T20 World Cup 2024: సెమీస్‌లో టీమిండియా ప్రత్యర్ధి ఇంగ్లండ్‌..! | T20 World Cup 2024: India Will Face Australia In Semis If It Wins Against Australia In Super 8 Match | Sakshi
Sakshi News home page

T20 World Cup 2024: సెమీస్‌లో టీమిండియా ప్రత్యర్ధి ఇంగ్లండ్‌..!

Published Mon, Jun 24 2024 1:04 PM | Last Updated on Mon, Jun 24 2024 1:26 PM

T20 World Cup 2024: India Will Face Australia In Semis If It Wins Against Australia In Super 8 Match

టీ20 వరల్డ్‌కప్‌ 2024 గ్రూప్‌-2 సెమీస్‌ బెర్త్‌లు ఖరారయ్యాయి. ఈ గ్రూప్‌ నుంచి సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌ సెమీస్‌కు చేరుకున్నాయి. గ్రూప్‌-1 సెమీస్‌ బెర్త్‌లు నేడు (జూన్‌ 24) జరుగబోయే మ్యాచ్‌లతో ఖరారవుతాయి. 

ఇవాళ రాత్రి (భారతకాలమానం ప్రకారం) జరిగే భారత్‌-ఆసీస్‌ మ్యాచ్‌ ఫలితంతో గ్రూప్‌-1 సెమీస్‌ బెర్త్‌లపై క్లారిటీ వస్తుంది. ఏ కారణాల చేతైనా ఈ మ్యాచ్‌ ఫలితంతో క్లారిటీ రాకపోతే రేపు ఉదయం జరిగే బంగ్లాదేశ్‌-ఆఫ్ఘనిస్తాన్‌ మ్యాచ్‌ వరకు ఆగాల్సి ఉంటుంది.

కాగా, గ్రూప్‌-2 నుంచి సెమీస్‌ బెర్త్‌లు ఖరారు కావడంతో సెమీఫైనల్లో ఏయే జట్లు తలపడతాయనే అంశంపై అంచనాలు మొదలయ్యాయి. నేడు ఆసీస్‌తో జరుగబోయే మ్యాచ్‌లో భారత్‌ గెలిచినా లేక ఈ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైనా సెమీస్‌లో టీమిండియా.. ఇంగ్లండ్‌తో తలపడాల్సి ఉంటుంది. 

ఎందుకంటే.. టీమిండియా ఆసీస్‌పై గెలిచినా లేక ఈ మ్యాచ్‌ రద్దైనా గ్రూప్‌-1లో టీమిండియా అగ్రస్థానంలో ఉంటుంది. అప్పుడు షెడ్యూల్‌ ప్రకారం గ్రూప్‌-1 టాపర్‌.. గ్రూప్‌-2లో రెండో స్థానంలో ఉన్న జట్టుతో సెమీస్‌లో తలపడాల్సి ఉంటుంది. అలాగే గ్రూప్‌-1లో రెండో స్థానంలో నిలిచే జట్టు.. గ్రూప్‌-2 టాపర్‌ను ఢీకొట్టాల్సి ఉంటుంది. గ్రూప్‌-2లో సౌతాఫ్రికా అగ్రస్థానంలో ఉండగా.. ఇంగ్లండ్‌ రెండో స్థానంలో నిలిచింది

సెమీస్‌లో తమ ప్రత్యర్ధిగా ఎవరుండాలని ఎంచుకుని సౌలభ్యం ప్రస్తుతం టీమిండియాకు దొరికింది. ఆసీస్‌పై గెలిస్తే ఇంగ్లండ్‌.. ఆసీస్‌ చేతిలో ఓడితే సౌతాఫ్రికాను టీమిండియా ఢీకొట్టాల్సి వస్తుంది. ఇదిలా ఉంటే, గ్రూప్‌-2కు సంబంధించి యూఎస్‌ఏపై గెలుపుతో ఇంగ్లండ్‌.. వెస్టిండీస్‌ను చిత్తు చేసి సౌతాఫ్రికా సెమీస్‌ఫైనల్స్‌ చేరిన విషయం తెలిసిందే. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement