టీమిండియా రోహిత్ శర్మ తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యాడు. ఎప్పుడూ నవ్వుతూ, ఇతరులను ఆటపట్టిస్తూ సరదాగా కనిపించే రోహిత్.. టీ20 వరల్డ్‌కప్ సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై విజయానంతరం ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యాడు. ఫైనల్స్‌కు చేరామన్న సంతోషంలో ఉబికి వస్తున్న ఆనందభాష్పాలు ఆపుకునే ప్రయత్నం చేశాడు. చేతిని అడ్డుపెట్టుకుని తన భావోద్వేగాన్ని కవర్ చేసుకున్నాడు. అప్పుడే డ్రెస్సింగ్ రూమ్‌లోకి వచ్చిన విరాట్ అతని భుజం తట్టాడు. రోహిత్, కోహ్లి ఒకే ఫ్రేమ్‌లో ఉన్న చిత్రం సోషల్‌మీడియాలో వైరలవుతుంది.
Rohit Sharma got emotional on the Semis Finals victory. 🥹
- Virat Kohli confronted him! ❤️ pic.twitter.com/JMVT2qFx2q— Mufaddal Vohra (@mufaddal_vohra) June 27, 2024
కాగా, నిన్న (జూన్ 27) జరిగిన టీ20 వరల్డ్‌కప్ 2024 రెండో సెమీఫైనల్లో టీమిండియా ఇంగ్లండ్‌ను 68 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి, మూడోసారి ఫైనల్స్‌కు (టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో) చేరింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. రోహిత్ శర్మ (39 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (13 బంతుల్లో 23, ఫోర్, 2 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. కోహ్లి (9), దూబే (0) మరోసారి విఫలం కాగా.. పంత్ (4) నిరాశపరిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డన్ 3 వికెట్లు పడగొట్టగా.. రీస్ టాప్లీ, జోఫ్రా ఆర్చర్, సామ్ కర్రన్, ఆదిల్ రషీద్ తలో దక్కించుకున్నారు.
అనంతరం 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. కుల్దీప్ యాదవ్ (4-0-19-3), అక్షర్ పటేల్ (4-0-23-3), బుమ్రా (2.4-0-12-2) ధాటికి 16.4 ఓవర్లలో 103 పరుగులకే చాపచుట్టేసింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జోస్ బట్లర్ (23), హ్యారీ బ్రూక్ (25), జోఫ్రా ఆర్చర్ (21), లివింగ్‌స్టోన్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. కాగా, భారతకాలమానం రేపు (జూన్ 29) రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఫైనల్లో టీమిండియా.. సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment