![Sunil Gavaskar Names His Two Finalists For T20 World Cup - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/18/Sunil.jpg.webp?itok=KQJWmnvJ)
టీ20 ప్రపంచకప్-2022లో ప్రస్తుతం క్వాలిఫియర్స్(రౌండ్-1) మ్యాచ్‌లు జరగుతున్నాయి. తొలి మ్యాచ్ నుంచే ఈ మెగా ఈవెంట్‌లో సంచలనాలు నమోదయ్యాయి. తొలి మ్యాచ్‌లో ఆసియాకప్ విజేత శ్రీలంకను పసికూన నమీబియా మట్టి కరిపించగా.. రెండు సార్లు టీ20 ప్రపంచకప్ ఛాంపియన్ వెస్టిండీస్‌ను స్కాట్లాండ్ చిత్తు చేసింది.
ఇక సూపర్-12 రౌండ్ ఆక్టోబర్ 22 నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి మ్యాచ్‌లో సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఇక టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్ 23న చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో అమీతుమీ తెల్చుకోనుంది. మరోవైపు ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది.
ఇక ఇది ఇలా ఉండగా.. టీ20 ప్రపంచకప్-2022కు ఫైనల్‌కు చేరే రెండు జట్లను భారత దిగ్గజం సునీల్ గవాస్కర్, ఆస్ట్రేలియా లెజెండ్ టామ్ మూడీ అంచనా వేశారు. టీమిండియా, ఆస్ట్రేలియా ఖచ్చితంగా ఫైనల్‌కు చేరుతాయి" అని గవస్కర్ స్టార్ స్పోర్ట్స్ షోలో పేర్కొన్నాడు. అదే విధంగా టామ్ మూడీ మాట్లాడుతూ.. టాప్-4లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, పాకిస్తాన్, టీమిండియా నిలుస్తాయి. అయితే ఫైనల్లో మాత్రం భారత్, ఆస్ట్రేలియా జట్లు అడుగు పెడతాయి అని తెలిపాడు.
చదవండి: T20 WC 2022: సహనం కోల్పోయిన షాదాబ్ ఖాన్.. 'కెప్టెన్‌గా పనికిరావు'
Comments
Please login to add a commentAdd a comment