Charitable Foundation
-
చారిటబుల్ ట్రస్ట్‌లకు ఐటీఆర్ గడువు పెంపు
న్యూఢిల్లీ: చారిటబుల్ ట్రస్ట్‌లు, మతపరమైన సంస్థలు, వృత్తిపరమైన సంస్థలకు సంబంధించి, ఆదాయపన్ను రిటర్నుల దాఖలు గడువును కేంద్రం పొడిగించనుంది. ఈ సంస్థలు ఐటీఆర్–7 దాఖలు చేసేందుకు అక్టోబర్ 31 గడువు కాగా, ఒక నెల అదనంగా నవంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. 2022–23 సంవత్సరానికి సంబంధించి ఆడిట్ రిపోర్టులు సమర్పించేందుకు ఫండ్, ట్రస్ట్, ఇన్స్టిట్యూషన్, యూనివర్సిటీ లేదా విద్యా సంస్థలు, మెడికల్ ఇన్స్టిట్యూషన్లకు నవంబర్ 30 వరకు గడవును పొడిగించారు. ఈ మేరకు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) ప్రకటన విడుదల చేసింది. -
విరాళం రూ.2 లక్షలకు మించితే తెలియజేయాలి..
న్యూఢిల్లీ: సామాజిక సేవా సంస్థలు వెల్లడించాల్సిన వివరాల నిబంధనలను ఆదాయపన్ను శాఖ సవరించింది. ఈ మార్పులు అక్టోబర్ ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఇక మీదట చారిటబుల్ సంస్థలు తమ కార్యకలాపాలు ధార్మికమైనవా లేదా మతపరమైనవా లేక మతపరమైన సేవా కార్యక్రమాల కిందకు వస్తాయా? అన్నది వెల్లడించాల్సి ఉంటుంది. ఒకరోజులో రూ.2 లక్షలకు మించి ఎవరైనా విరాళం ఇస్తే ఆ వివరాలను ఆదాయపన్ను శాఖకు తెలియజేయాలి. చెల్లించిన వ్యక్తి, చిరునామా, పాన్ నంబర్ ఇవ్వాలి. ఆదాయపన్ను చట్టంలో ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. స్వచ్ఛంద సంస్థలు, మతపరమైన ట్రస్టులు, వైద్య, విద్యా సంస్థల ఆదాయంపై పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే ఈ సంస్థలు ఐటీ శాఖ నుంచి రిజిస్ట్రేషన్ పొందవలసి ఉంటుంది. -
తోడుంటే నడుస్తారు
ఆగినప్పుడు అడుగు ముందుకు పడటానికి తోడు కావాలి. నడిపించే సాయం కావాలి. లోకం మనల్ని కూడా నడిపిస్తుందన్న నమ్మకం కలిగించాలి. అహ్మదాబాద్‌కు చెందిన శ్రద్ధా సోపార్కర్ నడవలేని వారికి తోడు నిలుస్తుంది. వారికి ప్రోస్థెటిక్ కాళ్లు అమర్చి జీవితాల్లో మళ్లీ కదలిక తెస్తోంది. సెరిబ్రల్ పాల్సీతో బాధ పడుతున్న సొంత కూతురిని చూశాక సాటి వారి బాధ ఆమెకు అర్థమైంది. ఆమె స్పందన ఇవాళ ఎందరికో వెలుగు. శ్రద్ధా సోపార్కర్ లా చదివింది. కాని ఎప్పుడూ కోర్టుకు వెళ్లాల్సిన అవసరం రాలేదు. ఆమెకు హైజీన్ ప్రాడక్ట్స్ తయారు చేసే ఫ్యాక్టరీ ఉంది. భర్త కూడా వ్యాపారస్తుడు. మొదట కొడుకు పుట్టాడు. అంతా హ్యాపీగా ఉండగా 2016లో కుమార్తె పుట్టినప్పుడు కుదుపు వచ్చింది. ‘నా కుమార్తెకు సెరిబ్రల్ పాల్సీ అని డాక్టర్లు చెప్పారు. నా కాళ్ల కింద భూమి కదిలిపోయింది. ఆ డిజార్డర్ ఉన్న పిల్లలకు వెంటనే నయం కాదు. జీవితంలో వారు పూర్తిగా నార్మల్ కాలేరు. వారికి కావలసిన థెరపీలు, సర్జరీలు చేయించాలంటే చాలా ఖర్చు కూడా. డబ్బుకు నాకు ఇబ్బంది లేదు కాబట్టి నా కుమార్తెకు కావలసిన థెరపీలు మొదలుపెట్టాను. కాని నా కుమార్తె వల్లే నాకు చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో అర్థమైంది’ అంటుంది శ్రద్ధ. ► మలుపు తిప్పిన ఘటన ‘2018లో అహ్మదాబాద్‌లోని ఒక థెరపీ సెంటర్‌కు పాపను తీసుకుని వెళ్లాను. సెరిబ్రల్ పాల్సీతో బాధ పడుతున్న నాలాంటి పిల్లల తల్లులు కూడా చాలామంది వచ్చారు. అందరం భోజనానికి కూచున్నప్పుడు ఒకామె ఉత్త మజ్జిగ తాగుతూ కనిపించింది. ఎందుకు బాక్స్ తెచ్చుకోలేదు అని అడిగాను. ‘‘నేను ఇళ్లల్లో పని చేస్తాను. మా ఆయన ఆటో నడుపుతాడు. మా సంపాదన కొడుకు థెరపీలకు చాలడం లేదు. అందుకే అన్నం కూడా వండుకోలేకపోతున్నాం’’ అంది. నాకు మనసు చేదుగా అయిపోయింది. ఆమెకు కావాల్సిన సాయం చేయడం మొదలుపెట్టాను. అలాంటి తల్లులు మరికొంత మంది వచ్చారు. వారికీ చేయడం మొదలుపెట్టాను. సాయం పొందుతున్న వారు 10 మంది అయ్యేసరికి నా భర్త ఒక చారిటబుల్ ట్రస్ట్ పెట్టి సేవ చేయి అన్నాడు. అలా మధురం చారిటబుల్ ట్రస్ట్ పెట్టి నా సేవను మొదలు పెట్టాను’ అంది శ్రద్ధ. ► చిన్నారులకు సేవ మెదడు సంబంధమైన రుగ్మతల వల్ల కదలికలు పరిమితమైన చిన్నారులకు, టీకాలు సరిగా వాడకపోవడం వల్ల అనారోగ్యం పాలైన చిన్నారులకు కావలసిన థెరపీలు, మందులు, వైద్య సహాయం ఇవన్నీ తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా ఇవ్వడం మొదలుపెట్టింది శ్రద్ధ. ఆమె తన సొంత డబ్బుల నుంచి ఇవన్నీ చేయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఆమెకు మెల్లగా సాయం అందసాగింది. ‘పేదవర్గాల తల్లిదండ్రులు తమ పిల్లలకు సెరిబ్రల్ పాల్సీ వస్తే నిస్సహాయంగా వదిలేస్తారు. అది పిల్లల స్థితిని మరింత దిగజారుస్తుంది. వారికి ప్రభుత్వం నుంచి కూడా పెద్దగా సాయం అందడం లేదు. మనలాంటి వాళ్లం స్పందించకపోతే ఎలా?’ అంటుంది శ్రద్ధ. ► ప్రోస్థెటిక్ కాళ్లు ఈ థెరపీలతో పాటు ప్రమాదవశాత్తు లేదా జన్మతః కాళ్లు కోల్పోయిన పిల్లలకు, పెద్దలకు ప్రోస్థెటిక్ కాళ్లు అమర్చాలని నిశ్చయించుకుంది శ్రద్ధ. అయితే ఇవి నాసిరకంవి కాదు. ఓట్టోబాక్ అనే జర్మన్ కంపెనీ సాయంతో నాణ్యంగా తయారైన కృత్రిమ కాళ్లు. ‘‘ఇప్పటికి 100 మందికి కృత్రిమ కాళ్లు ఇచ్చాం. నడవడం మానేసిన ఆ దురదృష్టవంతులు మేము అమర్చిన ప్రోస్థెటిక్ కాళ్లతో నడిచినప్పుడు వాళ్ల కళ్లల్లో కనిపించిన ఆనందం అంతా ఇంతా కాదు. ఈ కాళ్లు అమర్చాక వాహనాలు నడపొచ్చు. సైకిల్ కూడా తొక్కొచ్చు. స్నానం చేయడంలో కూడా ఇబ్బంది లేదు’’ అంది శ్రద్ధ. ఈమె ద్వారా కాళ్లు అమర్చుకున్న చిన్నారులు ఆటలు ఆడుతూ గెంతుతూ సంతోషంగా ఉండటం కూడా చూడొచ్చు. డబ్బు చాలామంది దగ్గర ఉంటుంది. కాని స్పందించే గుణమే కావాలి. సేవకు అడుగు ముందుకేస్తే నాలుగు చేతులు తోడవుతాయి. నాలుగు కాళ్లు నడుస్తాయి. తాము నడుస్తూ నలుగురినీ నడిపించేవారే గొప్పవారు. -
Divine Space: శ్వాసపై ధ్యాస
రోజుకు ఉన్నది ఇరవై నాలుగ్గంటలు. పాతిక గంటలు చేసినా తరగనన్ని పనులు. ఇదీ నేటి ఫాస్ట్ లైఫ్... బతుకు చిత్రం. ప్రతి ఒక్కరికీ ఒత్తిడి పెరుగుతోంది. మెదడు తన వంతుగా హెచ్చరిక చేస్తుంది. గమనించే తీరిక ఉండదు మనిషికి. ఊపిరి సలపనివ్వనన్ని పనులు. ఆరోగ్యాన్ని హరిస్తున్న బిజీ లైఫ్‌లో ధ్యాసతో ఊపిరి పీల్చమంటున్నారు అర్పిత. మోడరన్ లైఫ్‌లో మనిషి జీవితం... మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నట్లు కూడా గమనించలేని స్థితిలోనే ఎక్కువ భాగం గడిచిపోతోంది. కొన్నిసార్లు సమస్య మానసికమైనదా, శారీరకమైనదా అనే స్పష్టత కూడా ఉండదు. డాక్టర్ దగ్గరకు వెళ్లి టెస్టులు చేయించుకుని మందులతో నయం చేసుకోవాల్సిన అనారోగ్యం కూడా చాలా సందర్భాల్లో ఉండదు. అలాగని మనశ్శాంతి కోసం ధార్మిక సత్సంగాలతో కాలం గడిపే విశ్రాంత జీవనమూ కాదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పరుగులు తీయక తప్పదు. ఈ పరిస్థితికి సమాధానం డివైన్ స్పేస్‌లో దొరుకుతోంది. ఒత్తిడుల మధ్య జీవిస్తూనే తేలికగా జీవించగలగడం ఎలాగో తెలిపే ఒక వేదిక ఇది... అంటున్నారు అర్పితా గుప్తా. విభిన్నమైన రంగాన్ని ఎంచుకుని సమాజహితం కోసం పని చేస్తున్న అర్పితా గుప్తా పరిచయం. గాలి పీల్చడం తెలియాలి! ‘‘సైకాలజీ, ఫిలాసఫీ, స్పిరిచువాలిటీ కలగలిసిన వేదిక ఇది. కెరీర్లో కొనసాగుతూనే వారానికో గంట సమయం కేటాయించుకోవడం అన్నమాట. మా నాన్న డాక్టర్, అమ్మ టీచర్. మా ఇంట్లో ఎవరూ ఈ ఫీల్డ్‌లో లేరు. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించడం అలవాటైంది నాకు. మొదటి నుంచి అలాగే ఉండేదాన్ని. పుట్టింది పెరిగింది హైదరాబాద్‌లోనే. ఇంటర్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ కొంతమంది పార్ట్‌టైమ్ జాబ్‌లు చేయడం చూసి నేను కూడా ఒక ఇరిగేషన్ కంపెనీలో చేరాను. డిగ్రీ వరకు అంతే... చదువు ఉద్యోగం రెండూ. పెళ్లి తర్వాత చదువు, ఉద్యోగం రెండూ మానేసి ఇంట్లో ఉన్నాను. నాకు అది ఒక టర్నింగ్ పాయింట్. 1998–99 సంవత్సరాల్లో రేఖీ సాధన ట్రెండింగ్‌లో ఉండేది. పక్కింటి ఆవిడ వెళ్తూ నన్ను పిలిచింది. ఆ ప్రాక్టీస్‌తో నా ఆలోచనా ధోరణి మారిపోయింది. త్రీ లెవెల్స్ వరకు ప్రాక్టీస్ చేసి మానేశాను. ఓ ఏడాదిపాటు మళ్లీ గృహిణిగా, పిల్లల్ని పెంచుకుంటూ రొటీన్ లైఫ్. అయితే ఆ గ్యాప్‌లో ఫ్రెండ్స్, బంధువులు తలనొప్పి, మైగ్రేన్, డయాబెటిక్, ఎసిడిటీ వంటి సమస్యలకు రెమిడీ అడిగేవారు. శ్వాస తీసుకోవడం కరెక్ట్‌గా వస్తే జీవక్రియలన్నీ సక్రమంగా ఉంటాయి. గంట నుంచి ఒకటిన్నర గంట హీలింగ్ సెషన్ లో శ్వాస సాధన చేయించడమే వైద్యం. ఇంట్లో మూడు వారాలు ప్రాక్టీస్ చేస్తే ఇక అదే అలవాటయిపోతుంది. ఇలా మొదలైన సర్వీస్ ఆ తర్వాత చారిటబుల్ ట్రస్ట్‌గా రూపాంతరం చెందింది. అవి బంధాలే– బంధనాలు కాదు! ఇటీవల అమ్మాయిల్లో చాలా మంది పెళ్లంటే భయపడుతున్నారు. పెళ్లి చేసుకున్నప్పటికీ భర్తతో అన్యోన్యంగా ఉండలేకపోతున్నారు. బాల్యంలో సెక్యువల్ అబ్యూస్‌కి గురి కావడమే ప్రధాన కారణం అయి ఉంటుంది. మగవాళ్ల మీద ఏహ్యభావం పేరుకుపోయి ఉంటుంది. భర్తతో సరిగ్గా మెలగలేకపోతుంటారు. ఈ పరిస్థితులు అనేక అపార్థాలకు, విడాకులకు దారి తీస్తున్నాయి. ఆ అమ్మాయి ఓపెన్ అయ్యే వరకు ఆమెకు ఆలంబనగా నిలవాలి. మొదట తన దేహాన్ని తాను ప్రేమించుకునేటట్లు కౌన్సెలింగ్ ఇవ్వాలి. వైవాహిక జీవితాన్ని స్వాగతించడానికి మానసికంగా సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఇక మధ్య వయసు గృహిణుల్లో... ఎంప్టీనెస్ట్ సిండ్రోమ్ చాలా పెద్ద సమస్య. ఆర్థిక సమస్యలు ఉండవు, ఆరోగ్య సమస్యలూ ఉండవు. ఏమీ తోచని స్థితి నుంచి దేహంలో ఏదో ఒక అనారోగ్యం ఉన్నట్లు భావిస్తుంటారు. పిల్లలు పెద్దయి చదువు, ఉద్యోగాలతో వేరే ప్రదేశాలకు వెళ్లిపోయిన తర్వాత ఇంట్లో భార్యాభర్తలు మాత్రమే మిగులుతారు. మగవాళ్లు దాదాపుగా రోజంతా బయట పనుల్లో నిమగ్నమై ఉంటారు. ఆడవాళ్లు ఇంట్లో రోజంతా ఒంటరిగా గడపలేక ఏదో కోల్పోయినట్లవుతారు. అలాంటి వాళ్లను ‘మీకు ఏ కూర ఇష్టం’ అంటే వెంటనే సమాధానం చెప్పలేరు. భర్త ఇష్టాలు, పిల్లల ఇష్టాలను టక్కున చెప్పేస్తుంటారు. తమకంటూ జీవితం ఉందనే వాస్తవాన్ని కూడా గ్రహించకుండా యాభైఏళ్లపాటు జీవించేసి ఉంటారు. సెల్ఫ్ లవ్ అనే భావనే ఉండదు వాళ్ల మనసులో. మన సమాజం ఆడవాళ్లను అలా పెంచేసింది మరి. అలాగే ఆఫీసుల్లో ఆడవాళ్లకు ఎమోషనల్ అబ్యూజ్ మరో రకమైన సమస్య. ఇవన్నీ ఇలా ఉంటే... అత్తగారి హోదా వచ్చేటప్పటికి విచిత్రంగా మారిపోతుంటారు. ‘మేము వీకెండ్ సినిమాకు వెళ్తే మా అత్తగారు ఒప్పుకునే వారు కాదు. ఎంత బాధగా అనిపించేదో’ అని గుర్తు చేసుకుంటూ తాను మాత్రం కోడలి విషయంలో అలా ఉండకూడదు... అని నిర్ధారించేసుకుంటారు. ఇక కోడలితో ‘సండే సినిమాకు వెళ్లండి’ అని పదే పదే చెబుతుంటారు. సినిమాకు వెళ్లాలని ఆ కోడలికి ఉందా లేదా అనే ఆలోచన ఉండదు. ఇలాంటి ఎన్నో సున్నితమైన సమస్యలకు పరిష్కారం తమంతట తాముగా తెలుసుకోగలిగినట్లు చేయడమే నా సర్వీస్. నేనిచ్చే పాతిక ప్రశ్నలకు సమాధానాలు నిజాయితీగా రాసుకుంటే చాలు... బంధాలు అనుబంధాలుగా ఉండాలి తప్ప బంధనాలుగా ఉండకూడదని వాళ్లే తెలుసుకుంటారు. కుటుంబ బంధాలు బలపడతాయి’’ అని చెప్పారు అర్పితా గుప్తా. భయం కాదు... భరోసానివ్వాలి! కొంతమందికి క్లోజ్డ్ లిఫ్ట్ అంటే భయం. బలవంతంగా తీసుకువెళ్లినా కూడా ఊపిరాడనట్లు సతమతమవుతారు. ఇంట్లో వాళ్లు జాగ్రత్త కొద్దీ ‘లిఫ్ట్‌లోకి వెళ్లకు, నీకు ఊపిరాడదు’ అని భయపెడుతుంటారు. లిఫ్ట్‌లో ఏ ప్రమాదమూ రాదని ధైర్యం చెప్పాలి. వారిలో ఆ భయాన్ని పోగొట్టాలంటే ఆత్మీయంగా మాట్లాడాలి. మాటల్లో మాటలుగా ఎప్పటికో అసలు విషయం బయటపడుతుంది. చిన్నప్పుడు ఎప్పుడో తలుపులు, కిటికీలు మూసి ఉన్న గదిలో బంధీ అయి ఉక్కిరి బిక్కిరి కావడం వంటివేవో కారణాలు ఉంటాయి. ఒక పేషెంట్ కోసం గంట– రెండు గంటలు కేటాయించడం డాక్టర్లకు సాధ్యం అయ్యేపని కాదు, అంతేకాదు, ఇలాంటి ఫోబియాలున్న వాళ్లలో చాలామంది పేషెంట్ అనిపించుకోవడం ఇష్టంలేక డాక్టర్ దగ్గరకు వెళ్లరు. ఒక స్నేహితురాలిగా వాళ్లకు ఇష్టమైన టాపిక్ మాట్లాడుతూ వాళ్లంతట వాళ్లే ఓపెన్ అయ్యేలా చూడాలన్నమాట. – అర్పితా కె గుప్తా, చైర్ పర్సన్, డివైన్ స్పేస్ చారిటబుల్ ట్రస్ట్, సైనిక్‌పురి, సికింద్రాబాద్ – వాకా మంజులారెడ్డి – ఫొటోలు: నోముల రాజేశ్ రెడ్డి -
Sakshi Excellence Awards: మరింత మందికి సేవ చేసే అవకాశం
-
స్పర్శ్ హాస్పీస్కు సాక్షి అవార్డు.. ‘గొప్ప గుర్తింపు’
Sakshi Excellence Awards: సాక్షి మీడియా 2020 ఎక్స్‌లెన్స్ అవార్డుల కార్యక్రమం సెప్టెంబర్ 17న ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా.. ‘ఎక్స్‌లెన్స్ ఇన్ హెల్త్‌కేర్’ అవార్డును స్పర్శ్ హాస్పీస్ తరఫున సీఈఓ డా.రామ్ మోహన్‌రావు అందుకున్నారు. స్పర్శ్ హాస్పీస్ ‘ఎక్స్‌లెన్స్ ఇన్ హెల్త్‌కేర్’ మరణాన్ని ఎలాగూ తప్పించలేం కానీ మరణ యాతనను తగ్గించవచ్చనే ఆలోచనతో ‘రోటరీ క్లబ్ ఆఫ్ బంజారాహిల్స్ చారిటబుల్ ట్రస్ట్’ ఆధ్వర్యంలో 2011లో హైదరాబాద్‌లో ఏర్పాటైంది ‘స్పర్శ్ హాస్పీస్’ సంస్థ. అవసాన దశలో ఉన్నవారికి, వారి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ద్వారా కావాల్సిన మానసిక, ఆధ్యాత్మిక స్థైర్యాన్ని అందిస్తోంది. వివిధ కారణాల వలన ఈ సెంటర్‌కి రాలేని వారి కోసం స్పర్శ్ టీమ్ సభ్యులు వారి ఇళ్లకే వెళ్లి సపర్యలు చేస్తున్నారు. ఈ విధంగా ఈ 9 ఏళ్లలో 3300 మంది రోగులకు సేవలందించింది స్పర్శ్ హాస్పీస్. ఈ గుర్తింపుతో మరింత మందికి సేవలు సమాజానికి చేస్తున్న మంచి సేవకు గొప్ప గుర్తింపు. పదేళ్లుగా జీవితపు ఆఖరి దశలో ఉన్న 4వేల మంది రోగులకు అండగా నిలిచి, వారి అంతిమదశలో కష్టాలను నివారించాం. సాక్షి లాంటి సంస్థల గుర్తింపు, ప్రభుత్వ ప్రోత్సాహం లభిస్తే మరింత మందికి సేవ చేయగలుగుతాం. – డా.రామ్ మోహన్‌రావు, సిఇఓ, స్పర్శ్ హాస్పీస్ -
ప్రతి రూపాయి ప్రజల కోసమే: సోనూ సూద్
ముంబై: ‘సూద్ చారిటీ ఫౌండేషన్’లో ఉన్న ప్రతి రూపాయిని ప్రజల ప్రాణాలను కాపాడడానికి, ఆపన్నులను ఆదుకోవడానికే ఖర్చు చేస్తానని ప్రముఖ నటుడు సోనూసూద్ తేల్చిచెప్పారు. ఈ మేరకు ఆయన సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ప్రకటనను పోస్టు చేశారు. ఓ వార్తా సంస్థతోనూ మాట్లాడారు. సోనూసూద్‌తోపాటు ఆయన అనుచరులు రూ.20 కోట్ల మేర పన్ను ఎగవేసినట్లు సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ) ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. సోనూసూద్ నివాసాలు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు గతవారం సోదాలు నిర్వహించారు. సోదాల అనంతరం ఆయన తొలిసారిగా ప్రకటన విడుదల చేశారు. ‘కొందరు అతిథుల’ సేవలో తీరిక లేకుండా ఉన్నానని, అందుకే గత నాలుగు రోజులుగా ప్రజలకు సేవ చేయలేకపోయానని వివరించారు. (చదవండి: Bheemla Nayak: డానియల్ శేఖర్‌గా రానా.. పంచెకట్టులో పవర్‌ఫుల్‌గా) నా వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాల్లో ఇంకా చదవని మెసేజ్‌లు 54,000 ఉన్నాయి. సాయం కోసం ఎంతోమంది అర్థిస్తున్నారు. రూ.18 కోట్లు ఖర్చు చేయాలనుకుంటే 18 గంటలు కూడా పట్టదు. కానీ, ప్రతి పైసా సరైన విధంగా, అర్హులైన వారి కోసమే ఖర్చు పెట్టాలన్నదే నా ఆలోచన. రాజ్యసభ సభ్యత్వం కట్టబెడతామంటూ రెండు వేర్వేరు పార్టీల నుంచి ఆఫర్లు వచ్చాయి. రాజకీయాల్లో చేరేందుకు మానసికంగా సిద్ధం కాకపోవడంతో తిరస్కరించా. ఇప్పుడున్న హోదాతో సంతోషంగా ఉన్నా. మానసికంగా సిద్ధమైనప్పుడు చెబుతా. నా సేవా కార్యక్రమాలు యథాతథంగా కొనసాగుతాయి. ఆపడానికి కాదు ప్రారంభించింది. ఇది ఆరంభం మాత్రమే’’ అని సోనీ సూద్ స్పష్టం చేశారు. సోనూ సూద్ రూ.20 కోట్ల మేర పన్ను ఎగవేసినట్లు సోదాల్లో గుర్తించామని సీబీడీటీ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. చట్టానికి కట్టుబడి ఉంటా.. ‘అన్నివేళలా మన వాదనను మనం వినిపించలేకపోవచ్చు. కానీ, కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది. నా ఫౌండేషన్‌లోని ప్రతి రూపాయి ప్రజల సేవ కోసం, వారి ప్రాణాలను రక్షించడం కోసం ఎదురు చూస్తోంది. సేవా కార్యక్రమాలకు అవసరమైన డబ్బు కోసం బ్రాండ్ల తరపున ప్రచారం చేశా. ఫౌండేషన్‌కు ఎవరైనా ఒక్క రూపాయి విరాళం ఇచ్చినా దానికి లెక్క చెబుతా. నేను సేకరించిన సొమ్ము కేవలం ప్రజల విరాళాలే కాదు అందులో బ్రాండ్లకు ప్రచారకర్తగా నేను సంపాదించిన డబ్బు కూడా ఉంది. (చదవండి: Bigg Boss Telugu 5: మూడో వారం నామినేట్ అయింది వీళ్లేనా?) -
మాజీ క్రీడాకారులకు గావస్కర్ చేయూత
ముంబై: ఆరి్థక కష్టాలతో సతమతమవుతున్న భారత మాజీ క్రీడాకారుల కోసం భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ ‘ది చాంప్స్ ఫౌండేషన్’ ద్వారా చేయూత అందిస్తున్నారు. సన్నీ 1999 నుంచి ఈ వితరణ చేస్తూనే ఉన్నారు. అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన మాజీ క్రీడాకారులు, బతుకు భారంగా వెళ్లదీస్తున్న అలనాటి ఆటగాళ్లకు తనవంతు సాయం చేస్తున్నారు. ఇన్నాళ్లు మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచి్చన వారికే సన్నీ సేవలందాయి. ఇప్పుడు ఆయన తన సేవా నిరతిని పెంచాలని, స్వయంగా సాదకబాధకాలు తెలియజేసిన వారికీ ఆరి్థక సాయం చేయాలనుకుంటున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఆయన తన ఫౌండేషన్‌ను వెబ్సైట్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చారు. కష్టాల్లో ఉన్న మాజీలు ఎవరైనా సరే ఛిజ్చిఝpటజీnఛీజ్చీ.ౌటజ వెబ్సైట్లో తమ పేర్లు నమోదు చేసుకుంటే చేయూత అందిస్తామని సన్నీ చెప్పారు. తమ కార్యకలాపాలు క్రీయాశీలం చేసేందు కు వెబ్‌సైట్‌ను తీసుకొచ్చామని, ఇది తమ ఫౌండేషన్ విస్తృతికి దోహదం చేస్తుందని గావస్కర్ తెలిపారు. -
నా వంతు విరాళం సేకరిస్తున్నాను
‘కదలిరండి మనుషులైతే... కలసి రండి మమత ఉంటే’... ఇది ‘ఊరికి మొనగాడు’లో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. ఇప్పుడు ఆయన తన అభిమానులను అదే కోరుతున్నారు. ‘కరోనా’ మీద దేశం చేస్తున్న పోరాటానికి మద్దతుగా ‘ఎస్.పి.బి ఫ్యాన్స్ చారిటబుల్ ట్రస్ట్’కు విరాళాలు పంపమని కోరుతున్నారు. అయితే ఆయన ఇందుకు వినూత్నమైన మార్గం ఎంచుకున్నారు. వంద రూపాయల నుంచి ఎన్ని రూపాయలైనా విరాళం ఇచ్చి ఒక పాట కోరుకుంటే ఆ అభిమాని కోరిక మేరకు ఆ పాటను పాడి ఫేస్బుక్లో వీడియో పోస్ట్ చేస్తారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల అభిమానులకు బాలు ఈ పిలుపు ఇచ్చారు. విరాళాలు ఇస్తున్న అభిమానుల కోసం ఆ మూడు భాషల పాటలను కూడా పాడి ఆ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ పలకరిస్తే తాను చేస్తున్న కార్యక్రమాల గురించి మాట్లాడారు. ‘‘పన్నెండు సంవత్సరాలుగా మా ఎస్పిబి ఫాన్స్ చారిటబుల్ ట్రస్ట్ నడుస్తోంది. ఆరోగ్యం, విద్య రంగాలలో మాకు తోచిన సాయం చేస్తున్నాం. ఇప్పుడు కరోనాతో బాధపడేవారికి మాత్రమే మా సేవలు పరిమితం కాలేదు. అన్ని విభాగాలలోను పనులు లేక ఇబ్బంది పడుతున్నవారు ఉన్నారు. వారికి కూడా తోచినంత సహాయం చేయాలనుకుంటున్నాను. ఇందుకోసం నేను పాటల ద్వారా విరాళాలు సేకరిస్తున్నాను. శ్రోతలు వాళ్లకు ఇష్టమైన భాషలోని పాట అడగొచ్చు. ఆ పాట నేను పాడతాను. ఇందుకోసం కనీసంగా వంద రూపాయలు పెట్టాం. ఎవరి ఇష్టం వచ్చినంత ఎంతైనా ఇవ్వచ్చు. వంద, ఐదొందలు, వెయ్యి, పదివేలు, యాభైవేలు, లక్ష వస్తున్నాయి. ఇప్పటికి మూడు రోజులు చేశాను. మార్చి 31 నాటికి, నాలుగు లక్షల డెబ్బై వేల దాకా డబ్బులు పోగయ్యాయి. ఇలా ఎన్నాళ్లు నడుస్తుందో చూసి, మొత్తం వచ్చిన డబ్బుకి, నా సొంత చందా జత చేస్తాను. ఆ తరవాత ఎవరికి ఎలా పంచాలో నిర్ణయించుకుంటాను. కరోనా అవగాహన కోసం తెలుగు, కన్నడం, తమిళం మూడు భాషల్లో ఆర్కెస్ట్రా లేకుండా అవగాహన గీతాలు పాడాను. కన్నడంలో జయంత్ కాయికిన్, తెలుగులో వెన్నెలకంటి, తమిళంలో వైరుముత్తు పాటలు రాసి పంపారు. ఇప్పుడు మ్యుజీషియన్స్‌ను పెట్టి చేయలేను కనుక తంబురా పెట్టుకుని పాడాను. ఇవి ఫేస్బుక్లో బాగా వైరల్ అయ్యాయి. వీటికి చాలామంది ఆర్కెస్ట్రా జత చేసి ఫేస్బుక్లో పెడుతున్నారు. ఇది చాలా ముదావహం. పిల్లలు దీనికి నృత్యాభినయం చేసి పెడుతున్నారు. చాలా ఆనందం. రాంభొట్ల నృసింహశర్మగారు వైద్యులకు సంబందించి ఒక పాట రాశారు. ఆ పాటను కూడా అతి త్వరలో నా వెబ్ పేజీలో పెడతాను. ఈ సందర్భంగా అందరికీ ఒక సలహా ఇవ్వడం నా బాధ్యతగా భావిస్తున్నాను. కరోనా నాకేమి వస్తుందిలే అని అందరూ స్వేచ్ఛగా తిరగటం మానేయండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి మన ప్రభుత్వాల వరకు అందరూ దీని గురించిన ఒక అవగాహన కల్పిస్తున్నారు. వారి మాటలను మనమంతా అనుసరించి తీరాలి. సమాజం బావుండాలంటే మనం బావుండాలి. అది ముఖ్యమైన విషయం. అత్యవసరమైన పరిస్థితి అయితే తప్ప లక్ష్మణ రేఖ దాటి రాకండి’’ అన్నారాయన. -
పేద కళాకారులకు అండగా జీవిత–రాజశేఖర్
కరోనా వైరస్ ప్రభావంతో ఈ నెలాఖరు వరకు సినిమా షూటింగ్‌లు ఆపివేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. చలన చిత్ర పరిశ్రమ పెద్దలు కూడా మార్చి 31వరకు షూటింగ్‌లు ఆపివేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. ఏరోజుకు ఆ రోజు పని చేస్తే తప్ప ఇల్లు గడవని నిరుపేద కళాకారులు ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’లో (మా) కొందరు ఉన్నారు. అలాంటి కళాకారులకు పది రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులను రాజశేఖర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందించనున్నట్లు హీరో డా.రాజశేఖర్– జీవితా రాజశేఖర్ ప్రకటించారు. నిరుపేద కళాకారులు 90108 10140 నంబర్‌కి కాల్ చేసి పూర్తి వివరాలు అందించి తగు సహాయం పొందాలని కోరారు. -
చంద్రబాబు అరాచకాల వల్లే ఓటమి
సాక్షి, అమరావతి: చంద్రబాబు అనుసరించిన అప్రజాస్వామిక, అరాచక విధానాలు, అవినీతి, అప్పులు, ఆశ్రితపక్షపాతం, ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలన్న ఆలోచనా ధోరణే వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి అఖండ విజయాన్ని సాధించి పెట్టిందని స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు, పౌరసమాజం అభిప్రాయపడ్డాయి. వైఎస్ జగన్ శాసనసభలో అడుగుపెట్టినప్పటి నుంచి అడుగడుగునా ఆయన్ను అవమానించిన తీరే చంద్రబాబు అప్రజాస్వామిక విధానాలకు నిదర్శనమని, ఆ తీరే ఆయన ఓటమికి కారణమైందని పేర్కొన్నాయి. నూతన ప్రభుత్వానికి అప్పులు మిగిల్చిన వ్యవహారమై ప్రజలకు అన్ని వ్యవహారాలు తెలిసేలా శ్వేతపత్రాలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశాయి. రాష్ట్ర విభజన సందర్భంగా వచ్చిన రూ. 86 వేల కోట్ల అప్పు ఇప్పటికి రూ. 2.14 లక్షల కోట్లకు ఎందుకు చేరిందో వివరించాలని డిమాండ్ చేశాయి. ఏయే శాఖల్లో అప్పులు ఎందుకు తీసుకున్నారోనన్న అంశంపై కొత్త ప్రభుత్వం విచారణ జరిపించాలని కోరాయి. ఏపీ ఫైబర్‌గ్రిడ్ సహా అన్ని శాఖల్లో జరిగిన నిధుల దుర్వినియోగంపైనా విచారించాలని రాష్ట్ర మేధావుల సంఘం కోరింది. దానికి ముందే అప్పులపై శ్వేతపత్రాన్ని ప్రకటించి ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని చేతనా సమాఖ్య కాబోయే ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసింది. -
నా ఫౌండేషన్ రద్దు చేస్తున్నా: ట్రంప్
వెస్ట్ పామ్ బీచ్: తన చారిటబుల్ ఫౌండేషన్‌ను రద్దు చేస్తున్నట్లు అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం వెల్లడించారు. వచ్చే నెలలో పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నందున వివాదాలను తొలగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. దశాబ్దాలుగా ఈ ఫౌండేషన్ డబ్బులు నూటికి నూరుశాతం సేవ కోసమే వెచ్చిస్తున్నామని పేర్కొన్నారు. కాగా, ఈ ఫౌండేషన్ ట్రంప్‌కు అనుకూలంగా ప్రచారం చేసేందుకు నిధులు ఖర్చు చేసిందన్న ఆరోపణలపై న్యూయార్క్ ఏజీ కార్యాలయం విచారణ చేపట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం.