Tom Moody compares Suryakumar Yadav with legendary Viv Richards - Sakshi
Sakshi News home page

'సూర్యను చూస్తుంటే సర్‌ వివియన్ రిచర్డ్స్‌ గుర్తొస్తున్నాడు'

Published Sat, Jan 14 2023 5:34 PM | Last Updated on Sat, Jan 14 2023 7:05 PM

Tom Moody compares Suryakumar Yadav with legendary Viv Richards - Sakshi

టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌పై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ టామ్ మూడీ ప్రశంసల వర్షం కురింపిచాడు. వెస్టిండీస్‌ గ్రేట్‌ సర్ వివియన్ రిచర్డ్స్‌తో సూర్యను పోల్చాడు. కాగా సూర్యకుమార్‌ యాదవ్‌ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అదేవిధంగా టీ20ల్లో వరల్డ్‌ నెం1 బ్యాటర్‌గా సూర్య కొనసాగుతున్నాడు.

ఇటీవలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో మెరుపు సెంచరీతో సూర్య చెలరేగాడు. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్‌లో సత్తా చాటుతున్న సూర్యకు టెస్టు జట్టులో కూడా చోటు దక్కింది. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌కు ఈ ముంబైకర్‌ భారత సెలక్టర్లు ఎంపికచేశారు.

ఈ నేపథ్యంలో స్పోర్ట్స్‌ టాక్‌తో మూడీ మాట్లాడుతూ.. "సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్‌ చేసే విధానం అద్భుతమైనది. నేను క్రికెట్‌ ఆడే తొలి రోజుల్లో సర్‌ వివియన్ రిచర్డ్స్ కూడా సూర్యలానే బ్యాటింగ్‌ చేసేవాడు. ప్రస్తుతం సూర్యను చూస్తుంటే మళ్లీ నాకు రిచర్డ్స్ గుర్తొస్తున్నాడు. అతడకి ఒంటిచేత్తో జట్టును గెలిపించే సత్తా ఉంది" అని పేర్కొన్నాడు.
చదవండి: IND vs SL 3rd ODI: పద్మనాభస్వామి ఆశీస్సులు తీసుకున్న భారత క్రికెటర్లు


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement