టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా ఇంగ్లండ్‌తో నిన్న (జూన్ 27) జరిగిన రెండో సెమీఫైనల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పలు రికార్డులు బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో తాను చేసిన 57 పరుగుల్లో 6 ఫోర్లు బాదిన హిట్‌మ్యాన్.. టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో అత్యధిక బౌండరీలు బాదిన (43 మ్యాచ్‌ల్లో 113) ఆటగాడిగా శ్రీలంక దిగ్గజం మహేళ జయవర్దనే (111) రికార్డును బద్దలు కొట్టాడు.
ఇదే మ్యాచ్‌లో రెండు సిక్సర్లు కూడా బాదిన రోహిత్.. క్రిస్ గేల్ (63) తర్వాత టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో 50 సిక్సర్లు మార్కు తాకిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ మరో రెండు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో అత్యధిక సిక్సర్లు (22) బాదిన ఆటగాడిగా.. భారత కెప్టెన్‌గా 5000 పరుగుల మైలురాయిని దాటిన ఐదో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.
టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో అత్యధిక సిక్సర్లు
క్రిస్ గేల్- 63
రోహిత్ శర్మ- 50
జోస్ బట్లర్- 43
డేవిడ్ వార్నర్- 40
యువరాజ్ సింగ్- 33
విరాట్ కోహ్లి- 33
టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో అత్యధిక బౌండరీలు
రోహిత్ శర్మ- 113
జయవర్దనే- 111
విరాట్- 105
వార్నర్- 103
తిలకరత్నే దిల్షన్- 101
భారత కెప్టెన్‌గా అత్యధిక పరుగులు
విరాట్- 12883
ధోని- 11207
అజహారుద్దీన్- 8095
గంగూలీ- 7643
రోహిత్- 5012
ఐసీసీ నాకౌట్స్‌లో అత్యధిక సిక్సర్లు
రోహిత్ శర్మ- 22
క్రిస్ గేల్- 21
ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి మూడోసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్స్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన ఇంగ్లండ్ 16.4 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌటైంది.
రోహిత్ శర్మ (57), సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), కుల్దీప్ యాదవ్ (4-0-19-3), అక్షర్ పటేల్ (4-0-23-3), బుమ్రా (2.4-0-12-2) భారత విజయంలో కీలకపాత్రలు పోషించారు. భారతకాలమానం రేపు (జూన్ 29) రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఫైనల్లో టీమిండియా.. సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment