మాజీ క్రీడాకారులకు గావస్కర్‌ చేయూత | Sunil Gavaskar charitable foundation launches new website | Sakshi
Sakshi News home page

మాజీ క్రీడాకారులకు గావస్కర్‌ చేయూత

Published Tue, Aug 10 2021 5:12 AM | Last Updated on Tue, Aug 10 2021 5:12 AM

Sunil Gavaskar charitable foundation launches new website - Sakshi

ముంబై: ఆరి్థక కష్టాలతో సతమతమవుతున్న భారత మాజీ క్రీడాకారుల కోసం భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ ‘ది చాంప్స్‌ ఫౌండేషన్‌’ ద్వారా చేయూత అందిస్తున్నారు. సన్నీ 1999 నుంచి ఈ వితరణ చేస్తూనే ఉన్నారు. అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన మాజీ క్రీడాకారులు, బతుకు భారంగా వెళ్లదీస్తున్న అలనాటి ఆటగాళ్లకు తనవంతు సాయం చేస్తున్నారు. ఇన్నాళ్లు మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచి్చన వారికే సన్నీ సేవలందాయి. ఇప్పుడు ఆయన తన సేవా నిరతిని పెంచాలని, స్వయంగా సాదకబాధకాలు తెలియజేసిన వారికీ ఆరి్థక సాయం చేయాలనుకుంటున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఆయన తన ఫౌండేషన్‌ను వెబ్‌సైట్‌ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చారు. కష్టాల్లో ఉన్న మాజీలు ఎవరైనా సరే  ఛిజ్చిఝpటజీnఛీజ్చీ.ౌటజ వెబ్‌సైట్‌లో తమ పేర్లు నమోదు చేసుకుంటే చేయూత అందిస్తామని సన్నీ చెప్పారు. తమ కార్యకలాపాలు క్రీయాశీలం చేసేందు కు వెబ్‌సైట్‌ను తీసుకొచ్చామని, ఇది తమ ఫౌండేషన్‌ విస్తృతికి దోహదం చేస్తుందని గావస్కర్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement