అతడిని ఆదర్శంగా తీసుకోవాలి | Ashwin has shown he can be a fine leader | Sakshi
Sakshi News home page

అతడిని ఆదర్శంగా తీసుకోవాలి

Published Thu, May 10 2018 4:17 AM | Last Updated on Thu, May 10 2018 5:34 PM

Ashwin has shown he can be a fine leader - Sakshi

పటిష్ట బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సాధారణ లక్ష్యాన్ని కాపాడుకోవడం గొప్ప విషయం. మ్యాచ్‌ మ్యాచ్‌కూ సన్‌రైజర్స్‌ బౌలర్ల ప్రదర్శన మెరుగవుతోంది. కెప్టెన్‌ విలియమ్సన్‌ నిలకడగా ఆడుతుండగా... అతనికి సహచరుల నుంచి మద్దతు లభించాల్సిన అవసరం ఉంది. సన్‌రైజర్స్‌ జట్టులో కొందరు బ్యాట్స్‌మెన్‌ ఔటవుతున్న తీరు నిరాశ కలిగిస్తోంది. శుభారంభం లభించాక ఎక్కువసేపు క్రీజులో నిలిచి భారీగా పరుగులు చేయడంపై ఆ జట్టు దృష్టి సారించాలి. ఈ విషయంలో విలియమ్సన్‌ను మిగతావారు ఆదర్శంగా తీసుకోవాలి.

20 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ వాటిని అర్ధ సెంచరీలుగా మార్చేందుకు ప్రయత్నించి జట్టు భారీ స్కోరుకు దోహదపడాలి. మరోవైపు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ జట్టుకు పృథ్వీ షా, శ్రేయస్‌ అయ్యర్‌ ద్వారా శుభారంభాలు లభిస్తున్నాయి. సన్‌రైజర్స్‌తో నేడు జరిగే మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాలని డేర్‌ డెవిల్స్‌కు తెలుసు. ఢిల్లీ  ఎక్కువగా భారత బ్యాట్స్‌మెన్‌ ఆటతీరుపైనే ఆధారపడుతోంది. స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా పొదుపుగా బౌలింగ్‌ చేయడంతోపాటు కీలక సమయాల్లో వికెట్లు తీస్తున్నాడు. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుపై తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ గట్టెక్కాలంటే విశేషంగా రాణించాల్సిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement