ను ఆరంభించింది. న్యూజిలాండ్ ఓపెనర్లు గప్టిల్, ల్యూక్ రోంచీలు ఇన్నింగ్స్ ను ఎటువంటి తడబాటు లేకుండా ప్రారంభించారు. అయితే న్యూజిలాండ్ స్కోరు 40 పరుగుల వద్ద గప్టిల్(26) తొలి వికెట్ గా పెవిలియన్ చేరాడు. రోంచీకి జత కలిసిన విలియమ్సన్ స్కోరు బోర్డును చక్కదిద్దాడు.అయితే ఇన్నింగ్స్ పదో ఓవర్ లో వర్షం రావడంతో మ్యాచ్ ను 46 ఓవర్లకు కుదించారు. మ్యాచ్ ముగిసిన తరువాత తిరిగి క్రీజ్ లోకి వచ్చిన రోంచీ-విలియమ్సన్ లు 70 పరుగులు జోడించి స్కోరును ముందుకు తీసుకెళ్లారు. కాగా, రోంచీ (65) రెండో వికెట్ గా అవుట్ కావడంతో కివీస్ కాస్త తడబడినట్లు కనిపించింది. అయితే ఆపై రాస్ టేలర్-విలియమ్సన్ల జోడి కుదురుగా బ్యాటింగ్ చేస్తూ స్కోరును ముందుకు తీసుకెళ్లడంతో న్యూజిలాండ్ తిరిగి గాడిలో పడింది. ఈ జోడి 99 పరుగులు జత చేసిన తరువాత టేలర్(46) మూడో వికెట్ గా పెవిలియన్ చేరాడు. ఆ తరువాత కాసేపటికి విలియమ్సన్ సెంచరీతో మెరిశాడు. కాగా, శతకం సాధించిన వెంటనే విలియమ్సన్ అనవసర పరుగు కోసం యత్నించి నాల్గో వికెట్ గా పెవిలియన్ చేరాడు. -
ఇంత టాలెంట్ ఉందనుకోలేదు: విలియమ్సన్
ముంబై: ఐపీఎల్-10 సీజన్లో లోకల్ టాలెంట్ వెలుగులోకి రావడం ఆశ్చర్యానికి గురి చేసిందని న్యూజిలాండ్ కెప్టెన్, సన్ రైజర్స్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ అభిప్రాయపడ్డాడు. ఇండియన్ యువ ఆటగాళ్ల టాలెంట్ అధ్భుతమని, ఇక్కడి యువ ఆటగాళ్లలో ఇంత టాలెంట్ ఉందనుకోలేదని, ఇక్కడికి వచ్చి వారితో నెట్స్ లో ప్రాక్టీస్ చేశాక అర్ధమైందని విలియమ్సన్ తెలిపాడు. అంతర్జాతీయ టోర్నమెంట్లో ఆడక ముందే బంతిని సునాయసంగా బౌండరీలకు తరలిస్తున్నారని విలియమ్సన్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. సన్ రైజర్స్ యువ బౌలర్లు సిద్దార్థ్ కౌల్, మహ్మద్ సిరాజ్ అధ్భుతంగా రాణిస్తున్నారని, జట్టులో దీపక్ హుడా కూడా అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్నాడని విలియమ్స్ కొనియాడాడు. ఇక ఢిల్లీ టాప్ ఆర్డర్ లోని యువ బ్యాట్స్ మెన్ ల ఆటను ఆసక్తికరంగా చూస్తున్నానని విలియమ్సన్ పేర్కొన్నాడు. పుణే ఆటగాడు రాహుల్ త్రిపాఠి అసాధారణ ప్రతిభతో రాణిస్తున్నాడని యువ ఆటగాళ్లను పొగడ్తలతో ముంచెత్తాడు. ఐపీఎల్ తో భారత్ యువ ఆటగాళ్లతో స్నేహం పెరిగిందని, ఇది ప్రపంచ క్రికెట్ కు మంచిదని విలియమ్సన్ అభిప్రాయపడ్డాడు. 2017 అంతర్జాతీయ ఉత్తమ బ్యాట్స్ మెన్ అయిన విలియమ్సన్ ను సన్ రైజర్స్ కొన్నిమ్యాచ్ లకు బెంచ్ కే పరిమితం చేసినా విలియమ్సన్ అడ్డు చెప్పలేదు. గత ముంబై మ్యాచ్ లో విలియమ్సన్ స్థానంలో అప్ఘాన్ స్పిన్నర్ మహ్మద్ నబీని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. -
పుణేను ఓడించడం కష్టమే: విలియమ్సన్
హైదరాబాద్: శనివారం ఉప్పల్ లో జరగబోయే సన్ రైజర్స్ హైదరాబాద్, రైజింగ్ పుణే ఐపీఎల్ మ్యాచ్ లో పుణేను ఓడించడం కష్టమేనని సన్ రైజర్స్ ఆటగాడు కేన్ విలియమ్సన్ అభిప్రాయపడ్డాడు. వరుస విజయాలతో ఊపు మీద ఉన్న రైజింగ్ పుణే తో జరిగే మ్యాచ్ టఫ్ గేమ్ అని, అయినా సమిష్టిగా రాణిస్తామని విలియమ్సన్ మీడియా కు తెలిపాడు. ప్రతి ఒక మ్యాచ్ చాలేంజ్ అని, ఇప్పటి వరకు మంచి క్రికెట్ ఆడామని, పుణే తో కూడా మంచి ప్రదర్శన కనబరుస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఎప్పుడూ విజయాలు సొంతం కావని, ముఖ్యంగా టీ20 లో ఇది సాధ్యం కాదని తెలిపాడు. దీన్ని దృష్టి లో ఉంచుకోని ముందుకు వెళ్తామని విలియమ్సన్ పేర్కొన్నాడు. జట్టులో మూడో నెంబర్ బ్యాట్స్ మన్ గా జట్టుకు ఏమి కావాలో అది చేస్తానన్నాడు. జట్టుకు అవసరమైతే ఏ స్థానంలో బ్యాటింగ్ చేయడానికైనా సిద్దం అన్నాడు. డెవిడ్ వార్నర్ మంచి నాయకుడని, అతని నాయకత్వంలో ఆడటం సంతోషంగా ఉందని విలియమ్సన్ తెలిపాడు. ఢిఫెండింగ్ ఛాంపియన్స్ అయినందుకు మాజట్టు పై కొంత ఒత్తిడి ఉందని, గత సీజన్ లో కంటే ఈ సీజన్ లో మా ఆట తీరు చాలా మెరుగైందని చెప్పాడు. గత మ్యాచ్ ఢిల్లీ తో భారీ స్కోరు చేసినా ఓడిపోయామని, ఈ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకున్నామని, మంచి క్రికెట్ ఆడుతూ ఇంకా రెండు మ్యాచ్ లు నెగ్గి ప్లే ఆఫ్ కు అర్హత సాధిస్తామని విలియమ్సన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక ఈ ఐపీఎల్ అనుభవం వచ్చే నెలలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ న్యూజిలాండ్ కెప్టెన్ పేర్కొన్నాడు. -
ఢిల్లీనీ గెలిచాం
-
ఢిల్లీనీ గెలిచాం
►సన్‌రైజర్స్‌కు నాలుగో విజయం ►15 పరుగులతో డేర్‌డెవిల్స్ ఓటమి ►చెలరేగిన విలియమ్సన్, ధావన్ సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ తిరుగులేని ప్రదర్శన కొనసాగుతోంది. ఇతర వేదికలపై రెండు పరాజయాల తర్వాత గత మ్యాచ్‌లో జూలు విదిల్చిన జట్టు ఇప్పుడు మరో కీలక విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్‌లో విలియమ్సన్, శిఖర్ ధావన్‌ల మెరుపులతో భారీ స్కోరు నమోదు చేసిన రైజర్స్... కట్టుదిట్టమైన బౌలింగ్‌తో డేర్‌డెవిల్స్ పని పట్టింది. ఢిల్లీ యువ ఆటగాళ్లు కొంత పట్టుదల కనబర్చినా... అది జట్టును గెలిపించడానికి సరిపోలేదు. ‘సన్’కు ఇది ఓవరాల్‌గా నాలుగో విజయం కాగా, ఢిల్లీకి వరుసగా రెండో ఓటమి. హైదరాబాద్: మరోసారి ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఉప్పల్ మైదానంలో తాము ఆడిన నాలుగో మ్యాచ్‌లోనూ విజయాన్ని అందుకుంది. బుధవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 15 పరుగుల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కేన్ విలియమ్సన్ (51 బంతుల్లో 89; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), శిఖర్ ధావన్ (50 బంతుల్లో 70; 7 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగి రెండో వికెట్‌కు 86 బంతుల్లోనే 136 పరుగులు జోడించడం విశేషం. 4 వికెట్లూ మోరిస్కే దక్కాయి. అనంతరం ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 176 పరుగులు మాత్రమే చేయగలిగింది. శ్రేయస్ అయ్యర్ (31 బంతుల్లో 50 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), సామ్సన్ (33 బంతుల్లో 42; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కరుణ్ నాయర్ (23 బంతుల్లో 33; 5 ఫోర్లు,1 సిక్స్), మాథ్యూస్ (23 బంతుల్లో 31; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. హైదరాబాద్ బౌలర్ సిరాజ్‌కు 2 వికెట్లు దక్కాయి. భారీ భాగస్వామ్యం... చాలా కాలం తర్వాత హైదరాబాద్ జట్టు వార్నర్ ప్రమేయం లేకుండా భారీ స్కోరు సాధించగలిగింది. ధావన్, సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న విలియమ్సన్ కలిసి జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు. వార్నర్ (4) అవుటైన తర్వాత వీరిద్దరు దూకుడైన ఆటను ప్రదర్శించారు. ఢిల్లీ బలహీన బౌలింగ్ కూడా సన్‌కు కలిసొచ్చింది. కెప్టెన్ జహీర్ ఈ జోడీని విడదీసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. ముఖ్యంగా విలియమ్సన్ భారీ షాట్లతో చెలరేగి తనలో కొత్త కోణాన్ని ప్రదర్శించాడు. మాథ్యూస్ బౌలింగ్‌లో వరుస బంతుల్లో అతను రెండు అద్భుతమైన సిక్సర్లు బాదాడు. కమిన్స్ ఓవర్లోనూ మరో సిక్సర్ బాది కేన్ 33 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మిశ్రా వేసిన ఓవర్లో విలియమ్సన్ మరో రెండు సిక్సర్లు కొట్టడంతో మొత్తం 19 పరుగులు వచ్చాయి. మరోవైపు కొన్ని చక్కటి షాట్లతో ఆకట్టుకున్న ధావన్ 40 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఎట్టకేలకు మోరిస్ బౌలింగ్‌లో అవుటై విలియమ్సన్ సెంచరీ చేజార్చుకున్నాడు. అనంతరం మోరిస్ వరుస బంతుల్లో ధావన్, యువరాజ్ (3)లను అవుట్ చేసి రైజర్స్‌ను కట్టడి చేశాడు. అయితే జహీర్ వేసిన చివరి ఓవర్లో హైదరాబాద్ 17 పరుగులు రాబట్టగలిగింది. రాణించిన సామ్సన్... భువనేశ్వర్ వేసిన తొలి ఓవర్లో రెండు పరుగులే రాగా... సిరాజ్ వేసిన రెండో ఓవర్ తొలి నాలుగు బంతుల్లో బిల్లింగ్స్ (13) మూడు ఫోర్లు బాదాడు. అయితే అదే జోరులో మరో షాట్ ఆడబోయి మిడ్ వికెట్లో క్యాచ్ ఇచ్చాడు. ఈ దశలో సామ్సన్, నాయర్ కలిసి వేగంగా పరుగులు సాధించారు. భువీ ఓవర్లో నాయర్ వరుసగా రెండు ఫోర్లు కొట్టగా, ఆ తర్వాత సిరాజ్ ఓవర్లో ఢిల్లీ 15 పరుగులు రాబట్టింది. ఈ జోడి 45 బంతుల్లో 71 పరుగులు జోడించిన దశలో యువీ ఓవర్ మలుపు తిప్పింది. రెండో పరుగు కోసం ప్రయత్నించి నాయర్ రనౌట్ కాగా, రిషభ్ పంత్ (0) తొలి బంతికే వెనుదిరిగాడు. అనంతరం కీలకమైన సామ్సన్ వికెట్‌ను సిరాజ్ తీయడంతో సన్ చేతుల్లోకి మ్యాచ్ వచ్చినా... రషీద్ ఖాన్ ఓవర్లో అయ్యర్ రెండు భారీ సిక్సర్లతో మళ్లీ ధాటిని పెంచాడు. అయితే లక్ష్యం మరీ పెద్దది కావడం, హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో పరుగులు చేయడంలో ఇబ్బంది పడిన డేర్‌డెవిల్స్ చివరకు ఓటమితో ముగించింది. శభాష్ సిరాజ్... హైదరాబాద్ జట్టులో అసలైన హైదరాబాదీ మ్యాచ్ ఆడాలని ఎదురు చూసిన అభిమానుల కోరిక ఎట్టకేలకు బుధవారం తీరింది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌తో యువ పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. 4 ఓవర్లలో 39 పరుగుల ప్రదర్శన అద్భుతం కాకపోయినా... అతను తీసిన రెండు కీలక వికెట్లు సిరాజ్‌లోని ప్రతిభను చూపించాయి. తొలి మ్యాచ్ ఒత్తిడిలో మొదటి ఓవర్లో మూడు బౌండరీలు ఇచ్చినా, తెలివిగా బిల్లింగ్స్‌ను బోల్తా కొట్టించగలిగాడు. తర్వాతి ఓవర్లో 15 పరుగులు ఇచ్చినా... మూడో ఓవర్లో ఐదు పరుగులే ఇచ్చి దానిని సరిదిద్దుకున్నాడు. ఇక సామ్సన్ దూసుకుపోతున్న దశలో 122 కిలోమీటర్ల వేగంతో స్లోబాల్‌తో బోల్తా కొట్టించగలగడం సిరాజ్ బౌలింగ్‌లోని వైవిధ్యాన్ని చూపిస్తుంది. మొదటి మ్యాచ్‌తోనే ఆకట్టుకున్న ఈ కుర్రాడు మున్ముందు లీగ్‌లో మరిన్ని సంచలనాలు సృష్టించాలని ఆశిద్దాం. -
కివీస్ ఘన విజయం
క్రై స్ట్చర్చ్: వరుసగా నాలుగు టెస్టుల్లో పరాజయాల తర్వాత ఎట్టకేలకు న్యూజిలాండ్‌కు సొంతగడ్డపై ఊరట దక్కింది. ఆదివారం పాకిస్తాన్‌తో ఇక్కడ ముగిసిన తొలి టెస్టులో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌కు ముందు దక్షిణాఫ్రికా చేతిలో ఒక టెస్టుతో పాటు భారత్ చేతిలో 0-3తో కివీస్ క్లీన్‌స్వీప్ అయిది. ఓవర్‌నైట్ స్కోరు 129/7తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన పాకిస్తాన్ తమ రెండో ఇన్నింగ్స్ లో 171 పరుగులకు ఆలౌటైంది. సొహైల్ ఖాన్ (40) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కివీస్ బౌలర్లలో వాగ్నర్, బౌల్ట్, సౌతీ తలా 3 వికెట్లు తీశారు. అనంతరం కివీస్ 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 105 పరుగుల విజయలక్ష్యాన్ని చేరుకుంది. కెప్టెన్ విలియమ్సన్ (61) అర్ధ సెంచరీతో రాణించాడు. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ఈ నెల 25 నుంచి హామిల్టన్‌లో జరుగుతుంది. -
మిశ్రా మ్యాజిక్.. కివీస్ టాపార్డర్ ఔట్
రాంచీ: భారత్ తో జరుగుతున్న నాలుగో వన్డేలో న్యూజిలాండ్ టాపార్డర్ ఆటగాళ్లు పెవిలియన్ కు చేరారు. అమిత్ మిశ్రా స్పిన్ మాయాజాలంతో వరుస ఓవర్లలో ఇద్దరు కివీస్ బ్యాట్స్ మన్లను ఔట్ చేశాడు. తొలుత కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 41 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇన్నింగ్స్ 36వ ఓవర్లో టీమిండియా స్పిన్నర్ అమిత్ మిశ్రా రెండో బంతిని ఆడిన విలియమ్సన్ కీపర్ ధోనీ చేతికి చిక్కాడు. ధోనీ ఏ పొరపాటు లేకుండా విలియమ్స్ ఇచ్చిన క్యాచ్ పట్టడంతో జట్టు స్కోరు 184 పరుగుల వద్ద మూడో వికెట్ రూపంలో నిష్క్రమించాడు. మూడో వికెట్ కు రాస్ టేలర్ (20) తో కలిసి స్కోరు బోర్డుకు 46 పరుగులు జత చేశాడు. 38వ ఓవర్ వేసిన మిశ్రా.. ఓవర్ చివరి బంతికి నీషమ్ షాడ్ ఆడాడు. అయితే చాలా తక్కువ ఎత్తులో వస్తున్న బంతిని వైస్ కెప్టెన్ విరాట్ చక్కగా ఒడిసిపట్టడంతో నీషమ్ నిరాశగా వెనుదిరిగాడు. 38 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ 4 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. -
రెండో వన్డేలో భారత్ ఓటమి
-
నేలకు దించారు
►రెండో వన్డేలో భారత్ ఓటమి ►6 పరుగులతో కివీస్ విజయం ►సెంచరీతో చెలరేగిన విలియమ్సన్ ►మూడో వన్డే ఆదివారం మూడు టెస్టుల్లో ఘన విజయం, ఆ తర్వాత తొలి వన్డేలోనూ భారీ తేడాతో గెలుపు... న్యూజిలాండ్ జట్టు మన గడ్డపై అడుగు పెట్టిననాటినుంచి వరుస విజయాలతో పండుగ చేసుకున్న భారత జట్టు జోరుకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. సాధారణ లక్ష్యాన్ని ఛేదించడంలో మన బ్యాట్స్‌మెన్ విఫలం కావడంతో భారత గడ్డపై కివీస్ బోణీ చేసింది. తక్కువ స్కోర్ల మ్యాచ్ చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగినా... చివరకు విలియమ్సన్ సేనదే పైచేరుు అరుుంది. 243 పరుగుల లక్ష్య ఛేదనలో ఒక దశలో భారత్ స్కోరు 183/8... మిగిలిన 55 బంతుల్లో గెలుపు కోసం 60 పరుగు చేయాలి. ఎలాంటి ఆశలు లేని ఈ దశలో హార్దిక్ పాండ్యా, ఉమేశ్ యాదవ్ 49 పరుగుల భాగస్వామ్యం జట్టును విజయానికి చేరువగా తెచ్చింది. తొలి మ్యాచ్‌లో బౌలింగ్‌తో ఆకట్టుకున్న పాండ్యా ఈ సారి బ్యాట్‌తో మెరిశాడు. మరో 11 పరుగులు చేయాల్సిన సమయంలో అతను వెనుదిరగడంతో భారత్ విజయం వాకిట కుప్పకూలింది. న్యూఢిల్లీ: ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న కేన్ విలియమ్సన్ ఎట్టకేలకు తన క్లాస్ చూపించాడు. సహచరులంతా విఫలమైన వేళ ఒంటరిగా నిలబడి సెంచరీ సాధించాడు. ఆ తర్వాత తన కెప్టెన్సీతో జట్టును గెలిపించాడు. మరో వైపు ప్రధాన బ్యాట్స్‌మెన్ అవుటైన దశలో 19వ ఓవర్లోనే క్రీజ్‌లోకి వచ్చిన ధోని తన బాధ్యతను సమర్థంగా నిర్వర్తించలేకపోయాడు. ఇటీవల తన పేలవ ప్రదర్శనను కొనసాగిస్తూ జట్టును నడిపించడంలో విఫలమయ్యాడు. మొత్తంగా ఇరు జట్ల కెప్టెన్ల పోరులో విలియమ్సన్ గెలిచాడు. గురువారం ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ 6 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. కేన్ విలియమ్సన్ (128 బంతుల్లో 118; 14 ఫోర్లు, 1 సిక్స్) కెరీర్లో ఎనిమిదో సెంచరీని సాధించాడు. బుమ్రా, మిశ్రా చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్ 49.3 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటైంది. కేదార్ జాదవ్ (37 బంతుల్లో 41; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా... ధోని (65 బంతుల్లో 39; 3 ఫోర్లు), హార్దిక్ పాండ్యా (32 బంతుల్లో 36; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ఈ ఫలితంతో ఐదు వన్డేల సిరీస్ 1-1తో సమంగా నిలిచింది. మూడో వన్డే ఆదివారం మొహాలీలో జరుగుతుంది. కీలక భాగస్వామ్యం టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా... కివీస్ జట్టులో మూడు మార్పులు జరిగారుు. కివీస్ ఓపెనర్ గప్టిల్ (0) పేలవ ఫామ్ ఈ మ్యాచ్‌లోనూ కొనసాగింది. ఇన్నింగ్స రెండో బంతికే అతడిని బౌల్డ్ చేసి ఉమేశ్ భారత్‌కు శుభారంభం అందించాడు. అరుుతే మరో ఓపెనర్ లాథమ్ (46 బంతుల్లో 46; 6 ఫోర్లు, 1 సిక్స్), విలియమ్సన్ జాగ్రత్తగా ఆడారు. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ వీరు అలవోకగా పరుగులు సాధించడంతో పవర్‌ప్లే ముగిసే సరికి జట్టు స్కోరు 50 పరుగులకు చేరింది. అక్షర్ పటేల్ వేసిన ఒక ఓవర్లో రెండు ఫోర్లు, సిక్సర్ బాది విలియమ్సన్ జోరు ప్రదర్శించాడు. 46 పరుగుల వద్ద విలియమ్సన్ ఇచ్చిన కష్టసాధ్యమైన క్యాచ్‌ను పాండ్యా వదిలేయడం కివీస్‌కు కలిసొచ్చింది. వీరిద్దరి అటాకింగ్ ఆటతో తర్వాతి పది ఓవర్లలో 65 పరుగులు వచ్చారుు. ఆ వికెట్ తర్వాత... పార్ట్‌టైమర్ జాదవ్ మరోసారి జట్టుకు అదృష్టం తెచ్చాడు. తన తొలి ఓవర్లోనే లాథమ్‌ను అవుట్ చేసి అతని భారీ భాగస్వామ్యానికి తెర దించాడు. ఆ తర్వాత ఒక వైపు విలియమ్సన్ పట్టుదలగా నిలబడ్డా... మరో ఎండ్‌లో కివీస్ పతనం మొదలైంది. క్రీజ్‌లో ఉన్నంత సేపు తీవ్రంగా ఇబ్బంది పడ్డ టేలర్ (21) మిశ్రా బౌలింగ్‌లో స్వీప్‌కు ప్రయత్నించి డీప్ మిడ్వికెట్లో క్యాచ్ ఇచ్చాడు. బుమ్రా బౌలింగ్‌లో కవర్స్ దిశగా ఆడి రెండు పరుగులు తీయడంతో 109 బంతుల్లో విలియమ్సన్ సెంచరీ పూర్తరుుంది. ఈ పర్యటన మొత్తంలో కివీస్ తరఫున ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. ఈ దశలో అండర్సన్ (21)ను అవుట్ చేసి మిశ్రా మళ్లీ దెబ్బ తీశాడు. మిశ్రా తన తర్వాతి ఓవర్లోనే చక్కటి బంతితో విలియమ్సన్‌ను కూడా పెవిలియన్ పంపించడంతో ఆ జట్టు కోలుకోలేకపోరుుంది. ఆ తర్వాత మరో 24 పరుగులు మాత్రమే చేసి కివీస్ తర్వాతి ఐదు వికెట్లు కోల్పోరుుంది. ఒక దశలో ఆ జట్టు వరుసగా 11 ఓవర్ల పాటు ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోరుుంది. భారత బౌలర్లలో బుమ్రా ఒక్కడే 37 డాట్ బాల్స్ వేయగా, మొత్తం కలిపి కివీస్ పరుగులు తీయని బంతులు 161 ఉండటం చూస్తే భారత బౌలర్లు ఎంతగా కట్టడి చేశారో అర్థమవుతుంది. కోహ్లి విఫలం ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా భారత జట్టు తక్కువ వ్యవధిలోనే తొలి నాలుగు వికెట్లు కోల్పోరుుంది. టాప్-4 ఆటగాళ్లలో ఎవరూ ఎక్కువ సేపు నిలబడలేకపోయారు. ముందుగా రోహిత్ (15)ను అవుట్ చేసి బౌల్ట్ కివీస్‌కు తొలి వికెట్ అందించాడు. అరుదైన రీతిలో కోహ్లి (9) కూడా విఫలమయ్యాడు. సాన్‌ట్నర్ బౌలింగ్‌లో లెగ్ సైడ్ ఆడిన బంతిని కీపర్ రోంచీ చక్కగా అందుకోవడంతో కోహ్లి ఇన్నింగ్స ముగిసింది. చక్కటి షాట్లు ఆడిన రహానే (49 బంతుల్లో 28; 3 ఫోర్లు) కుదురుకుంటున్న దశలో సౌతీ దెబ్బ తీశాడు. ఫైన్ లెగ్ దిశగా రహానే పుల్ షాట్ ఆడగా తక్కువ ఎత్తులో వచ్చిన బంతిని అండర్సన్ క్యాచ్ పట్టాడు. అరుుతే అతని చేతుల్లో పడే ముందు బంతి నేలకు తగిలినట్లు కని పించింది. పదే పదే రీప్లేలు చూసిన తర్వాత థర్డ్ అంపైర్ రహానేను అవుట్‌గా ధ్రువీకరించారు. ఆ తర్వాతి ఓవర్లోనే మనీశ్ పాండే (19) రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆదుకున్న ధోని, జాదవ్ ఈ దశలో జత కలిసిన ధోని, జాదవ్ దూకుడును ప్రదర్శించారు. ముఖ్యంగా జాదవ్ కెప్టెన్‌ను మించి ధాటిగా ఆడాడు. సాన్‌ట్నర్ వేసిన రెండు వరుస ఓవర్లలో అతను రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు. ఐదో వికెట్‌కు 66 పరుగులు జోడించిన అనంతరం హెన్రీ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్ ఇచ్చి జాదవ్ నిష్ర్కమించాడు. అనంతరం ధోని, అక్షర్ కలిసి 33 పరుగులు జోడించినా... కివీస్ కట్టుదిట్టమైన బౌలింగ్, ఫీల్డింగ్‌తో పరుగులు నెమ్మదిగా వచ్చారుు. ఈ దశలో సౌతీ అద్భుత రిటర్న్ క్యాచ్‌తో ధోనిని పెవిలియన్ పంపించాడు. ఆ తర్వాత గప్టిల్ తన తొలి ఓవర్లో రెండు వికెట్లు తీయడంతో భారత్ ఓటమికి మరింత చేరువైంది. ఇలాంటి స్థితిలో పాండ్యా, ఉమేశ్ (18 నాటౌట్) జోడి గెలుపుపై ఆశలు రేపినా...చివరకు ఓటమి తప్పలేదు. 13 భారత్‌ను భారత గడ్డపై న్యూజిలాండ్ 13 ఏళ్ల తర్వాత ఓడించింది. ఈ కాలంలో ఇరు జట్ల మధ్య 8 వన్డేలు జరిగారుు. -
పసికూనపై కివీస్ ఘన విజయం
బులవాయో: జింబాబ్వేతో జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ 254 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్ 2-0తో కివీస్ సొంతం చేసుకుంది. 387 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య జింబాబ్వే 68.4 ఓవర్లాడి 132 పరుగులకే కుప్పకూలడంతో దారుణ పరాజయాన్ని చవిచూసింది. ఓవర్ నైట్ స్కోరు 58/3తో ఐదో రోజు బ్యాటింగ్ కు దిగిన జింబాబ్వే స్వల్ప స్కోరుకే చేతులెత్తేసింది. రెండో ఇన్నింగ్స్ లో కివీస్ బౌలర్లలో గప్టిల్, సోదీ చెరో మూడు వికెట్లు తీశారు. న్యూజీలాండ్ బౌలర్ నీల్ వాగ్నర్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ సొంతం చేసుకోగా, రెండు ఇన్నింగ్స్ లో రాణించిన కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో న్యూజీలాండ్ ఆటగాళ్లు లాథమ్ (136), రాస్ టేలర్ (124 నాటౌట్), విలియమ్సన్ (113) చెలరేగడంతో కివీస్ 582/4 డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్ లో విలియమ్సన్(68 నాటౌట్), టేలర్(67 నాటౌట్) రాణించారు. జింబాబ్వే నుంచి ఎర్విన్(146) ఒక్కడు మాత్రమే సెంచరీ చేయగా, చిబాబా(60) మాత్రమే పరవాలేదనిపించాడు. న్యూజీలాండ్ తొలి ఇన్నింగ్స్: 582/4 డిక్లేర్ రెండో ఇన్నింగ్స్ : 118/2 డిక్లేర్ జింబాబ్వే తొలి ఇన్నింగ్స్ : 362 ఆలౌట్ రెండో ఇన్నింగ్స్ : 132 ఆలౌట్ -
విలియమ్సన్, టేలర్ సెంచరీలు
బులవాయో: జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ జట్టు భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (151 బంతుల్లో 113; 10 ఫోర్లు)తో పాటు రాస్ టేలర్ (173 బంతుల్లో 124 నాటౌట్; 10 ఫోర్లు) శతకాలతో రెచ్చిపోయారు. దీంతో ఆదివారం రెండో రోజు తమ తొలి ఇన్నింగ్స్‌ను కివీస్ 150 ఓవర్లలో 582/4 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం తమ తొలి ఇన్నింగ్స్‌లో జింబాబ్వే 30 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 55 పరుగులతో రోజును ముగించింది. -
‘టాప్’ క్లాస్ కివీస్
► వరుసగా నాలుగో విజయం ► గ్రూప్-2లో అగ్రస్థానం ► 75 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ చిత్తు కోల్‌కతా: టి20 ప్రపంచకప్‌లో టాప్‌క్లాస్ ఆటతీరుతో చెలరేగుతున్న న్యూజిలాండ్ జట్టు లీగ్ దశను అగ్రస్థానంతో ముగించింది. నాణ్యమైన బౌలింగ్‌తో చెలరేగి వరుసగా నాలుగో మ్యాచ్‌లో గెలిచింది. శనివారం ఈడెన్‌గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో 75 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 145 పరుగులు చేసింది. విలియమ్సన్ (32 బంతుల్లో 42; 5 ఫోర్లు, 1 సిక్స్), మున్రో (33 బంతుల్లో 35; 1 ఫోర్, 2 సిక్సర్లు) నిలకడగా ఆడారు. టేలర్ (24 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నారు. అయితే ముస్తాఫిజుర్ (5/22) సంచలన బౌలింగ్‌తో కివీస్ ఓ మాదిరి స్కోరుకే పరిమితమయింది. తర్వాత బంగ్లాదేశ్ 15.4 ఓవర్లలో 70 పరుగులకే ఆలౌటయింది. శువగత (17 బంతుల్లో 16 నాటౌట్; 2 ఫోర్లు) టాప్ స్కోరర్. ఎలియట్ (3/12), సోధి (3/21)ల అద్భుత బౌలింగ్‌కు తోడు కివీస్ ఫీల్డింగ్‌లో చురుగ్గా వ్యవహరించింది. విలియమ్సన్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. స్కోరు వివరాలు: న్యూజిలాండ్ ఇన్నింగ్స్: నికోలస్ (బి) ముస్తాఫిజుర్ 7; విలియమ్సన్ (బి) ముస్తాఫిజుర్ 42; మున్రో (బి) అల్ అమిన్ 35; టేలర్ (సి) మిథున్ (బి) అల్ అమిన్ 28; అండర్సన్ (బి) మోర్తజా 0; ఎలియట్ (సి) శువగత (బి) ముస్తాఫిజుర్ 9; రోంచి నాటౌట్ 9; సాంట్నర్ (బి) ముస్తాఫిజుర్ 3; మెకల్లమ్ (బి) ముస్తాఫిజుర్ 0; మెక్లీంగన్ నాటౌట్ 6; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 145. వికెట్ల పతనం: 1-25; 2-57; 3-99; 4-100; 5-122; 6-127; 7-139; 8-139. బౌలింగ్: మోర్తజా 3-0-21-1; శువగత 3-0-16-0; షకీబ్ 4-0-33-0; ముస్తాఫిజుర్ 4-0-22-5; అల్ అమిన్ 4-0-27-2; మహ్మదుల్లా 2-0-21-0. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తమీమ్ రనౌట్ 3; మిథున్ (బి) మెక్లీంగన్ 11; షబ్బీర్ (సి) సాంట్నర్ (బి) మెకల్లమ్ 12; షకీబ్ (సి) మెకల్లమ్ (బి) సాంట్నర్ 2; సౌమ్య (స్టం) రోంచి (బి) సోధి 6; మహ్మదుల్లా (బి) సోధి 5; ముష్ఫికర్ (బి) ఎలియట్ 0; శువగత నాటౌట్ 16; మోర్తజా ఎల్బీడబ్ల్యు (బి) ఎలియట్ 3; ముస్తాఫిజుర్ (సి) రోంచి (బి) ఎలియట్ 6; అల్ అమిన్ (బి) సోధి 0; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: (15.4 ఓవర్లలో ఆలౌట్) 70. వికెట్ల పతనం: 1-4; 2-29; 3-31; 4-38; 5-43; 6-44; 7-48; 8-59; 9-65; 10-70. బౌలింగ్: నాథన్ మెకల్లమ్ 2-0-6-1; అండర్సన్ 2-0-7-0; సాంట్నర్ 3-0-16-1; మెక్లీంగన్ 1-0-3-1; ఎలియట్ 4-0-12-3; సోధి 3.4-0-21-3. -
తొలి టి20లో దక్షిణాఫ్రికా విజయం
డర్బన్: న్యూజిలాండ్‌తో రెండు టి20ల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆరు వికెట్లతో విజయం సాధించింది. కింగ్స్‌మీడ్ మైదానంలో శుక్రవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత న్యూజి లాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 151 పరుగులు చేసింది. ఓపెనర్లు గప్టిల్ (42), విలియమ్సన్ (42) మినహా అందరూ విఫలమయ్యారు. రబడ, వీస్, ఫాంగిసో రెండేసి వికెట్లు తీశారు. సఫారీ జట్టు 17.5 ఓవర్లలో 4 వికెట్లకు 152 పరుగులు చేసి గెలిచింది. ఆమ్లా (48), డివిలియర్స్ (33), రోసో (38) రాణించారు. ఇరు జట్ల మధ్య రెండో టి20 నేడు (ఆదివారం)జరుగుతుంది. న్యూజిలాండ్ x దక్షిణాఫ్రికా రెండో టి20, సెంచూరియన్ సా. గం. 5.30 నుంచి టెన్ క్రికెట్లో ప్రత్యక్ష ప్రసారం -
మూడో వన్డేలో కివీస్ గెలుపు
విలియమ్సన్, రాస్ టేలర్ సెంచరీలు సౌతాంప్టన్ : రాస్ టేలర్ (123 బంతుల్లో 110; 12 ఫోర్లు) వరుసగా రెండో సెంచరీకి తోడు.. విలియమ్సన్ (113 బంతుల్లో 118; 12 ఫోర్లు; 1 సిక్స్) కూడా శతకం బాదడంతో న్యూజిలాండ్‌కు మరో విజయం దక్కింది. దీంతో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో 2-1 ఆధిక్యం సాధించింది. ఆదివారం ది రోజ్ బౌల్ మైదానంలో జరిగినమూడో వన్డేలో ఆల్‌రౌండ్ షో చూపిన కివీస్ మూడు వికెట్ల తేడాతో నెగ్గింది. టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 45.2 ఓవర్లలో 302 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మోర్గాన్ (82 బంతుల్లో 71; 4 ఫోర్లు; 2 సిక్సర్లు), స్టోక్స్ (47 బంతుల్లో 68; 7 ఫోర్లు; 2 సిక్సర్లు), వేగంగా ఆడారు. సౌతీ, వీలర్లకు మూడేసి వికెట్లు, హెన్రీకి రెండు వికెట్లు దక్కాయి. అనంతరం భారీ లక్ష్యం కోసం బరిలోకి దిగిన కివీస్ 49 ఓవర్లలో 7 వికెట్లకు 306 పరుగులు చేసి నెగ్గింది. ఓపెనర్లు త్వరగానే పెవిలియన్‌కు చేరినా విలియమ్సన్, టేలర్ జోడి ఇంగ్లండ్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంది. విలియమ్సన్ 88 బంతుల్లో.. టేలర్ 105 బంతుల్లో సెంచరీలు చేశారు. వీరి జోరుతో మూడో వికెట్‌కు 206 పరుగుల భారీ భాగస్వామ్యం చేరింది. విల్లేకు మూడు, స్టోక్స్‌కు రెండు వికెట్లు దక్కాయి. నాలుగో వన్డే ఈనెల 17న జరుగుతుంది. -
న్యూజిలాండ్ ‘సూపర్’
రెండో టెస్టులో ఇంగ్లండ్‌పై విజయం సిరీస్ 1-1తో డ్రా లీడ్స్ : డ్రాగా ముగియాల్సిన తొలి టెస్టును ఆఖరి రోజు పేలవంగా ఆడి కోల్పోయిన న్యూజిలాండ్... రెండో టెస్టులో అనూహ్యంగా పుంజుకుంది. డ్రా ఖాయమనుకున్న మ్యాచ్‌లో కివీస్ బౌలర్లు అనూహ్యంగా చెలరేగి చివరి రోజు పది వికెట్లు తీసి జట్టును గెలిపిం చారు. 455 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 91.5 ఓవర్లలో 255 పరుగులకు ఆలౌటయింది. విలియమ్సన్ (3/15), క్రెయిగ్ (3/73), బౌల్ట్ (2/61) అద్భుతంగా బౌలింగ్ చేశారు. దీంతో చివరిదైన రెండో టెస్టును కివీస్ 199 పరుగుల తేడాతో గెలుచుకుని సిరీస్‌ను 1-1తో డ్రా చేసింది. ఇంగ్లండ్ లో వారికిది ఐదో టెస్టు విజయం. ఆఖరి రోజు కుక్ సేన వికెట్ నష్టపోకుండా 44 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ప్రారంభించగా... లంచ్ సెషన్‌లోపే ఐదు వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత కూడా ఎవరూ పోరాడలేకపోవడంతో పరాజయం తప్పలేదు. బట్లర్ (147 బంతుల్లో 73; 13 ఫోర్లు; 1 సిక్స్), కుక్ (171 బంతుల్లో 56; 4 ఫోర్లు) అర్ధ సెంచరీలతో ఫర్వాలేదనిపించారు. మరోవైపు టెస్టుల్లో 9 వేల పరుగులు పూర్తి చేసిన అతి పిన్న వయస్కుడిగా (30 సంవత్సరాల 159 రోజులు) కుక్ రికార్డులకెక్కాడు. కివీస్ బ్యాట్స్‌మన్ వాట్లింగ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
విలియమ్సన్, వాట్లింగ్ రికార్డు
న్యూజిలాండ్ 524/5 డిక్లేర్డ్ శ్రీలంక లక్ష్యం 390 వెల్లింగ్టన్: విలియమ్సన్ (438 బంతుల్లో 242 నాటౌట్; 18 ఫోర్లు) కెరీర్లో తొలి డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. అటు వాట్లింగ్ (333 బంతుల్లో 142 నాటౌట్; 9 ఫోర్లు; 1 సిక్స్) కూడా శతకం నమోదు చేశాడు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు అజేయంగా 365 పరుగులు జోడించి ప్రపంచ రికార్డు భాగస్వామ్యం నెలకొల్పడంతో... శ్రీలంకతో రెండో టెస్టులో న్యూజిలాండ్ పటిష్ట స్థితికి చేరింది. విలియమ్సన్, వాట్లింగ్ల అత్యద్భుత ఆటతీరుతో మంగళవారం నాలుగో రోజు న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లకు 524 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. దీంతో లంకకు 390 పరుగుల భారీ లక్ష్యం ఎదురయింది. బుధవారం ఆటకు చివరి రోజు. మూడో రోజు ఆటలో విలియమ్సన్ రెండు క్యాచ్‌లను మిస్ చేసిన లంక ఫీల్డింగ్ నాలుగో రోజు కూడా అదే రీతిన సాగింది. తను 104 పరుగుల వద్ద ఉన్నప్పుడు కీపర్ ప్రసన్న జయవర్ధనే క్యాచ్ వదిలేయగా... 233 వద్ద ఉన్నప్పుడు స్టంప్ చేయలేకపోయాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక మంగళవారం ఆట మగిసే సమయానికి తమ రెండో ఇన్నింగ్స్‌లో 17 ఓవర్లలో వికెట్ నష్టానికి 45 పరుగులు చేసింది. -
వెస్టిండీస్‌తో రెండో టెస్టు: ఓటమి దిశగా కివీస్ ?
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వెస్టిండీస్‌తో రెండో టెస్టులో న్యూజిలాండ్ ఓటమి దిశగా పయనిస్తోంది. ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించుకునేందుకు పోరాడుతోంది. గురువారం నాలుగో రోజు కడపటి వార్తలందే సమయానికి కివీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కన్నా ఇంకా 78 పరుగులు వెనకబడే ఉంది. ఓవర్‌నైట్ స్కోరు 73/1తో ఇన్నింగ్స్ కొనసాగించిన కివీస్.. స్వల్ప విరామాల్లో వికెట్లు కోల్పోతూ వచ్చింది. విలియమ్సన్ (178 బంతుల్లో 52; 5 ఫోర్లు) అర్ధసెంచరీతో ఒంటరి పోరాటం చేసినా ఇతర బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. వాట్లింగ్ (14 బ్యాటింగ్), రూథర్‌ఫర్డ్ (7 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. -
విలియమ్సన్ సెంచరీ
చిట్టగాంగ్: బంగ్లాదేశ్‌తో బుధవారం ప్రారంభమైన తొలి టెస్టులో న్యూజిలాండ్ నిలకడగా ఆడుతోంది. కేన్ విలియమ్సన్ (114) సెంచరీతో చెలరేగడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 89.5 ఓవర్లలో 5 వికెట్లకు 280 పరుగులు చేసింది. మార్టిన్ (0 నాటౌట్) క్రీజులో ఉన్నాడు. జహుర్ అహ్మద్ చౌదరీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.... టాస్ గెలిచి కివీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఫుల్టన్ (73), విలియమ్సన్ మెరుగ్గా ఆడారు. ఈ ఇద్దరు రెండో వికెట్‌కు 126 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఓ దశలో 244/2 స్కోరుతో పటిష్ట స్థితిలో ఉన్న కివీస్‌ను.. రెండేళ్ల తర్వాత టెస్టు జట్టులోకి వచ్చిన లెఫ్టార్మ్ స్పిన్నర్ అబ్దుర్ రజాక్ దెబ్బతీశాడు. టేలర్ (28)తో పాటు తొలిరోజు చివరి ఓవర్ (90)లో బ్రెండన్ మెకల్లమ్ (21)ను అవుట్ చేసి షాకిచ్చాడు. నిలకడగా ఆడుతున్న విలియమ్సన్‌ను 89వ ఓవర్లో షకీబ్ పెవిలియన్‌కు పంపాడు. రజాక్ 2, గాజి, షకీబ్, నాజిర్ తలా ఓ వికెట్ తీశారు.