sunil gavasker
-
పాకిస్తాన్‌దే పైచేయి! అక్కడ టీమిండియాదే హవా.. నాడు రోజర్ బిన్నీ, రవిశాస్త్రి కారణంగా..
భారత్ వర్సెస్ పాకిస్తాన్.. దాయాదుల మధ్య క్రికెట్ పోరుకు ఉన్న క్రేజే వేరు. గెలుపు కోసం చిరకాల ప్రత్యర్థులు మైదానంలో పోటాపోటీగా ముందుకు సాగుతూ ఉంటే అభిమానులకు కన్నులపండుగగా ఉంటుంది. హై వోల్టేజీ పోరులో విజయం ఎవరిని వరిస్తుందా అని ఇరు దేశాల క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి హోరాహోరీ పోరుకు సమయం ఆసన్నమైంది. శ్రీలంక వేదికగా సెప్టెంబరు 2(శనివారం)న ఆసియా కప్-2023 వన్డే టోర్నీలో అమీతుమీ తేల్చుకునేందుకు భారత్- పాకిస్తాన్ సిద్ధమయ్యాయి. ఇప్పటికే నేపాల్‌పై విజయంతో పాకిస్తాన్ పాయింట్ల పట్టికలో ముందు వరుసలో ఉండగా.. రోహిత్ సేన ఈ మ్యాచ్‌తోనే ఈవెంట్‌ను ఆరంభించనుంది. ఈ నేపథ్యంలో చిరకాల ప్రత్యర్థుల మధ్య తొలి వన్డే ఎప్పుడు ఎక్కడ జరిగింది? ఆ మ్యాచ్‌లో విజేత ఎవరు? ఆసియా కప్ చరిత్రలో ఆధిపత్యం ఎవరిది? ఓవరాల్‌గా వన్డేల్లో ఎవరు ముందంజలో ఉన్నారు? తదితర అంశాలు గమనిద్దాం. తొలిసారి అక్కడే బలూచిస్తాన్‌లోని క్వెటా వేదికగా 1978లో తొలిసారి భారత్, పాకిస్తాన్ వన్డే మ్యాచ్‌లో తలపడ్డాయి. ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో టీమిండియా పాకిస్తాన్‌పై 4 పరుగుల స్వల్ప తేడాతో జయభేరి మోగించింది. పాకిస్తాన్‌దే పైచేయి! ఇక ఇప్పటి వరకు భారత్- పాకిస్తాన్ మధ్య మొత్తంగా 132 వన్డేలు జరుగగా.. 73 మ్యాచ్‌లలో పాక్ విజయం సాధించింది. టీమిండియా 55 మ్యాచ్‌లలో గెలుపొందింది. ఇరు జట్ల మధ్య నాలుగు మ్యాచ్‌లు డ్రాగా ముగిసిపోయాయి. తొట్టతొలి విజేత భారత్ ఇదిలా ఉంటే.. ఆసియా కప్ టోర్నీలో మాత్రం భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. 1984లో షార్జాలో ఆరంభమైన ఈ మెగా ఈవెంట్లో టీమిండియా పాక్‌తో తొలిసారి తలపడింది. నాటి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థిని 54 పరుగుల తేడాతో ఓడించింది. తద్వారా తొట్టతొలి ఆసియా కప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. నాడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అతడే ఆనాడు తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు.. 46 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో 4 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఓపెనర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సురీందర్ ఖన్నా 56 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. సందీప్ పాటిల్ 43 రన్స్‌తో రాణించాడు. నాటి కెప్టెన్ సునిల్ గావస్కర్ 36 పరుగులు సాధించగా.. గులాం పార్కర్, దిలీప్ వెంగ్‌సర్కార్ వరుసగా 22, 14 పరుగులు చేశారు. పాకిస్తాన్ జట్టులో సర్ఫరాజ్ నవాజ్, షాహిద్ మహబూబ్, ముదాసర్ నాజర్ తలో వికెట్ పడగొట్టారు. ఈ క్రమంలో 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 39.2 ఓవర్లలోనే 134 పరుగులకు ఆలౌట్ అయింది. మొహ్సిన్ ఖాన్ 35 పరుగులు చేయగా.. కెప్టెన్ జహీర్ అబ్బాస్ 27 పరుగులు సాధించాడు. రోజర్ బిన్నీ, రవిశాస్త్రి మ్యాజిక్ మిగతా వాళ్లంతా చేతులెత్తేయడంతో పాక్ తక్కువ స్కోరుకే పరిమితమై భారీ ఓటమిని మూటగట్టుకుంది. టీమిండియా బౌలర్లలో పేసర్ రోజర్ బిన్నీ, స్పిన్నర్ రవిశాస్త్రి ఆకాశమే హద్దుగా చెలరేగి పాక్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించారు. చెరో మూడు వికెట్లు పడగొట్టి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఇక నలుగురు బ్యాటర్లు రనౌట్ల రూపంలో వెనుదిరగడంతో పాక్ కథ ముగిసిపోయింది. టైటిల్ భారత్ సొంతమైంది. ఆసియాలో టీమిండియాదే హవా ఓవరాల్‌గా వన్డేల్లో పాకిస్తాన్ ఆధిక్యంలో ఉన్నా ఆసియా కప్ టోర్నీలో మాత్రం భారత్ హవా నడుస్తోంది. ఇప్పటి వరకు ఏడుసార్లు టైటిల్ గెలిచిన ఘనత టీమిండియాది. ఇందులో ఆరు వన్డే, ఒక టీ20 ట్రోఫీ ఉన్నాయి. పాక్ కేవలం రెండుసార్లు రెండేళ్లకోసారి నిర్వహించే ఈ ఈవెంట్లో 1984, 1988, 1990, 1995, 2010, 2016, 2018లో భారత జట్టు విజేతగా నిలిచింది. ఇక పాకిస్తాన్ ఇప్పటి వరకు 2000, 2012లో.. అంటే రెండుసార్లు మాత్రమే చాంపియన్‌గా నిలిచింది. 2000 ఫైనల్లో శ్రీలంకను 39 పరుగులు, 2012లో బంగ్లాదేశ్‌ను 2 పరుగులతో ఓడించి టైటిల్ గెలిచింది. ముఖాముఖి పోరులో ఇక ముఖాముఖి పోరులో 1984- 2022 వరకు భారత్- పాకిస్తాన్ వన్డే పోరులో 13 మ్యాచ్‌లలో టీమిండియా గెలుపొందగా.. పాక్ ఐదుసార్లు విజయం సాధించింది. వర్షం కారణంగా ఓ మ్యాచ్ రద్దైపోయింది. చదవండి: వన్డేల్లో ఏకైక బ్యాటర్‌గా రోహిత్ రికార్డు.. మరి ఆసియా కప్‌లో? ఈ గణాంకాలు చూస్తే -
టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఆ రెండు జట్ల మధ్యే : సునీల్ గవాస్కర్
టీ20 ప్రపంచకప్-2022లో ప్రస్తుతం క్వాలిఫియర్స్(రౌండ్-1) మ్యాచ్‌లు జరగుతున్నాయి. తొలి మ్యాచ్ నుంచే ఈ మెగా ఈవెంట్లో సంచలనాలు నమోదయ్యాయి. తొలి మ్యాచ్‌లో ఆసియాకప్ విజేత శ్రీలంకను పసికూన నమీబియా మట్టి కరిపించగా.. రెండు సార్లు టీ20 ప్రపంచకప్ ఛాంపియన్ వెస్టిండీస్‌ను స్కాట్లాండ్ చిత్తు చేసింది. ఇక సూపర్-12 రౌండ్ ఆక్టోబర్ 22 నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి మ్యాచ్‌లో సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఇక టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్ 23న చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో అమీతుమీ తెల్చుకోనుంది. మరోవైపు ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఇక ఇది ఇలా ఉండగా.. టీ20 ప్రపంచకప్-2022కు ఫైనల్‌కు చేరే రెండు జట్లను భారత దిగ్గజం సునీల్ గవాస్కర్, ఆస్ట్రేలియా లెజెండ్ టామ్ మూడీ అంచనా వేశారు. టీమిండియా, ఆస్ట్రేలియా ఖచ్చితంగా ఫైనల్‌కు చేరుతాయి" అని గవస్కర్ స్టార్ స్పోర్ట్స్ షోలో పేర్కొన్నాడు. అదే విధంగా టామ్ మూడీ మాట్లాడుతూ.. టాప్-4లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, పాకిస్తాన్, టీమిండియా నిలుస్తాయి. అయితే ఫైనల్లో మాత్రం భారత్, ఆస్ట్రేలియా జట్లు అడుగు పెడతాయి అని తెలిపాడు. చదవండి: T20 WC 2022: సహనం కోల్పోయిన షాదాబ్ ఖాన్.. 'కెప్టెన్‌గా పనికిరావు' -
రోహిత్ ఆ షాట్లు ఆడడంలో ఇబ్బంది పడుతున్నాడు: సునీల్ గవాస్కర్
నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండడో టీ20లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్ సిరీస్‌ను 1-1తో టీమిండియా సమం చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత విజయంలో కెప్టెన్ రోహిత్ శర్మ కీలక పాత్ర పోషించాడు. 20 బంతుల్లో 46 పరుగులుతో అఖరి వరకు నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన రోహిత్ శర్మను భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ ప్రశంసించాడు. అయితే రోహిత్ షాట్లు అద్భుతంగా ఆడుతున్నప్పటికీ.. కొన్ని షాట్ల ఎంపికలో మాత్రం ఇబ్బంది పడుతున్నాడని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఈ క్రమంలో స్టార్ స్పోర్ట్స్‌తో గవాస్కర్ మాట్లాడుతూ.. "ఈ మ్యాచ్‌లో రోహిత్ ఆడిన విధానం అద్భుతమైనది. అతడు డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించలేదు. అతడు ఈ మ్యాచ్‌లో చాలా షాట్లు కూడా ఆడాడు. రోహిత్ ఫ్లిక్ షాట్లు, పుల్ షాట్లు అద్భుతంగా ఆడాడు. అయితే అతడు ఆఫ్ సైడ్ షాట్లు ఆడడంలో ఇబ్బంది పడతున్నాడు. ఆ షాట్లను ఎంపిక చేసుకోవడంలో రోహిత్ సృష్టంగా లేడు. కాబట్టి బంతిని స్టాండ్‌లోకి కాకుండా గాల్లోకి లేపుతున్నాడు. ఆ ఒక్క షాట్ విషయంలో అతడు జాగ్రత్తగా ఆడితే చాలు" అని పేర్కొన్నాడు. కాగా సిరీస్ డిసైడర్ మూడో టీ20 హైదరాబాద్ వేదికగా ఆదివారం జరగనుంది. చదవండి: Rohit Sharma: సిక్సర్ల విషయంలో రోహిత్ శర్మ సరికొత్త రికార్డు -
ఆ భారత ఆటగాళ్లకు ఇదే చివరి ఛాన్స్..లేదంటే
భారత జట్టు సీనియర్ ఆటగాళ్లు ఛతేశ్వర్ పుజారా, అజింక్య రహానే పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నారు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో రహానే గోల్డెన్ డక్ కాగా, పుజారా ఈ సారి కేవలం 3 పరుగులకే పెవియన్ చేరాడు. అయితే దక్షిణాఫ్రికా టూర్‌కు జట్టు ఎంపిక చేసే ముందే వీరిద్దరి చోటుపై అనుమానాలు నెలకొన్నాయి. కాగా విదేశాల్లో ఉన్న అనుభవం దృష్ట్యా ఈ సీనియర్ ఆటగాళ్లకి చోటు దక్కింది. అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోలేక పోతున్నారు. తొలి టెస్ట్‌లో రహానే 48 పరుగులతో ఫర్వాలేదనిపించిన, తర్వాత తేలిపోయాడు. ఈ క్రమంలో మరోసారి వీరిద్దరి ఎంపికపై చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక వాఖ్యలు చేశాడు. ఈ టెస్ట్ రెండో ఇన్నింగ్స్ వీళ్లిద్దరికి చాలా కీలకం అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఇప్పటికే యువ ఆటగాళ్లు రాణిస్తుండంతో, వీళ్లు జట్టులో చోటు కోల్పోయే అవకాశం ఉందని అతడు తెలిపాడు. "పుజారా, రహానే ఇద్దరూ వారి టెస్ట్ కెరీర్‌ను కాపాడుకోవడానికి రెండో ఇన్నింగ్స్ కీలకం. తదపరి ఇన్నింగ్స్‌లో ఏదో ఒక స్కోర్ సాధించి జట్టులో తమ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నించాలి. లేదంటే వారు జట్టులో తమ స్ధానాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే వీళ్లకు శ్రేయస్ అయ్యర్ రూపంలో తీవ్రమైన పోటీ నెలకొంది" అని గవాస్కర్ పేర్కొన్నాడు. చదవండి: SA vs IND: రాహుల్‌కి వార్నింగ్ ఇచ్చిన అంపైర్.. ఎందుకో తెలుసా? -
ఆయన వీడియోలు చూసి నా బ్యాటింగ్ స్టైల్ మార్చుకున్నా..
Mayank Agarwal Explains How Sunil Gavaskars Advice Ahead Of Mumbai Test Helped: ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో టెస్టులో టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ సెంచరీతో చెలరేగాడు. రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో స్పెషలిస్ట్ బ్యాటర్ చతేశ్వర పుజారా, కెప్టెన్ కోహ్లి డకౌట్లుగా పెవిలియన్‌కు చేరారు. ఈ క్రమంలో జట్టు భారాన్ని తన భుజాన వేసుకుని మయాంక్ నడిపించాడు. తొలి రోజు ఆటలో 125 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ నేపథ్యంలో మయాంక్ అగర్వాల్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తన బ్యాటింగ్ స్టైల్‌ను మార్చుకోవాలని సూచించారని మయాంక్ తెలిపాడు. తొలి రోజు ఆట అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడిన అగర్వాల్.. "గవాస్కర్ సార్ నాతో చెప్పారు. ఇన్నింగ్స్ ఆరంభంలో బ్యాట్ కాస్త కిందకి పెట్టి ఆడమని సలహా ఇచ్చారు. ఆయన చెప్పినట్లుగా నా బ్యాటింగ్ టెక్నిక్‌లో మార్పు చేసుకున్నాను. సునీల్ గవాస్కర్ వీడియోలు చూస్తూ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశా .ఈ మ్యాచ్‌కు ముందు రాహుల్ ద్రావిడ్ సర్ వచ్చి నాతో మాట్లాడారు. నీకు దొరికిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నీవు మైదానంలో ఉత్తమమైన ప్రదర్శన చేయాలి. క్రీజులో నీవు సెట్ అయినప్పుడు.. భారీ స్కోరు చేయడంపై దృష్టి సారించు అని ఆయన నాతో చెప్పారు. ఆయన చెప్పినట్లే నేను క్రీజులో కుదురు పడ్డాకే భారీ స్కోర్ చేయడానికి ప్రయత్నించాను" అని తెలిపాడు. చదవండి: Ind vs NZ 2nd Test: రికార్డుల అజాజ్..! ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు.. స్పందించిన కుంబ్లే -
'సెమిఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించడం అంత సులభం కాదు'
Sunil Gavaskar Comments on New Zealand vs England T20 World Cup 2021 Semi-Final: టీ20 ప్రపంచకప్-2021 చివరి అంకానికి చేరుకుంది. తొలి సెమిఫైనల్లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు హమీ తుమీ తేల్చుకోవడానికి సిద్దం అవుతున్నాయి. అబుదాబి వేదికగా బుధవారం(నవంబర్10)న ఇరు జట్లు మధ్య ఈ కీలక పోరు జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌పై భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ఈ పోరులో ఇంగ్లండ్‌పై విజయం సాధించడం న్యూజిలాండ్‌కు అంత సులభం కాదు అని అతడు అభిప్రాయపడ్డాడు. "టీ20 ప్రపంచకప్‌లో తొలి సెమిఫైనల్ పోరు ఆసక్తికరంగా ఉండనుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను ఓడించడం అంత సులభం కాదు. ఎందుకంటే పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇంగ్లండ్ అద్బుతమైన జట్టు. 2015లో ఆస్ట్రేలియాలో జరిగిన వన్టే ప్రపంచ కప్‌లో గ్రూప్ దశలోనే నిష్క్రమించిన ఇంగ్లండ్ జట్టు తర్వాత వైట్-బాల్ క్రికెట్లో అద్బుతంగా రాణిస్తుంది. జోస్ బట్లర్, జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టోన్ హిట్టర్లు ఇంగ్లండ్ జట్టులో ఉన్నారు. ఇయాన్ మోర్గాన్ మాదిరిగానే న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా ప్రశాంతంగా ఉండి ప్రత్యర్థులను కట్టడం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాడు" అని గవాస్కర్ పేర్కొన్నాడు. అయితే అంతక ముందు 2019 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో ఇరు జట్లు సమానంగా స్కోర్లు చేయడంతో మ్యాచ్ టై అయింది. అలా సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్లో కూడా ఇరు జట్లు 15 పరుగులే చేయడంతో మరోసారి టై అయింది. దీంతో ఇన్నింగ్స్‌లో ఎక్కువ బౌండరీలు కొట్టిన ఇంగ్లండ్‌ను ఐసీసీ విజేతగా ప్రకటించింది. టి20 ప్రపంచకప్ 2021లో సెమీస్‌లో మరోసారి ఈ ఇద్దరు తలపడుతుండడంతో కివీస్ ప్రతీకారం తీర్చుకుంటుందా అనేది వేచి చూడాలి. చదవండి: న్యూజిలాండ్ సిరీస్‌కు ముందు భారత అభిమానులకు గుడ్ న్యూస్. -
అతడి లాంటి ఆల్ రౌండర్ టీమిండియాకు కావాలి...
Sunil Gavaskar Comments On Venkatesh Iyer: ఐపీఎల్ 2021 సెకెండ్ ఫేజ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరుపున బ్యాటింగ్, బౌలింగ్‌లో ఆదుగొడుతన్న ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్‌పై భారత క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. వెంకటేశ్ అయ్యర్ ఆల్ రౌండర్‌గా టీమిండియాలో దృష్టిలో పడవచ్చని అతడు అభిప్రాయపడ్డాడు. హార్దిక్ పాండ్యా ప్రస్తుతం క్రమంగా బౌలింగ్ చేయకపోవడంతో ఆల్‌రౌండర్ జాబితాలో అయ్యర్ పైన అందరి దృష్టి మళ్ళిందిని గవాస్కర్ తెలిపాడు. "టీమిండియా ప్రస్తుతం వెంకటేష్ అయ్యర్ లాంటి ఆల్ రౌండర్ కోసమే ఎదురు చూస్తుంది. అతడు బౌలింగ్‌లో యార్కర్లని బాగా వేస్తున్నాడు. అతడు బ్యాట్స్మన్లకు భారీ షాట్లు ఆడే అవకాశం ఇ్వడంలేదు. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే షార్ట్ బాల్‌ను బాగా పుల్ చేస్తున్నాడు. కవర్ డ్రైవ్ షాట్లు ఆడగలడని" టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు.ప్లేఆఫ్‌కు అర్హత సాధించేందుకు అవకాశాలను కోల్‌కతా సద్వినియోగ పరుచుకుందని అతడు చెప్పాడు. కాగా ఐపీఎల్లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన వెంకటేశ్ అయ్యర్126 పరుగులు, 2 వికెట్లు సాధించాడు. చదవండి: Virender Sehwag: అతడు సరిగ్గా ఆడకపోయినా.. ధోనీ తుదిజట్టు నుంచి తప్పించడు! -
వారిద్దరికి దక్కని చోటు.. గావస్కర్ టీ 20 ప్రపంచకప్ జట్టు ఇదే!
ముంబై: వచ్చే నెలలో జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం దాదాపు అన్ని దేశాలు తమ జట్లును ప్రకటించే పనిలో ఉన్నాయి. బీసీసీఐ బుధవారం భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ టీ20 ప్రపంచకప్ కోసం 15 మందితో తన జట్టును ప్రకటించాడు. ఆశ్చర్యకరంగా ఓపెనర్ శిఖర్ ధావన్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ శ్రేయాస్ అయ్యర్‌ని తన టీంలో ఎంపిక చేయలేదు. ఇక తన జట్టుకు కెప్టెన్‌గా విరాట్ కోహ్లి ఎంచుకున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లికు ఓపెనర్లుగా ఆవకాశం ఇచ్చాడు. అదే విధంగా.. తన జట్టులో ముగ్గురు ముంబై ఇండియన్స్ ఆటగాళ్లను గవాస్కర్ ఎంపిక చేసుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ మూడో స్థానాన్ని దక్కించుకోగా, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలకు మిడిలార్డర్లో స్దానం దక్కింది. గవాస్కర్ జట్టులో ఇద్దరు ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ చోటు దక్కించుకున్నారు. ఇక బౌలింగ్ విషయానికొస్తే... సన్నీ తన జట్టులో 5 పేసర్లను ఎంపిక చేసుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహమ్మద్ షమీలకు అవకాశం ఇచ్చాడు. తన జట్టులో ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా యుజ్వేంద్ర చాహల్‌ను గావస్కర్ ఎంచుకున్నాడు. చదవండి: Ayesha Mukherjee: అసలు ఎవరీ అయేషా..? శిఖర్‌తో విడిపోవడం వెనుక. -
మాజీ క్రీడాకారులకు గావస్కర్ చేయూత
ముంబై: ఆరి్థక కష్టాలతో సతమతమవుతున్న భారత మాజీ క్రీడాకారుల కోసం భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ ‘ది చాంప్స్ ఫౌండేషన్’ ద్వారా చేయూత అందిస్తున్నారు. సన్నీ 1999 నుంచి ఈ వితరణ చేస్తూనే ఉన్నారు. అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన మాజీ క్రీడాకారులు, బతుకు భారంగా వెళ్లదీస్తున్న అలనాటి ఆటగాళ్లకు తనవంతు సాయం చేస్తున్నారు. ఇన్నాళ్లు మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచి్చన వారికే సన్నీ సేవలందాయి. ఇప్పుడు ఆయన తన సేవా నిరతిని పెంచాలని, స్వయంగా సాదకబాధకాలు తెలియజేసిన వారికీ ఆరి్థక సాయం చేయాలనుకుంటున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఆయన తన ఫౌండేషన్‌ను వెబ్సైట్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చారు. కష్టాల్లో ఉన్న మాజీలు ఎవరైనా సరే ఛిజ్చిఝpటజీnఛీజ్చీ.ౌటజ వెబ్సైట్లో తమ పేర్లు నమోదు చేసుకుంటే చేయూత అందిస్తామని సన్నీ చెప్పారు. తమ కార్యకలాపాలు క్రీయాశీలం చేసేందు కు వెబ్‌సైట్‌ను తీసుకొచ్చామని, ఇది తమ ఫౌండేషన్ విస్తృతికి దోహదం చేస్తుందని గావస్కర్ తెలిపారు. -
విమర్శలకు కౌంటరిచ్చిన రోహిత్ శర్మ
‘ఎందుకు, ఎందుకలా? నేను నమ్మలేకపోతున్నా. ఇది చాలా బాధ్యతారాహిత్యమైన షాట్. లాంగాన్, డీప్ స్క్వేర్ లెగ్‌లో ఫీల్డర్లు ఉన్నారు. రెండు బంతుల ముందే ఫోర్ కొట్టిన తర్వాత అలాంటి షాట్ ఆడాల్సిన అవసరం ఏముంది. దీనికి ఎలాంటి సాకులు కూడా చెప్పడానికి లేదు. అతి సునాయాస క్యాచ్. అలాంటివి వదిలేసే ఫీల్డర్ (స్టార్క్) కూడా కాదు. తన వికెట్‌ను బహుమతిగా ఇచ్చేశాడు. ఒక వికెట్ వృథా అయిపోయింది. ఇది టెస్టు మ్యాచ్. మంచి ఆరంభం తర్వాత దానిని భారీగా మలచాలి గానీ ఇలా కాదు’... రెండో రోజు రోహిత్ శర్మ అవుటైన తీరుపై దిగ్గజం సునీల్ గావస్కర్ చేసిన తీవ్ర వ్యాఖ్య ఇది. పలువురు మాజీలు కూడా ఇదే రకంగా తమ అసంతృప్తిని ప్రదర్శించారు. రోహిత్ ఆత్మవిశ్వాసంతో ఆడుతూ మ్యాచ్‌ను శాసించే భారీ ఇన్నింగ్స్‌కు సిద్ధమైనట్లుగా కనిపించాడు. కానీ అతను అనూహ్యంగా వెనుదిరగడం భారత్‌ను ఆత్మరక్షణలో పడేసింది. అయితే ఈ విమర్శలకు రోహిత్ తనదైన శైలిలో బలంగా బదులిచ్చాడు. ‘నేను అవుటైన తీరు పట్ల ఎలాంటి బాధా లేదు. ఇలా ఆడటాన్నే నేను ఇష్టపడతాను. ఈ సిరీస్‌లో పరుగులు చేయడానికి ఇరు జట్లు ఎంత ఇబ్బంది పడుతున్నాయో చూస్తున్నాం. కుదురుకున్న తర్వాత బౌలర్‌పై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తా. జట్టులో నాకు అప్పగించిన పని కూడా అదే. ఎవరో ఒకరు ఆ పని చేయాల్సిందే కదా. ఈ క్రమంలో తప్పులు కూడా జరగవచ్చు. అందుకు సిద్ధంగా ఉండాలి. నేను ఆడిన షాట్లు కూడా మా ప్రణాళికల్లో భాగమే. కాబట్టి ఆ షాట్ విషయంలో పశ్చాత్తాపం చెందడం లేదు. లయన్ తెలివిగా బంతిని వేయడం వల్ల నేను కొట్టిన షాట్‌కు బంతి అనుకున్నంత దూరం వెళ్లలేదు’ అని రోహిత్ తన మాటను స్పష్టంగా చెప్పాడు. గతంలోనూ తాను ఈ తరహా షాట్లను సమర్థంగా ఆడిన విషయాన్ని భారత ఓపెనర్ గుర్తు చేశాడు. ‘ఈ షాట్ ఎక్కడి నుంచో అనూహ్యంగా రాలేదు. గతంలో చాలాసార్లు ఆడాను కాబట్టి ఎప్పుడైనా ఆడగలనని నాపై నాకు నమ్మకముంది. తర్వాత చూస్తే తప్పుడు షాట్లాగా అనిపించవచ్చని ఒప్పుకుంటాను. కానీ ఇలాంటివి ఆడినప్పుడు కొన్నిసార్లు అవుట్ కావచ్చు. కొన్నిసార్లు బౌండరీ బయట బంతి పడవచ్చు. ఇక ముందూ వాటిని ఆడతాను. రెండు టెస్టులు క్వారంటైన్లో ఉండి చూశాను. ఇంత పదునైన, క్రమశిక్షణతో కూడిన బౌలింగ్‌లో పరుగులు చేసేందుకు ఏదో ఒక దారి వెతకడం గురించే ఆలోచించేవాడిని. ఎవరైనా చివరకు పరుగులు చేయడమే ముఖ్యం. ఇలా దూకుడు ప్రదర్శించి పరుగులు రాబడితే ప్రత్యర్థి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలనుకున్నా. నేను అవుటైన బంతి ముందు వరకు నేను ఆడిన ఆట నాకు చాలా నచ్చింది. ఆ బంతి వరకు అంతా నేను అనుకున్నట్లే సాగింది’ అని తన ఆటను రోహిత్ విశ్లేషించాడు. -
డి కాక్ చెలరేగిపోగలడు!
కొత్త కెప్టెన్ డి కాక్ సారథ్యంలో దక్షిణాఫ్రికా జట్టు మూడు వన్డేల సిరీస్ కోసం మళ్లీ వచ్చింది. దక్షిణాఫ్రికాలో 3–0తో ఆస్ట్రేలియాను చిత్తు చేసి వస్తుండటం వల్ల జట్టులో ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉండి ఉంటుంది. డి కాక్ తొలి రెండు వన్డేల్లో విఫలమయ్యాడు. రెండు సార్లు స్టార్క్ బౌలింగ్‌లోనే క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. తన భార్య అలీసా హీలీ ప్రపంచ కప్ మ్యాచ్ చూసేందుకు స్టార్క్ స్వదేశం వెళ్లిన తర్వాత జరిగిన మూడో వన్డేలోనే అతను పరుగులు చేయగలిగాడు. అయితే దీని వల్ల అతనిపై ఎలాంటి ఒత్తిడీ ఉండదు. ఎందుకంటే భారత్‌పై అద్భుతమైన రికార్డు ఉన్న డి కాక్ అలవోకగా సెంచరీలు బాదేశాడు. భారత్‌లో పరాభవంనుంచి కోలుకున్న తర్వాత డు ప్లెసిస్ కూడా ఇప్పుడు కోలుకొని ఉంటాడు. అతనిలోని అసలైన బ్యాట్స్‌మన్ బయటకు వస్తే మంచిది. అతనిపై కెప్టెన్సీ భారం లేదు కాబట్టి కొన్నాళ్ల క్రితం సారథిగా కనిపించిన బేలతనం ఇకపై కనిపించకపోవచ్చు. కొందరు కొత్త ఆటగాళ్లతో జట్టు కూడా కొత్తగా కనిపిస్తోంది. ఆసీస్‌పై సెంచరీ చేసిన మలాన్‌తో పాటు గతంలో భారత్‌లో ఆడినా పెద్దగా అవకాశాలు రాని క్లాసెన్ ఆట కూడా కీలకం కానుంది. రబడ లేకుండా బౌలింగ్ కొంత బలహీనంగా కనిపిస్తున్నా... ఇక్కడ టెస్టులు ఆడలేకపోయిన ఇన్‌గిడి ఇటీవల ఆస్ట్రేలియాపై చెలరేగాడు. అతను ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంది. -
అదంతా ఒట్టి భ్రమే!
భారత క్రికెట్ జట్టు ఎంపిక, నాయకత్వ మార్పు గురించి ఎప్పుడు చర్చ జరిగినా సెలక్షన్ కమిటీ సభ్యుల కెరీర్‌పైనే అన్ని వైపుల నుంచి ప్రశ్నలు వస్తుంటాయి. ఆరు టెస్టులే ఆడిన ఎమ్మెస్కే ప్రసాద్ ధోని కెరీర్‌ను శాసించడం ఏమిటంటూ సెలక్టర్ల సామర్థ్యంపైనే అందరూ విమర్శలు చేస్తుంటారు. తాజాగా క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అయితే దీనిపై ఎమ్మెస్కే ఘాటుగా స్పందించారు. తమ కెరీర్ గణాంకాలకు సంబంధించి వస్తున్న విమర్శలపై స్పష్టంగా సమాధానమిస్తూ ఆయన ఎదురు దాడి చేశారు. తమ ఆటకు, జట్టు ఎంపికకు సంబంధం ఏమిటంటూ సూటిగా ప్రశ్నించారు. న్యూఢిల్లీ : అంతర్జాతీయ స్థాయిలో ఎక్కువ క్రికెట్ ఆడిన వారికే సెలక్టర్లుగా బాగా పని చేసే సామర్థ్యం ఉంటుందనే ప్రచారంలో వాస్తవం లేదని భారత క్రికెట్ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నారు. అదంతా ఒట్టి భమ్ర మాత్రమేనని ఆయన విశ్లేషించారు. టీమిండియా ఇటీవలి ప్రదర్శన, తమ బృందంపై వచ్చిన విమర్శలు తదితర అంశాలపై ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు ఎమ్మెస్కే మాటల్లోనే... సెలక్షన్ కమిటీ స్థాయి, సామర్థ్యం గురించి వచ్చిన విమర్శలపై... ఏదో ఒక ఫార్మాట్లో అంతర్జాతీయ క్రికెట్ ఆడి ఉండాలనేది మమ్మల్ని సెలక్టర్లుగా నియమించే సమయంలో పెట్టిన కనీస అర్హత. మా సభ్యులలో అందరికీ ఆ అర్హత ఉంది. దీంతో పాటు మేమందరం కలిసి 477 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాం. మా పదవీకాలంలో 200కు పైగా ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ప్రత్యక్షంగా చూశాం. ఆటగాళ్లుగానే కాకుండా సెలక్టర్లుగా ఇన్ని మ్యాచ్‌లు చూసిన అనుభవం సరైన ప్రతిభను గుర్తించేందుకు సరిపోదా! ఐదుగురు కలిసి ఆడిన టెస్టుల సంఖ్య 13 మాత్రమే కావడంపై... నిజంగా అంతర్జాతీయ అనుభవం గురించే చెప్పుకోవాలంటే ఇప్పుడు ఇంగ్లండ్ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎడ్ స్మిత్ ఒకే ఒక టెస్టు ఆడాడు. సుదీర్ఘ కాలం ఆస్ట్రేలియా చీఫ్ సెలక్టర్‌గా పని చేసిన ట్రెవర్ హాన్స్ 7 టెస్టులు మాత్రమే ఆడాడు. 128 టెస్టులు, 244 వన్డేలు ఆడిన మార్క్‌వా, 87 టెస్టులు ఆడిన మరో దిగ్గజం గ్రెగ్ చాపెల్ కూడా ట్రెవర్ నేతృత్వంలో పని చేశారు. ఆయా దేశాల్లో ఎవరూ పట్టించుకోని అనుభవం, స్థాయి మన వద్దకు వచ్చేసరికి ఎందుకు అవసరమవుతుంది? నా ఉద్దేశం ప్రకారం ప్రతీ పదవికి ప్రత్యేక బాధ్యతలు ఉంటాయి. అపార అంతర్జాతీయ అనుభవమే కొలమానమైతే ఒక్క టెస్టు కూడా ఆడని రాజ్‌సింగ్ దుంగార్పూర్‌లాంటి మహానుభావుడు చీఫ్ సెలక్టర్ అయ్యేవాడా? 16 ఏళ్ల వయసున్న సచిన్ టెండూల్కర్‌లాంటి ఒక వజ్రాన్ని ఆయన వెలికి తీసేవాడా? ప్రతిభను గుర్తించాల్సిన సెలక్టర్‌కు స్థాయి, అంతర్జాతీయ అనుభవంతో పనేంటి. సెలక్టర్లకు చేవ లేదంటూ సునీల్ గావస్కర్ చేసిన వ్యాఖ్యలపై... ఇది చాలా దురదృష్టకరం. దిగ్గజ క్రికెటర్లంటే మాకు ఎంతో గౌరవం ఉంది. వారు వెలిబుచ్చే ప్రతీ అభిప్రాయాన్ని తగిన విధంగా పరిగణలోకి తీసుకుంటాం కూడా. వారి ఆలోచనలు వారికి ఉండవచ్చు. అయితే ఇలాంటి మాటల వల్ల బాధ పడటంకంటే సెలక్షన్ కమిటీ మరింత బలంగా, అంకితభావంతో, కలిసికట్టుగా పని చేయడం ముఖ్యం. ఎంపిక విషయంలో కోహ్లి, శాస్త్రిలతో వచ్చే విభేదాలపై... ఎక్కువ క్రికెట్ ఆడిన వారికి ఎక్కువ పరిజ్ఞానం ఉంటుందని, అదే కారణంతో వారు సెలక్టర్లకు ఇబ్బంది పెడతారని చాలా మంది అనుకుంటారు. కానీ అది తప్పు. అలా అయితే కోచ్‌ల నుంచి ఇతర సహాయక సిబ్బంది వరకు అంతా అనుభవం ఉన్న క్రికెటర్లతోనే నిండిపోయేది. ఎంపిక సమయంలో కోహ్లి, శాస్త్రి, ‘ఎ’ జట్టు కోచ్ ద్రవిడ్‌లతో చర్చించడం సహజం. సెలక్టర్లకు కూడా తమ పాత్ర ఏమిటో బాగా తెలుసు. అభిప్రాయ భేదాలు కూడా వస్తాయి కానీ బయటకు చెప్పం. నాలుగు గోడల మధ్య ఏం జరిగిందో అక్కడే ఉండిపోతుంది. చివరకు భారత జట్టు ప్రయోజనాలే అన్నింటికంటే ముఖ్యం. గత మూడేళ్లలో సెలక్షన్ కమిటీ పనితీరుపై... మా సెలక్షన్ కమిటీ దేశంలోని మూలమూలకూ వెళ్లి ప్రతిభాన్వేషణ సాగించింది. ఒక పద్ధతిలో సరైన వారిని గుర్తించి భారత ‘ఎ’ జట్టులోకి, సీనియర్ జట్టులోకి తీసుకొచ్చింది. భారత జట్టు 13 టెస్టు సిరీస్‌లలో 11 గెలిచి గత మూడేళ్లుగా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానంలో కొనసాగుతోంది. వన్డేల్లో విజయశాతం 80–85 మధ్యలో ఉండగా, ఇటీవలి ప్రపంచకప్ సెమీస్ పరాజయం వరకు నంబర్‌వన్‌గా నిలిచాం. చాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ చేరడంతో పాటు రెండు సార్లు ఆసియా కప్ సాధించాం. ‘ఎ’ జట్టు 11 వన్డే సిరీస్‌లలో 11 కూడా గెలిస్తే, 9 టెస్టు సిరీస్‌లలో 8 నెగ్గింది. దాదాపు 35 మంది ఆటగాళ్లను గుర్తించి మూడు ఫార్మాట్లలో కూడా ఎంపిక చేశాం. ఇదంతా మా కమిటీ ఘనతగా చెప్పగలను. -
కపిల్ ‘లెజెండరీ ఇన్నింగ్స్’ను మళ్లీ చూడొచ్చు!!
ముంబై: భారత క్రికెట్ అభిమానుల మదిలో మరుపురాని ఇన్నింగ్స్.. 1983 నాటి ప్రపంచకప్‌లో జింబాంబ్వేపై అప్పటి టీమిండియా సారథి కపిల్‌దేవ్ చేసిన 175 పరుగుల ‘లెజండరీ ఇన్నింగ్స్’.. నిజానికి ఆ ఇన్నింగ్స్‌ను చాలామంది కళ్లారా వీక్షించలేకపోయారు. అప్పట్లో బీబీసీ సమ్మె చేయడంతో ఈ మ్యాచ్‌ను ప్రసారం చేయలేదు. అంతేకాదు.. ఈ మ్యాచ్‌ను రికార్డు కూడా చేయలేదు. దీంతో తర్వాత కూడా ఆ ‘లెజండరీ ఇన్నింగ్స్’చూసే భాగ్యం భారతీయులకు దక్కలేదు. అయితే, ఆ ఇన్నింగ్స్‌ను వెండితెరపై పునర్ ఆవిష్కరిస్తున్నామని, కపిల్ నాడు చేసిన 175 పరుగుల వీరోచిత బ్యాటింగ్‌ను తమ సినిమాలో కళ్లకు కట్టినట్టు చూపించబోతున్నామంటుంది ‘83’ చిత్ర యూనిట్. భారత్ గెలిచిన తొలి ప్రపంచకప్ నేపథ్యంతో కపిల్ దేవ్ బయోపిక్‌గా కబీర్ ఖాన్ దర్శకత్వంలో ‘83’ మూవీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 36 ఏళ్ల క్రితం క్రికెట్ చర్రితలో కపిల్ సరికొత్త రికార్డు నెలకొల్పారని.. 1983 ప్రపంచ కప్‌లో జింబాంబ్వేపై ఆయన ఆడిన ఇన్నింగ్స్ ఓ అద్భుతమని, ఆ మరిచిపోలేని ఘట్టాన్ని తమ సినిమాలో పునర్ ఆవిష్కరిస్తున్నామని ఈ సినిమాలో కపిల్ దేవ్‌గా నటిస్తున్న రణ్వీర్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆనాటి పాత ఫోటోలను ఆయన పోస్ట్ చేశారు. కపిల్ ‘లెజండరీ ఇన్నింగ్స్’ పై సునీల్ గవాస్కర్ స్పందిస్తూ.. బీబీసీ టీవీ సిబ్బంది సమ్మె చేయడం వల్ల నాటి కపిల్ లెజండరీ ఇన్నింగ్స్ మ్యాచ్‌ను బీబీసీ ప్రసారం చేయలేకపోయిందని తెలిపారు. -
కోల్‌కతాను ఆపతరమా!
కీలక పోరులో ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడుతున్న వేళ... గత మ్యాచ్‌లో ఆండ్రీ రసెల్ తమ బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకు పడి చావబాదిన తీరు రాయల్ చాలెంజర్స్ బెంగళూరును వెంటాడుతూనే ఉంటుంది. ఢిల్లీకి కూడా తమ సొంత సమస్యలు ఉండటం ఒక్కటే బెంగళూరుకు కాస్త ఊరటనిచ్చే విషయం. తమ బ్యాట్స్‌మెన్ చెత్త షాట్లు ఆడటంతో తక్కువ స్కోరుకే పరిమితమై సన్‌రైజర్స్‌కు మ్యాచ్ సమర్పించుకుంటే ఆ జట్టు పిచ్‌ను నిందిస్తోంది. నిజాయితీగా తమ లోపాలను గుర్తించి సరిదిద్దుకునే బదులు పిచ్‌ను తిట్టి ప్రధాన అంశాన్ని పక్కదోవ పట్టించడం చూస్తే ‘పని చేతకానివాడు తమ పనిముట్లను తప్పు పట్టాడట’...అనే పాతకాలం సామెత నాకు గుర్తుకొస్తోంది. అసలు వారు ఆడిన షాట్లు చూశారా! ఆ తర్వాత ఐదు వికెట్లు తీసిన తర్వాత కూడా ఒత్తిడి పెంచకుండా పస లేని బౌలింగ్‌తో వారు హైదరాబాద్‌కు కోలుకునే అవకాశం కల్పించారు. బెంగళూరులో బ్యాటింగ్‌కు బాగా అనుకూలించిన పిచ్‌పై శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్లు చెలరేగడంతో 400కు పైగా పరుగులు రావడం అభినందించదగ్గ విషయం. పిచ్ ఇక ముందు కూడా మారకపోవచ్చు. కాబట్టి కోహ్లి టాస్ గెలిచి ఛేదనకు మొగ్గు చూపాలని బెంగళూరు అభిమానులు ఆశిస్తున్నారు. ఎందుకంటే ఎంత పెద్ద లక్ష్యాన్నైనా జట్టు బౌలర్లు నిలబెట్టలేకపోతున్నారు. సరైన లెంగ్త్‌లో బౌలింగ్ చేస్తే ఇక్కడి అదనపు బౌన్స్ రబడ, మోరిస్‌లకు సహకరించవచ్చు. ఓటమి దిశగా వెళుతున్న సమయంలో రసెల్ భీకర బ్యాటింగ్‌తో మ్యాచ్ గెలుచుకున్న అనంతరం కోల్‌కతా జట్టులో జోరు మరింత పెరిగింది. ఇలాంటి సమయంలో ఆ జట్టు తో రాజస్తాన్ రాయల్స్‌కు పోరాటం తప్పదు. రాయ ల్స్ పవర్‌ప్లేలో మరింత సానుకూలంగా ఆడితే మం చిది. ఇప్పటి వరకు చెలరేగని స్మిత్, స్టోక్స్ కూడా బా గా ఆడితే రాజస్తాన్ భారీ స్కోరు చేయవచ్చు. కోల్‌కతా నైట్‌రైడర్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. రసెల్ చెలరేగడం, ఇతర ఆటగాళ్లు కూడా తమ వంతు పాత్ర పోషిస్తుండటంతో పాటు చివరి వరకు ఓటమిని అంగీకరించని తత్వం ఆ జట్టును గెలిపిస్తున్నాయి. ఇక నరైన్ ఒక్కడు గతంలోలాగా ఆరంభంలో వికెట్లు తీయగలిగితే కోల్‌కతాను ఆపడం కష్టం కావచ్చు. -
సెహ్వాగ్‌ను తలపిస్తున్నాడు
వెస్టిండీస్‌కు మర్చిపోలేనిదిగా మిగిలిన ఈ పర్యటనను భారత జట్టు 3–0తో ముగించాలని భావిస్తోంది. పొట్టి ఫార్మాట్లో ప్రపంచ చాంపియన్ విండీస్ చెన్నైలో జరిగే చివరి మ్యాచ్‌లోనైనా ఆతిథ్య జట్టుకు పోటీనిస్తుందా చూడాలి. వారి నుంచి కనీస ప్రతిఘటన కూడా ఎదురుకావడం లేదు. టీమిండియా ఆటగాళ్లు అటు బంతితో, ఇటు బ్యాట్‌తో అదరగొడుతున్నారు. కొత్త ఆటగాళ్లు జట్టులో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు యత్నిస్తున్నారు. వన్డే, టి20 సిరీస్‌ల్లో రోహిత్ శర్మ అద్భుత ప్రదర్శన చేశాడు.అచ్చం సెహ్వాగ్‌ను తలపించాడు. ఒక్కసారి జోరు అందుకుంటే అతన్ని ఆపడం కష్టం. భారీ సెంచరీల కోసం ఆకలిగొన్న వాడిలా విరుచుకుపడుతున్నాడు. ఓ బంతిని బౌండరీకి తరలించాక మరో భారీ షాట్ కొట్టే ముందు సెహ్వాగ్ ఓసారి మైదానాన్ని గమనించేవాడు. రోహిత్ మాత్రం అలవోకగా మరో షాట్‌కు యత్నిస్తాడు. రోహిత్ పరిమిత ఓవర్ల క్రికెట్లో కనబరిచే దూకుడు టెస్టుల్లోనూ కొనసాగించగలిగితే సంప్రదాయ క్రికెట్లో వివ్ రిచర్డ్స్, సెహ్వాగ్ తర్వాత ప్రపంచంలో అత్యంత విధ్వంసకర బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందుతాడు. సచిన్ టెండూల్కర్, లారా, పాంటింగ్ లాంటి దిగ్గజాలు నిలకడగా రాణిస్తూ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించారు. కానీ రిచర్డ్స్, సెహ్వాగ్‌లాగా నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడలేదు. వీరిద్దరూ తమ ఆటతీరుతో బౌలర్లను బెంబేలెత్తించారు. చివరి మ్యాచ్‌లో కుల్దీప్కు విశ్రాంతి కల్పించడంతో చహల్‌కు అవకాశం దక్కనుంది. అతను కూడా విండీస్ పనిపట్టడానికి అస్త్రశస్త్రాలతో సిద్ధంగా ఉన్నాడు. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు భువనేశ్వర్‌కు మరిన్ని ఓవర్లు బౌలింగ్ చేయడానికి ఇది మంచి అవకాశం. అరంగేట్రం ఆటగాళ్లు ఖలీల్ అహ్మద్, కృనాల్ పాండ్యా ఆకట్టుకున్నారు. చివరి మ్యాచ్‌లో ఫలితం ఎలా ఉన్నా... ఈ ఏడాది భారత్‌లో పర్యటించిన జట్లకు అంతగా కలిసి రాలేదు. -
బ్రాడ్‌మన్ తర్వాత కోహ్లినే!
రెండో వన్డే ‘టై’గా ముగియడం నా దృష్టిలో సరైన ఫలితమే. ఎందుకంటే ఇరు జట్ల బౌలర్లు కూడా తమ జట్టును గెలిపించే స్థాయి ప్రదర్శన ఇవ్వలేదు. కెప్టెన్లు ఇద్దరూ తమ బౌలింగ్ బలగాల గురించి ఆందోళన చెందుతూ ఉండవచ్చు. ఇంతకుముందే చెప్పుకున్నట్లుగా టి20 క్రికెట్ ప్రభావం వల్ల వన్డేల్లో కూడా జోరు పెరిగింది. ఒక జట్టు 300 పరుగుల స్కోరు సాధించడం గతంలోలాగా అరుదుగా కాకుండా ఇప్పుడు చాలా సహజంగా మారిపోయింది. విరాట్ కోహ్లి బ్యాటింగ్ చేస్తున్న తీరు చూస్తుంటే అతను మానవమాత్రుడిలా కనిపించడం లేదని కొద్ది రోజుల క్రితం బంగ్లాదేశ్ బ్యాట్స్‌మన్ తమీమ్ ఇక్బాల్ వ్యాఖ్యానించాడు. అతని మాటలు ఇప్పుడు నిజంలాగే అనిపిస్తున్నాయి. స్విచ్ వేయగానే యంత్రం పని చేయడం ప్రారంభించినట్లు కోహ్లి పరుగులు చేసేస్తున్నాడు. కోహ్లి నిలకడ గురించి చెప్పాలంటే అద్భుతం అనే మాట కూడా సరిపోదు. అయితే దీనికి మించి అతను పరిస్థితులను అర్థం చేసుకుంటూ జట్టుకు ఏది అవసరమో దాని ప్రకారం తన ఆటను మార్చుకుంటూ ఆడటమే మరింత పెద్ద విశేషం. అతను బ్యాటింగ్‌కు వెళుతున్నాడంటే చాలు కచ్చితంగా సెంచరీ సాధిస్తాడనే విషయంలో కించిత్ కూడా సందేహం కనిపించడం లేదు. గతంలో ఇలాంటి స్థితి ఒక్క సర్ డాన్ బ్రాడ్‌మన్ విషయంలోనే కనిపించేది. నాడు బ్రాడ్‌మన్ మైదానంలోకి దిగుతుంటే చూడచక్కగా స్టైల్‌గా కనిపించేది. ఇప్పుడు కోహ్లి తనదైన శైలిలో గంభీరంగా, ఆత్మవిశ్వాసంతో వెళుతుంటే ప్రత్యర్థి ఆటగాళ్లు అతని కళ్లల్లో కళ్లు పెట్టి చూసే ధైర్యం కూడా చేయడం లేదు. అయితే భారత జట్టు ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో మ్యాచ్‌లో మలుపులు సాగుతున్నప్పుడు మాత్రం తన భావోద్వేగాలను ప్రదర్శిస్తూ కోహ్లి మామూలు మానవుడిలా కనిపిస్తున్నాడు. వెస్టిండీస్‌ను ఈసారి 300లోపు కట్టడి చేసే బౌలింగ్ బలగం భారత్‌కు ఉందని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. గత మ్యాచ్లకంటే ఈసారి మరింత మెరుగ్గా ఫీల్డింగ్ చేయాలని కూడా జట్టు భావిస్తోంది. రనౌట్‌కు అవకాశం లేకున్నా అనవసరంగా స్టంప్స్‌పైకి బంతిని విసిరే అలవాటుపై కూడా టీమ్ మేనేజ్మెంట్ దృష్టి పెట్టాల్సి ఉంది. -
అతడిని ఆదర్శంగా తీసుకోవాలి
పటిష్ట బ్యాటింగ్ లైనప్ ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సాధారణ లక్ష్యాన్ని కాపాడుకోవడం గొప్ప విషయం. మ్యాచ్ మ్యాచ్‌కూ సన్‌రైజర్స్ బౌలర్ల ప్రదర్శన మెరుగవుతోంది. కెప్టెన్ విలియమ్సన్ నిలకడగా ఆడుతుండగా... అతనికి సహచరుల నుంచి మద్దతు లభించాల్సిన అవసరం ఉంది. సన్‌రైజర్స్ జట్టులో కొందరు బ్యాట్స్‌మెన్ ఔటవుతున్న తీరు నిరాశ కలిగిస్తోంది. శుభారంభం లభించాక ఎక్కువసేపు క్రీజులో నిలిచి భారీగా పరుగులు చేయడంపై ఆ జట్టు దృష్టి సారించాలి. ఈ విషయంలో విలియమ్సన్‌ను మిగతావారు ఆదర్శంగా తీసుకోవాలి. 20 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ వాటిని అర్ధ సెంచరీలుగా మార్చేందుకు ప్రయత్నించి జట్టు భారీ స్కోరుకు దోహదపడాలి. మరోవైపు ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకు పృథ్వీ షా, శ్రేయస్ అయ్యర్ ద్వారా శుభారంభాలు లభిస్తున్నాయి. సన్‌రైజర్స్‌తో నేడు జరిగే మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాలని డేర్ డెవిల్స్‌కు తెలుసు. ఢిల్లీ ఎక్కువగా భారత బ్యాట్స్‌మెన్ ఆటతీరుపైనే ఆధారపడుతోంది. స్పిన్నర్ అమిత్ మిశ్రా పొదుపుగా బౌలింగ్ చేయడంతోపాటు కీలక సమయాల్లో వికెట్లు తీస్తున్నాడు. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ గట్టెక్కాలంటే విశేషంగా రాణించాల్సిందే. -
ధోనిని చూసి కుర్రాళ్లు నేర్చుకోవాలి
పటిష్టమైన చెన్నై సూపర్ కింగ్స్‌పై సాధికారిక విజయం సాధించిన ముంబై ఇండియన్స్ జట్టు ఈ ఐపీఎల్ సీజన్లో మళ్లీ ఫామ్‌లోకి వచ్చినట్టు అనిపిస్తోంది. గత సీజన్లలో ముంబై ఆరంభంలో తడబడి ఆ తర్వాత కోలుకొని చాంపియన్‌గా నిలిచిన సందర్భాలున్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆకట్టుకుంది. బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు వచ్చిన అతను జట్టును విజయబాట పట్టించాడు. లీగ్ తొలి మ్యాచ్‌లోనే ముంబైను ఓడించి... ఇపుడు అదే జట్టు చేతిలో ఓటమి పాలైన చెన్నై నేడు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగే మ్యాచ్‌లో పుంజుకునే అవకాశం ఉంది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రాకతో ఢిల్లీ జట్టు పరాజయాల బాటను విడిచి విజయపథంలోకి వచ్చింది. మరోవైపు ఇద్దరు యువ బౌలర్లు అవేశ్ ఖాన్, శివమ్ మావి దుందుడుకు ప్రవర్తనకుగాను ఐపీఎల్ కౌన్సిల్ మందలించడం శుభపరిణామం. బ్యాట్స్‌మెన్‌ను అవుట్ చేశాక ఈ ఇద్దరు బౌలర్లు అభ్యంతరకర భాషను ప్రయోగించడం మంచిది కాదు. యువ క్రికెటర్లలో ఈ దూషణ పర్వం అలవాటును మొగ్గలోనే తుంచేయాలి. అయితే టీవీల్లో తమ సీనియర్ క్రికెటర్ల ప్రవర్తనను చూశాకే వీరు కూడా ఇలా చేసి ఉంటారనిపిస్తోంది. ఈ మందలింపు అనేది ఈ ఇద్దరితోపాటు మిగతా యువ ఆటగాళ్లకు హెచ్చరికలాంటిదే. వికెట్ తీసినపుడుగానీ, అర్ధ సెంచరీ చేసినపుడగానీ ఆవేశంతో సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారో అర్ధం కావడంలేదు. ఆవేశం ప్రదర్శించే బదులు హాయిగా నవ్వుతూ ఆ క్షణాలను ఆస్వాదిస్తే అందరికీ బాగుంటుంది. మైదానంలో ఎలా ప్రవర్తించాలనే విషయంలో యువ క్రికెటర్లు ధోనిని చూసి నేర్చుకోవాలి. సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించినా ధోని ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్లిపోతాడు. విజయంలోనూ అతను హుందాతనం చూపిస్తాడు. -
సరైన ఆరంభమే సునీల్ గావస్కర్
చెన్నై సూపర్ కింగ్స్ పునరాగమనం చిరస్మరణీయం. కఠిన పరిస్థితుల్లోనూ అద్భుతంగా ఆడగల బ్రేవో వంటి అనుభవజ్ఞులతో కూడిన ఆ జట్టు బలంగా కనిపిస్తోంది. ఓటమి అంచుల నుంచి సూపర్ కింగ్స్ సాధించిన విజయంతో ఐపీఎల్–11వ సీజన్‌కు సరైన ఆరంభం లభించినట్లయింది. జట్టులో ఆల్‌రౌండర్లు ఉండటం ఎంతటి సౌలభ్యమో బ్రేవో అసాధారణ ఇన్నింగ్స్ చెబుతోంది. అంతకుముందు బ్రేవో జిత్తులమారి బౌలింగ్‌తో ప్రత్యర్థి స్కోరు 180కి చేరకుండా నిలువరించాడు. చివరి ఓవర్లలో అతడి నెమ్మదైన బంతులు, వేగవంతమైన యార్కర్లను ముంబై బ్యాట్స్‌మెన్ భారీ షాట్లుగా మలచలేకపోయారు. ఛేదనలో 16వ ఓవర్ ముగిసేసరికి చెన్నై దాదాపు 11 రన్‌రేట్‌తో పరుగులు సాధించాల్సి ఉంది. ఈ దశలో బ్రేవో భారీ హిట్టింగ్తో ఫలితాన్ని మార్చేశాడు. లీగ్‌లో పునరాగమనం చేస్తున్న మరో జట్టు రాజస్తాన్ రాయల్స్ కూడా చెన్నైను చూసి స్ఫూర్తి పొందుతుందనడంలో సందేహం లేదు. స్టీవ్ స్మిత్ దూరమైనా... వార్న్ వంటి వారు మెంటార్‌గా ఉండటంతో జట్టు సమతూకంతో కనిపిస్తోంది. రహానే కెప్టెన్సీ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించగలడు. సిక్స్‌లు కొట్టలేకపోయినా బౌండరీలతో పరుగులు రాబట్టగలడు. వార్నర్ లేకపోవడం సన్‌రైజర్స్‌కు పెద్ద దెబ్బే. బ్యాటింగ్‌లో అతడే జట్టు మూలస్తంభం. తన కెప్టెన్సీ కూడా అద్భుతం. అతడి స్థానంలో వస్తున్న విలియమ్సన్ ఈ సీజన్లో తమ దేశం తరఫున బాగా ఆడాడు. కెప్టెన్‌గా అతడు బాగా ఎదిగాడు. భావాలను బహిరంగంగా ప్రదర్శించే అతడు... పరిస్థితులను అంతే చక్కగా అర్థం చేసుకుంటాడు. గొప్ప బ్యాట్స్‌మన్, గొప్ప బౌలర్ మధ్య జరిగినట్లే కెప్టెన్ల మధ్య కూడా పోరాటం ఉంటుంది. ఏదేమైనా... ఈ ఏడాది ఏ కెప్టెనైతే మ్యాచ్‌ను మలుపుతిప్పగల వ్యూహాలు పన్నుతాడో ఆ జట్టే విజేతగా నిలుస్తుంది. -
బీసీసీఐ చొరవ చూపాలి
డివిలియర్స్ వంటి ఆటగాడు తిరిగి జట్టుతో చేరడం చిన్న విషయమేం కాదు. ఆటను అతడెలా మార్చేయగలడో ప్రపంచానికంతటికీ తెలుసు. రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పెంపొందించే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ‘పింక్ డే’ మ్యాచ్‌లలో అతడి నమ్మశక్యంకాని ఇన్నింగ్స్‌లు మార్క్రమ్ బృందానికి స్ఫూర్తిదాయకమైనవే. దీంతోపాటు ‘గులాబీ’ రంగు దుస్తుల్లో దక్షిణాఫ్రికా ఇంతవరకు ఓడలేదు. ఓవైపు భారత మణికట్టు స్పిన్ ద్వయాన్ని ఎదుర్కోవడంలో సఫారీల వైఫల్యం కొనసాగుతుండగా... మరోవైపు కోహ్లిని నిలువరించడం పెద్ద ఆందోళనగా మారింది. కోహ్లికి రబడ మాత్రమే సవాల్ విసరగలుగుతున్నాడు. వీరి పోరాటం చూడదగినది. అత్యంత ధనిక బోర్డుగా పేరుగాంచిన బీసీసీఐ... ఛారిటీ మ్యాచ్‌ల నిర్వహణలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా బోర్డులను చూసి నేర్చుకోవాలి. కాస్త చొరవ చూపించి ప్రతి సీజన్లో ఒక అంశాన్ని ఎంచుకుని దానిపై అవగాహన కల్పించే ఆలోచన చేయాలి. ఐపీఎల్‌లోనూ ఇలాంటి అంశాలకు చోటివ్వచ్చు. ఆటగాళ్లపై, వారి ఇతరత్రా ఖర్చులతో పోలిస్తే ఇదేమంత పెద్ద మొత్తం కాదు. పైగా వచ్చే మంచి పేరు వెలకట్టలేనిది. విద్యకు సంబంధించిన విషయంపై ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఇలానే చేస్తోంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ‘గ్రీన్ డే’ మ్యాచ్ ఆడుతోంది. ఇలా ప్రతి ఫ్రాంచైజీ ఒక మంచి ఉద్దేశంతో ముందుకొస్తే సమాజానికి మేలు చేసిన వారవుతారు. డబ్బు ఆడించే ఆటగా ఐపీఎల్‌పై ఉన్న వ్యతిరేకత కూడా కొంత తగ్గుతుంది. -
నంబర్‌వన్ స్థాయిలో ఆడాలి
తొలి టెస్టులో భారత్ పరాజయం పాలైనా ఇప్పటికీ సిరీస్ గెలిచే అవకాశం జట్టుకు ఉంది. మూడు టెస్టుల సిరీస్‌లో మొదటి మ్యాచ్ ఓడాక కోలుకోవడం ఎప్పుడైనా కష్టమే. అయితే రెండేళ్ల క్రితం ఇదే భారత జట్టు శ్రీలంకలో దానిని చేసి చూపించింది. ఇప్పుడు దానిని పునరావృతం చేయవచ్చు కూడా. దక్షిణాఫ్రికాపై విజయం సాధించాలనే కల నిజం కావాలంటే జట్టు బ్యాట్స్‌మెన్ అత్యద్భుతంగా ఆడాల్సి ఉంటుంది. గత మ్యాచ్‌లో బ్యాటింగ్ వైఫల్యమే దెబ్బ తీసిందని అంగీకరించాల్సిందే. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా లేదనేది వాస్తవమే అయినా మరీ ఆడలేనంత ఘోరంగా కూడా ఏమీ లేదు. మనోళ్ల బాడీ లాంగ్వేజ్ ఎంత ఇబ్బందికరంగా అనిపించిందంటే కనీసం బ్యాటింగ్‌లో కాలు కదిపి కూడా ఆడలేకపోయారు. రెండు ఇన్నింగ్స్‌లలో కూడా స్వింగ్ మాయలో పడిపోవడంతో వికెట్ల పతనం కొనసాగింది. ఇప్పుడైనా వారు తమ నిస్సత్తువను దూరం చేసి ఆత్మవిశ్వాసంతో గట్టిగా నిలబడాల్సి ఉంది. టీమ్ మేనేజ్మెంట్ ఆలోచనలేమిటో నాకు తెలీదు కానీ జట్టు వార్మప్ మ్యాచ్‌లు ఆడాల్సింది. ప్రతీసారి మనం విదేశాల్లో సిరీస్ తొలి టెస్టులో ఇబ్బంది పడుతున్నామనే ఒక్క కారణం దానికి చాలు. తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలింగ్‌ను ఎదుర్కొంటున్నప్పుడు మనలో కనిపించిన అపరిచిత భావన అంతకుముందు రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడి ఉంటే చాలా వరకు దూరమయ్యేది. నెట్ ప్రాక్టీస్‌లో ఆరున్నర అడుగుల ఎత్తు ఉన్న ఒక బౌలర్‌తో బౌలింగ్ చేయించుకుంటే మోర్నీ మోర్కెల్ బంతులు ఎలా వస్తున్నాయో ఒక అవగాహన వచ్చేది. దురదృష్టవశాత్తూ సన్నాహాలు మరీ నాసిరకంగా ఉన్నాయి. మరోవైపు ఆప్షనల్ ప్రాక్టీస్ అనే విషయాన్నే పూర్తిగా తీసి పడేయాలి. కేవలం కోచ్, కెప్టెన్ మాత్రం ఎవరికి విశ్రాంతి అవసరమో, ఎవరికి అవసరం లేదో నిర్ణయించాలి తప్ప ఆటగాళ్లు తమ ఇష్టానుసారం చేయడం కాదు. మీ ఇష్టం అంటూ వదిలేస్తే చాలా మంది మ్యాచ్‌కు ముందు రోజు, ఆపై మ్యాచ్ తర్వాతి రోజు కూడా ప్రాక్టీస్ చేయకపోవడం మనం చూశాం. జట్టు పర్యటనలకు వెళ్లినప్పుడు ఆటగాళ్ల వెంట వారి కుటుంబ సభ్యులు ఉండాలనే అంశానికి నేను ఎప్పటి నుంచో మద్దతు పలుకుతున్నా. ఆఫీసుకు వెళ్లేవారు సాయంత్రం కాగానే కుటుంబం చెంతకు చేరుతుంటే క్రికెటర్లకు ఆ అవకాశం ఎందుకు ఉండరాదనేది నా అభిప్రాయం. అయితే ఆఫీసు పనివేళల్లో ఎవరైనా ఆఫీసుకు సంబంధించిన పని చేయాల్సిందే. ఇక్కడ ఆఫీస్ అంటే టెస్టు కోసం ప్రాక్టీస్ చేయడం, ఒక పెద్ద టెస్టుకు ముందు సరైన రీతిలో సిద్ధం కావడం. అయితే ఇది మాత్రం సక్రమంగా జరగడం లేదు. టెస్టు ముగిసిన తర్వాతి రోజు అంటే వాస్తవంగా అది మ్యాచ్ ఐదో రోజు కూడా ఆప్షనల్ ప్రాక్టీస్ అవకాశం ఇవ్వడం నన్ను నిజంగా నిరాశపర్చింది. ఆ రోజు రిజర్వ్ బెంచీలో ఉన్న ఆరుగురిలో నలుగురు మాత్రమే ప్రాక్టీస్ చేశారు. వర్షం కారణంగా మూడో రోజు అసలు ఆటే జరగని స్థితిలో అలసిపోవడం అనే మాటలకు కూడా తావు లేదు. నిజానికి పేస్ బౌలర్లు మినహా మిగతా వారంతా ప్రాక్టీస్‌కు హాజరు కావాల్సింది. టెస్టు ముగియగానే తాము ఆడిన పిచ్‌పై నీళ్లు చల్లకుండా అలాగే ఉంచమని గ్రౌండ్స్‌మన్‌కు చెప్పాల్సింది. తమను ఇబ్బంది పెట్టిన పిచ్‌పై తిరిగొచ్చి బ్యాట్స్‌మెన్ మళ్లీ సాధన చేయాల్సింది. తర్వాతి రోజు ప్రయాణం చేస్తున్నారు కాబట్టి ప్రాక్టీస్ చేసినా, చేయకపోయినా సమస్య లేదు. ఓటమి తర్వాత తప్పులను సరిదిద్దుకునేందుకు కొంత అదనంగా శ్రమించక తప్పదు. అయితే ఇప్పుడు జరిగిందంతా గతం. గొప్పవాళ్లకు కూడా ఇది సహజమే అన్నట్లు న్యూలాండ్స్‌లో జరిగిన దానిని అరుదైన ఘటనగా నిరూపించాల్సిన బాధ్యత ఆటగాళ్లపై ఉంది. దెబ్బతిన్న పులిలా లేచి మళ్లీ వారు విజృంభిస్తారని ఆశిస్తున్నా. ఈ జట్టు ఇప్పటికీ వరల్డ్ నంబర్‌వన్ అని మరచిపోవద్దు. ఇక తప్పులకు ఎలాంటి అవకాశం ఇవ్వవద్దు. -
ఎవరు నంబర్‌వన్ అనేది తేలే సమయం
పరుగులు చేయడం, వికెట్లు తీయడం కంటే మాట్లాడటం తేలిక. ఇప్పుడిక అసలు ఆట ప్రారంభమైంది. రెండింటిలో ఏది నంబర్‌వన్ టెస్టు జట్టో తేల్చే సమయం వచ్చేసింది. అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సుదీర్ఘ సిరీస్‌లో ఆటగాళ్లు పాల్గొనబోతున్నారు. రెండు జట్లకూ ఎంపికలో ఇబ్బందులున్నాయి. ముఖ్యంగా పేసర్ల విషయంలో. తీవ్రమైన భుజం గాయం నుంచి డేల్ స్టెయిన్ కోలుకున్నాడు. కానీ మ్యాచ్ ఫిట్నెస్తో ఉన్నాడా? రోజంతా బౌలింగ్ చేయగలడా? అతడి భుజం వేగంగా బంతులు విసిరేందుకు సహకరిస్తుందా? 400లకు పైగా వికెట్లు తీసిన అతడిని తుది జట్టులోకి తీసుకోకుండా ఉండగలమా? ఒకవేళ మళ్లీ గాయపడితే? ఇదంతా దక్షిణాఫ్రికా సందిగ్ధత. ఏ సీమర్‌ను పక్కన పెట్టాలి... ఏ స్పిన్నర్‌ను ఆడించాలి? అనేవి భారత్ సందేహాలు. షమీ, భువనేశ్వర్ జట్టు తొలి ప్రాధాన్యత. వీరికి తోడుగా అదనపు పేస్‌తో పాటు, పాత బంతిని స్వింగ్ చేయగల ఉమేశ్, తిరిగి గాడిలో పడిన ఇషాంత్‌లలో ఎవరిని తీసుకోవాలనే ఆలోచనలో పడింది. జడేజా జ్వరం కారణంగా ఏకైక స్పిన్నర్‌గా అశ్విన్ ఖాయమే. కానీ... జడేజా కోలుకుంటే కోహ్లి ఎక్కువగా నమ్మే అతడికే అవకాశం ఉండొచ్చు. బ్యాటింగ్ విషయానికొస్తే ఓపెనర్లు సహా మిడిలార్డర్ గురించి టీమిండియాకు ఇబ్బంది లేదు. లోయర్ ఆర్డర్లో వికెట్ కీపర్ సాహా బ్యాటింగ్ సామర్థ్యం అదనపు బలం. భారత ఫీల్డింగ్ గురించే కొంచెం ఆలోచించాలి. శ్రీలంక సిరీస్‌లో కొన్ని క్యాచ్‌లు చేజారినా అంతిమంగా విజయం దక్కింది. అయితే... జారవిడిచిన క్యాచ్‌లు గెలుపునే దూరం చేస్తాయని ఢిల్లీ టెస్టు నిరూపించింది. స్లిప్ చాలా కీలక ప్రాంతం. సుదీర్ఘ కాలంగా ఉత్తమ క్యాచర్‌గా ఉన్న రహానే సీమర్ల బౌలింగ్‌లో ఎప్పుడోగానీ క్యాచ్‌లు రాని గల్లీలో ఎందుకు? ధావన్, అతడు 1, 2 స్లిప్‌లలో ఉండాలి. జట్టుగా బలంగా ఉన్న భారత్... మైదానంలో కనబరిచే ఆటపైనే సిరీస్ ఫలితం ఆధారపడి ఉంటుంది. -
భారత టెస్టు చరిత్రలో దారుణమైన ఓటమి: గవాస్కర్
ముంబై: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ఘోరంగా ఓడిపోవడం భారత్టెస్టు చరిత్రలోనే అత్యంత దారుణమైన ఓటమిగా సునీల్ గవాస్కర్ అభివర్ణించారు. పూణే టెస్టు మ్యాచ్‌లో ఒకిఫ్ స్పిన్ మాయాజలానికి భారత్ 333 పరుగుల తేడాతో పరాజయం పొందింది. ఈ ఓటమిపై గవాస్కర్ తీవ్రంగా స్పందించారు. భారత్ రెండున్నర రోజుల్లో ఆటముగించడం నమ్మలేకపోతున్నానని తెలిపారు. ఆసీస్ స్పిన్నర్ల అటాకింగ్ తనను ఆశ్చర్యానికి గురిచేసిందని, ఇది భారత క్రికెట్‌కు బ్లాక్ డేగా పేర్కొన్నారు. భారత్ బ్యాటింగ్‌లో రెండు ఇన్నింగ్స్‌లను 75 ఓవర్లకు ముగించడం అసంతృప్తికి గురిచేసిందని గవాస్కర్ తెలిపారు. భారత ఆటగాళ్లు అత్యంత పేలవమైన ప్రదర్శన కనబర్చారని చెప్పారు. ట్రీ బ్రెక్ తర్వాత అరగంట సమయంలో భారత ఇన్నింగ్స్ ముగించడం నమ్మలేకపోతున్నానని తెలిపారు. ఆటగాళ్లు కేర్లెస్గా ఆడారని , ఏ ఒక్కరు క్రీజులో నిలదొక్కుకోవడానికి ప్రయత్నించలేదన్నారు. ఇప్పటికైనా చేసిన తప్పులు గ్రహించి మిగతా మ్యాచ్‌లకు సిద్దం కావాలని గవాస్కర్ ఆటగాళ్లకు సూచించారు.