After India Defeat In 1st ODI, Jasprit Bumrah Posts Comeback Video Goes Viral - Sakshi
Sakshi News home page

Jasprit Bumrah: టీమిండియాకు గుడ్‌ న్యూస్‌.. యార్కర్ల కింగ్‌ వచ్చేస్తున్నాడు!

Published Sat, Nov 26 2022 1:07 PM | Last Updated on Sat, Nov 26 2022 1:43 PM

Jasprit Bumrah posts COMEBACK video - Sakshi

టీ20 ప్రపంచకప్‌-2022కు ముందు ఆస్ట్రేలియా సిరీస్‌ సందర్భంగా టీమిండియా స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా గాయపడిన సంగతి తెలిసిందే.  ఈ క్రమంలో అతడు దక్షిణాఫ్రికాతో సిరీస్‌తో పాటు పొట్టి ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. అయితే ఇప్పుడు బుమ్రా పూర్తి స్థాయి ఫిట్‌నెస్‌ సాధించినట్లు తెలుస్తోంది

అతడు త్వరంలోనే మైదానంలోనే అడుగుపెట్టనున్నాడు. బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చేందుకు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. తన వర్కౌట్‌లకు సంబంధిచిన వీడియోను బుమ్రా ట్విటర్‌లో షేర్‌ చేశాడు. "అంత సులభమేం కాదు.. కానీ ఎల్లప్పుడూ విలువైనది" అంటూ క్యాప్షన్‌ పెట్టాడు.

వచ్చే ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. కాగా బుమ్రా లేని లోటు టీ20 ప్రపంచకప్‌లో సృష్టంగా కన్పించింది. ఇంగ్లండ్‌తో సెమీఫైనల్లో భారత బౌలర్లు కేవలం ఒక్క వికెట్‌ కూడా పడగొట్టలేకపోయారు. దీంతో 10 వికెట్ల తేడాతో ఓటమి పాలైన భారత్‌ అవమానకర రీతిలో టోర్నీ నుంచి నిష్క్రమించింది.


చదవండి: IPL 2023 Mini Auction: యువ బ్యాటర్‌ కోసం సంజూ శాంసన్‌ ప్లాన్‌! కేరళ ఆటగాడిపై రాజస్తాన్‌ కన్ను!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement