టీ20 వరల్డ్‌కప్ 2024 రెండో సెమీఫైనల్లో టీమిండియా ఇంగ్లండ్‌ను 68 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో టీమిండియా 2022 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. గత వరల్డ్‌కప్ సెమీస్‌లో ఇంగ్లండ్ టీమిండియాను 10 వికెట్ల తేడాతో ఓడించింది. ఇందుకు ప్రతిగా టీమిండియా ప్రస్తుత ప్రపంచకప్ సెమీస్‌లో ఇంగ్లండ్ 10 వికెట్లు పడగొట్టి చిత్తు చేసింది. టీమిండియా ఇంగ్లండ్ లెక్క సరి చేయడంతో భారత క్రికెట్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 'పర్ఫెక్ట్ రివెంజ్' అంటే ఇదే అంటూ కామెంట్లు చేస్తున్నారు.
THE WINNING CELEBRATION OF TEAM INDIA. 🇮🇳
- History will be rewritten tomorrow. 🏆pic.twitter.com/atRTQyA1ZA— Mufaddal Vohra (@mufaddal_vohra) June 28, 2024
2022 ప్రపంచకప్ సెమీస్‌లో టీమిండియాను ఓడించి ఫైనల్స్‌కు చేరిన ఇంగ్లండ్.. తుది సమరంలో పాకిస్తాన్‌ను ఓడించి రెండోసారి జగజ్జేతగా నిలిచింది. ప్రస్తుత వరల్డ్‌కప్ సెమీస్‌లో ఇంగ్లండ్‌కు ఓడించి ఫైనల్స్‌కు చేరని భారత్.. తుది సమరంలో సౌతాఫ్రికాను ఓడించి రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరిస్తుందని భారత క్రికెట్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
INDIA TOOK A PERFECT REVENGE OF 2022 SEMIS. 🇮🇳
- England defeated India by 10 wickets in the 2022 Semi Final.
- India took all 10 wickets of England in the 2024 Semi Final. pic.twitter.com/7OKz2yvrsT— Mufaddal Vohra (@mufaddal_vohra) June 27, 2024
కాగా, నిన్న (జూన్ 27) జరిగిన సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై విజయం సాధించిన టీమిండియా మూడోసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్స్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. రోహిత్ శర్మ (39 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (13 బంతుల్లో 23, ఫోర్, 2 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. కోహ్లి (9), దూబే (0) మరోసారి విఫలం కాగా.. పంత్ (4) నిరాశపరిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డన్ 3 వికెట్లు పడగొట్టగా.. రీస్ టాప్లీ, జోఫ్రా ఆర్చర్, సామ్ కర్రన్, ఆదిల్ రషీద్ తలో దక్కించుకున్నారు.
అనంతరం 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. కుల్దీప్ యాదవ్ (4-0-19-3), అక్షర్ పటేల్ (4-0-23-3), బుమ్రా (2.4-0-12-2) ధాటికి 16.4 ఓవర్లలో 103 పరుగులకే చాపచుట్టేసింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జోస్ బట్లర్ (23), హ్యారీ బ్రూక్ (25), జోఫ్రా ఆర్చర్ (21), లివింగ్‌స్టోన్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. కాగా, భారతకాలమానం రేపు (జూన్ 29) రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఫైనల్లో టీమిండియా.. సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment